-
Rushi – ఋషి
0₹50.00‘ఏమిటాలోచిస్తున్నావ్ ?” అలవోకగా పక్క మీదకు వాలి అంది అమ్మాయి. మాట్లాడలేదు నేను – ఆమెనే చూస్తూ వుండిపోయేను. చీరెకి, జాకెట్టుకి మధ్య, సముద్రపు తీరానే స్థిరంగా నిలబడి యుగయుగాలుగా, ఆ అలల తాకిడికి సున్నితత్వాన్ని ఆపాదించుకున్న కొండరాళ్ల నునుపు సెక్స్ కాదు, ఉద్విగ్నత.
”ఏమిటి కొంపదీసి ఈ గంటా యిలా ఏదో ఆలోచిస్తూనే గడిపేస్తావేమిటి బాబూ?”
అడుగు ముందుకేసి – ఆమె చేరువై – ఆ స్పర్శలో – ఆ గుండె చలనపు సవ్వడి. తరతరాలుగా స్త్రీని పురుషుణ్ణి ఏకం చేసే రాగబంధం – లయ. ఏ వాద్యకారుని వేళ్లు సుతారంగా మీటుతున్నాయో –
ఆమె చెయ్యి లైట్ మీదకు వెళ్లబోయింది – వారించాను. లైటార్పితే – ఇంత ఆనందం ఎక్కడుంది ?……..
అతడు ప్రకాశం. అతడు ప్రేమించిన అమ్మాయి. అతడ్ని ప్రేమించిన మరో అమ్మాయి. ఈ వలయం నుంచి చూస్తే అన్నీ సజావైన ప్రేమ వ్యవహారాలే. కానీ హిపోక్రసీ అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నవ నాగరికతలో ఈతడు ఇమడలేకపోయాడు. ఆత్మవంచనతో బతకలేకపోయాడు. ఐయామ్ ఆల్సో బికమింగ్ ఎస్కేపిస్ట్ లైక్ యు!- అననైతే అన్నాడు కానీ – చెడిపోవడం కూడా అందరికీ చేతకాదు. అదీ ఒక ఆర్టు! మన బ్రతుకుల్లోని వంచనాశిల్పాన్ని ఎత్తిచూపే యండమూరి వీరేంద్రనాథ్ సమస్యాత్మక నవల – ఋషి.
-
Sampurna Premayanam – సంపూర్ణ ప్రేమాయణం
0₹75.00‘నాకు అర్థం కావటం లేదు” అన్నాడు వేణు. ఆమె ఎందుకలా ప్రవర్తించిందో.. అంత చనువు ఎందుకు ప్రదర్శించిందో”.
”నాకు నిన్న రాత్రి అర్థం కాలేదు. కానీ రాత్రి రూమ్‌కొచ్చాక ఆలోచిస్తే అర్థమయింది” అన్నాడు ప్రసాదరావు.
”ఏమిటి?”
”ప్రసాద్‌తో గొడవవల్ల ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మనుష్యులు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏ చిన్న ఆధారం దొరికినా చాలనుకుంటారు. నిన్న రాత్రి అది కలిసొచ్చింది. ఇక కథ క్లయిమాక్స్‌కి వచ్చేసినట్టే”.
…
తన చెల్లెలి జీవితంతో ఆడుకున్న సర్ జగపతిరావు బహదూర్ అనేవాడి మీద పగతీర్చుకునే నిమిత్తం..
ప్రసాదరావు అనే కౌటిల్యుడిలాంటి వృద్ధుడు జీవితంలో ఎప్పుడూ అబద్ధమాడని వేణు అనే అందమైన కుర్రవాడిని నియమించాడు.
వాళ్ళ కాంట్రాక్టు ప్రకారం జగపతిరావు కూతుర్ని ప్రేమలోకి దింపి, ఆమెను గర్భం వచ్చాక వదిలెయ్యాలి. వేణు రంగంలోకి దిగాడు. దిగాక తెలిసింది. – చూస్తే నాలుగు పెదవుల కలయిక చాలా సులభం, ఆలోచిస్తే రెండు మనసుల కలయిక చాలా కష్టం అని – అప్పటికే ప్రేమ వలలో పూర్తిగా ఇరుక్కుపోయిన వేణు ఎలా బయటపడ్డాడు?
మొదటిపేజీ నుంచి చివరి పేజీ వరకూ సస్పెన్సుతో మిమ్మల్ని మరోలోకంలోకి తీసుకుపోయే శైలిలో, అత్యద్భుతమైన శిల్పంతో, పరిపూర్ణమైన పాత్రల చిత్రణతో యండమూరి వీరేంద్రనాథ్ కలం నుంచి వచ్చిన మరో హరివిల్లు ‘సంపూర్ణ ప్రేమాయణం’.
-
Siggestondi – సిగ్గేస్తోంది
0₹75.00ఆరోజు సోమవారం !
క్రితంరోజు ‘శలవు బద్ధకం’ లోంచి బయట పడటానికి ఇష్టంలేనట్టుగా మత్తుగాపడుకుని ఉన్నారు కొంతమంది.
సూర్యుడికి, గృహిణికి అది కుదరదు కదా !
ఉదయభానుడు ఉరుకులూ పరుగులూ మీద పైకి పొడుచుకొచ్చేస్తున్నాడు. ప్రాత:కాలాన్నే లేచి, పెరట్లో రాత్రి కురిసిన పారిజాతాలు ఒళ్లో నింపుకుంటూ, ముంగిట్లో రంగవల్లులు తీర్చే అతివలు ఆ లొకాలిటీలో లేరు !
గేట్లమీద పాలపేకెట్లు చూస్తున్నాయి. మెట్లమీద న్యూస్‌పేపర్లు అడ్డంగా పడివున్నాయి.
కిలకిలారావాల్తో నిద్రలేచి, కూనిరాగాలతో పనులు ప్రారంభించవలసిన సుందరవదనలు, ఆదరాబాదరా పనుల్లో జొరబడి, తిరిగిపోతున్న గడియారపు ముళ్ళకేసి నిస్పృహగా చూస్తున్నారు.
కలలు కంటే, నిద్రలేని రాత్రి కరిగిపోయి, మండే కళ్ళతో పగలు ఆఫీసుల కెళ్ళాల్సొస్తుందని కలలను సైతం త్యాగం చేసే ఉద్యోగస్తురాళ్లు!
మధ్య తరగతి మహిళలు !
పునీత పువ్వులాంటి పాప బస్‌పాస్ కోసం ఫోటో తీయించుకోవాలని స్టూడియో కెళ్ళింది. అక్కడ!
వనజ పదహారేళ్ళ అమ్మాయి. బస్‌లో కాలేజికెళ్తోంది. కండక్టర్ ‘పీఛేజావ్’ అంటూ చెయ్యివేసి వెనక్కి తోసాడు. ఎక్కడ!?
ధరణి ఒక ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగస్తురాలు. సైటుకి రమ్మన్నాడు బాస్. ఎందుకో తెలుసు. కాదంటే
మంచినీళ్ళు పుట్టని సైటుకి బదిలీ చేస్తాడు. అదీ పరిస్థితి. మరేం చెయ్యాలి ? ఇక్కడ!? – పైకి కనబడకుండా – మూడోకంటికి అస్సలనుమానం రాకుండా-కేవలం తెలియాల్సిన వ్యక్తికే తెలిసేలా-ఆ వ్యక్తి మనసులోనే దు:ఖపడేలా-మరొకరికి చెప్పుకోవటానికి సిగ్గు పడేలా – ఓ అంతరంగవేదనా తరంగం యండమూరి వీరేంద్రనాథ్ సృష్టి ‘సిగ్గేస్తోంది’.
-
-
Swarabhetalam – స్వరబేతాళం
0₹80.00‘మారా …. మరా….. బచావ్” (చంపుతున్నాడు – చంపుతున్నాడు – రక్షించండి)
జనవరి 31, 1982 పొద్దున్న 7-50కి నాంపల్లి రైల్వేస్టేషను పక్కనున్న ఇంటినుంచి వినిపించిన కేకలవి.
హోటల్లో టీ తాగుతున్న ఒకరిద్దరు. రాయల్ లాడ్జి బయటున్న ఆటోడ్రైవర్లు ముగ్గురు అటువైపు పరుగెత్తారు.
కత్తి పట్టుకుని బయటకు వచ్చిన యువకుడిని చూసి అందరూ నిశ్చేష్టులై ఆగిపోయారు. సాహసవంతులైన నలుగురైదుగురు యువకులు మాత్రం అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళను కూడా పొడిచి అతడు స్టేషనువైపుకు పరుగెత్తాడు.
లోపల ఇంట్లో కత్తిపోట్లుకు గురి అయిన వ్యక్తి రక్తంలో గిల గిల కొట్టుకుంటూ మరణించాడు. ఆ వ్యక్తి పేరు మొహిసిన్. అతడొక పోలీసు. హంతకుడి పేరు ధర్మదాస్. ధర్మదాస్ పరుగెడుతూ అడ్డుగా వచ్చిన వాళ్ళను పొడవగా గాయపడిన వాళ్ళు మొయినుద్దీన్, సయ్యద్ బాషా, పద్మనాభం, అన్వర్, జబ్బర్ (చివరి ఇద్దరూ ఆటో డ్రయవర్లు). చివరికి జనం ఆ హంతకుడిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అతడి దగ్గర రక్తంతో తడిసిన పొడవాటి కత్తి లభించింది. అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
అతడు హత్య చేసాడని అందరికీ తెలుసు. నలుగురూ చూస్తూ వుండగానే హత్య చేసాడు. లోయర్ కోర్టు అతడికి ఉరిశిక్ష వేసింది. కానీ హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదలచేసింది.
కారణం ? ఐ.పి.సి. సెక్షన్ 84 నిచీశ్‌ీష్ట్రఱఅస్త్ర ఱర aఅ శీటటవఅషవ షష్ట్రఱషష్ట్ర ఱర సశీఅవ పవ a జూవతీరశీఅ, షష్ట్రశీ, a్ ్‌ష్ట్రవ ్‌ఱఎవ శీట సశీఱఅస్త్ర ఱ్, పవ బీతీవaరశీఅ శీట బఅరశీబఅసఅవరర శీట ఎఱఅస, ఱర ఱఅషaజూaపశ్రీవ శీట సఅశీషఱఅస్త్ర ్‌ష్ట్రవ అa్‌తీబవ శీట ్‌ష్ట్రవ ూష్‌కు. ూవష.84-Iఅసఱaఅ ూవఅaశ్రీ జశీసవ.
ఉరితీత మీద ధ్వజమెత్తి ‘అభిలాష’ నవల ద్వారా పాఠకుల్ని ఉర్రూతలూపినరచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ ఈసారి లాజిక్‌తో హారర్ కలిపి న్యాయశాస్త్రపు మరోకోణాన్ని స్పృశించటానికి చేసిన ప్రయత్నం ‘స్వరబేతాళం’.
-
thirteen fourteen fifteen
0₹100.00హృదయం గది నిండా బాధ బురద పేరుకు పోకుండా నిరంతరం ప్రక్షాళన చేయడానికి కన్నీటిని ఇచ్చాడు భగవంతుడు. ఈ పెళ్ళి అనే వ్యవస్థలో ఏదో లోపం వుంది కాబట్టే చాలా మంది స్త్రీలు రాజీపడటాన్నీ, చాలా మంది పురుషులు ఎస్కేపిజాన్నీ తమ జీవితంగా మార్చుకుని బ్రతుకుతున్నారు. దేహావసరాలు తీర్చుకోవటమే జీవితం అనే అభిప్రాయానికి మనిద్దరం బలవంతంగా తోయబడ్డాం. ఒకరికొకరు ఏమీ కాకుండా …. కేవలం భార్యాభర్తలమయి…. ఇలా అసంతృప్తితో వేగిపోతున్న ఆమె – భర్తని ఒక అర్ధరాత్రి హోటల్ గదిలో ఒకమ్మాయితో చూసిన ఆమె, అదే ఆవేశంతో వెళ్ళి తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే యువకుడి ఇంటి తలుపు తట్టింది. పురుషుడికొక న్యాయం స్త్రీకో న్యాయం ఎందునుకుంది.
అదొక తాత్కాలికమైన అసంకల్పిత ప్రతీకార చర్య, పర్యవసానం ? బ్లాక్ మెయిలింగ్, మానసిక సంఘర్షణ, ఊపిరి సలుపనివ్వని క్లైమాక్స్.
నకిలీ హిప్నటిజాల మాఫియా, కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రాల మోసాల నేపధ్యంలో ఒక జర్నలిస్టు, ఒక రచయిత్రి, ఒక వ్యాపార వేత్త, భారతదేశపు నెంబర్‌వన్ టెన్నిస్ ప్లేయరు ఒకరు –
నాలుగువిభిన్న మనస్తత్వాలతో రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఆడుకున్న గేమ్ ’13-14-15′.
-
Tulasi Dalam – తులసి దళం
0₹100.00‘ముగ్గు మధ్యలో కాద్రా కూర్చుని ఉన్నాడు. అతడి ప్రక్కన పాత్రలో మైదాపిండి ఉంది. తులసి చేతి కర్చీఫ్ ఉంది. తులసి తొక్కిన కాలిమట్టి ఉంది.
ముగ్గుకి ఎనిమిది వైపులా చిన్న చిన్న గొబ్బిళ్ళలాంటి మాంసపు ముద్దలు ఉన్నాయి…..
ముగ్గు మధ్యలో హ్రీం-క్రీం అన్న అక్షరాలు వ్రాయబడి ఉన్నాయి. సాంబ్రాణి పొగ దట్టంగా అలుముకొని వుంది. అతడు మైదాపిండితో బొమ్మను తయారు చేశాడు. తులసి తాలూకు చేతి గుడ్డ దానికి కట్టేడు. తులసి తొక్కిన మట్టిని ఆ బొమ్మ కాలికి అద్దేడు. బొమ్మ నెదురుగా పెట్టుకొని మంత్రం చదవటం మొదలుపెట్టాడు. అతడి పెదవులు కదులుతున్నాయి….”
తులసి అనే పదేళ్ళ చిన్నారిని చంపటానికి ముగ్గురు కిరాతకులు కాద్రా అనే మహామాంత్రికుడిని ఆశ్రయించారు. ‘కాష్మోరా’ అనే అతిభయంకరమైన క్షుద్రదేవతను ప్రయోగించి 21 రోజుల్లో పాపని చంపుతానని వాగ్దానం చేశాడు కాద్రా. రోజు రోజుకి తులసి క్షీణించిపోసాగింది. ఒక హిప్నటిస్టు, ఒక డాక్టరు కలసి ఆ చిన్నారిని కాపాడటానికి రంగంలో దిగారు.
1981లో వెలువడిన ఈ నవల – తెలుగు పాపులర్ నవలా సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పింది. సంచలనం సృష్టించింది. అనేక వాద వివాదాలకు కేంద్రబిందువయింది. అఖిలాంధ్ర పాఠకలోకాన్ని అలరించిన ఈ నవల ఇప్పటికీ బెస్ట్ సెల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది.
-
Yevaree Chatrapati Sivaji – ఎవరీ ఛత్రపతి శివాజి
0₹40.00భారతావనిలో యెంతమంది రాజులు లేరు? ఎంతమంది స్వతంత్రంగా పాలించలేదు. ముస్లిం పాలకులు, హిందూ పాలకులు సమాంతరంగా పరిపాలించిన దశలూ ఉన్నాయి. ముస్లిం పాలకులకి వ్యతిరేకంగా హిందూ పాలకులు కత్తిగట్టారనీ, హిందూ ధర్మస్థాపన కోసం కంకణబద్దులయ్యారనీ కొంతమంది చరిత్రకారులు వక్రీకరించి చెపుతూ వుంటారు. ”వక్రీకరించి” అనడం ఎందుకంటే వాళ్ళు ముస్లింలు కాబట్టే హిందువులు కత్తిగట్టనూలేదు. ముస్లిం రాజులు సాటి ముస్లింరాజుల మీద దాడులు చెయ్యకపోనూలేదు. ఇక్కడ సమస్య అల్లా మతంకాదు. పాలకుల నైజం, వ్యవహారశైలి, పాలితులపట్ల వాళ్ళ వైఖరి. హిందువు అయినా, ముస్లిం అయినా క్రూర చక్రవర్తిని ప్రజలు అసహ్యించుకున్నారు, ఎదిరించారు. దయగల ప్రభువుల్ని ఆదరించారు – వాళ్లు ముస్లింలు అయినా, హిందువులు అయినా, అలా ప్రజాదరణ పొందినవాడు శివాజి.
శివాజి దండయాత్రలు, దుర్గాల ముట్టడి, శత్రు శిబిరాల్లో పరాక్రమ ప్రదర్శన లాంటి వీరోచిత కృత్యాలన్నీ జనం నోళ్ళల్లో కథలు, గాథలుగా అల్లుకుపోయాయి.
‘రాయఘడ్’ రాజధానిగా ఆయన స్థాపించిన సామ్రాజ్యంలో ఎన్నో సంస్కరణలు కార్యరూపం ధరించాయి. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం, వాళ్ళని పెత్తందారుల ఆగడాల నుంచి బయటపడెయ్యడం కోసం ఆయన ఎన్నో ఘనకార్యాలు నిర్వహించాడు. సైన్యాన్ని, నావికదళాన్ని నిర్మించాడు. దుర్గాలని పటిష్ట పరిచాడు. అక్షరాస్యత వ్యాప్తికి నడుంకట్టాడు. పరిపాలనా భాష సంస్కరించాడు. రాజ వ్యవహారం కోశం అనే నిఘంటువును తయారు చేయించాడు. శిక్ష్మాస్మృతి సమన్యాయంతో అమలుచేశాడు. మొత్తం మీద ”ప్రజల మనిషి” అని ప్రజల మన్నన పొందాడు.
శివాజికి ముస్లింమత విద్వేషం యేమాత్రం లేదు. ఔరంగజేబ్‌తో పోరాడినా తన కొలువులో, సైన్యంలో ముస్లింలని యే శంకలూ లేకుండా నియమించాడు. ఆయన విశాలదృక్పథం, ఏ ఒక్క మతానికి సంకుచితం కాకుండా ఆయన్ని మహనీయుణ్ణి చేసింది.
-
Avanism
0₹200.00చరిత్రను శోధించి సత్యాన్ని సాధించాలి. వాస్తవికత ఇచ్చే తృప్తి, ఆనందం మారేది ఇవ్వలేదు. ఈ “అవనిజం” పుస్తకంలో కూడా కొన్ని పరిశోధనలను గురించి రాస్తున్నప్పుడు ఎదో సంతోషం. ఎందుకంటే మన బాధ్యతగా కొన్ని నిజాలను ఆవిష్కరిస్తున్నామని. ప్రతి మనిషికి విశ్వం ఒక అంతుబట్టని రహస్యం. ఎంత తెలుసుకున్నామనే దానికంటే మనకు అందిన విషయం సముద్రంలో ఒక నీటి బొట్టు మాత్రమే. అయినా అది సాధించిన విజయం తక్కువదేం కాదు. ఎన్నో మూఢనమ్మకాల పొరలు ఛేదించి విజ్ఞానం వైపు ఆధునిక సమాజాన్ని నడిపిస్తున్న శాస్త్రీయతను ప్రాచీన అర్వాచీన విజ్ఞానం ద్వారా అందించాలనే చిన్న ప్రయత్నమే ఈ “అవనిజం”.
-
Divodasu Lokasanchari
0₹200.00“మానవజాతి ప్రగతి పథంవైపు సాగించిన ప్రతి అడుగూ రక్తతర్పణంతోనే సాగింది. నర రక్తం ఇంతగా ప్రవహించడానికి అన్ని మతాల ధర్మచార్యులే కారణం; వారే బాధ్యులు, ఏ ఒక్క మతము, ఏ ఒక్క మతాచార్యుడు గర్వించవల్సింది ఏమీలేదు” అని చారిత్రిక ఆధారాల రీత్యా తన రచనల ద్వారా ఆయన రుజువు చేశాడు. ప్రస్తుత రాజకీయ, సామాజిక వాతావరణంలో రాహుల్జీ పుస్తకాల పఠనం అత్యంత అవశకం. ఆ మహాపండితుని రచనలన్నింటినీ తిరిగి ముద్రించి తెలుగు పాఠకుల ముందుంచుతున్నందుకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ గర్వపడుతున్నది.
– గడ్డం కోటేశ్వరరావు
-
Nobel Kathalu – నోబెల్ కథలు
0₹120.00ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రచయితలకే నోబుల్ బహుమతి దక్కుతుంది. ఆ బహుమతి దక్కినవారిలో కొంతమంది రచనల నుండి మేలిమి కథలను స్వీకరించి, కథా సంకలన రూపంలో తెలుగు పాఠకులకు అందించారు రచయిత్రి శ్రీమతి జి.లక్ష్మి.
ఆమె ఎంచుకున్న రచయితలు, రచయిత్రులు ప్రపంచం నలుమూలలకు చెందినవారు. అందులో థామస్ మాన్, పెరల్ ఎస్ బక్, టాగోర్, సింక్లెయిర్, నైపాల్, లెస్సింగ్, రెమాంట్ లాంటివారు మన దేశ పాఠకులకు కూడా బాగా పరిచితులే. ఇరవై మంది రచనల నుండి ఇరవై కథలు అనువదించి ‘నోబెల్ కథలు’గా అందించారు లక్ష్మి.
Pages : 158 -
Raktasruvulu – రక్తాశ్రువులు
0₹180.00ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విప్లవాలలో చైనా విప్లవం ఒకటి. సాయుధ ప్రజా విప్లవం ద్వారా ప్రజాతంత్ర చైనా ఆవిర్భవించింది. భూస్వామ్య విధానానికీ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు సాగిన చైనా సాయుధ పోరాటాన్ని ‘లాంగ్ మార్చ్’ గా ప్రపంచ చరిత్రపుటల్లో నిక్షిప్తం చేయబడింది. కష్టాలు, కన్నీళ్లు, రక్తతర్పణంతో నవ చైనా అవతరించింది. అందుకు ఆనాటి ప్రపంచ దేశాల్లోని పురోగామి శక్తులన్నీ తమ అండదండలు తెలియజేశాయి. భారతదేశాన్నుండి కొట్నీస్ వెళ్లి చైనా విముక్తి పోరాటానికి తన సాహసోపేతమైన సేవలందిస్తూ మరణించాడు. అదే కోవకు చెందినవారు నార్మన్ బెతూన్. తమ దేశాలను, కుటుంబాలను విడిచిపెట్టి మరో దేశం వెళ్లి ఆ ప్రజల కోసం నిస్వార్థ సేవలందిస్తూ ప్రాణత్యాగం చేసిన అమరవీరులు. చరిత్ర పుటల్లో, ప్రజల హృదయాల్లో ఆచంద్రతారార్కంగా వారు నిలిచిపోతారు.
నార్మన్ బెతూన్ కమ్యూనిస్టు. కమ్యూనిస్టు చైతన్యం ఆయన నరనరానా జీర్ణమైపోయింది. చైనా విముక్తి పోరాటంలో పాల్గొనడం తన అంతర్జాతీయ కర్తవ్యంగా భావించాడు. ఒకవైపున భీకరపోరాటం జరుగుతున్నా బాంబుల వర్హం కురుస్తున్నా, మొక్కవోని ధైర్యంతో ఒక అడుగు కూడా వెనక్కు వేయకుండా తనకు తానే నిర్దేశించుకున్న కర్తవ్య నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన మానవులలో మహోన్నతుడు నార్మన్ బెతూన్. ఆయన జీవిత అమరగాథే “రక్తాశ్రువులు” అనే నవలగా సిడ్నీ గోర్డన్, టెడ్ అలెన్ లు ఇంగ్లీషులో రాసిన నవలను సహవాసి తెలుగులో రచించారు.