• Money Purse 2

    Money Purse 2

    సంపాదించడానికి ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తూనే ఉన్నారు. భూమ్మీద లెక్కలేనన్ని ఆదాయ మార్గాలున్నాయి. కానీ మనలో చాలామంది – సంపాదించిన దానిని వృధా కాకుండా పొదుపు చేయడానికి, మంచి ఆదా మార్గమేదో తెలుసుకోవడానికి శోధించడం లేదు పూర్తిస్థాయిలో. అందుకే ఆదాయ మార్గాల గురించి కాకుండా, అనవసర వ్యయాల గురించి, ఆధిక లాభాలనిచ్చే ఆదా మార్గాల గురించి చర్చించా ఈ పుస్తకంలో.

    చిట్ ఫండ్స్  లాభమా? నష్టమా?

    నేలను నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడా…?

    రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఏ జాగ్రత్తలు తీసుకొవాలి?

    వంద రూపాయలతో పది వేల కోట్లు……. ఎలా?

    ఏడాదికి 9% వడ్డీ గిట్టబాటయ్యే ఎండోమెంట్ బీమా పాలసీ ఏది?

    ఎల్ ఐ సి ఎండోమెంట్ పాలసీ లో రాబడి ఎంత?

    ఏది ఉత్తమ పెట్టుబడి?

    నమ్మకానికి అమ్మ వంటిది ఎల్ ఐ సి మాత్రమేనా?

    ప్రైవేటు బీమా కంపెనీలను నమ్మ వచ్చా?

    ఏజంటు లేకుండా పాలసీ తీసుకోవచ్చా?

    పిల్లలని కోటిశ్వరులను చేయడం ఎలా?

    పోస్టల్ అర్ డి, బ్యాంక్ అర్ డి ల లో ఏది ఎక్కువ లాభం?

    వేయి రూపాయలు= లక్ష రూపాయలు

    బంగారానికీ కల్తీ కావాలి

    ఆరోగ్య మహాభాగ్యానికి ఏమి చేయాలి?

    బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ లాభమా? నష్టమా?

    బంగారం ఎలా కొంటే మంచిది?

    జీవిత బీమా తక్కువయితే నేరం, ఎక్కువయితే ప్రమాదం

    ….ఇంకా ఎన్నో ఆర్ధిక సందేహాలకు చదవండి….

    ఇది 5వ ముద్రణ…

    300.00
    Add to cart
  • Money Purse 3

    Money Purse 3

    ఏడాదికోసారి ‘హెల్త్ చెకప్’ చేయించుకుంటే రోగాలు రాకుండా జాగ్రత్తపడొచ్చు. ‘వెల్త్ చెకప్’ చేయించుకుంటే ఆర్ధిక సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కానీ వెల్త్ చెకప్ ఎవరు చేస్తారు? మనీపర్స్ చదివితే వెల్త్ చెకప్ అయి ఆర్ధికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకాలు.

                                                  – గంపా నాగేశ్వరరావు గారు

                   లక్ష్మీదేవి తన భార్యే అయినా వెంకటేశ్వర స్వామి నిత్యం నిలబడి సంపాదిస్తున్నాడు. కానీ కుబేరుడు..? కుబేరుడిలా కూర్చొని, పడుకుని, నిద్రపోతూ కూడా సంపాదించాలి అనుకుంటారా? కుబేరుడిలా శ్రమలేని ఆదాయం రావాలంటే ఆయనలా మీ డబ్బుని ఎక్కడ, ఎప్పుడు, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియాలి. ఆ ఆర్ధిక అక్షరాశ్యతలో భాగంగానే మనీపర్స్ 1 & 2 వచ్చాయి. ఇప్పుడు మనీపర్స్ – 3 మీ చేతిలో ఉంది. చదవండి…

    ఈ పుస్తకం ద్వారా ఎక్కువ లాభం పొందాలి అనుకుంటున్నారా మీరు? ఐతే, కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం అనే ఉద్దేశ్యంతో చదవకండి. తెలుసుకుంటే జీవితాలు మారవు. తెలిసిన విషయాలను ఎంతవరకు ఆచరిస్తున్నారని మిమ్మల్ని మీరు సమీక్షించుకోవడానికి చదవండి. పొద్దున్నే లేచి ఓ గంట నడిస్తే లాభం అని నాకు తెలిస్తే… ఏం లాభం? నడిస్తే లాభం. అలా రోజూ నడిచేంత వరకు నడక వల్ల ప్రయోజనాలు తెలుసుకుంటూనే ఉండాలి నేను. అలాగే మన జీవిత ఆర్ధిక ఆరోగ్యం ఎలా ఉందో మనకి మనం తెలుసుకునేందుకు మన ఫైనాన్స్ ని మనమే స్కానింగ్ చేసుకోవాలి. అందుకు ఈ పుస్తకం కొంతవరకు పనికొస్తుందని నమ్ముతున్నా.

    ఈ పుస్తకంలో…

    ఎంత సంపాదించాలి?

    ఇల్లుకొందామా? అద్దెకుందామా?

    పర్స్ లో పైసా తీయకుండా ఫ్లాట్ ఋణం తీర్చవచ్చా?

    ఇంటి రుణ వాయిదాలు భారం అయితే.. ఏం చేయాలి?

    అద్దెకారు తీయన… సొంతకారు పుల్లన ?

     

    300.00
    Add to cart
  • Mr Sampath M A

    Mr Sampath M A

    ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే ఉంటాయి. మాదిరెడ్డి సులోచన సమగ్ర సాహిత్యం ఈ తరం పాఠకులకు అందచేయ్యాలని, ఈ నవలల్ని పాఠకులు ఆదరిస్తారనీ మా ఆలోచనలకు మిత్రులనుండి, పాఠకులనుండి సోదర ప్రచురణకర్తల నుండి ఎంతో ప్రోత్సాహం వచ్చింది. వారికి మా ధన్యవాదాలు.

    సంపత్ హడావుడిగా లేచాడు. అతని అరచేతులు తడిగా ఉన్నాయి. ఎదో గాభరా! ఎదురుగా ఉన్న స్ప్రింగ్ తలుపును ఆనుకొని ఉన్నాడో వ్యక్తి. అతని చేతిలో ఫైలు లాంటి కార్డ్ బోర్డ్ ఉంది. దానివంకే పరీక్షగా చూస్తున్నాడు. అతని నోరు ఎండుకు పోతుంది. సంపత్ ముందుకు వెళ్ళాడు. నేనే ఆ సంపత్ ను అని చెప్పాలని ఉంది. నోట్లో నుండి మాట బయటికి రావటం లేదు. ఉద్యోగాల వేటలో మొదటి ప్రయత్నం ఇది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

    120.00
    Add to cart
  • Mrutyunjayulu - మృత్యుంజయులు

    Mrutyunjayulu – మృత్యుంజయులు

    జనంలోంచే వస్తారు ‘మృత్యుంజయులు’

    ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా పాలకవర్గం పాలితవర్గం నడుమ పోరాటమంటూ ప్రారంభమయితే నాటి పరిస్థితుల అనుకూల్యతను అనుసరించి అంతిమ విజయం ఉంటుంది. ఇది చారిత్రక సత్యం. అలాటి సత్యావిష్కరణకు సృజన రూపం ‘మృత్యుంజయులు’ నవల.

    1946లో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటం వస్తువుగా 1947లో ‘మృత్యుంజయులు’ నవల అచ్చయింది. ఆ పోరాటానికి తొలి అక్షరరూపం ఈ నవల. రచనా కాలానికి రచయిత బొల్లిముంత శివరామకృష్ణ వయసు 27 ఏళ్ళు. యువకుడుగా తన కాలంలో తన సమీప ప్రాంతం తెలంగాణలో ప్రారంభమైన ప్రజాపోరాట నేపథ్యాన్ని అవగాహన చేసుకొని, దాని ఆంతర్యాన్ని అర్థం చేసుకొంటూ, ఆ పోరాటం జరుగుతున్న తీరుతెన్నుల్ని గమనిస్తూ, ప్రజలపక్షమే అంతిమ విజయమని వైతాళిక గీతికగా ఆవిష్కరించిన కథా కథనం ‘మృత్యుంజయులు’ నవల.

    80.00
    Add to cart
  • Mugdha

    Mugdha

    ముగ్ధ

    జీవితం కొందరికి విశాలమైన ఆకాశం. మరికొందరికి ఉరకల, పరుగుల, విలాసమైన సముద్రం. జీవితం కొందరికి లేత బుగ్గమీద కన్నీటి చుక్క మరికొందరికి పున్నమి వెలుగుల్లో పూలమొక్క జీవితం కొందరికి కనబడని కంటి కాటుక. మరికొందరికి సప్తస్వరాల్ని కాళ్ళకు కట్టుకున్న బంగారు పట్టీల సంజె వెలుగు.

    పురుషుడికైనా, స్త్రీకయినా బతుకు నిండుసున్నా దగ్గరే ప్రారంభమవు తుంది. బాల్యం, అస్పష్టపు జ్ఞాపకాలు, పెరుగుదల, మరచిపోలేని వాతావరణం, యౌవనం, కలలు, ఆశలు, ఆకాంక్షలు, జడివానలా ముంచెత్తి, ఉక్కిరి బిక్కిరి చేసే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ఒక అధ్యాయమైతే, పెళ్ళయిన తర్వాత మరో అధ్యాయం ప్రారంభమవుతుంది… వ్యామోహం, పిల్లలు, అస్పష్టపు దారిని సరైన దారిగా మార్చుకోడానికి చేసే విశ్వ ప్రయత్నం… ఆ ప్రయత్నంలో సఫలాలు, విఫలాలు, భోగాలు, త్యాగాలు, యోగాలు, చివరికి రోగాలు, మనిషిని చివరి వరకూ అంటి పెట్టుకునే వుంటాయి. ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో మజిలీలు, ఎన్నెన్నో మెరుపులు, ఎన్నెన్నో మలు……………..

    140.00
    Add to cart
  • Nakili Manishi

    Nakili Manishi

    అగథా క్రిస్టీ గురించి ఒకరు చెప్పగలిగే దేముంటుంది? పేరు పొందిన రచయిత్రి ఆమె. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొదీ తన రచనలు అమ్ముకోగలిగిన రచయిత్రి. ప్రపంచ భాషలలోనికి తన కథలు, నవలలు అనువాదం చేయించుకోగలిగిన చెయ్యి తిరిగిన రచయిత్రి. అంతేకాదు, పిస్టల్ అనేది ఎలా ఉంటుందో తాకి చూడకుండానే పుంఖాను పుంఖాలుగా అపరాధ పరిశోధక రచనలు చేసినట్లు కూడా

    పేరు మోసిన రచయిత్రి. ఈ సంపుటిలో సాధారణ పాత్రలూ ఉంటాయి. సాధారణ సంఘటనలూ ఉంటాయి. అయితే అసాధారణమైన రచనా వైవిధ్యంతో, మనస్తత్వ కల్పనతో రచయిత్రి ప్రతి కథకు ఊహించలేని స్థాయిలో ముగింపును సిద్ధం చేస్తారు. క్లుప్తమైన, సూటియైన సంభాషణలు పాఠకుల మస్తిష్కాలను ఉత్తేజ పరుస్తాయి. తాను చూసిన లండన్ మహా నగరంలో నిత్యం జరిగే సంఘటనలకు ఆమె తన కథనశైలితో, రచనావిన్యాసంతో, మలుపులూ, మెరుపులూ కల్పించి ప్రచురించిన ఇరవై నాలుగు కథల ఆసక్తికర సమాహారమిది. – ఆంగంలో వీటిని చదివినవారు సైతం తమ తొలి పఠన స్మృతుల పరిమళం తిరిగి పొందుతారు. చదవనివారు ఊపిరిసలపని ఉత్కంఠతో పాటు ఈ కథల రచనాశిల్పంతో రసాస్వాదనను సొంతం చేసుకుంటారు, ఈ కథలు వేటికవే నూటికి నూరు శాతం సంతృప్తి కలిగిస్తాయి.

    250.00
    Add to cart
  • Nalla Trachu

    Nalla Trachu

    నల్లతాచు

    ఇంతకుముందు ‘వారియర్ షాడో’ కథను గురించి కొంచెం గుర్తుచేసే ప్రయత్నం ఇది. దేశంలో ఉన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్సంస్థలన్నిటినీ తందనాలు తొక్కిస్తున్న గజదొంగ షాడోని పట్టుకోవటంలో సహాయం చేసేందుకు వచ్చిన సిఐబి చీఫ్ కులకర్ణిగారికి చాలా దగ్గిరిగా వచ్చి కూడా ఆయన దృష్టిలో పడకుండా తప్పించుకున్నాడు షాడో.

    సరిహద్దులకు ఆవల నివశించే అసరుద్దీన్ అనే పెద్దమనిషిని బంధించి, అతని ఎస్టేట్ ని తను స్వాధీనం చేసుకున్న అజ్మల్ భాయ్ అనే ఒక క్రిమినల్ ఆట కట్టిస్తాడు అతను.

    ఆ ఎస్టేట్లో బంధింపబడిన భాంజీ సాబ్ కూతుర్నీ, ఇతర ఆడబిడ్డలను చెరనుంచి విడిపిస్తాడు.

    భాంజీసాబ్ సరిహద్దులకు ఇవతల ఉన్న తన ఎస్టేట్లో ఒక విచిత్రమైన ఒంటెల్ని పెంచుతూ ఉంటాడు,……….

    120.00
    Add to cart
  • Narakamlo Harishchandrudu

    Narakamlo Harishchandrudu

      పురాణగాథలపై నార్లవారి విమర్శలలో ముఖ్యమైన మూడవది “నరకంలో హరిశ్చంద్రుడు”. ఆయన అభిప్రాయంలో మనకు “సుపరిచితుడైన” సత్యహరిశ్చంద్రునితో పాటు మరో ఇద్దరు హరిశ్చంద్రులున్నారు. ఒకడు అసత్య హరిశ్చంద్రుడు కాగా, మరొకడు రాజర్షి హరిశ్చంద్రుడు. ఈ ముగ్గురు హరిశ్చంద్రులు మన ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తారంటారు నార్ల. ఐతరేయ బ్రాహ్మణం, రామాయణం, భారతం, మార్కండేయ పురాణం, పద్మ పురాణం, వాయు పురాణం, శివ పురాణం, భాగవతం, దేవీభాగవతం మొదలైన పురాణ గ్రంథాల్లో ఈ ముగ్గురు హరిశ్చంద్రులు కనిపిస్తారు. 

    మార్కండేయ పురాణంలోని గాథకే అధిక ప్రాధాన్యం లభించిందనీ, అందులోని హరిశ్చంద్రుడి గాథే మనకు సత్యహరిశ్చంద్రుడిగా దర్శనమిస్తున్నాడని నార్లగారంటారు. ఈ నాటకానికి ఆయన రాసిన పీఠిక కూడా దాదాపుగా సమగ్రమైన “పురాణ విమర్శే”. పదకొండవ శతాబ్దిలో క్షేమేంద్రుడు రాసిన “చండకౌశిక” నాటకం నుండి, పదిహేనవ శతాబ్దిలో గౌరవ రాసిన “హరిశ్చంద్రోపాఖ్యానం”, పదిహేడవ శతాబ్దికి చెందిన రామరాజభూషణుడు రాసిన “హరిశ్చంద్రనలోపాఖ్యానం”, కందుకూరి వీరేశలింగం రాసిన నాటకం, బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన నాటకం, విశ్వనాథ సత్యనారాయణ రాసిన “కావ్యవేదహరిశ్చంద్ర” నాటకాల వరకూ నార్లవారు పరిశీలించినట్లుగా ఆయన పీఠికలో రాశారు.

    60.00
    Add to cart
  • Natopatu Nalguram

    Natopatu Nalguram

      తిరిగి యిన్నేళ్ళ కు మాదిరెడ్డి సులోచన నవలలు మీ ముందుకు వచ్చాయి. దాదాపు ఏభై యేళ్ళ క్రితం అచ్చమైన తెలంగాణా వాతావరణం పొందికైన మానవ సంబంధాలూ కలగలిపి చక్కని యితివృత్తాలు ఆమె సాహిత్యంలో కనిపిస్తాయి. డెబ్భై పైగా నవలలు ఆమె రచించారు. వాసిలోనూ రాశిలోను కూడా సులోచన రచనలు ఎన్నతగినవే. ఆమె ప్రమాదవశాత్తు అకాలమరణం పాలు కాకుండావుంటే మరెన్ని మంచి నవలలు రాసి వుండేవారోననేది ఊహకు మాత్రమే మిగిల్చి వెళ్లిపోయారు.

            ఇప్పుడు అంటే నూతన సహస్రాబ్ది తొలిదశకంలో యీ నవలల్ని చదువుతున్నపుడు కొన్ని కొన్ని సందర్భాలలో పాఠకులకు అసహజంగా వున్నా భావన కలిగే అవకాశం వుంది. ఎందుకంటే గడచిన ఏభై సంవత్సరాలలో ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రంగాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆనాటి రూపాయికి నేటి రూపాయికి పొంతన లేదు. కొన్ని వూళ్ళపేర్లు కొన్ని మాటల అర్దాలు సైతం మారిపోయాయి. వేషధారణ మారింది. దూరాలు తగ్గిపోయాయి. భూగోళం గుప్పెట్లో వొదిగిపోయింది. ఆనాడు వంద రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. నేడు అది చిల్లర డబ్బు. కనుక ఇలాంటివి మాదిరెడ్డి నవలలో తారసపడినప్పుడు విజ్ఞలైన మా పాఠకులకు కాలంతో అన్వయించుకుని అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాము.

                                                                                                      – మాదిరెడ్డి సులోచన

    70.00
    Add to cart
  • Navala Manjari- 2

    Navala Manjari- 2

    125.00
    Add to cart
  • Navala Manjari- 3

    Navala Manjari- 3

    125.00
    Add to cart
  • Navala Manjari- 4

    Navala Manjari- 4

    125.00
    Add to cart