-
Donga Tallidandruluntaaru Jaagrattha
0₹150.00దొంగ తల్లిదండ్రులూ, దొంగ అత్త మామలూ, పాత కాలం నుంచీవున్నారు. “సతీ సహగమనాల” ముచ్చట్లు నిర్వహించిన వాళ్ళందరూ తల్లిదండ్రులూ, అత్తామామలూ, కారూ? ఈనాడు కూడా ‘పరువు హత్యల’ పేరుతో ఆడ పిల్లల్ని నరికివేసేది తల్లిదండ్రులు కారూ? పిల్లలు, హిమాలయ పర్వ్ఫతాలేక్కే ఘన కార్యాలు చేసి డబ్బు సంపాదించాలనీ పిల్లలు అక్కడ కొండల మధ్య రాలిపడి చచ్చినా, కొంత డబ్బు వస్తే చాలనీ చూసే తల్లిదండ్రులు కూడా, తల్లిదండ్రులు కారూ? కొండ ఎక్కడంలో బోలెడు మంది పడిపోతున్నారానీ, చస్తున్నారానీ, తెలీదు? – తెలుసు! కానీ డబ్బు రావాలి. పిల్లలు పొతే పోతారు! వాళ్ళే మరి తల్లిదండ్రులు.
ప్రతీ తల్లీ, ప్రతీ తండ్రి, దొంగలు గానే ప్రవర్తిస్తారని చెప్పడమూ ఇది? – కాదు. అలా చెప్పడం అయితే, నేనూ ఒక ‘దొంగ తల్లి’ నే అవుతాను. ప్రతీ ఒక్కరి గురించి అదే అర్ధంతో చెప్పడం కాదు ఇది. దొంగ తల్లిదండ్రుల పిల్లలు, తమ అవమానాలన్నీ ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. పెద్ద వాళ్ళయాక, దేన్నీ సాహించాలో, దేన్నీ తిరస్కరించాలో, ఆ రకంగా నడవాలి. తమ ప్రవర్తనలోకి క్రూర లక్షణాలు చేరనివ్వకుండా తమని తాము ధృఢ పరచుకోవాలి. ఇదే, కొత్త తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్త!.
-
Dooram
0₹230.00రచయితది హైద్రాబాద్. అభిమాన పాఠకురాలిది వైజాగ్.
వ్యక్తిగత సమాచార మార్పిడికి ఉత్తరాలే ప్రధాన ఆధారమైన సంవత్సరం అది. 1976.అభిమాని, రచయితల మధ్య ఆరంభమైన ఉత్తరాలు చివరికి వారి పెళ్ళికి ఎలా దారి తీసాయి? ఆ ఉత్తరాల్లో ఏం రాసుకున్నారు?
ఒకరితో మరొకరికి ముఖపరిచయం కూడా లేని వారి సంబంధం పెళ్ళి దాకా ఎలా వెళ్ళింది?.
ఈ ప్రేమ నవలంతా కేవలం ఉత్తరాల ద్వారానే నడవడం విశేషం.
ఆంధ్రభూమి వీక్లీకి మీ అభిమాన రచయిత మల్లాది తొలుత రాసిన ఈ రొమాంటిక్ సస్పెన్స్ సీరియల్ ద్వారా పాఠకులని ఆకట్టుకుని తర్వాత ధర్మయుద్ధం, ఈ గంట గడిస్తే చాలు లాంటి ఎన్నో నవలలని అందించారు.
షరా : ఇతరుల ఉత్తరాలు చదవడంలోని ఆనందం, వాటికి సమాధానాలు ఇవ్వనవసరం లేదు.
ఈ నవలతో పాటు మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఒకటి ఒంటరి అంకె అనే నవల కూడా ఉంది.
చదవండి! చదివించండి!!
-
Dooram
0₹230.00రచయితది హైద్రాబాద్. అభిమాన పాఠకురాలిది వైజాగ్.
వ్యక్తిగత సమాచార మార్పిడికి ఉత్తరాలే ప్రధాన ఆధారమైన సంవత్సరం అది. 1976.అభిమాని, రచయితల మధ్య ఆరంభమైన ఉత్తరాలు చివరికి వారి పెళ్ళికి ఎలా దారి తీసాయి? ఆ ఉత్తరాల్లో ఏం రాసుకున్నారు?
ఒకరితో మరొకరికి ముఖపరిచయం కూడా లేని వారి సంబంధం పెళ్ళి దాకా ఎలా వెళ్ళింది?.
ఈ ప్రేమ నవలంతా కేవలం ఉత్తరాల ద్వారానే నడవడం విశేషం.
ఆంధ్రభూమి వీక్లీకి మీ అభిమాన రచయిత మల్లాది తొలుత రాసిన ఈ రొమాంటిక్ సస్పెన్స్ సీరియల్ ద్వారా పాఠకులని ఆకట్టుకుని తర్వాత ధర్మయుద్ధం, ఈ గంట గడిస్తే చాలు లాంటి ఎన్నో నవలలని అందించారు.
షరా : ఇతరుల ఉత్తరాలు చదవడంలోని ఆనందం, వాటికి సమాధానాలు ఇవ్వనవసరం లేదు.
ఈ నవలతో పాటు మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఒకటి ఒంటరి అంకె అనే నవల కూడా ఉంది.
చదవండి! చదివించండి!!
-
Doshiki Nidra Pattadu
0₹300.00దోషికి నిద్ర పట్టదు!
రాత్రి తొమ్మిది అవస్తోంది. సముద్రానికి దగ్గరగా వున్న సమ్మర్ విల్లా భవనంలోకి రాజారావు అడుగుపెట్టాడు. ఫ్లోరసెంటు దీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. తన భార్య మనోరమకోసం నలువైపులా చూశాడు. ఎక్కడా ఆమె కనిపించలేదు. లోలోపల విసుక్కున్నాడు.
కాశ్మీర్లో మూడు నెలలుండి మళ్ళా అతను తిరిగొచ్చాడు. మద్రాసులో వున్న మామగారిల్లు చేరుకున్నాడు. మనోరమ ఇంట్లో లేదు. మహాబలిపురంలో కట్టించిన సమ్మర్విల్లాలో ఆమె విశ్రాంతి తీసుకుంటోందని మామ చెప్పడం మూలంగా తిన్నగా అతనిక్కడికి వచ్చాడు.
తన భార్య ఏరోడ్రోమ్కి వచ్చి స్వాగతం చెపుతుందనుకున్నాడు. తనొస్తున్నట్లు ముందు టెలిగ్రామ్కడా ఇచ్చాడు. ధనవంతుల కూతుళ్ళను పెళ్ళాడితే ఇలాగే ఉంటుందేమో! రాజారావు హాల్లోకి ప్రవేశిస్తూంటే కనకరాజు ఎదురయ్యాడు.
“హల్లోవ్, ఎప్పుడొచ్చారు?” అడిగాడు కనకరాజు.
“ఇప్పుడే. మనోరమని ఎక్కడేనా చూశారా?” అడిగాడు రాజారావు. “ఇందాకా చూశాను. ఆమె చాలా బిజీగా వుంది. మీకు తెలిసిన అతిథులు హాల్లో ఉన్నారు. వెళ్ళి వాళ్ళను కలుసుకోండి.”
ఏదో అర్జెంటు పని వున్నట్లు కనకరాజు పోర్టికోలోంచి ఎడంవైపుకి తిరిగి తోటలోకి దూసుకుపోయాడు.
రాజారావు హాల్లో నడవసాగాడు. హాలు ప్రకాశవంతంగా వుంది. పెద్దహాలు, దీపాల కాంతిలో మొజాయిక్ ఫ్లోరు మెరుస్తోంది. కొంచం దూరంలో కొందరు కౌంటరు ముందు నిలబడి కోకోకోలా తాగుతున్నారు. మాట్లాడుతూ నవ్వుతున్నారు. రాజారావు వాళ్ళవైపు నడిచాడు. కౌంటరు ముందుకి వెళ్ళాడు. తెల్లటి యూనిఫారమ్ ధరించిన పుల్లయ్య రాజారావుకి నమస్కరించి ఒక కోకోకోలా బుద్దిని తెరిచి వేసి అందించాడు………….
-
Edagani Manasulu
0₹60.00‘బిందూ! ఇంకా నీ ముస్తాబు పూర్తి కాలేదా?
మమ్మీ నేను నలుపు. ఈ పింక్ కలర్ చీర కట్టుకుంటే ఇంకా నల్లగా కనిపిస్తాను కదూ!
హేమలత పద్దెనిమిదేళ్ళ కూతురు పసిపిల్లలా కనిపించింది.
ఎవరన్నారు నువ్వు నలుపని! పిచ్చితల్లీ అందం అంటే ఒక రంగేనేమిటే?
కాదా మరి!
నీ ఫీచర్స్ ఎంతో బావుంటాయంటారమ్మా. రంగు చూడగానే కొట్టవచ్చినట్టు కనిపించేమాట నిజమే. కాని మనిషి అందం మనసు, ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది.
పోమ్మా, నన్ను మరిపించాలని చూస్తావు.
ఎదగని మనసులు విచిత్ర పరిస్థితుల మధ్య జరిపే ఆరాట పోరాటాల, తబ్బిబ్బులను హృద్యంగా చిత్రీకరించే స్వభావ పరిశీలనాత్మక నవల. తప్పక చదవండి.
-
Ee Desam Maakemichhindi – ఈ దేశం మాకేమిచ్చింది
0₹80.00ప్రభు సబ్‌ఇన్‌స్పెక్టర్, బిందు అతని భార్య, రచయిత్రి. వారికి నలుగురు పిల్లలు. విధి నిర్వహణలో అనికాతనే సాటి. తన పర భేదం లేదు. ఎవరు చెప్పినా వినడు. వేటికీ లొంగడు. యిలాంటి వారివల్లనే ప్రభుత్వ యంత్రాంగానికి తుష్టి పుష్టి వచ్చేది. న్యాయం, ధర్మం సక్రమంగా పాలింపబేది. అయితే ఒక్కోసారి తన ధర్మమే తన న్యాయమే ఆ ఉద్యోగికి, అతని కుటుంబానికి ప్రాణాంతకమైతుంది. చట్టాలు, న్యాయస్థానాలు అతనిని రక్షించలేవు. అతని సేవకు గుర్తింపేమిఇ? ఏ దేశ సౌభాగ్యం కోసం అతను అహరహం శ్రమించాడో ఆ దేశం వారికేమిచ్చింది?
నిశిత సూక్ష్మ పరిశీలనలో తనకుతానే సాటియైన శ్రీమతి సులోచకనా రాణిగారి మరో ప్రయజనాత్మక, ప్రయోగాత్మక నవల.
మనోహరమైన ఆమె శైలి నందనవనంలో విహరిస్తున్నట్లు కమనీయమైన సంగీతం వింటున్నట్లు, వేదనాభరిత హృదయాలకు స్వాంతన వచనాలు పలుకుతున్నట్లు వుంటుంది. ఈ ఏటి నవలలో దీనికి సాటి, పోటీ లేదు అని ఇప్పటికే వేలాది పాఠకులు మెచ్చిన నవల. -
-
-
Enni Metlekkina
0₹150.00అతను పత్రికా సంపాదకుడు, రచయిత వ్యక్తిగత జీవితంలో సుఖం లేనివాడు. మొగుడు వదిలేసిన పెద్ద కూతురు, పోలియోతో కాళ్ళు చచ్చుబడ్డ చిన్నకూతురు. నాలుగు రోడ్ల కూడలిలో మరణించిన కొడుకు, కాలేజీ రోజుల నెచ్చెలి లీల… ఫ్రెంచ్ క్లాసులో పరిచయమైన శకుంతల… అతని తృప్తి నియ్యలేని భార్య సుభద్ర… వీరందరి మధ్య అతనికి జీవితంమీద అసంతృప్తి. ఏమిటి అతనిలోని లోపం? ఏమిటి అతని వ్యామోహం…
మాలతీ చందూర్ వ్రాసిన ప్రతి కధా, నవల, వ్యాసం, అన్నీ ఇంటింటికీ మామిడి తోరణాలై, మణిదిపాలై ప్రకాశిస్తుంటాయి, ఆమె కలం నుండి వెలువడిన మరో మణిపూస, “ఎన్ని మెట్లెక్కినా”.
– మాలతీ చందూర్
-
-
Gaddaladatandayi
0₹200.00ఈ నవలను చదవటం ఏ పాఠకుడికైనా తన సామజిక జీవితానుభవాన్ని విస్తృతపరుస్తుందని నా నమ్మకం. ఈ నవలకు కేంద్రం ఒక చిన్నపల్లె అయినప్పటికీ, దాని పరిధి దేశమంత విస్తృతమైనట్టిది. కొన్ని నదుల నీళ్ళు ఒక జలాశయంలో ఇమిడినట్టుగా, ఎన్నో సాంఘిక , ఆర్ధిక రాజకీయ సవ్యాపసవ్య సందర్భాలు ఈ నవలలో ఎంతో చిక్కగా, కుదురుగా ఇమిడి వుండటం, రచయిత శిల్పప్రతిభకు పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను. ఇందులోని ప్రతి వాక్యం వెనుకా, వెన్నాడుతున్నట్టుగా రచయిత గొంతుక ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. మన సామజిక జీవితం ఎంత భీభత్సంగా ఉందొ, మానవ సంబంధాలు గానుగలో పిప్పిలా ఎలా పిండీకృతం అవుతున్నాయో’ ఎంతో భయానకంగా, రౌద్రంగా, వర్ణించి చూపెడుతుంది ఈ నవల. మౌఖిక సంప్రదాయాన్ని రచయిత పాటించడం ద్వారా పాఠకుడిని తల ప్రక్కకు తిప్పనివ్వకుండా నిమగ్నం చేయటం ఈ నవల రచనలో రచయిత సాధించిన అద్భుత శిల్ప ప్రయోజనం – పాత్రలూ, జీవితమూ, భాషా, యాసా, సన్నివేశ కల్పనా, విమర్శనాపూర్వక వాస్తవికత, రచయిత కంఠస్వరం, ప్రయోజన దృష్టి, యిలాంటివన్నీ ఒకే కూర్పులో కలిసిపోవటం ద్వారా, ఈ నవల సాధారణ పాఠకుడి నుండి నద్విమర్శకుని వరకూ హృదయగతమవుతుందని నేను గాఢంగా నమ్ముతున్నాను.