-
Gali Poralu
₹250.00నివురుగప్పుకున్న (కథలు) నిప్పులు మధురాంతకం నరేంద్ర
చలికాలపు తెల్లవారుజాముల్లో మంచు కురుస్తున్నప్పటి మసక వెలుతుర్లూ, నిద్రకూ మెలకువకూ మధ్యలో వుండే సుషుప్త సమయాలూ, నిన్న కాసిన యెండ జ్ఞాపకాలూ, చావుకూ బతుక్కూ మధ్య వేలాడే సన్నటి తెరలూ, రాత్రి తలలో తురుముకున్న మల్లెల వాసనల్ని మోసుకొచ్చే వుదయాలూ, చలిలో నానిన నిద్రలేని ముఖాలూ, దుప్పటి మడతల మధ్య లోయలోకి జారిన నక్షత్రాల్లా మినుకుమినుకుమనే ముక్కు పుల్లలూ, నిద్రమత్తులో వుంటే చెవుల్లోకి దూరీదూరని మాటలూ, గాలిలోకి తెరుచుకునే కళ్ళపైన కమ్ముకునే నీడలూ, వులిక్కిపడేలా నిద్రలోంచి లేపేసే కలవరింతలూ, మోటారు వాహనాల రొదల్లోంచీ ముక్కలై విరిగిపడే సంభాషణలూ, చెమటకు తడిసి కనిపించీ కనిపించకుండా మిగిలే బొట్లూ, మసక వెలుతుర్లో తేరిపారజూస్తేగాని కనిపించని మనుషులూ, పొద్దువాలే సంధ్యాసమయాల్లో దాగిపోయే నవ్వులూ, సగం తెరిచిన తలుపుల వెనక తారట్లాడే చీకట్లు, కూలినగోడలూ పిచ్చిమొక్కల వెనక దాక్కునే పురాతన మహిడీలూ వెరసి అజయ్ ప్రసాద్ కథలనిండా నిప్పుల్ని దాచేసే నివురులే దోబూచులాడుతూవుంటాయ్.
తెల్లగా కప్పేసిన బూడిదకింద యెర్రెర్రని నిప్పుకణికలు మండుతూనే వున్నాయని తెలుసుకోవడం కష్టం. సనసన్నగా పలచగా వస్తున్న పొగల్ని చూసి అక్కడ నిప్పు ఆరిపోయిందని భ్రమలో పడిపోతాం. చేతనకూ, అచేతనకూ మధ్య వెంట్రుక కంటే సన్నగావుండే వుపచేతనే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేశించినట్టుగానే నిప్పును కప్పిన…………
-
Garbhagudiloki
₹150.00దేవుడు గమనిస్తాడు
మంచి భోజనం, భార్యాబిడ్డలు
దేవుడు వెనక నిలబడతాడు
విజయాలు, కష్టాలు దూరాలు
దేవుడు చేయి పట్టుకుంటాడు
సంగీత సాహిత్యాలు,
సకల కళాకోవిదులు
దేవుడు మిలోకి ప్రవేశిస్తాడు
ఇక మీదెగ్గరేం ఉంచుకోరు
మిరే అందరికి కావాల్సివస్తుంది.
-
Gelupu Naade – గెలుపు నాదే
₹70.00అనగనగా ప్రేమ సముద్రంలో ఒక షిప్పు ! అదే లవ్… హేట్ రిలేషన్‌షిప్ ! ఆ షిప్పులో ఓ జంట !
ఆమె పెళ్ళి చూపులనుకుంది. చదువులేని ఆడపిల్లకి తన హృదయంలో చోటులేదని అనాలోచితంగా అన్నాడతను. ఆ నిరసనతో ఆమెలో ఛాలెంజీ జ్వాలలు ప్రజ్వరిల్లేయి. మారుతున్న సమాజంలో ఆడపిల్లకి అర్థం ఏమిటో చెప్పాలని పంతం పట్టింది. చదువు ప్రారంభించింది. బ్రిలియంట్ స్టూడెంట్‌గా, మోస్ట్ మోడ్రన్‌గాళ్‌గా పదుగురి ముందూ నిలిచింది. ఆమె వున్న క్లాసుకే అతను లెక్చరర్‌గా వచ్చాడు. అతన్నామె గుర్తించింది. అతని గుండెల్లె కితకితలు పెట్టింది, కవ్వించింది, అతన్ని ముగ్గులోకి దించి, సుందర ప్రేమకాండకి కథానాయకుడ్ని చేసింది. విరహాగ్నిలో పడేసింది. ఇక వాళ్ళ షిప్పు రసవత్తర తరంగాల్లో చిక్కుకుంది.
ఆ ప్రేమ నావ అనురాగ దీవికి ఆనందంగా చేరిన వైనమే గెలుపు నాదే !
ఇంతేగాక ఇందులో చదువుకునేందుకు మిమ్మల్ని మెరిపించే మురిపించే ఆరు మంచి ముత్యాల్లాంటి కథలున్నాయి కూడా…
పేజీలు : 147
-
God Gift
₹220.00గాడ్ గిఫ్
అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని నెక్కల్లు గ్రామం. ఆ గ్రామ సరిహద్దుల్లోని సమాన ఉపరితల ‘పొలాలు. ఒకచోట జీప్ ఆపి దిగాడు అజాతశతృ.
ఎదురుగా స్వీడెన్ దేశపు ఒక పాత ఓల్వో బస్. ‘ఇరవై ఆరేళ్ళ బలిష్టమైన యువకుడు అజాతశతృ. స్పురద్రూపి. జీప్ దిగిన అజాతశతృ బస్ డోర్ తెరుచుకుని
ఓల్వో బస్లో ప్రవేశించాడు. నిజానికి ప్రస్తుతం అది బస్ కాదు. ‘అజాతశతృ నివసించే గృహం. ఇరవై అడుగుల పొడవు పన్నెండు ‘అడుగుల వెడల్పు ఉన్న ఆ బస్లో సీట్లన్నీ పీకేసి తన లివింగ్ హెూమ్ గా మార్చుకున్నాడు. కిచెన్, పడగ్గది, లివింగ్ రూం యిలా కంఫర్టబుల్ గా మార్చుకున్నాడు……………..
-
-
-
Harry Potter and the Half Blood Prince
₹422.00When Dumbledore arrives at Privet Drive one summer night to collect Harry Potter, his wand hand is blackened and shrivelled, but he does not reveal why. Secrets and suspicion are spreading through the wizarding world, and Hogwarts itself is not safe. Harry is convinced that Malfoy bears the Dark Mark: there is a Death Eater amongst them. Harry will need powerful magic and true friends as he explores Voldemort’s darkest secrets, and Dumbledore prepares him to face his destiny.
These new editions of the classic and internationally bestselling, multi-award-winning series feature instantly pick-up-able new jackets by Jonny Duddle, with huge child appeal, to bring Harry Potter to the next generation of readers. It’s time to PASS THE MAGIC ON .
-
Heart Prints
₹200.00హార్ట్ ప్రింట్స్
దయగల చూపు
అమెరికన్ కథ
జాన్ అప్ డైక్ ఆ వసంతంలో అకస్మాత్తుగా సుత్తితో కొట్టే చప్పుడు వినిపించసాగింది. ఓ అరడజనుసార్లు సుత్తితో కొట్టాక బండ గొంతు లోంచి వచ్చే బాణీ కాని, శృతి కాని లేని శబ్దం పాటలా వినిపించసాగింది.
బేర లో సౌకర్యంగా ఉన్న, కాంతివంతమైన ఆ గదిలోని కొందరు సైనికులు ఆ శబ్దానికి చెవులు మూసుకున్నారు. అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఓ రాజశాసన పత్రాన్ని వాళ్ళకి చూపించాడు.
“నువ్వేనా? ఆ కూనిరాగం తీసేవాడి దగ్గరకి వెళ్ళు.” దాన్ని చదివిన అధికారి సూచించాడు.
“నువ్వు రాజు గారి సైన్యంలో కొత్తగా చేరావు. నిన్నో ఉద్యోగానికి ఎంపిక చేసారని విన్నాను. డీషియస్ ఎస్కులస్ పేరు ఎప్పుడైనా విన్నావా?” అతను ప్రశ్నించాడు.
“నిపుణుడు అని పిలిచేది అతన్నే అని విన్నాను. అతని గురించేనా మీరు అడిగేది?” ఆ యువకుడు అడిగాడు……….
-
Helavathi
₹35.00‘హేలావతి’ తొలి తెలుగు దళిత నవల. మన దేశంలోని సామాజిక నిరంకుశత్వాన్ని, అమానుషత్వాన్ని నిరసించిన తొలి నవల. హైందవ సమాజ సంస్కరణ కోసం పొలికేక వేసిన నవల. ఇప్పటి దాకా తెలుగులో వచ్చిన 100 కి పైగా దళిత నవలలకు ఈ నవల పునాది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంస్కర్తలు, ఉద్యమకారులు, ఆధునికులు, సంప్రదాయవాదులు, సామాన్యులు, మేధావులు – అందరూ చదవాల్సిన నవల. అందరికన్నా ముందే మేల్కొన్న నవల. వైతాళిక నవల. ఇది కాలంచెల్లిన నవలకాదు, నేటికీ తాజాగా ఉన్న నవల. పరిమాణంలో చిన్నది. ప్రభావంలో పెద్దది.
-
Homo Deyus Repati Sankshiptha Charitra
₹499.00హోమో సేపియన్స్ హోమో డేయుస్ గా మారుతుంటే మనకు మనం ఎటువంటి భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం?
పరిణామక్రమం యొక్క ప్రధాన శక్తీ – స్వాభావిక ఎంపిక – తెలివైన రూపకల్పనకు దారి ఇస్తుంటే మానవుల భవితవ్యం ఎలా మారుతుంది?
గూగుల్ ఇంకా ఫేస్ బుక్ లు మన రాజకీయ ఇష్టాయిష్టాలను గురించి మనకు తెలిసినదానికన్నా ఏక్కువగా తెలుసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది?
పేలుసయినా భూగ్రహాన్ని కడకు మానవజాతిని మన స్వoత విధ్వంసక శక్తుల నుండి ఏ రకంగా కాపాడుకుంటాము?
ఈ పుస్తకంలో ప్రొఫెసర్ పరారీ ఇటువంటి ప్రశ్నలను మన ముందు ఉంచుతారు. వాటికీ వీలైన జవాబులను ఆసక్తి కలిగించే, ఆలోచనలు పుట్టించే పద్దతిలో వెతుకుతారు.
-
Hrudaya Ganam – హృదయ గానం
₹100.00నేనంటే నీకు ఇష్టం ఉందా? నిజం చెప్పు” – మృదుల అంది .
హర్షకిరణ్ మాట్లాడలేకపోయాడు.
చెప్పు చెప్పు మృదుల అతన్ని చేతులతో తన మీదకి లాక్కుంది. హర్శకిరాన్ తోలి మంచం మీద కూలబడ్డాడు. మృదుల అతని మీదకి జరిగి అతని మెడ ఓంపులో ముఖం దాచుకుంది. “నేనెంత నరకం పద్తున్నానో నీకు తెలుసా ! నీకు తెలియదు. నీకెలా తెలుస్తుంది ! అంది. మృదుల అతని మెడ చుటూ చేతులు పెనవేసి ,, అతని గుండెల్లో తలదాచేసుకుంది.
మృదుల ఓ పాతికేళ్ల అమ్మాయి. హిస్టరీ లెక్చరర్ గా భవానిపురం వెడుతుంది. అక్కడ తన స్టూడెంట్ శాంత అన్నయ్య హర్షకిరణ్ తో పరిచయం అవుతుంది. అది అనురాగంగా మారుతుంది. క్లాసులో మరో స్టూడెంట్ రమేష్ మృదుల పట్ల అభిమానం పెంచుకుంటాడు. మధ్యలో శాంత రేప్ కి గురవుతుంది. కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది.
నాదంటూ ఒక చిన్న ఇల్లు, నన్ను ప్రేమించి ణా ప్రేమని పొందే భర్త, మా అనురాగానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలు అంటూ ఒక కలల గూడు కట్టుకున్నాడు. కానీ .. విధి రాకాసిలా తన భయంకరమైన పాదంతో దాన్ని తోక్కివేసింది. ఆ గూడు పడిపోయింది. ణా జీవితం ఎడారి అయిపొయింది. .. అంటూ వాపోతుంది మృదుల . ఇష్టం వేరూ ప్రేమ వేరూ అనీ, వాటి అర్ధాలు వేరు వేరనీ మృదుల కు నెమ్మది మీద స్పష్టంగా అర్ధం అవుతుంది. సున్నితమైన ఆడపిల్ల మనసుని అతి సున్నితంగా చిత్రించిన నవల హృదయగానం . -
Hrudayanetri – హృదయనేత్రి
₹80.00‘గోపాలాన్ని – నా వెంట తీసుకెడతానురా తమ్ముడూ. వాడు బట్టలు సంచీలో పెట్టుకు ఏడుస్తున్నాడురా!” అంటూ తండ్రిని రాముడత్తయ్య అడగటం, తలుపు వెనకన నక్కి నిల్చుని వింటున్నాడు గోపాలం.
పొందూరు ఖద్దరు చీరె – గోచీపోసి ట్టుకుని, గుండ్రటి సిగమధ్యన రాళ్ళ చామంతి పువ్వు చుట్టుకున్న రాముడత్తయ్య అంటే గోపాలానికి ప్రాణం. రాముడత్తయ్య ‘వందేమాతరం’ అంటుంది. ఎవరో గాంధీగారుట, ఆయన్ని మహాత్ముడంటూ, ‘ఆ గాంధీగారు స్వరాజ్యం తెచ్చిపెడతాడు – తెల్లవాళ్ళందరిని తరిమి కొడతాడు’ అంటూ – రాత్రిళ్ళు పక్కన పడుకోపెట్టుకుని కథలు చెప్పే రాముడత్తయ్య, వూరికి వెళ్ళిపోతోందీ అంటే ఏడుపు వచ్చింది గోపాలానికి –
”నీతో నేనూ వచ్చేస్తాను” అంటూ సంచీలో చొక్కాలాగూ పెట్టుకుని, రాముడత్త కొంగు వదలకుండా తిరుగుతున్నాడు పదేళ్ళ గోపాలం.
రాముడత్తయ్య అని పిలవబడే రామలక్ష్మమ్మగారు ఆ యింటి పెద్దాడబడుచు. నలభై ఏళ్ళుపైన వుంటాయి. పిల్లలు లేరు. ఆవిడ గురించి – విడ్డూరంగా పెద్దవాళ్ళు చెప్పుకోవటం చాలాపార్లు వినివున్నాడు గోపాలం. తన తల్లి సుబ్బమ్మకి, ఒదినగారంటే భయం – పైకి ‘ఒదినగారూ’ అంటూ – గౌరవంగా పిలుస్తూ – భయభక్తులతో వున్నా! ….