-
-
Nalla Chepapilla Katha – నల్ల చేపపిల్ల కథ
₹20.00చైతన్య ప్రవాహంలో ఈదులాడే ఓ చిన్న ‘నల్ల చేపపిల్ల’ కథ ఇది. ప్రపంచం అంచుల్ని చుంబించాలనే తపన. నూతన ప్రపంచంలో ఆవిష్కృతం కావాలనే తిరుగులేని పట్టుదల. ఆ అద్భుత ప్రయత్నంలో చేప పిల్ల పొందిన ఎన్నో వింత అనుభవాలు, ప్రకృతి పారవశ్యాలు, విరుచుకుపడ్డ ప్రమాదాలు, వాటితో చెలగాటాలు, ఎవరెవరితోనో పరిచయాలు. శత్రు మిత్ర భావనలు, అననుకూల పరిస్థితులు, శత్రువుపై పన్నిన యుద్ధ వ్యూహాలు, మొక్కవోని ధైర్యసాహసాలతో ముందుకు మున్ముందుకు సాగించిన స్వేచ్ఛా ప్రయాణం. అదో భయమెరుగని జీవనగమనం.
నిజంగా ఇది కేవలం చేపపిల్ల కథేనా! అవును నిజమే బెహరంగీ అల్లిన మరో ‘పంచతంత్రం’ కథ. ఇది మనిషి స్వేచ్చా పిపాసకు, జ్ఞాన తృష్ణకు ఎత్తిపట్టిన ప్రతీక.
తన జాతిజనులలో, ఇంకా చెప్పాలంటే ప్రపంచ మానవాళిలో స్వాతంత్య్రేచ్ఛని, అందుకవసరమైన చైతన్యాన్ని రగుల్గొలిపేందుకు సమద్ బెహరంగి చేసిన అద్భుత సృజన ‘నల్ల చేపపిల్ల కథ’.
-
-
-
-
Peka Mukkalu – పేక ముక్కలు
₹220.00సృజనాత్మక సాహితీ సేచనతో భారతదేశ సాహితీ క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్‌చందర్ తెలుగు పాఠకలోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన ఆయన రచనలు అనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.
కిషన్ చందర్ 1914 నవంబర్ 23న పంజాబ్‌లో జన్మించారు. ఎం.ఏ., ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకున్నారు. ప్రధానంగా ఆయన నవలా రచయిత. ఆయన నవలలు అనేకం భారతీయ భాషలతోపాటు ఇంగ్లీష్, రష్యన్, డేనిష్, పోలిష్, జర్మన్, హంగేరియన్, చైనా భాషలలోకి అనువదించబడ్డాయి.
ఆయన రచనలు సమాజ స్వరూపానికి అద్దం పడతాయి. మహోదాత్త శ్రమకీ నీరాజనమిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలి, జీవిత వైవిధ్యం, మానసిక అంతర్మథనానికి మాటలతో రూపమివ్వటం – కిషన్ చందర్ ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి. ”గాలిబ్ వారసుడు”గా సాహితీ లోక సమాదరణ పొందిన కిషన్ చందర్ 1977 మార్చి 8న కీర్తిశేషులయ్యారు.
ఈ నవలకు పెట్టిన ”పేకముక్కలు” అన్న పేరు చాలా విధాలా సార్థకనామం. ఇందులో ఉన్న పాత్రలు పేకముక్కలు. ఇందులో రాజులూ, రాణీలూ, జాకీలూ, జోకర్లూ, పొడిముక్కలూ అందరూ ఉన్నారు. సినిమా ఒక కళా కాదు, ఒక వ్యాపారమూ కాదు – పేకాట, జూదం! కాని అది కొద్దిమందికే జూదం. మిగిలినవారిలో సుఖజీవనం కోసం వచ్చినవాళ్ళుంటారు. తమ ఆదర్శాలు సఫలం చేసుకోవటానికి వచ్చినవారుంటారు. బ్రతుకు తెరువులలో ఇది ఒకటనుకుని, పెద్ద ఆశలేమీ లేకుండా వచ్చినవారుంటారు. ఈ రకాలన్నీ ఈ నవలలో ఉన్నాయి.
సినిమా జీవితం ఒక విలక్షణమైన జీవితం. మామూలు జీవితపు విలువలకిక్కడ చలామణీ లేదు. ఈ సంగతి తెలియగానే మామూలు జీవితపు విలువలను సునాయాసంగా విసర్జించేస్తారు కొందరు. మరి కొందరు వాటిని గాఢంగా అంటిపెట్టుకుంటారు. ఆ కారణంగా నలిగి హూనమైపోతారు. అంతులేని ఆశనూ, అగాధమైన నైరాశ్యాన్నీ రేకెత్తించగల విచిత్ర జీవితం సినిమా జీవితం.
జీవితాన్ని వాస్తవంగా చిత్రించటమే ఒక విశేషం కాదు. డిటెక్కివు నవలల్లో కూడా వాస్తవ జీవితమే ఉన్నది. ఈ నవలలో సినిమాకారుల జీవితాన్ని ఉన్నదున్నట్టు చిత్రించటంలో సరిపుచ్చుకోక, రచయిత ఆ జీవితంలోని సత్యాలన్నిటినీ నగ్నంగా ప్రదర్శించారు. ఆ కారణంచేత ఇది ఉత్తమ రచన అనిపించుకుంటుంది. ఎప్పటికైనా సినిమా కళ ఉన్నతికి రావాలంటే, అందుకు జరగదగిన కృషిలో ఈ నవల ఒక భాగమవుతుందా అంటే, అవుతుందని నేను నమ్మకంగా చెప్పగలను. – కొడవటిగంటి కుటుంబరావు
పేజీలు : 264
-
Prajaa Nayakudu V.Subbayya – ప్రజా నాయకుడు వి.సుబ్బయ్య
₹60.00ఆయన పేరు సుబ్బయ్య. ప్రజలు ముద్దుగా పిలుచుకునేది వీఎస్. ఇదేదో ఓ వ్యక్తికి సంబందించింది కాదు. ఓ స్వాతంత్య్ర సమరయోధునికి, అదీ ఫ్రెంచ్-ఇండియా విముక్తి ఉద్యమానికి అంకితమైన సర్వస్వాన్నీ త్యాగం చేసిన వ్యక్తి జీవితంతో ముడిపడి ఉన్న పేరది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహరహారం పరితపించిన హృదయమది. సుమారు మూడు దశాబ్ధాల పాటు ప్రజల కోసం, ప్రజలతో మమేకమై సమరాంగణాన నిలబడిన మహామనిషి కామ్రేడ్ వీఎస్. వలసవాదుల గుండెల్లో నిదురించి, పాండీచ్చేరి ప్రజల మనసుల్లో స్వేచ్ఛా స్వాతంత్య్రాల కాంక్షను రగిలించి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ధీరుడు, వీరుడు. ఆయనో సామాజిక వేత్త. ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా, చివరకు తన ప్రాణాలకు ముప్పొచ్చినా ఏ మాత్రం వెరవక ప్రజల పక్షాన నిలిచిన చరితార్థుడు. అటు ఫ్రెంచ్-ఇండియా ఇటు బ్రిటీష్-ఇండియా చరిత్రపుటలకెక్కిన నేతలకే ఆదర్శప్రాయుడు. అటువంటి మహనీయుని సంక్షిప్త జీవిత చరిత్ర ఈ పుస్తకం.
కావడానికిది వీఎస్ జీవిత చరిత్రే కావచ్చు గాని వాస్తవానికిది పుదుచ్ఛేరి 20 శతాబ్దపు చరిత్ర కూడా. వీఎస్ జీవిత చరిత్ర నుంచి పుదుచ్ఛేరి స్వాతంత్య్ర పోరాటాన్ని విడదీసి చూడడం అసాధ్యం. అసంభవం.
-
-15%
Rich Dad Poor Dad: What the Rich Teach Their Kids About Money That the Poor and Middle Class Do Not! Mass Market Paperback – 11
Original price was: ₹499.00.₹424.00Current price is: ₹424.00. -
Science Vijayalu
₹75.00నిప్పును ఎవరు కనుగొన్నారు… చక్రాన్ని ఎవరు రూపొందించారు… నేడు అందరూ ఎంతో ఇష్టపడే కాఫీకి మూలం ఎవరు… దూరాన ఉన్న మనుషుల సైతం మాటలతో కలిపే టెలిఫోన్ రూపకర్తలు ఎవరు… ఇటువంటి ఎన్నో విషయాలు నాటి చరిత్రగా మిగిలిపోయినా… నేటికి… రేపటికి కూడా నూతనంగా ఉంటాయి. ఇక్కడి ఆర్యభట్ట నుండి అక్కడి ఐన్స్టీన్… ఈ పుస్తకంలో పలువురు శాస్త్రవేత్తలు రూపొందించిన పరికరాలు, వాటి కాలాలు తదితర విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసారు. ఇలా ప్రపంచంలో ఎందరో శాస్త్రవేత్తల జీవితాలే కాదు, వారి పరిశోధనలు చరిత్రలుగా మిగిలినా భవిష్యత్ ప్రగతికి కొత్త మార్గాల అన్వేషణలో సహాయపడుతూనే ఉన్నాయి. నిత్య నూతనంగా… విజ్ఞాన సంబంధమైన విషయాలకు సంబంధించిన పుస్తకాలు చదవాలని ఎంతోమందికి ఉన్నా.. క్లిష్టమైన బాష అడ్డుగా మారింది. ఆయా అంశాలు మాతృబాషలో లభిస్తే ఎంతో ఉపయుక్తం. కనీసం క్లుప్తంగానైనా మాతృబాషలో ఉండి పలు అంశాలు ఒకచోట చేర్చితే చదువరులకు ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించడంతో పాటు భద్రపరచుకునేందుకు వీలుగా ఉంటుంది. ఆ ప్రయత్నమే ఇది.
– జె.ఎస్. భాస్కర్
-