• Andani Pilupu

    Andani Pilupu

    0

    “చిన్నా!” నన్ను ఆ పేరుతో పిలిచి ప్రలోభపెట్టకు, చెప్పు – నా తండ్రెవరు? నిజం చెప్పు. అనుకోని ఈ ప్రశ్నకు అంజనీదేవి తెల్లబోయింది. ముఖం పాలిపోయింది. తనను సంబాలించుకుంది. ఏమిట్రా పిచ్చిపట్టిందా? నీ తండ్రెవరో నీకు తెలియదా? పిచ్చి భ్రమలో పెంచావు. ఇప్పుడైనా నిజం చెప్పకపోతే పిచ్చిపడుతుంది. “మీ తండ్రి శ్రీహరిగారు.” కాదు అబద్దం అతను రామస్వామిగారి ఇల్లరికపు అల్లుడు. నీ అందానికి దాసుడై భార్యబిడ్డలను అనాధలను చేసి వచ్చిన ఘనుడు. కన్న కొడుకుకు సంజాయిషీగా ఆ తల్లి చెప్పిన కన్నీటికథే “అందని పిలుపు.”

    80.00
    Add to cart
  • Animal Farm (Telugu)

    Animal Farm (Telugu)

    0
    300.00
    Add to cart
  • Antam Chusina Asuya

    Antam Chusina Asuya

    0

    రచయిత గురించి
    మాదిరెడ్డి సులోచన శంషాబాదు గ్రామంలో 1935 లో జన్మించారు. వీరిది సాంప్రదాయక వ్యవసాయక కుటుంబం. ఈమె ఎం.ఎ, ఎం.ఇడి చేసి 1971 వరకు సుమారు 10సంవత్సరాలు ఉపాధ్యాయినిగా పని చేశారు. భర్తతో బాటు ఇధియోపియా,జాంబియా దేశాలకు వెళ్లి అక్కడ కూడా ఉపాధ్యాయినిగా పనిచేసారు ఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల రాసారు. ఈమె దాదాపు 150 కధలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాసారు. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే ఆలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలు, పెళ్ళిళ్ళు కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కధా రచయిత్రి అవార్డులు పొందారు.

    80.00
    Add to cart
  • Antata Atade
  • Anubandalu - Antaralu
  • Anuraga Toranam,అనురాగ తోరణం

    Anuraga Toranam,అనురాగ తోరణం

    0

      “ప్రియమైన శ్రీవారికి

                                                               లక్ష్మి నమస్కరించి వ్రాయునది : నేను రాత్రంతా బాగా ఆలోచించాను. ఒక్కసారి మన పెళ్ళి అయినా యూ పది సంవత్సరాల నుంచి, మనం గడిపిన జీవితం, యూ సంసారంలో నేను పొందిన సుఖం, ఆనందం యేమిటో, యిందులో నేను పడిన శ్రమ ఏమిటో, కూలంకషంగా నాలో నేనే తర్కించుకుని, చర్చించుకున్నాను! కానీ డబ్బు సంపాయించటం నాకు చేతకాని మాట నిజమేకాని, న శరీరశక్తితో, మీ సంపాదనలో యెంత భాగం కూడబెట్టేట్టు చేయగలిగానో, నా ఒక్కదానికే తెలుసు. అది మీకు గుర్తుచేయటం, నన్ను నేను కించపరుచుకొనటం అని భావిస్తున్నాను! “పనిపాట లేకుండా కూర్చుని తింటుంటే నీకు కష్టం తెలియటం లేదు” అని మీరు మాటిమాటికి విసుక్కుంటుంటే విని భరించటం, నన్ను కాదని ఉరుకోవటం నాకు శక్తికి మించినపని అవుతోంది.”

                                                                                                           -యద్దనపూడి సులోచనారాణి.

    60.00
    Add to cart
  • Aparanji

    Aparanji

    0

     ఓ పుత్తడి బొమ్మ అపరంజి! పడిలేచే కడలి తరంగం ఆమె జీవితంలోని ఒక్కొక్క సంఘటన. తండ్రి కఠినాత్ముడు, కర్కోటకుడు. తన మొదటి భార్య సంతానాన్ని సొంత బిడ్డలుగా చూసుకుంటున్న తల్లిని వేదించాడు. ఆ నికృష్టుని బారి నుండి పరమతస్థుడు కాపాడి, కాల భ్రమణంలలో తన తల్లిని ఆయన అర్ధాంగిగా చేసుకున్నాడు. అపరంజిని వయసుతోబాటు తీర్చి దిద్ది నిండయిన సిసలైన అపరంజిని చేశాడు. ఆమె ఆనాడు విదేశీయాత్రకు పయనమైంది. సరదాకోసం కాదు హనీమూన్ కి అంతకంటే కాదు. తెలుగు పడుచులు మాత్రమే బాధ్యతగా గుర్తించే రక్త సంబంధీకుల క్షేమం కోసం, వారి ఉన్నతికోసం. జాలి, కరుణ, బాధ్యతల హద్దులను, ప్రేమ, త్యాగం, దీక్షల సరిహద్దులను తెలుసుకోవాలంటే అపరంజి కథకంటే ఏం కావాలి…

    100.00
    Add to cart
  • Apuroopa

    Apuroopa

    0

    రూపసుందరీ, గుణసుందరీ, చదువుల సరస్వతీ, సంస్కారవతీ అయిన అమ్మాయికి కుడి ఎడమల అన్నీ సమస్యలే.. అన్నీ చికాకులే. తను ఇష్టపడిన యువకుడ్ని పైకి తీసుకురావాలనే తాపత్రయం. చెల్లెలికి చదువు. తనచుట్టూ ఉన్న చిన్న ప్రపంచంలో మళ్ళీ సంతోష తరంగాలు వెళ్లివిరియాలనీ. నవ్వుల పువ్వులు పూయాలనీ. తన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వంశంలోని సర్వాలక్షణ సంపన్నుని వివాహమాడి తనవారికి రక్షారేఖై, తన సౌభాగ్యానికి తానే వెలియై. అపురూపంగా జీవించి. ఇంటికి దీసమై కంటికి వెలుగై విలసిల్లిన ఓ చక్కని చుక్క జీవనరాగ విపంచి ఈ అపురూప చదివి ఆనందించండి!!

    100.00
    Add to cart
  • Ardha Nari

    Ardha Nari

    0

    పితృస్వామ్య దృక్పధం పై యుద్ధం ఈ అర్ధనారి

    జి. లక్ష్మీనరసయ్య

    బండి నారాయణస్వామి రాసిన ఐదో నవల అర్ధనారి. గత నాలుగు నవలల్లో నాలుగు విభిన్న ఇతివృత్తాలను డీల్ చేశాడు. గద్దలాడతండాయి నవలలో దళిత బహుజన సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని పునాది దృష్టి నుంచి చూపాడు. మీరాజ్యం మీరేలండి దళిత బహుజన రాజకీయ చూపుతో వచ్చిన నవల. రెండు కలల దేశం పీడితకుల ప్రజల తాత్వికతను వెల్లడించింది. శృభూమి 18వ శతాబ్దపు రాయలసీమ చరిత్రలోని దళిత బహుజన ఘట్టాల్ని ముందుకు తెచ్చింది. ప్రస్తుతం మన ముందున్న అర్ధనారిలో ట్రాన్స్ జెండర్ వాస్తవికత గురించి బహుముఖ చిత్రణ ఉంది. తెలుగు నవలలో ఈ వస్తువును ఇంత వివరంగా లోతుగా డీల్ చేయడం ఇంతకుముందు జరగ లేదు. ఈ వస్తువుకు సమాంతరంగా పడుపువృత్తిని గురించిన మరో కథనం కూడా ఇందులో నడిచింది. రెండు సమస్యల వెనకా ఉన్న పితృస్వామిక సమాజాన్ని విస్తార విశ్లేషణకు గురిచేయడం ఉంది. ట్రాన్స్ జెండర్ ప్రపంచాన్ని రమణి ఉరఫ్ చంద్రన్న జీవితం ద్వారా నిర్మించుతూ పడుపు వృత్తి వాస్తవికతను రామలక్ష్మి పాత్ర ద్వారా చూపాడు. దిగువ మధ్యతరగతి బహుజన వ్యవసాయ కుటుంబానికి చెందిన చంద్రన్న అనే యువకుడు రమణిగా పరిణమించిన క్రమంలో కుటుంబం నుంచి, సమాజం నుంచీ, ప్రభుత్వం నుంచి నిరాదరణకు గురై అవమానాల్నీ, హింసనీ, వివక్షనీ, వంచననీ అనుభవించిన తీరు సమంజసంగా చిత్రించాడు రచయిత. ఇందులో భాగంగా ట్రాన్స్ జెండర్ వ్యవస్థ నిర్మాణాన్ని అందులోని ఖాదాన్ లనూ, గురువులనూ, నానీలనూ, చేలాలను వారి జీవన విధానాన్ని రోజువారీ…………

    320.00
    Add to cart
  • Arthanareeswarudu - అర్ధనారీశ్వరుడు

    Arthanareeswarudu – అర్ధనారీశ్వరుడు

    0

    పశ్చిమ తమిళనాడులో నమక్కాల్‌ జిల్లా తిరుచెంగోడు పట్టణ ప్రాంతంలోని ఒక సామాజిక సంప్రదాయం ఈ నవలకు నేపథ్యం. దాన్ని ఆచార్య పెరుమాళ్‌ మురుగన్‌ తమిళంలో ‘మధోరు బాగన్‌’ అనే నవలగా 2010లో రాశాడు. దాని తెలుగు అనువాదమే ‘అర్ధనారీశ్వరుడు”. 1940 సం|| నేపథ్యంలో వ్యవసాయము, పశుపోషణ జీవనంగా గల ఒక జంట కాళి, పొన్నల కథ ఇది. ఎన్ని ”గుళ్ళూ, గోపురాలు దర్శించినా” సంతానం కలగదు. పిల్లలు కలగనపుడు తిరుచెంగోడు అర్ధనారీశ్వరుడికి జరిగే రథోత్సవం వేడుకల్లో 14వ రోజున సాంఘిక కట్టుబాట్లను వదలి, ఆ రాత్రి ఎవరు ఎవరితోనైనా శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనవచ్చుననే సాంప్రదాయం ఆనాడు ఉండేది. దీని నాధారంగా చేసుకొని హృద్యంగా ఈ నవల రచించబడింది. పశ్చిమ తమిళనాడులోని కొగునాడు ప్రాంతంలోని కొన్ని సామాజిక వర్గాలు మురుగన్‌ మీద కాలు దువ్వినాయి. అలజడి ప్రారంభమయింది. ఈ నవలలో ప్రస్తావించిన అంశాలు తమ సామాజిక వర్గాన్ని, స్త్రీలను కించపరచేవిగా ఉన్నదనీ, దీన్ని నిషేధించాలనీ కొన్ని హిందూ మతోన్మాద సంస్థలూ, కుల సంఘాలు వక్రమార్గంలో ఎడతెరిపి లేని ఆందోళన అన్ని రూపాల్లో కొనసాగించాయి. రచయితైన మురుగన్‌ను వేటాడారు. దాదాపుగా సాంఘిక బహిష్కరణ చేశారు. మురుగన్‌తో ప్రభుత్వ అధికారుల సమక్షంలో క్షమాపణలు చెప్పించాయి. అయినా గొడవ కోర్టుదాకా వెళ్ళింది. విచారణ సం||ర కాలం జరిగింది. మతోన్మాదుల ఉన్నాదాన్ని కోర్టు కొట్టివేసింది. ఈ రచనను తెలుగులోకి ప్రసిద్ధ రచయిత ఎల్‌.ఆర్‌.స్వామి అనువదించారు.

    పేజీలు : 152

    120.00
    Add to cart
  • Arugu

    Arugu

    0

    వస్తువు తజన్యమైన ఇతివృత్తమూ, రచన తదనుకూలమైన భాష, సన్నివేశ పాత్ర ప్రవర్తనాదులూ, ఆసక్తి కలిగించే ఈ లక్షణాలు శ్రీ నక్షత్రం వేణుగోపాల్ కథానికలు సంపుటి ‘అరుగు’ లో ప్రత్యక్షమై, పాఠకులు పరమానందం పొందుతారు. కథానికల్లో పరిచిత విషయం ప్రత్యక్షమయితే, పునశ్చరణతో చదువరులు ఉత్తేజితులౌతారు. అపరిచితాంశాలు ఆవిష్కృతమైతే, ఆశ్చర్యానుభూతులకు సహృదయులు లోనవుతారు. –

    తెలుగు పాఠకులు తెలుగు భాషలో ఇంతకు పూర్వం అంతగా పరిచయం లేని విశేష జీవితం చెప్పే ట్రూ ఫేస్ అమెరికా కథలు, శ్రీ వేణు చెబుతుంటే విని చదివి, ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు, అర్థం చేసుకుంటారు. శ్రీ నక్షత్రం వేణుగోపాలకు కథా నిర్వహణ ఆసక్తికరంగా చేయడం బాగా పట్టుబడింది. పాత్ర సృష్టి, సన్నివేశ కల్పన, అతిశయోక్తులు లేకుండా సుందరంగా సహజంగా రాయడం తెలిసి వచ్చింది. ఈ కథానికలు సహజత, స్పష్టత, ఆర్జవం, సౌకుమార్యం సాధించుకున్న మంచి రచనలు. ఉత్తమ కథానికా మార్గంలో మునుముందుకు సాగుతున్న శ్రీ నక్షత్రం వేణుగోపాల్ ఉజ్వల భవిష్యత్తును సాధిస్తాడని పాఠకులు నమ్ముతారు.

    -కొలకలూరి ఇనాక్

    సరిగ్గా ఏడాది క్రితం వేణు నక్షత్రం నాకు ఫోన్ చేసి మూడు దశాబ్దాల క్రితపు మంజీరా రచయితల సంఘ సమావేశాల్లో కలిసిన జ్ఞాపకాలను తడుముతూ తనను పరిచయం చేసుకొన్నారు. మంజీరా రచయితల సంఘంతో కలిసిన అనుభవాలు ఎవరికైనా సంతోషకరమైనవే. దిశానిర్దేశం చేస్తూ తెలంగాణాలో రచయితలను తయారుచేసిన, నడిపించిన చరిత్ర ఆ సంస్థది. అలాంటి సంస్థతో సంబంధంవల్ల 90ల నాటికే రచనా రంగంలోకి ప్రవేశించిన వేణు నాకిప్పుడు ఇలా పరిచయం అయ్యారు. ముందుగా ఆయన పేరులోని నక్షత్రం నన్ను బాగా ఆకర్షించింది. ఆకాశంలోని, అనంతకోటి నక్షత్రాలలో ఒకటి ఎంత చక్కగా ఆయన పేరుకు ముందు పుట్టుకతోనే చేరిపోయిందికదా అనుకున్నా, కథలు రాయటం, లఘుచిత్రాలు తీయటం, నటించటం వంటి అభిరుచులు ప్రయత్నపూర్వకంగా ఆయన ఎన్ని నక్షత్రాలను కలగంటే, ఎన్ని నక్షత్రాలను ఆవాహన చేస్తే సాధ్యమైంది! ?

    మొత్తం మీద వాస్తవికతకు దగ్గరగా ఉండే నక్షత్రం వేణుగోపాల్ కథలు చదవటం మంచి అనుభవం. జీవితాన్ని ఆవరించుకొన్న కనిపించని భీభత్సాన్ని కనిపింపచేయటం ఆయన కథల లక్ష్యం, సంపదలు, సంపాదనల యావలో మనిషి మాయం కావటం పట్ల ఆయన వేదన, వ్యష్టి నుండి సమిష్టి ఆయన కామన,

    – కాత్యాయిని విద్మహే

    200.00
    Add to cart
  • Asatyaniki Avala

    Asatyaniki Avala

    0

    ఈ యావత్ప్రపంచం అబద్ధం…

    ఏది శాశ్వతం కాదు…

    నేనన్నది కూడా పిచ్చి భ్రమ మాత్రమే…

    సత్యమై, నిత్యమైనది వేరే వుంది,

    దాన్ని పొందుదామన్నది ఎంత అసహ్యమైంది?

    దీనికి, ఈ సోకాల్డ్ అసత్యానికి ఆవల ఏదైనా ఉండొచ్చు.

    అది సత్యమై తీరాలా?

    దాన్ని కూడా దాటి వెళ్లాలన్న కామన

    మనిషన్న వాడికి కలక్కుండా వుంటుందా?

    ఈ అసంబద్ధమైన ఆలోఛన్నే తుడిచి అవతల పారేసే శక్తే మనకుంటే ఎంత బావుణ్ణు..

    కానీ, సుప్త చేతననబడే ఈ సబ్ కాన్షస్ మైండ్ వున్నంత వరకూ…

    ఈ చీకటి అరుపులు తప్పవేమో!

    250.00
    Add to cart