• Hrudaya Ganam - హృదయ గానం

    Hrudaya Ganam – హృదయ గానం

    0

    నేనంటే నీకు ఇష్టం ఉందా? నిజం చెప్పు” – మృదుల అంది .
    హర్షకిరణ్ మాట్లాడలేకపోయాడు.
    చెప్పు చెప్పు మృదుల అతన్ని చేతులతో తన మీదకి లాక్కుంది. హర్శకిరాన్ తోలి మంచం మీద కూలబడ్డాడు. మృదుల అతని మీదకి జరిగి అతని మెడ ఓంపులో ముఖం దాచుకుంది. “నేనెంత నరకం పద్తున్నానో నీకు తెలుసా ! నీకు తెలియదు. నీకెలా తెలుస్తుంది ! అంది. మృదుల అతని మెడ చుటూ చేతులు పెనవేసి ,, అతని గుండెల్లో తలదాచేసుకుంది.
    మృదుల ఓ పాతికేళ్ల అమ్మాయి. హిస్టరీ లెక్చరర్ గా భవానిపురం వెడుతుంది. అక్కడ తన స్టూడెంట్ శాంత అన్నయ్య హర్షకిరణ్ తో పరిచయం అవుతుంది. అది అనురాగంగా మారుతుంది. క్లాసులో మరో స్టూడెంట్ రమేష్ మృదుల పట్ల అభిమానం పెంచుకుంటాడు. మధ్యలో శాంత రేప్ కి గురవుతుంది. కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది.
    నాదంటూ ఒక చిన్న ఇల్లు, నన్ను ప్రేమించి ణా ప్రేమని పొందే భర్త, మా అనురాగానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలు అంటూ ఒక కలల గూడు కట్టుకున్నాడు. కానీ .. విధి రాకాసిలా తన భయంకరమైన పాదంతో దాన్ని తోక్కివేసింది. ఆ గూడు పడిపోయింది. ణా జీవితం ఎడారి అయిపొయింది. .. అంటూ వాపోతుంది మృదుల . ఇష్టం వేరూ ప్రేమ వేరూ అనీ, వాటి అర్ధాలు వేరు వేరనీ మృదుల కు నెమ్మది మీద స్పష్టంగా అర్ధం అవుతుంది. సున్నితమైన ఆడపిల్ల మనసుని అతి సున్నితంగా చిత్రించిన నవల హృదయగానం .

    100.00
    Add to cart
  • Hrudayanetri - హృదయనేత్రి

    Hrudayanetri – హృదయనేత్రి

    0

    ‘గోపాలాన్ని – నా వెంట తీసుకెడతానురా తమ్ముడూ. వాడు బట్టలు సంచీలో పెట్టుకు ఏడుస్తున్నాడురా!” అంటూ తండ్రిని రాముడత్తయ్య అడగటం, తలుపు వెనకన నక్కి నిల్చుని వింటున్నాడు గోపాలం.
    పొందూరు ఖద్దరు చీరె – గోచీపోసి ట్టుకుని, గుండ్రటి సిగమధ్యన రాళ్ళ చామంతి పువ్వు చుట్టుకున్న రాముడత్తయ్య అంటే గోపాలానికి ప్రాణం. రాముడత్తయ్య ‘వందేమాతరం’ అంటుంది. ఎవరో గాంధీగారుట, ఆయన్ని మహాత్ముడంటూ, ‘ఆ గాంధీగారు స్వరాజ్యం తెచ్చిపెడతాడు – తెల్లవాళ్ళందరిని తరిమి కొడతాడు’ అంటూ – రాత్రిళ్ళు పక్కన పడుకోపెట్టుకుని కథలు చెప్పే రాముడత్తయ్య, వూరికి వెళ్ళిపోతోందీ అంటే ఏడుపు వచ్చింది గోపాలానికి –
    ”నీతో నేనూ వచ్చేస్తాను” అంటూ సంచీలో చొక్కాలాగూ పెట్టుకుని, రాముడత్త కొంగు వదలకుండా తిరుగుతున్నాడు పదేళ్ళ గోపాలం.
    రాముడత్తయ్య అని పిలవబడే రామలక్ష్మమ్మగారు ఆ యింటి పెద్దాడబడుచు. నలభై ఏళ్ళుపైన వుంటాయి. పిల్లలు లేరు. ఆవిడ గురించి – విడ్డూరంగా పెద్దవాళ్ళు చెప్పుకోవటం చాలాపార్లు వినివున్నాడు గోపాలం. తన తల్లి సుబ్బమ్మకి, ఒదినగారంటే భయం – పైకి ‘ఒదినగారూ’ అంటూ – గౌరవంగా పిలుస్తూ – భయభక్తులతో వున్నా! ….

    80.00
    Add to cart
  • Ide Na Nyayam

    Ide Na Nyayam

    0
    50.00
    Add to cart
  • Janani Janmabhoomi

    Janani Janmabhoomi

    0

    శ్రీమతి రుకాయ బేగం దిండునానుకుని కూర్చుంది. ఆమె నిశ్చలంగా కూర్చున్నా, చూపులు మాత్రం చంచలంగా కదులుతున్నాయి. మాటి మాటికీ ద్వారం వైపు దృష్టిసారించి, నిరాశగా నిట్టూరుస్తోంది. తాంబూలం సేవద్దామని “పాన్ దాన్ ” తీసింది. ఎమనుకున్నాడో మళ్ళి మూసింది. “చుక్కుమా! ఓ చుక్కుమ్మ!” అని పిలిచింది విసుగ్గా.

                      “అమ్మ!” అని, చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ వచ్చింది చుక్కమ్మ.

                      “వంటయిందా?”

                      “అయిందమ్మా! కాఫి, చా ఎమన్నా పెట్టనా అమ్మ?”

                    “వద్దులే. వీళ్ళిద్దరూ రాలేదు. చూడే! ఇంకా రాలేదు… ” ఆమె మాట పూర్తికాకముంటే ఇరవైఏళ్ళ యువతీ, పంజాబీ దుస్తులు వేసుకుని వచ్చింది. ఆమెను చూడగానే రకయాబేగం కళ్ళు వెడల్పు అయ్యాయి. “వచ్చావా సాజి?” అన్నది సంబరంగా. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

    90.00
    Add to cart
  • Janglee - జంగ్లీ

    Janglee – జంగ్లీ

    0

    కిషన్‌చందర్‌ రాసిన ”జంగ్లీ” (నవల) ఒకనాటి బొంబాయ్‌ నగర జీవితాన్నీ, మహానగరంగా పెరుగుతున్న ఆ నగర వైరుధ్యాలనూ ప్రత్యేకించి కూటికీ, గుడ్డకూ, గూడుకూ కరువైన సాదాసీదా జనజీవనాన్ని గురించి అత్యంత అద్భుతంగా మన కళ్ల ముందు ఆవిష్కరింపజేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరుగుదలతోపాటు దాన్ని అంటిపెట్టుకుని ఉండే దారిద్య్రం, సంపన్నతలను మనం ఈ నవల ద్వారా గమనించవచ్చు. జీవిత వైవిధ్యాన్ని, మానసిక అంతర్మథనాన్ని కిషన్‌చందర్‌ గొప్పగా చిత్రించాడు. అనామకులైన ఇద్దరు పేద యువతీయువకుల ప్రేమగాథను కష్టాలకూ, కన్నీళ్ళకూ వేదికైన బొంబాయ్‌ నగర  ”ఫుట్‌పాత్‌” అలగాజన’ జీవనస్రవంతిలో ఆ ప్రేమజంట ఏ విధంగా జీవనాన్ని సాగిస్తూ కలలు కన్న విషయాన్ని కిషన్‌చందర్‌ సాహితీలోకానికి అందిస్తాడు. అందుకే ఆయన భారతీయ సాహిత్య శిఖరంలో నిలవగలిగిన కొద్దిమందిలో ఒకరైనారు.

    పేజీలు :186

    150.00
    Add to cart
  • Jeevana Laalasa

    Jeevana Laalasa

    0

    విన్సెంట్ చనిపోలేదు. అతనికి మరణం లేదు. అతని ప్రేమా, ప్రజా, అతడు సృజించిన మహా

    సౌందర్యమూ కలకాలం నిలిచిపోతాయి, ఈ ఈ లోకాన్ని సుసంపన్నం చేస్తాయి. అతని చిత్రాల్లో

    నూత్న విశ్వాసం, బతుక్కి కొత్త అర్థం గోచరిస్తాయి. అతడు గొప్ప మానవుడు, గొప్ప వర్ణచిత్రకారుడు, గొప్ప తాత్వికుడు. ప్రేమించిన కళ కోసం ప్రాణాలు ధారపోసి అమరుడయ్యాడు.

    విన్సెంట్ జీవితం, నిరాశలు వాస్తవమైనవాటికన్న ఎక్కువ కల్పనలా అనిపిస్తాయి. అతని మానవ సంబంధాలను, చిత్రలేఖనాలను, వర్ణసమ్మేళనాలను, ఆశనిరాశలను తన ఊహాశక్తితోనూ, కవితాత్మక సాంద్ర వ్యక్తీకరణలతోనూ అక్షరాల్లో పునర్జీవింపజేసే అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకుని నవలగా మలిచాడు ఇర్వింగ్ స్టోన్.

    ఈ అనువాదం కేవలం ఆసక్తి కొద్దీ సాగినది మాత్రమే కాక ఇర్వింగ్ స్టోన్ రచనలాగ అభిరుచితో హృదయమంతా రంగరించి సాగడం , తెలుగు పాఠకులకు దొరికిన గొప్ప రంగుల వెల్లువ….

    ఎన్. వేణుగోపాల్

    300.00
    Add to cart
  • Kale neta

    Kale neta

    0

    మనకు తెలియని మహిళల ఆత్మకథ

    పాశికంటి (బల్ల) సరస్వతిగారు తన 69వ యేట (2012) మొదలు పెట్టి తన 76వ యేటకు (2019) పూర్తి చేసిన ఆత్మకత ‘కలెనేత’. ఒక బహుజన (పద్మశాలి), తెలంగాణ ఉపాధ్యాయురాలు రాసిన రెండవ ఆత్మకథ. సుమారు అటుయిటుగా నూటా ఇరువై సంవత్సరాలు ఏడుతరాల నేతపనివారి గెలుపోటముల విషాద విధ్వంసక పోరాట చరిత్ర… ‘కలెనేత’లో సరస్వతిగారు నాలుగోతరం ప్రతినిధి. భారతదేశంలో జాతీయోద్యమ పోరాటం, తెలంగాణాలో రైతాంగ సాయుధ పోరాటం రూపుదిద్దుకుంటున్న కాలంలో సరస్వతిగారు నడక నేర్చుకున్నారు. అక్కడి నుండి ఒక మహిళగా, ఉపాధ్యాయురాలిగా తన జీవితాన్ని, తన బతుకు చుట్టూ విస్తరించి యున్న గ్రామీణ జీవితాన్ని తార్కికంగా అర్థం చేసుకున్నారు… మూడు తరాలు వెనక్కి తన తల్లిదండ్రులైన పాశికంటి రామదాసు, లక్ష్మమ్మలను – తాత వీరయ్య – అతని తండ్రి ధర్మయ్యదాకా లోపలికి వెళ్లారు. అక్కడి నుండి 2019 దాకా తను, సాగిన జీవనయానం – దాని చుట్టూ విస్తరించి ఉన్న జీవితాన్ని అంటే మరో మూడు తరాల సమకాలీన జీవితాన్ని ఆత్మకథలో చిత్రించారు. తెలంగాణా సాయుధ పోరాటం ఉధృతంగా నడిచిన ఆలేరు, జనగామ, వరంగల్లు, నల్గొండ ప్రాంతాలు – అక్కడి గ్రామాలు, చిన్న పట్టణాలు ఈ ఆత్మకథలో కన్పిస్తాయి.

    ఇదే ప్రాంతం నుండి ఇంతకన్నా ముందు ముదిగంటి సుజాతరెడ్డిగారు ‘ముసురు’ అనే పేరుతో ఆత్మకథగా రాశారు. సుజాతారెడ్డిగారు ఉపాధ్యాయురాలే. నకిరేకల్ (నల్గొండ) నుండి కరీంనగర్ దాకా అదే పోరాటకాలంలో దొరల జీవన నేపథ్యంలో రాశారు. తెలంగాణాలో బహుజన మహిళ సంఘం లక్ష్మీబాయమ్మ రాసిన మొట్టమొదటి

    ఆత్మకథ ‘నా అనుభవములు’. ఈ ఆత్మకథను కాంగ్రెస్ రాజకీయాల నేపథ్యంలో రాసారు. తెలంగాణాలో పురుషులు రాసిన ఆత్మకథలు… సామల సదాశివ ‘యాది’, దాశరథి రంగాచార్య ‘జీవన యానం’, దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’, కాళోజీ ‘నా గొడవ’, బోయి భీమన్న ‘పాలేరు నుండి పద్మశ్రీ వరకు’, పి.వి. నర్సింహారావు ‘లోపలి మనిషి’, రావినారాయణరెడ్డి స్వీయచరిత్రము’ రాశారు.

    ఈ మూడు మహిళల ఆత్మకథలు తెలంగాణా మహిళా సాహిత్యంలో (సుమారుగా ఏడువందల నవలలు వచ్చినా కూడా) ప్రామాణికంగా నిలుస్తాయి………….

    బల్ల సరస్వతి – in

    500.00
    Add to cart
  • Kalnal Ekalingam Adventures

    Kalnal Ekalingam Adventures

    0

    జోక్ అతి చిన్నది. నవల అతి పెద్దది. చిన్న చిన్న జోకులని దండలా గుచ్చి ఓ వ్యక్తి జీవితగాధని అతి పెద్ద నవలగా రాయడం ప్రపంచ సాహిత్యంలో ఇదే తొలిసారి. ప్రింట్ మీడియా ఎంటర్టైనర్ మల్లాది వెంకట కృష్ణమూర్తి చేసిన ఈ సాహితీ సర్కస్ ఫీట్ లోని డర్టీ, పార్టీ, రొమాంటిక్, ప్లేబాయ్, కేంపస్ జోక్స్ అన్నీ పాఠకులని ఎంటర్ టైన్ చేసేవే. మధ్య నుంచి మొదటికీ, లేదా చివరి నుంచి మధ్యకి కూడా చదువుకో దగ్గ మల్లాది రాసిన మొదటి నవల ఇది. అసలు హాస్యం ఎలా పుడుతుంది? ఎక్కడ అవకతవక లేదా అసంపూర్ణం ఉంటే అక్కడ హాస్యం పుడుతుంది.

    ఉదాహరణకి సుబ్బారావు రోడ్డు మీద నడిచి వెళ్తుంటే అందులో హాస్యం ఉండదు. అదే సుబ్బారావు రోడ్డు మీద నడిచి వెళ్తూ, అరటి తొక్క మీద కాలు వేసి జారిపడితే, ఆ అవకతవక లోంచి హాస్యం పుడుతుంది. ఇలాగే అందాన్ని ఎవరూ ఆక్షేపించరు. అనాకారితనం లోనే హాస్యం ఉంటుంది. అనేక విదేశీ జోక్స్ పత్రికలు ఇచ్చి సహాయం చేసిన మిత్రులు, కార్టూనిస్టు మీనా గారికి నా కృతఙ్ఞతలు.

    – మల్లాది వెంకట కృష్ణమూర్తి

    310.00
    Add to cart
  • KarunaKumara Kathalu

    KarunaKumara Kathalu

    0

    గ్రామజీవనమే కథా వస్తువుగా తీసుకుని మోతుబరీ భూస్వాముల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి పూటకు గతిలేని కష్టజీవుల దయనీయ జీవిత  గాధలను కండ్లకు కట్టినట్లు చిత్రీకరిస్తూ బలవంతులు బలహీనులపై చూపే పాశవిక ప్రవృత్తినీ, కర్కశ కఠిన మనస్తత్వాలను తూర్పారపట్టి, ఎంతో రసభరితంగా బహిర్గతం చేసిన పరమ కరుణారస హృదయులు శ్రీ కరుణ కుమార. అయన గతించగా ఇక ఆంధ్ర కథా సాహిత్యానికి మిగిలినవి ఆయన కథలే. అప్పుడీ కథలు ఉదయిని, భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, కిన్నెర, స్వతంత్ర మొదలైన పత్రికలలో ప్రచురితమైనాయి. అప్రకటితములుగా కూడా మిగిలిపోయాయి కొన్ని.

    ఆంధ్రదేశంలో అడుగునపడియున్న ఉత్తమ సాహిత్యాన్ని అచ్చోత్తించి పాఠక లోకానికి అందించడం వారి ఉన్నతాశయం. ముందు కూడా తెలుగు సాహిత్య లోకాన్ని మరింత సుసంపన్నం చేయగలరని విశ్వసిస్తున్నాను.

    – ఇవటూరి కామేశ్వరరావు

    150.00
    Add to cart
  • Kasibhatla Venugopal- 3 Novels (Nenu Chikati, Thapana, Digantham)

    Kasibhatla Venugopal- 3 Novels (Nenu Chikati, Thapana, Digantham)

    0

    గత దశాబ్ద కాలంలో “నేను – చీకటి” తెలుగు నవలా సాహిత్యంలో ఒక ప్రభంజనమైతే “తపన” ఒక ఘంఘా మారుతం అయింది. “రాళ్ళెత్తిన కూలి” కథ సాహిత్యంకి పచ్చ బొట్టయింది. స్వతహాగా కవి. వీరి రచనల్లో కవిత్వపు వాసనలు గుబాళిస్తుంటాయన్నది కాదనలేని సత్యం. అది ఆయా రచనలకు అలంకార ప్రాయమే అవుతోంది.

                    “సర్టిఫికెట్స్ చదువుకి కొలబద్దలైతే నాకు చదువు రాదన్నమాటే! నా దగ్గర ఒక సర్టిఫికెట్ కూడా లేదు మరి! చదువంటే నలభై అయిదేళ్ళ జీవితమే నాకు. భుక్తికి ఇన్సూరెన్సమ్మాకల్తో పాటు ఒ రెండు చిన్న వ్యాపార లావాదేవీల్లో ఇంకింత చిన్న వాటాలు, అంతే!” అంటారు శ్రీ వేణు గోపాల్.

                             ఇంకా-

                      “బ్రహ్మచారిని. మంచి పద్యమూ, పద్యమూ – రెండు నాకు ప్రీతి . అమ్మ కి||శే|| మనుమాంబ చిన్నప్పుడే పల్లె వేయించిన “అమరకోశము” చదివించిన “రఘు వంశము” ఈ రోజుకి నాకు ఉపయోగపడుతున్నాయి” అని గురువుని స్మరిస్తుంటారు.

    300.00
    Add to cart
  • Kasyapa Yodhudu - కశ్యప యోధుడు

    Kasyapa Yodhudu – కశ్యప యోధుడు

    0

    మాతృభూమి రక్షణకై యోధుడుగా మారిన ఒక బ్రాహ్మణ యువకుని కథ. మహారాజు క్షమాపణలు చెప్పటాన్ని అక్కడి ప్రజలు ఊహించలేదు. వారందరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సముద్రఘోషగా ఖాసి సైన్యం సూర్యదేవాలయాన్ని చేరుకుంది. నిరాయుధులైన అందరినీ వధించిన తరువాత నిశ్ఛేష్టులై విగ్రహాల్లా నిల్చొని ఉన్న రాజును, రాజగురువును ఖాసిం స్వయంగా తన ఖడ్గంతో వధించాడు. అద్భుతమైన సౌందర్యం, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన దేవాలయ ప్రాంగణం రక్తసిక్తమై ఒక్కసారిగా భయానకంగా తయారైంది. సూర్యుడు కూడా ఈ ఘోరాన్ని చూడలేనట్టు మబ్బుల వెనకాల దాక్కున్నాడు. కొద్దిసేపటికే వర్షం ముంచెత్తి ఆకాశం తన బాధను తీర్చుకుంది. ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకునే మాతృభూమి ముస్లింల వశమైంది.

    కశ్యపాపుర మహాసామ్రాజ్యానికి రాజు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్తితి ఎందుకొచ్చింది? యోధానుయోధులను కన్న భరతభూమి పోరాటపటిమ లేకుండా ఖాసిం సైన్యానికి ఎందుకు దాసోహమైంది? కట్టుబాట్లు, సాంప్రదాయాలు అంటూ వేదమంత్రాలు వల్లెవేసుకునే సౌమ్యుడైన బ్రాహ్మణ యువకుడు యుద్ధమే ఊపిరిగా బ్రతికే ఖాసింని ఎదుర్కొనే యోధుడుగా ఎలా మారాడు..? ”మాతృభూమిని రక్షించటం అంటే పరాయి దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయటమేనా? తరతరాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్యకు పరిష్కారం కనుగొనగలిగాడా?”… తెలుసుకోవాలంటే ఈ నవల చదవక తప్పదు.

    200.00
    Add to cart
  • Katha 2021

    Katha 2021

    0

    కల్లోల వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయా?

    వాసిరెడ్డి నవీన్

    కథారచనకు స్వేచ్ఛావ్యవస్థ తప్పనిసరి.

    ఆమాటకొస్తే ఏ రచనకైనా అది అవసరమే. ఇప్పుడు ఆ వ్యవస్థ బలహీన పడుతోంది. అంటే రచయితలకు స్వేచ్ఛ లేదని కాదు. (అప్పుడప్పుడు ప్రభుత్వాలు ఆ స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అది వేరు.) కానీ కనపడని ఇనుపతెరలు దానికి అడ్డుగా వేలాడుతున్నాయి. రచయిత తన అభిప్రాయాలను, భావావేశాలను, దృక్పథాన్ని, తనకు తెలిసిన జ్ఞానాన్ని, తెలివిడిని తన చుట్టూ ఉన్న ప్రపంచంతో పంచుకోవాలని తపన పడతాడు. రచనకున్న ఈ ప్రాథమిక ఉద్దేశానికి ఆటంకాలు ఏర్పడుతున్న దశ ఇది. మరీ ముఖ్యంగా సృజనాత్మక రచనలకు.

    కథలకు కానికాలం వచ్చేసింది.

    ఇటీవల కాలంలో కథల నిడివి రానురాను కుంచించుకుపోతోంది. ఎంచు కున్న కథావస్తువుకు అవసరమనిపించినంత, రాయవలసిన అవసరం ఉండి, రాయగలిగి కూడా రచయిత రాయలేకపోవడం విషాదం కదా! పత్రికల్లో సాహిత్యానికి జాగా తగ్గిపోవడము, కథలను ప్రచురించే పత్రికలు కనుమరుగైపోవడము, తెలుగు సాహిత్యాన్ని వారసత్వ సంపదగా

    140.00
    Add to cart