-
Swamuloru – స్వాములోరు
0₹120.00అతడో చిల్లర దొంగ. హీనుడు. స్త్రీలోలుడు. క్రూరుడు. డబ్బు వ్యామోహపరుడు. సర్వదుర్గుణాలపుట్ట. తేలికగా డబ్బు సంపాదించాలని స్వామి అవతారం ఎత్తాడు. ఆశ్రమం నిర్మించాడు. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తా అన్నాడు. రోగాల్ని తగ్గిస్తానన్నాడు. పిల్లలు లేని దంపతులకి పిల్లలు పుట్టిస్తానన్నాడు. మాయలూ మంత్రాలూ చేసాడు. జనాన్ని నమ్మించాడు. వంచించాడు. వక్రబుద్ధులు చూపెట్టాడు. అంతులేని సంపద పోగేసుకున్నాడు. ఆశ్రమంలో అత్యాచారాలు జరిగాయి. హత్యలు జరిగాయి. పెద్ద పెద్ద అధికార్లూ, పోలీసులూ, మంత్రులూ స్వామి పాదాక్రాంతులయ్యారు.
నేటి మన సమాజంలో స్వాములుగానూ, బాబాలుగానూ చలామణి అవుతూ పూజలందుకుంటున్న అనేకమంది దగుల్బాజీల కోవలోని వాడే ఈ స్వామికూడా! స్వామి క్రూరత్వానికి ఒక అబల గురైంది. భర్తని పోగొట్టుకుంది. స్వామి స్వరూపాన్ని గ్రహించింది. స్వామిని కటకటాల వెనక్కి పంపిస్తానని ప్రతిన బూనింది.
ఆ అబల ఆవేదననీ, ఆరాటాన్నీ, పోరాటాన్నీ, ఉద్యమాన్నీ ఉత్తేజపూరితంగానూ, స్వాముల బతుకుల్నీ, బండారాల్నీ, దుష్టత్వాల్నీ, కపటత్వాల్నీ, దుర్మార్గాల్నీ మోసాల్నీ, ధనకాంక్షల్నీ ఆసక్తికరంగానూ, ఉత్కంఠ భరితంగానూ అక్షరీకరించిన నవల ‘స్వాములోరు’.
పేజీలు : 159
-
Vidhatha
0₹100.00ప్రజాస్వామ్యం వచ్చినా బానిసత్వం పోలేదు! ఎన్ని రాజకీయ పార్టీలు మారినా రాజరికం మారలేదు! కార్ల్ మార్క్స్ కోరుకున్న సమసమాజం ఎక్కడ? రవీంద్రుడు కలలుగన్న స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఏమయ్యింది?
ఈ కర్మభూమిలో ఎంతమంది మహానుభావులు మట్టినా ఇంకా మన జీవితాలు ఇలాగే ఎందుకున్నాయి?మరి దీనికి శాశ్వత పరిష్కారమేమిటి? ప్రజలా? ప్రభుత్వాలా? వ్యవస్థలా? భావవిప్లవమా?వెదకగలిగితే ఈ నవలలో పరిష్కారం కనపడుతుంది!
ఈ నవలలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం జరిగింది. ఇప్పుడున్న మానవ సంబంధాలలో, అలాంటి ప్రపంచం ఒకటి ఎంతయినా అవసరమని, నిజంగా నమ్మి రాసిన పుస్తకం ఇది. వందమంది నిజాయితీపరులు ఉంటే ఈ ప్రపంచాన్నే మార్చివేస్తానన్న ‘శ్రీ స్వామీ వివేకానందు’ని వాక్యమే ఈ నవలకి ప్రేరణ!
-
Viswambhara – విశ్వంభర
0₹75.00భారతీయ జ్ఞానపీఠ పురస్కారం పొందిన కావ్యం.
ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర.
ఇతివృత్తం – తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనషి కథ.
ఈ కథకు నేపథ్యం ప్రకృతి.
మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు.
అలాగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ – ఇలా ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి!
కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతిశక్తుల వశీకరణం – ఇలా ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి!
ఆదిమదశనుంచీ ఆధునికదశవరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలో ప్రకరణాలు.
మనిషి సాధన త్రిముఖం – కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగున ఎదురుదెబ్బలు. క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు. ‘విశ్వంభర’ కావ్య రచనకు పూర్వం నాలో గీసుకున్న రేఖాచిత్రమిది.