• Oka Radha - Iddaru Krishnulu - ఒక రాధ - ఇద్దరు కృష్ణులు

    Oka Radha – Iddaru Krishnulu – ఒక రాధ – ఇద్దరు కృష్ణులు

    0

    అంతలో ఓ కారు రివ్వున దగ్గరకొచ్చి స్లో అయింది. అందులో నుంచి ఓ రివాల్వర్‌ బయటకు కనిపించింది. మరుక్షణంలో రెండు గుళ్లు వరుసగా ఆమె పక్క నుంచి దూసుకు పోయాయి.

    ఆ యువకుడు సమయానికి ఆమెను పక్కకు లాగబట్టి బ్రతికింది కానీ లేకపోతే రక్తపు మడుగులో కూలి ఉండేది. మరుక్షణంలో ఆమెను వదిలి అటువైపు దూకాడు హరి. కానీ కారు వాయువేగంతో వెళ్లి మిగతా వాహనాల ప్రవాహంలో కలిసిపోయింది. జనమంతా పోగయ్యారక్కడ.

    ”ఎవరిదా కారు ?”

    అతడి తండ్రిని హత్య చేసి తల్లి జైలుకెళ్లింది. తమ్ముడు మాయమయ్యాడు. ఎక్కడున్నాడో తెలీదు. సమాజం తల్లి మీద కులట, హంతకురాలు అంటూ ముద్రవేసింది…… ఒక వ్యక్తి పన్నాగం పన్ని చేసిన ద్రోహం అది. అతడా వ్యక్తిని ఎదుర్కొవాలనుకున్నాడు. అతడి చేత పాతికేళ్ల కిందటి నిజాల్ని కక్కిద్దామనుకున్నాడు. దానికి ఓ అద్భుతమైన ప్లాను వేశాడు. ఫలితమే….. ఒక రాధ ఇద్దరు కృష్ణులు.

    ఊహించలేని మలుపులతో, క్షణక్షణం ఉత్కంఠతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ కూడా – చక్కటి హాస్యంతో గిలిగింతలు పెట్టే యండమూరి వీరేంద్రనాథ్‌ హ్యూమర్‌ క్రైమ్‌ నవల – ఒక రాధ ఇద్దరు కృష్ణులు.

    70.00
    Add to cart
  • Oka Varshakalapu Sayantram - ఒక వర్షాకాలపు సాయంత్రం

    Oka Varshakalapu Sayantram – ఒక వర్షాకాలపు సాయంత్రం

    0

    ‘శత్రు గూఢచారులు నా ప్రాణం తీస్తున్నా, నా వారిని హింసిస్తున్నా – నా దేశ రహస్యాలు చెప్పను….”

    సి.బి.ఐ ఆఫీసు గోడ మీద చిన్న కొటేషన్‌ అది. దాన్ని పూర్తిగా తన జీవితానికి అన్వయించుకున్నది ఆమె! పర్యవసానం – భయంకరమైన ప్రమాదపు ఊబిలో చిక్కుకుపోయింది !! తాను వ్యవహరిస్తున్నది భయంకర కాలకూట విషసర్పాలతో అని ఆమెకు తెలీదు!!! తన చర్య కొన్ని లక్షల మంది భారతీయుల ప్రాణాల్ని కాపాడబోతోందా ?

    చాలా కాలం విరామం తర్వాత యండమూరి వీరేంద్రనాథ్‌ కలం నుంచి జాలువారిన ఒక వినూత్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఒక వర్షాకాలపు సాయంత్రం’. చరిత్రలో ప్రాముఖ్యం వున్న కొన్ని పాత్రలను తీసుకొని దానికి కాల్పనిక పాత్రలని జతపరచి కథ నడపటం అనేది కొందరు ప్రముఖ పాశ్చాత్య రచయితల టెక్నిక్‌. ఈ నవలలో అదే టెక్నిక్‌ని ఎంచుకొని కథ నడిపారు యండమూరి వీరేంద్రనాథ్‌. మంచితనం భారతదేశానికి కష్టాల్నే మిగిల్చింది కాబట్టి, ఇకనైనా ఆ పంథా మార్చుకోవాలంటారు రచయిత. ‘విజయవిహారం’ పత్రికలో సీరియల్‌గా వచ్చిన నవలయిది.

    100.00
    Add to cart
  • Parnasaala - పర్ణశాల

    Parnasaala – పర్ణశాల

    0

    అ పడిలేచే కడలి తరంగం లాటి జీవిత

    రంగంలో డబ్బుంటేనే ఆప్యాయతలూ,

    అభిమానాలూ, ఆపేక్షలూ

    చెల్లుబాటవుతాయా?

     

    లేకపోతే వాటికి విలువే లేదా?

    అనే ప్రశ్నకు సముద్రతీరాన బెస్తల

    జీవితపు నేపథ్యంలో డబ్బునే,

    ఆప్యాయతకీ లంగరందదని

     

    వాదోపవాదాలు పోయిన యువతీ

    యువకులకు ఓ గుణపాఠం

     

    జీవితానికీ, జీవిత సమస్యలకూ

    దర్పణం పట్టిన ఓ చమత్కారమైన

    నవజీవన నవలావాహిని

    పర్ణశాల ….

    75.00
    Add to cart
  • Popular Rachanalu Cheyadam Ela - పాపులర్‌ రచనలు చేయడం ఎలా

    Popular Rachanalu Cheyadam Ela – పాపులర్‌ రచనలు చేయడం ఎలా

    0

    ‘కథ ఎలా ప్రారంభించినా దానికి చదివించే గుణం ఉండాలి అన్న విషయాన్ని ఏ రచయితా మర్చిపోకూడదు. ఉదాహరణకి మొదటి చాప్టర్ని ‘బాగా వర్షం కురుస్తోంది. రోడ్డంతా తడిసిపోయింది. కారు నెమ్మదిగా వెళుతూంది. ఆ కారు నెంబరు ఏ.పి.పి. 4.045. ఆ కారులోభార్గవ కూర్చుని ఉన్నాడు. అతడి చేతిలో సిగరెట్‌ వెలుగుతోంది.’ అని మొదలు పెడితే పాఠకుడికి మొదటి పేరాలోనే సంగం ఇంట్రస్ట్‌ తగ్గి పోవటం మొదలు పెడుతుంది. వీలైనంత వరకు నవల మొదటి చాప్టర్‌లోనే ఏదో ఒక ముడి వేసేయటం మంచిది…..”

    కథని కానీ నవలని కానీ ఎలా ముస్తాబు చేయాలో రచనా వ్యాసంగంలో పాతికేళ్ళ అనుభవమున్న నెంబర్‌ వన్‌ రైటర్‌ వివరిస్తున్నారు. ప్రతి చిన్న విషయమూ అర్థమయ్యేలా తన వృత్తి రహస్యాన్ని వెల్లడిస్తున్నారు. వర్ధమాన రచయితలకి మరిన్ని టెక్నిక్కులు నేర్పి ప్రొఫెషనల్‌ రైటర్స్‌గా నిలబెట్టేందుకై రైటర్స్‌ వర్క్‌షాప్‌ని స్థాపించిన యండమూరి వీరేంద్రనాథ్‌ దానికి సిలబస్‌గా ”పాపులర్‌ రచనలు చేయడం ఎలా ?” అన్న పేరుతో ఈ పుస్తకాన్ని వెలువరిస్తున్నారు. ప్లాట్‌ (కథాంశం) నుంచి క్లైమాక్స్‌ దాకా కథ నడకకి సంబంధించిన పలు అంశాలని ఆయన బోధిస్తున్నారు.

    90.00
    Add to cart
  • Prarthana - ప్రార్ధన

    Prarthana – ప్రార్ధన

    0

    భార్గవ చప్పున అతడిని ఆపుచేసి ”అసలేమయింది. చెప్తారా లేదా ?” అన్నాడు ఇరిటేషన్‌ నిండిన గొంతుతో.

    ”వెల్‌….” అన్నారు డాక్టర్‌.

    ”విల్‌ యు ప్లీజ్‌ సిట్‌డౌన్‌”
    భార్గవ కోపంతో ”విల్‌ యు ప్లీజ్‌ టెల్‌ మి” అని అరిచాడు. అన్నాజీరావు అతడివైపు తలెత్తి చూసేడు. డాక్టరుగా పుట్టం మనిషి చేసుకున్న దురదృష్టం . తప్పదు. అతడి పెదాలు స్పష్టంగా కదిలాయి. ”భార్గవా .” అన్నాడు, ”ప్రార్ధనకి లుకేమియా”.

    రాబిన్‌కుక్‌ ‘ఫీవర్‌’ ప్రేరణతో వ్రాయబడిన నవల ‘ప్రార్ధన’. కరుణరసం ఆసాంతం పోషించబడిన నవల యిది. మానవాళికి పెనుభూతంగా దాపురించిన క్యాన్సర్‌ వ్యాధిని గురించీ, దాని నివారణ కోసం జరుగుతున్న ప్రయత్నాలని గురించీ, పచ్చి వ్యాపారంగా పరిణమించిన దాని చికిత్సలని గురించీ, మందులని గురించీ చర్చిస్తారు రచయిత.

    ఒక చోట నవలలో భార్గవ పాత్ర ఇట్లా అంటుంది…. ”ఈ ప్రపంచంలో ఎక్కడా క్యాన్సర్‌కి పూర్తిగా మందు కనుక్కోబడదు. ఎందుకో తెలుసా! శేఖరం!, కేన్సర్‌ చాలా పెద్ద బిజినెస్‌. డబ్బున్న వాళ్ళకి వచ్చేది. అది చాలా ఖరీదైన వ్యాధిగా వుండిపోవల్సిందే. కేన్సర్‌ని నాశనం చేయటానికి ఒక చౌకైన మందు గానీ మూలిక గానీ కనుక్కోబడిన మరుక్షణం అమెరికాలో కోట్ల కోట్ల రూపాయల్తో స్థాపించబడ్డ రీసెర్చి ఇన్స్టిట్యూట్‌లు మూతబడతాయి. ఎందరో క్యాన్సర్‌ స్పెషలిస్టులు వీధిన పడతారు. మొత్తం ఆర్ధిక వ్యవస్థే దెబ్బతింటుంది. అందుకే ఎంత ఖర్చయినా అసలు మందు కనుక్కోకుండా నొక్కెయ్యాటానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరికీ తెలియని సత్యం ఇది ! నేను దాన్ని బయటపెడితే నాకు పిచ్చెక్కిందంటారు”.. యండమూరి వీరేంద్రనాథ్‌ బాణీ సస్పెన్సుతో – ఆర్ద్రమైన మానవ సంబంధాల చిత్రీకరణతో – విశిష్టమైన పాత్ర పోషణతో సాగిపోయే నవల.

    120.00
    Add to cart
  • Prema - ప్రేమ

    Prema – ప్రేమ

    0

    ‘సరస్వతీ! స్త్రీ గానీ, పురుషుడుగానీ, వివాహిత గానీ, అవివాహిత గానీ, ఆనందంగా వుండటానికి కావలసిది ‘ప్రేమించిన మనిషి’ లేకపోవటం కాదు. తనకు ప్రేమించే హృదయం లేకపోవటం”.

    భర్త మాటలు అర్ధంకానట్టు సరస్వతి తనలో తానే కొంచెం సేపు తర్కించుకుని చివరికి ”నాధా! ప్రేమంటే ఏమిటి ?” అని అడిగింది.

    నారదుడు కంగారుగా ‘నారాయణ…. నారాయణ’ అన్నాడు. బ్రహ్మ చిరునవ్వుతో ”వాగ్దేవేనా ఈ ప్రశ్న అడుగుతున్నది ?” అన్నాడు.

    ”అందులో హాస్యాన్ని పట్టించుకోకండి. ప్రేమికుడు లేకపోవటానికి, ప్రేమించే హృదయం లేకపోవటానికి తేడా ఏమిటి ?” అంది.

    ”ప్రేమంటే ఆహ్లాదం. అది స్త్రీ పురుష సంపర్కమే కానవసరం లేదు.”

    ఆ మాటలకి సరస్వతి మరింత అయోమయంగా భర్తవైపు చూస్తూ ‘మీ నాలుగు తలల తార్కిక జ్ఞానంతో నా ఒక్క మెదడునీ అతలాకుతలం చేస్తున్నారు స్వామీ’ అంది.

    ”అయితే నీవే చూడు దేవీ” – సరస్వతి చూసిన ఆమె పేరు వేదసంహిత! వైవాహిక జీవితం ఆమె మెడమీద భర్త పెట్టిన కత్తిగాటునే మిగిల్చింది.

    బ్రతుకు బాటలో ముందుకు సాగిపోయే తరుణంలో – ఆలంబనగా ఒక అనుభవాన్నీ, అనుభూతినీ మిగుల్చుకోవాలనుకుంది. ఆమె జీవితంలోకి అభిషేక్‌ అపురూపంగా ప్రవేశించాడు. వెన్నెల్లో గోదావరి ఒడ్డున ఒక అనుభవం అనుభూతిగా మారింది.

    ప్రతి పదమూ సరిగమ పదముగా – ప్రతి వాక్యమూ ఒక సరళీ స్వరముగా – ప్రతి ఉపమానమూ అపురూపముగా యండమూరి వీరేంద్రనాథ్‌ స్వరకల్పన చేసిన మృదుమధుర మంజుల నవలా నాదం ‘ప్రేమ’.

    90.00
    Add to cart
  • Priyuralu Piliche - ప్రియురాలు పిలిచె

    Priyuralu Piliche – ప్రియురాలు పిలిచె

    0

    ఒక అబ్బాయిని సృష్టించండి. అంతకన్నా మంచివాడు ఈ ప్రపంచంలో ఇక ఉండకూడదు” అంది సరస్వతి.

    ”సృష్టించాను” అన్నాడు బ్రహ్మ.

    ”గొప్ప తెలివితేటలున్న అమ్మాయిని సృష్టించండి. ఇద్దరికీ పెళ్ళిగీత నుదుట వ్రాయండి”.

    ”వ్రాసాను” అన్నాడు బ్రహ్మ.

    ”ఇప్పుడా అమ్మాయిని సెక్సుకి పనికి రాకుండా చేయండి”.

    బ్రహ్మ అదిరిపడి ”వద్దు సరస్వతీ” అన్నాడు కంగారుగా.

    ”ఏం?… మనలాంటి దేవతలకెలాగూ సాధ్యం కాదు. కనీసం మనుష్యుల కన్నా సెక్స్‌ లేకుండా ప్రేమించగలగడం సాధ్యమవుతుందేమో చూద్దాం” – అంది సరస్వతి.

    కల్యాణి, కార్తికేయ, అనూజ్ఞ – ఈ మువ్వురి చుట్టూ సాగే కథ ప్రియురాలు పిలిచె. ఈ ముగ్గురివీ మూడు భిన్న స్వభావాలు. కల్యాణిని ప్రకృతి సౌందర్యం కంటే మానేజ్‌మెంట్‌ అకౌంటెన్సీయే ఎక్కువ ఆకర్షిస్తుంది. మనిషికీ మనిషికీ మధ్య బంధం అనేది పరస్పర అవసరాల కోసం మనుష్యులు ఏర్పర్చుకునే లౌక్యపు ముడి అని ఆమె గాఢ నమ్మకం. కల్యాణి తండ్రిని ఆమె ఐదో ఏటే ఆమె మేనమామ ఆస్తి కోసం హత్య చేస్తాడు. చేదు అనుభవాలతో రాటు దేలిన కల్యాణిది పూర్తిగా మెటీరియలిస్టిక్‌ ధోరణి.

    ఇక కార్తికేయ ప్రపంచమే వేరు. జమీందారీ కుటుంబంలో పుట్టినా పేదరికంలో పెరిగాడు. డబ్బు లేక మెడిసిన్‌ చివరి సంవత్సరంలో చదువు ఆపేశాడు. కుంచెలతో అందమైన బొమ్మలూ వేస్తాడు. శాంతినికేతనానికి వెళ్ళి చదువుకోవాలన్నది అతడి తీరని కోరిక. అభిమానాలకీ ఆపేక్షలకీ విలువిస్తాడు. అహం దెబ్బతిన్న కల్యాణి అతడి జీవితంలో ప్రవేశిస్తుంది. తనని పెళ్ళి చేసుకోమని కోరుతుంది. ఇంకో పక్క ఇంద్రచాపంలాంటి అనూజ్ఞ కూడా అల్లరితో కార్తికేయకు దగ్గరవుతుంది…. ఊహించని సంఘ టనలతో కథ మరెన్నో మలుపులు తిరుగుతుంది. జీవితంలో సెంటిమెంట్లకి విలువుందా ? ఏ ప్రతిఫలమూ ఆశించని ప్రేమ అసలు ప్రపంచంలో ఉంటుందా ? ప్రేమకి థర్డ్‌ డైమెన్షన్‌ ఇచ్చిన నవల – ప్రియురాలు పిలిచె

    100.00
    Read more
  • Radha - Kunti - రాధ - కుంతి

    Radha – Kunti – రాధ – కుంతి

    0

    ‘నా స్నేహాన్ని తిరస్కరించావు నువ్వు, ప్రేమ ముందు స్నేహంతో ప్రారంభం కావాలి అని నా అభిప్రాయం. తరువాత ఆ స్నేహంతో దేహాలు దగ్గరవ్వాలి. అదీ థ్రిల్లు. ఆథ్రిల్‌ ఇంకా ఏమైనా మిగులుంటే అప్పుడు పెళ్ళవ్వాలి. నా ధియరీకి పెద్ద దెబ్బ కొట్టేసేవ్‌ రాధా నువ్వు. నీ దృష్టిలో ప్రేమనేది స్నేహం వల్లా. స్పర్శవల్లా ఉద్భవించదన్నావు, కాబట్టి – హాయిగా ఇంకెవర్నైనా ప్రేమించటం మొదలుపెట్టు. నీ మెళ్లో మూడు ముళ్ళు వేయలేదు ఫ్రెండ్‌-విప్పి చూసుకో రెండే ముళ్ళు వేసేను. బైదిబై రిజిష్ట్రార్‌ ఆఫీసుకు వెళ్ళి సంతకాల కోసం వెతక్కు. అది పాత పుస్తకాల షాపులో కొన్న లెడ్జరు – చివరగా – థాంక్స్‌ ఫర్‌ది ఎక్స్‌పీరియన్స్‌ – కృష్ణ.

    పై ఉత్తరం రాధ – కుంతి నవలలో రాధకు కృష్ణ రాసినది. ప్రేమించి పెళ్ళి చేసుకోవడమా ? పెళ్ళి చేసుకుని ప్రేమించడమా ? అనే యువకులూ ప్రేమను ముందే రుచి చూసి ఎవరితో ప్రేమో నిర్ణయించుకోవాలని ఒకరూ, ప్రధమ స్పర్శతోనే జీవిత భాగస్వామిని ఎంచుకోవాలనే మరొకరూ సంఘర్షణ పడుతుంటే – కృష్ణుడిని ఎంచుకున్న రాధ చెడ్డదా ? కర్ణుడిని కన్న కుంతి చెడ్డదా ? అనే మీమాంసకు అనాధల్నించి ఆపదల్నుంచి ఇవతలికి ఈడ్చే ‘అఆఇఈ’ సంఘం ఒకటి వుంది. ఆ విచిత్ర సంఘం పరిష్కరించిందా పై నలుగురి సమస్యల్నీ ?

    యండమూరి వీరేంద్రనాథ్‌ నవలా పజిల్‌ ‘రాధ-కుంతి’లోకి వెళ్ళి మీరే క్లూని పట్టుకోండి.

    60.00
    Add to cart
  • Rakshasudu - రాక్షసుడు

    Rakshasudu – రాక్షసుడు

    0

    ‘నువ్వింత తెలివైనవాడివిలా కనబడుతున్నావు. ఇంత చక్కగా ఆలోచిస్తున్నావు. ఈ ఊబిలో ఎలా ఇరుక్కు

    పోయావు ?”

    ”ప్రతివాడికీ ఒక బలహీనత వుంటుంది తాతా, నా బలహీనత – నా అమ్మ. అమ్మని కనుక్కోవాలన్నది నా జీవితాశయం. సరిగ్గా ఆపేరు వచ్చేసరికల్లా ఏం చేస్తున్నానో కూడా ఆలోచించకుండా దిగిపోతూ వుంటాను. ఈ ప్రపంచంలో ఎంతమంది నా బలహీనతని ఆసరాగా చేసుకుని తమ పబ్బం గడుపుకున్నారో, వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటాను !! ఎలాగైనా అమ్మని కనుక్కొని తీరతాను…..”

    ”ఇక్కడ నుంచి బయటపడితే….” నవ్వుతూ పక్కనుంచి అన్నాడు సింహం…..

    అతనికి పేరు లేదు. తల్లి కడుపులోంచి…. చెత్త కుండీలోకి…. అక్కణ్ణుంచి కాకులు దూరని కారడవిలోకి బానిసగా…. తోడేళ్ళ లాంటి మనుషుల మధ్య నుండి బయటపడి…. అంతకన్నా భయంకరమైన మాఫియా గ్రూపుల నడుమ చిక్కుకుని……

    కేవలం ఒకే ఒక ఆశ. తన తల్లెవరో తెలుసుకోవాలని ! ఆ తపనని క్యాష్‌ చేసుకునే గుంటనక్కలు, రాబందులతో ఎడతెడగని పోరాటం….

    అతడు చివరికి తన తల్లెవరో తెలుసుకున్నాడా ? ఎవరామె ?

    1980 దశకంలో వెలువడి సంచలనం సృష్టించిన యండమూరి వీరేంద్రనాథ్‌ నవల రాక్షసుడు. ఆ తరువాత సినిమాగానూ వచ్చి సూపర్‌హిట్‌ అయింది. ఇండియాలో ప్రజాస్వామ్యం ఎంత నేతిబీర చందమో, ప్రభుత్వ యంత్రాంగం దళారీలతో ఎలా కుమ్మక్కయ్యిందో, సాధారణ పౌరులెలా ఏమీ పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్టున్నారో పదునైన శైలిలో చిత్రించిన నవల – రాక్షసుడు.

    100.00
    Add to cart
  • Rakta Sindhuram - రక్తసింధూరం

    Rakta Sindhuram – రక్తసింధూరం

    0

    మనిషి నిర్మించుకున్న కట్టుబాట్లు, మనిషి తయారుజేసుకున్న న్యాయశాస్త్రం నైతిక విలువల్ని, జీవన విధానాన్ని పరిరక్షిస్తాయా?

    సమసమాజ నిర్మాణానికి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ ఇస్తున్న కొత్త పిలుపు ‘రక్త సింధూరం’.

    60.00
    Add to cart
  • Rendu Gundela Chappudu - రెండు గుండెల చప్పుడు

    Rendu Gundela Chappudu – రెండు గుండెల చప్పుడు

    0

    నాకు యవ్వనం వుంది. అందం వుంది. రచయిత్రిని. నాకు స్వేచ్ఛ కావాలి. భర్త కట్టడిలో వుండటం నాకిష్టంలేదు. అందుకే ఈ వివాహ వ్యవస్థని నేను నమ్మను. నాకున్న ‘స్వేచ్ఛ’ నన్ను అంచెలంచెలుగా తారాపధానికి చేరుస్తుంది. – పద్మిని.

    అట్టడుగు వర్గాల్లో చైతన్యం తీసుకురావటానికి నేను రచనలు చేస్తాను. నేను వ్రాసేది చదివి పాఠకులు చైతన్యవంతులై, అట్టడుగు వర్గాల్ని పైకి తేవాలి. దాన్నే ‘సామాజిక స్పృహ’ అని నేను నమ్ముతాను – విష్ణుమూర్తి.

    నా భార్య అంటే నాకు వల్లమాలిన ప్రేమ. ఎక్కడ ప్రేమ ఎక్కువ వుంటుందో అక్కడ స్వార్ధం వుంటుంది. దాన్ని ‘కట్టడి’ అని నా భార్య అనుకుంటే నేనేం చెయ్యను ? – ప్రభాకర్‌.

    నేను సగటు స్త్రీని. ఆలోచించే శక్తి వుంది. వివాహం మంచిదా ? స్వేచ్ఛ మంచిదా ? వివాహంలో స్వేచ్ఛ లేదా ? ఏ నిర్ణయం తీసుకోను ? – సుభాషిణి.

    కష్టం నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నం తప్పుకాదు. కాని ఎన్నుకునే మార్గం తప్పుకావచ్చు. ‘కష్టం’వేరు. ‘అసంతృప్తి’ వేరు. అసంతృప్తుల్ని కష్టాలుగా భూతద్దంలో చూపెట్టే ప్రయత్నాల్ని ఖండించాలి. మనం ఒక నిర్ణయం తీసుకుని పని చేస్తే, కొన్ని కష్టాలు తొలగిపోవచ్చు. మరికొన్ని కొత్త కష్టాలు రావచ్చు. వాటిని ఎలా ఎదుర్కోవాలో ముందే మనం ప్రిపేరయి వుండాలి. తెలియని దేవుడిని ఆహ్వానించేకన్నా, తెలిసిన దెయ్యాన్ని మార్చుకునే ప్రయత్నమే మంచిది’ అంటూ డి.ఎస్‌.పి. మూర్తి సలహా ఇచ్చాడు సుభాషిణికి.

    నాలుగు విభిన్న పాత్రలతో మనోవిశ్లేషాత్మకంగా రాసిన నవల ‘రెండు గుండెల చప్పుడు’ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌.

    60.00
    Add to cart
  • Rudranetra - రుద్రనేత్ర

    Rudranetra – రుద్రనేత్ర

    0

    ప్రపంచాన్ని క్షణాల్లో నాశనం చెయ్యగల  విష వాయువుని కనుక్కుంది ‘రేఖ’ అనే సైంటిస్ట్!

    అది ఏజెంట్ ‘ క్యూ’ చేతిలో పడితే, ప్రపంచాన్ని అతడు అల్లకల్లోలం చెస్తాడు.

    ప్రపంచ ప్రళయానికి కొద్ది రోజులే వ్యవధి వుంది.
    దాన్ని ఆపటం కోసం ప్రభుత్వం ఆ పనిని అప్పగించింది…ఇండియన్ ఏజెంట్ నేత్రకి….!
    ‘ప్రతిమ మరో సి.బి.ఐ. ఏజెంట్. అమె చేసిన పొరపాటు వల్ల రేఖ బదులు లేఖ అనె మరో అమాయకమైన అమ్మాయిని వెంటాడుతాడు నేత్ర.
    ఎత్తులు-పై ఎత్తులు….! అపోహలు-అనుమానాలు ….!
    బావుకత్వం బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన స్పై , సస్పెన్స్ థ్రిల్లర్.

    100.00
    Add to cart