-
-
Athmayogam Sri Vidya Sadanasaram
0₹200.00ఇది శాస్త్రవచనం కాదు. వేదభాష్యం అంతకన్నాకాదు. ఇది శ్రీవిద్యా సాధనకు సంబంధించిన చర్చ మాత్రమే. ఈ చర్చ అంతర్గత భావానికి భంగం కలిగించకుండా ఒక విషయం నుండి మరియొక విషయానికి మారుతూ ముందుకు సాగుతుంది. ఈ కథనంలో కపటంగానీ , సందర్భానుకుల కల్పనలు గానీ లేవు. కేవలం నిజాలు మాత్రమే ప్రస్తావించబడినాయి. ఇది సత్యాన్వేషణ చుట్టూ తిరిగే సత్యవిషయ సంకలనం. సాధనా మార్గంలో కలిగే సందేహాలను నివృత్తి చేసే కొన్ని సమాధానాల క్రోడీకరణ.
సాధన అంటే ఏమిటి? ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? సాధనయొక్క ఫలితాలేమిటి? దాని పర్యవసానంగా భగవతుని ఉనికిని గ్రహించడం ఎలా సాధ్యం? లాంటి లాంటి విషయాలను గురించి ఇక్కడ స్పృశించడం జరిగింది.
-
-
Attagari Kadhalu
0₹300.00ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కధలు
సాహిత్య అకాడమీ వారు ఆమె రచించిన “అత్తగారి కధలు”కు బహుమతి ఇచ్చారు.1994లో ఆమె రచన “నాలో నేను” పుస్తకానికి జాతీయ బహుమతి లభిస్తుంది.
తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్వమైన కధలు బహుముఖ ప్రజ్ఞాశాలిని శ్రీమతి భానుమతి రామకృష్ణ రచించిన “అత్తగారి కధలు”. అత్తగారి అలవాట్లు ఇతరులను అక్షేపించేందుకు వాడె పదజాలం రచయిత్రి నిశిత పరిశీలనలోంచి జాలువారి ప్రవాహవేగంతో సాగే సరళ సుందరమైన ఆమె శైలిలో అత్తగారు ఎల్లప్పుడు సజీవమూర్తిగా దర్శనమిస్తుంది. అత్తగారి పాత్ర నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఉత్తమ ఏకైక తెలుగు హాస్య స్త్రీ పాత్ర.
మన తెలుగు కుటుంబాలలో దాదాపుగా అంతరించి పోతున్న ఒక గొప్ప ఇనిస్టిట్యూషన్ కు అత్తగారి పాత్ర సాహిత్యంలో ఏకైక ప్రతినిధి. భానుమతి గారు వాక్యవిన్యాసం ఎంతో మనోహరము గా ఉంటుందో ప్రతి వాక్యం ఎంత హాస్య స్పోరకంగా ఉంటుందో “అత్తగారి కధలు” పుస్తకంలో యాధృచ్చికంగా ఏ పేజి చదివినా సుభోధకం అవుతుంది.
-
Balavyakaranam
0₹300.00చిన్నయసూరి గొప్పపండితుడు. వ్యాకరణశాస్ర్తజ్ఞాడు. నేటికీ ప్రాచీన తెలుగు సాహిత్యభాషకు వచ్చిన వ్యాకరణాలలో బాలవ్యాకరణానికి బాలవ్యాకరణమే సాటి. ఇందులో సందేహం లేదు. పది పరిచ్చేదాలతో, 465 సూత్రాలతో కూడుకొని ఉన్న ఈ రచనలోని సూత్రాలను, ఉదాహరణలను గూర్చి ఇంతకుముందున్న వ్యాఖ్యాన కారులు ఎన్నోరకాలుగా కీర్తించారు. అవి నూటికి నూరుపాళ్ళు యదార్ధమైన పొగడ్తలే. అయినా ఇన్నిసూత్రాల్లో ఎక్కడా లోపంలేదా అనే కాంక్షతో పరిశీలిస్తూ చదివితే ఏవో కొన్ని చిన్నపాటివి లాభిస్తాయి. వంట రుచిగా ఉన్నదా! లేదా! అవి చెప్పటానికి వంటచేయటం రావాల్సిన అవసరం లేదుగదా! తినగలిగే ఆసక్తి ఉంటేచాలు. కాబట్టి ఈ వ్యాఖ్యానంలో వ్యాకర్త గొప్పదనాన్ని చూపిస్తూనే, ఎక్కడైనా లోపంగా నాకు అనిపిస్తే దాచకుండా ఆ లోపాన్ని చూపించే ధైర్యం చేశాను. అంతమాత్రాన నేను గోప్పపండితున్ననే భావం కాదు. ఆసక్తితో చదివిన పాఠకున్నని భావం. ఇరువై ఐదు సంవత్సరాలుగా తరగతిగదిలో ఈ వ్యాకరణాన్ని భోదించటం వల్ల – విద్యార్ధుల ఆలోచనలు, వారి ప్రశ్నలు, వానికి సమాధానాలు, విటన్నింటినీ కలగలిపిన సారాంశం ఈ వ్యాఖ్యానం ప్రధానంగా విద్యార్ధులను ఉద్దేశించి ఇది వ్రాయటం జరిగింది. అందుకే “కరదీపికావ్యాఖ్యాన” మని నామకరణం చేశాను. కాబట్టి విద్యార్ధిలోకానికి ఏ మాత్రం ఉపయోగపడినా, నా శ్రమ ఫలించిందని భావిస్తాను.
డా” ఆలేటి మోహన్ రెడ్డి
-
Balavyakaranam Gantapadham
0₹350.00ఎం.ఎ. తెలుగు, సాహితి విద్యార్థులకు ఉపయోగపడే వ్యాకరణ గ్రంథం. ఈ సంపుటం మార్పులు చేర్పులు జరిగి కొత్తగా ముద్రితమైనది.
-పరవస్తు చిన్నయసూరి.
-
-
-
Bava Bava Panneru
0₹70.00“హలో…” అన్నారు ఫోన్ యెత్తి. నవల మంచి రసపట్టులో ఉంది. “హలో అర్చన! నేను శ్రీధర్ని. నువ్వు వెంటనే ట్యాంకుబండ్ కు వచ్చేయి. నీతో అర్జoటు గా మాట్లాడాలి” అన్నాడు బావ.
నాకు నవ్వు వచ్చింది.
“మరో పెళ్లి చూపుల తంతా బావా? ” అన్నాను నవ్వుతు.
“అలాగే అనుకో. వెంటనే వచ్చేయి. శైలుకు చెప్పవలసిన అవసరం లేదు” అన్నాడు.
“జి హుజూర్!” అని ఫోన్ పెట్టేశాను. అలాగే ఆలోచిస్తూ నిలబడిపోయాను. అయితే నిన్నటి సంబంధం బావకు నచ్చలేదు? వరుడు ఆరడుగుల యెత్తు, అందగాడు కాకపోయినా, ఫర్వాలేదు. తెలుపు, నలుపుగాని రంగుతో ఆకర్షణీయంగానే ఉన్నాడు. అతను బ్యాంక్ లో పనిచేస్తున్నడట. తండ్రికి మెడికల్ షాపుంది. ఇద్దరే కొడుకులట. అదికాక శారదత్త కొడుకు అన్ని విధాల తగినవాడు, అనిల్ కుమార్. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-“మాదిరెడ్డి సులోచన.”
-
Bhaarya Kopavati
0₹60.00కాఫీ గ్లాసుల్లో పోస్తున్న ఉమకు కాలింగ్ బెల్ అదే పనిగా వినిపించడంతో, అవి అక్కడ వదిలి తలుపు తీయక తప్పలేదు.
“యెవరు?” విసుగ్గా అడిగింది.
“నేను కస్తూరి గారింటినుండి వచ్చాను. వారి తమ్ముడు బాబ్జిని ఒక్కసారి పిలుస్తారా?” అన్నాడు ఆదుర్దాగా.
ఆడబడుచు పేరు వింటూనే ముడుచుకుపోయింది ఉమ.
“యెందుకు?” ముఖం చిట్లించింది.
“అరగంట క్రితం కస్తూరిగారి భర్త పోయారండి…”
అతని మాట పూర్తికాకముందే బాబ్జి వచ్చాడు. విషయం విని నోట మాటరానట్టు క్షణం నిలబడిపోయాడు.
“ఇక్కడ ఆటోలు దొరకవని ఆటోరిక్షా తెచ్చానండి.” ఆ వచ్చిన కుర్రాడు చెప్పాడు. బాబ్జి యాంత్రికంగా వెళ్ళి ఆటోలో కూర్చున్నాడు. తరువుత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
-
Bhagavathamlo Manipusalu
0₹100.00“భాగవత” మంటే భగవత్తత్వాన్ని తెలియచేసేదని అర్ధం. ఈ భాగవత్తత్వాన్ని తెలియచేసేవారిని “భాగవతు”లంటారు. వాళ్ళు పరమ భగవతోత్తములై తాము దర్శించిన దానిని –
ఇతరులు ధన్యత చెందాలనే వుద్దేశంతో, తమలోని భక్తీ, ఆనందం, చైతన్యం, బ్రహ్మానందం కలిపి అందిస్తారు. అది విన్న, చదివిన వారలందరు భాగవతులై, భగవత్తత్వానందుకోవాలనే సత్సంకల్పమే వారి లక్ష్యం.
అటువంటి దివ్యలక్షణాని కనుగుణంగా ఇటు భక్తీ – వేదాంత ఆధ్యాత్మిక దృష్టి, అటు వ్యాపారదృష్టి అంటే సద్గ్రంధాలను, సర్వభక్త జనానీకానికి అందించాలనే సదాశయంతో – నాతో –
“స్వామీ! కొన్ని క్రొత్త ప్రచురణలు తిసుకోవద్డామనుకుంటున్నా” నని చెప్పి – నన్ను –
1. సంక్షిప్త భాగవతం
2. సంక్షిప్త భారతం
3. సంక్షిప్త శ్రీమద్రామాయణం
చిన్న చిన్న సంపుటాలుగా వ్రాయమని కోరారు. ఆ ఆలోచనా దివ్య సరళికి – ఈ గ్రంధమొక మచ్చుతునక. అనకూడదు కాని, ఈ కధలన్నీ చదివితే (కృష్ణ) భాగవతాన్ని చదివిన “తృప్తి” – తప్పక కల్గుతుంది. కారణం –
ఆ భగవంతుడు నాకిచ్చిన “ఆవేశ – ఆదేశాలలో కొన్ని కొన్ని సమయాలలో – ఆ పాత్రలలో పాత్రనై పోయాను. బ్రహ్మానందమను భవించాను. ఆ సందర్భాలు, సంఘటనలు తప్పక, పఠీతులను భక్తులను చేస్తాయి. భక్తులను భగవంతుని చేరువ చేస్తాయి.
– రామకృష్ణ ప్రసాద్