-
Bhagyalakshmi
0₹70.00ప్రతి మనిషికి యిల్లుంటుంది. ఆయింటిని తీర్చిదిద్దుకోవడమే ప్రతిభ. ప్రతి వారికి బుర్ర వుంటుంది. ఆ బుర్రను సక్రమంగా ఉపయోగించుకోవడం ప్రతిభ. ప్రతివారికి లేకపోయినా కొందరికయినా డబ్బుంటుంది. దానివల్ల నలుగురికి ఉపయోగం మాటెలావున్న హాని చేయకపోవడం ప్రతిభ…
తెలుగు జీవితాన్ని కలంపట్టి భూమార్గం పట్టించిన మాదిరెడ్డి సులోచన జీవిత పద చిత్రణలివి!
-
Bhinna Dhruvaalu
0₹70.00రచయిత గురించి మాదిరెడ్డి సులోచన శంషాబాదు గ్రామంలో 1935 లో జన్మించారు. వీరిది సాంప్రదాయక వ్యవసాయక కుటుంబం. ఈమె ఎం.ఎ, ఎం.ఇడి చేసి 1971 వరకు సుమారు 10సంవత్సరాలు ఉపాధ్యాయినిగా పని చేశారు. భర్తతో బాటు ఇధియోపియా,జాంబియా దేశాలకు వెళ్లి అక్కడ కూడా ఉపాధ్యాయినిగా పనిచేసారు ఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల రాసారు. ఈమె దాదాపు 150 కధలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాసారు. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే ఆలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలు, పెళ్ళిళ్ళు కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కధా రచయిత్రి అవార్డులు పొందారు.
-
Bindhu Padham
0₹120.00రచయిత గురించి మాదిరెడ్డి సులోచన శంషాబాదు గ్రామంలో 1935 లో జన్మించారు. వీరిది సాంప్రదాయక వ్యవసాయక కుటుంబం. ఈమె ఎం.ఎ, ఎం.ఇడి చేసి 1971 వరకు సుమారు 10సంవత్సరాలు ఉపాధ్యాయినిగా పని చేశారు. భర్తతో బాటు ఇధియోపియా,జాంబియా దేశాలకు వెళ్లి అక్కడ కూడా ఉపాధ్యాయినిగా పనిచేసారు ఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల రాసారు. ఈమె దాదాపు 150 కధలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాసారు. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే ఆలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలు, పెళ్ళిళ్ళు కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కధా రచయిత్రి అవార్డులు పొందారు.
-
Chalam Sahityam – చలం సాహిత్యం
0₹40.00చలం సాహిత్యంలో స్త్రీ స్వేచ్ఛ’ని తీసుకుంటే, దానికి అనుకూలించే పాజిటివ్ అంశాన్ని, దానికి హాని కలిగించే నెగిటివ్ అంశాన్నీ వేరుపరచి, దేన్ని స్వీకరించాలో, దేన్ని తిరస్కరించాలో గుర్తించడం చాలా అవసరం.
ఈ సాహిత్యం మీద, ప్రారంభం నించీ చర్చలు సాగుతూనే వున్నాయి. మూడు రకాల ధోరణులు ఈనాటికీ వున్నాయి. చలంలో ఉన్న ఏ సానుకూలాంశాన్నీ పట్టించుకోకుండా, వ్యతిరేకాంశాల్ని మాత్రమే పట్టించుకొని, ‘చలం, పూర్తిగా తిరస్కరించదగ్గ రచయిత’ అని తేల్చే ధోరణి కొందరిది.
చలంలో వున్న ఏ వ్యతిరేకాంశాన్నీ గమనించకుండా ప్రతిదాన్నీ నిర్విమర్శగా స్వీకరించే ధోరణి మరికొందరిది.
గాఢంగా ఇష్టాలూ, తీవ్రమైన సందేహాలూ – రెంటితోనూ సతమతమయ్యే మూడో ధోరణి మిగతావాళ్ళది!
ఈ స్పందనలన్నీ ఈనాటికీ వున్నాయి.
చలం జయంతి సంవత్సరానికి వెనకటి నుంచీ ఆ మూడు ధోరణులూ కాని వింత ధోరణి ఇంకొకటి ప్రారంభమైంది. ‘స్త్రీ స్వేచ్ఛ’ పట్ల చలంలో దొరికే నెగిటివ్ అంశాలనే ఆదర్శాలుగా, ఆచరణీయాలుగా భావిస్తూ, చలం అవగాహన అంతా అదే అయినట్టు ప్రచారం చేసే ధోరణి అది!‘స్త్రీ స్వేచ్ఛ’ గురించి ఏ తెలుగు రచయితలోనూ సరైన అవగాహనలేని కాలంలో జరిగిన తప్పుల పట్ల చూపే సహనం, ఈనాటి తప్పులపట్ల చూపకూడదు. ఆనాటి తప్పులకు వర్తించిన క్షమాపణ, ఈనాటి తప్పులకు వర్తించదు.
-
Chankya Ala Cheppadu
0₹225.00‘ఎదురు లేకుండా ఉండేందుకు మిమ్మల్ని మీరు అధిగమించండి. విజయానికి మీ మార్గంలో అతి పెద్ద అడ్డంకి, అతి పెద్ద మద్దతు రెండూ మీ మనస్సే – దానికి మీరు ఎలా శిక్షణ ఇచ్చారన్న దాని మీదే అంతా ఆధారపడి ఉంటుంది.
– చాణక్య
స్నేహాలను ఏర్పరచుకోవడం, విజయవంతమైన వృత్తి ఉండడం, ఆరోగ్యకరమైన వివాహ జీవితం, కుటుంబాన్ని పోషించడం, సామాన్యంగా జీవించడం గురించి మనకు ఏ బడి లేదా విశ్వవిద్యాలయం నేర్పదు. నిత్య జీవిత గందరగోళ ప్రకృతి చిత్రానికి, మార్గ నిర్దేశానికి మనకు దిక్సుచి వంటి ఒక నిర్దేశక పుస్తకం ఉంటే బాగుండని, ఉండాలని మనం ఎన్నోసార్లు అనుకుని ఉంటాము.
చాలాకాలంగా ఎదురు చూస్తున్న పుస్తకం ‘దస్ స్పోక్ చాణక్య’ లో రాధాకృష్ణన్ పిళ్ళై, ప్రసిద్ధిగాంచిన కౌటిల్యుని అర్థం శాస్త్రం నుంచి పురాణోక్తులను విశదీకరిస్తూ, ఈ ఆధునిక కాలానికి అనుగుణంగా రోజువారీ అభ్యాసానికి, అమలుకు చిన్న, చురుకైన వాక్యాలలో వాటిని వివరించారు.
– రాధాకృష్ణన్ పిళ్లై
-
-
Dasarathi Sahityam- 4
0₹400.00“దాశరథి అన్నిటికన్నా ముందు – మనిషి, ఏ కొద్దిపాటి వానచినుకులకైనా తబ్బిబ్బుకాగల రావిఆకు హృదయమున్నవాడు. అతనొక సంక్షుభిక తెలంగాణా ఉద్యమకాలంలో కాక, మరొక కాలంలో జన్మించినట్లయితే, ఏమి చేస్తుండేవాడో ఊహించడం కష్టం కాదనుకుంటాను.
ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ‘యాత్రాస్మృతి’ అనడం కన్నా, కవిపరంపరతో కలిసి చేసిన యాత్రాస్మృతి అనడం సముచితంగా ఉంటుంది. ఒకప్పుడు మహా రాష్ట్రదేశంలో సంత్ జ్ఞానేశ్వర్, నామదేవ్ వంటివారు ప్రోదిచేసి పోషించిన వర్కారీ సంప్రదాయంలో లాగా, పండరియాత్ర చేసే భక్త గాయకులు తమ యాత్రనొక కావ్యయాత్రగా మార్చుకున్నాడు. అతిసున్నితమైన, మసృణకోమలమైన ఆయన హృదయం ఏ పాటలు పాడుకున్నదో అన్న పాటలూ మనం వినలేకపోయాo. క్లుప్తంగా కనిపిస్తున్న ఈ పుస్తకం పుటల్లో రాసిన వ్యాక్యాలను సంభావించుకునే యోగ్యత ఒక్కటే మనకు మిగిలింది.
“మహారచయిత టాల్ స్టాయి ‘యుద్ధము శాంతి’గా పర్యవసించడానికి ఒక నవలగా రాసాడు. కాని దాశరథి విషయంలో ‘యుద్ధము – శాంతి’ ఆయన జీవితంగానే పెనవైచుకు పోయాయి”.
– చినవీరభద్రుడు
-
-
Devudichina Varaalu
0₹110.00రచయిత గురించి
మాదిరెడ్డి సులోచన శంషాబాదు గ్రామంలో 1935 లో జన్మించారు. వీరిది సాంప్రదాయక వ్యవసాయక కుటుంబం. ఈమె ఎం.ఎ, ఎం.ఇడి చేసి 1971 వరకు సుమారు 10సంవత్సరాలు ఉపాధ్యాయినిగా పని చేశారు. భర్తతో బాటు ఇధియోపియా,జాంబియా దేశాలకు వెళ్లి అక్కడ కూడా ఉపాధ్యాయినిగా పనిచేసారు ఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల రాసారు. ఈమె దాదాపు 150 కధలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాసారు. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే ఆలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలు, పెళ్ళిళ్ళు కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కధా రచయిత్రి అవార్డులు పొందారు.