-
Katha Sravanthi (Set of Ten books)
0₹670.00కనపర్తి వరలక్ష్మమ్మ కథలు, తల్లూరి నాగేశ్వరరావు కథలు, కరుణ కుమర కతలు, బలివాడ కాంతరావు కథలు, – శశిశ్రీ కాఠ్ఠలు, సంతి నారాయణ కథలు, – సతీశ్ చంద్ర కాఠ్ఠలు, పెద్దింటి అశోక్ కుమార్ కథలు, వి. ఆర్. రసాని కథలు, సన్నాపురెడ్డీ వేంకటరామిరెడ్డి కథలు,
-
KGH Kathalu
0₹150.00మనసులో మాట
మనసులోంచి తన్నుకొచ్చే ఆలోచనలన్నీ బిగబట్టి భద్రంగా దాచి ముప్ఫై ఏళ్ళ పైగా చదువులో మునిగి తేలి, ఇన్నాళ్లకు ఈ చదువిక అవ్వదని తెలుసుకుని, ఆ ఆలోచనలకి ఒక స్వేచ్ఛనిచ్చి మళ్ళీ పుస్తక రూపంలో బంధిస్తే వచ్చినవే ఈ కథలు.
మనసు మాతృభాషలోనే ఆలోచిస్తుంది. అందుకని తెలుగులో కాకుండా మరే భాషలోనూ నా ఆలోచనలని నిజాయితీగా రాయడం కుదరని పని. నిరంతర పోటీ పరిశ్రమలో బట్టీలు పట్టి వైద్యుడినైపోయిన నేను, ఎక్కడో ఏ మూలో నేను విన్న కథలు నాలో నన్ను అనే ఒకడ్ని సృష్టించి, ఆ భావం నిద్రాణమైపోకుండా నన్నెప్పుడూ మేల్కొల్పుతూ ఉండి చివరికి ఒక సృజనగా ఈ కథాసంపుటంగా ఇన్నాళ్లకు బయటకు వచ్చింది. – నేనొక మానసిక వైద్యుడిని. ఎందరివో బాధలు, గాధలు వింటాను; అయినప్పటికీ ఈ కథల్లో వారెవరి వివరాలు గానీ, అనుభవాలు గానీ లేకుండా జాగ్రత్త తీసుకుని కేవలం నా అనుభవాలు లేదా పరిశీలనలు మాత్రమే రాశాను. ఈ కథలన్నీ కూర్చొని ఆలోచించి పథకం ప్రకారం రాసినవి కావు, అన్నీ ఆశువుగా ఒక సాయంత్రం సోఫాలో కూర్చునో, ఏ రైలు ప్రయాణంలో తూర్పుకనుమలు చూస్తూనో రాసేసినవి. కాబట్టి నిడివి, లోతు, కథావస్తువు మొదలైన వాటిల్లో తారతమ్యం ఉంటుంది…………..
-
Kishan Chandar Rachanalu – 1 Gadidala Kathalu – కిషన్ చందర్ రచనలు – 1 గాడిదల కథలు
0₹100.00సాహిత్యంలో వ్యంగ్యానికున్న శక్తి అందరికీ తెలిసిందే! వ్యంగ్యం అనండి; అవహేళన అనండి; అందులో కిషన్ చందర్ పెట్టింది పేరు. శరీరానికి దెబ్బ తగలకుండా మనస్సుకు మెత్తగా చురుకపెట్టే శక్తి కిషన్ చందర్ రచనకుంది. గాడిదను ఆసరగా తీసుకొని ఢిల్లీ రాజనీతినీ, బొంబాయి వ్యాపారనీతినీ ఎండ గట్టాడు కిషన్ చందర్ ”ఒకానొక గాడిద ఆత్మకథ”లోనూ ‘తిరిగి వచ్చిన గాడిద”లోను. అదే గాడిద మరో దేశానికి ప్రయాణం చేసి తన అనుభవాలను పాఠకుల కందించేలా రాశాడు ”నేఫాలో గాడిద”లో.
పేజీలు : 216
-
Kollayi Gattithe Nemi
0₹250.00ఆంద్రదేశ చరిత్రలోనే 1920 -45ల పాతికేళ్ళకు అనిదంపూర్వమైన ప్రాముఖ్యం ఉంది. సామాజికంగా వీరేశలింగం ప్రభ్రుతులు సంస్కరణవాదధోరణులతో జాతి సంస్కారాన్ని ఎన్నో మెట్లెక్కించిన కాలం అది.
సహాయ నిరాకరణం, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు జాతిని అపార త్యాగాలకు సంసిద్ధం చేసిన కాలం అది. సాహితీ, నవ్యసాహితీ, అభ్యుదయోద్యమాలు సాంస్కృతిక రంగాన్ని నూతన స్థాయికి చేర్చిన కాలం అది.
తెలుగు ప్రాంతంలో జాతీయోద్యమ చరిత్ర శాస్త్రీయమైన అవగాహనతో అన్ని వైపుల నుంచి అధ్యయనం చేసి, కళాత్మకత దెబ్బతినకుండా “కొల్లాయిగట్టితేనేమి?” ‘దేశం కోసం’, ‘జ్వాలాతోరణం’, ‘రథచక్రాలు’, అనే చారిత్రక నవలలు మహీధర రామమోహనరావు రాశారు.
కాంగ్రెస్, కాంగ్రెస్ సోషలిస్ట్, ఫార్వర్డుబ్లాకు, రాయిస్టు, కమ్యూనిస్ట్ పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ, అన్నీ కలిసి పరాయి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ, సంక్లిష్ట చారిత్రిక గతితో మానవ సంబంధాలలో వస్తున్న మార్పుల్ని సజీవ రీతిలో చిత్రించిన నవలలు ఇవి.
– మహీధర రామ మోహన రావు
-
Kovvali Navalalu Konni
0₹280.00సామాన్య జనాన్ని రంజింప చేసిన 1000 నవలలను రూపొందించిన ప్రముఖ రచయిత, కర్మయోగి, నిరాడంబరుడు, సాహితీ తపస్వి శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు 1912లో పశ్చమ గోదావరి జిల్లా తణుకులో జన్మించారు. తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి కాంతమ్మ, తండ్రి ప్లీడరు గుమాస్తా వృతిని అవలంబించి రాజమహేంద్రవరానికి నివాసం మార్చుకున్నందున లక్ష్మీనరసింహారావుకు కూడా అదే స్వస్థలం అయింది. తల్లి చిన్నప్పుడే గతించడంవల్ల తండ్రే తక్కిన సోదరులతో పాటుగా ఆయనను పెంచి పోషించారు. 14 సంవత్సరాలు నిండేసరికి స్కూల్ ఫైనల్ పరీక్ష రాశారు. స్థానిక గ్రంధాలయంలోని పుస్తకాలన్నింటినీ చదివారు. కొంతకాలం దేశ సంచారం చేశారు.
ఆనాటి సామాజిక, సాహిత్య పరిస్థితులను తీసుకొని శృంగారము, ప్రేమ మొదలగు వానిని జోడించి వ్యావహారిక భాషలో 2, 3 గంటల్లో చదవడానికి అనువైన నవలలను ముఖ్యంగా ‘కాలక్షేపపు నవలలు’ 1000 రాసి ‘వేయి నవలల కొవ్వలి’ అయ్యారు.
కొవ్వలి రచనలలో పైకి ప్రేమ, శృంగారం ఎక్కువగా కనబడినా సాంఘిక దురాచారాల నిర్మూలన, వితంతు వివాహోద్యమం, బాల్య వివాహ నిరసన, వృద్ధ వివాహాల అవహేళన, స్త్త్రి విద్య, కులమత విభేద నిర్మూలన ఇతివృత్తాలుగా వుండి సముచిత ఆదరణ పొందగలిగాయి. అంతేకాక అందరినీ ఆకట్టుకునే రీతిలో రసవత్తరంగా ముఖ్యంగా మధ్య తరగతి స్త్రీలకు ఆమోదకరంగా తన రచనలను రూపొందించారు. ఆ రోజుల్లో (1940 లలో) ఆంద్ర సాహిత్య చదువరులకు చలువ పందిళ్లు కప్పించిన మహా రచయిత శ్రీ కొవ్వలి.
1940లలో శ్రీ కొవ్వలి పేరు ఊరూరా, వాడవాడలా చదువరులున్న ప్రతి ఇంటా జపించబడింది. ఆబాలగోపాలాన్ని ఆనంద డోలికల్లో ముంచి తేల్చింది.
యావత్ ప్రపంచంలోనూ 1000 నవలలు రచించిన ఖ్యాతి శ్రీ కొవ్వలికే దక్కింది.ఆయన రచనలను ఆదరించినంతగా ఆనాడు మరొకరి నవలలను ప్రజలు ఆదరించలేదు. చదువులను ఎగ్గొట్టి వారి నవలలు విస్తారంగా చదివిన ఆనాటి పసివాళ్ళల్లో ఈనాటి పెద్దలెందరో ఉన్నారు.
కొవ్వలికి మద్రాసు, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖలు మాన్యతా పత్రాలు (సర్టిఫికెట్స్ ఆఫ్ ఆనర్ ) ఇచ్చి గౌరవించింది.భారత ప్రభుత్వ విద్యాశాఖ కూడా వీరిని సముచితంగా గౌరవించింది.
“తెలుగు నవలా రచనా పధశోధకులు
తెలుగు ప్రజల పట్టనాభిలాష పోషకులు
వెయ్యి నవలలు వేవేగ వ్రాయసములు” ఐన
శ్రీ కొవ్వలి 1975 జూన్ 8న మహాప్రస్థానమొందారు.
– కొవ్వలి లక్ష్మీనరసింహారావు
-
Merupula Marakalu
0₹200.00ఈ నవల చదివినంత సేపు ఒక రసవత్తరమైన సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే ఉషారాణి పాత్ర మొదటి నుంచి చివరి వరకు ఈ నవలని ఏకబిగిని అద్భుతమైన టెంపోలో నడిపిస్తుంది. సంభాషణలు ఇప్పటికి ఆధునీకమే. ప్రతి దృశ్యాన్ని ఆధునిక కళాఖండంగా మలిచారు నాన్న గారు. నవల ముగింపు ఒక అనూహ్యం.
మానవుని స్వయం శక్తీ ఒక పక్క, ఆధ్యాత్మిక సంపద మరో పక్క పెనవేసుకుని ఈ నవలకి దీప్తిని, శోభని చేకూర్చాయి. నాన్నగారి సాహితి జైత్రయాత్రలో అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ఒక గొప్ప సజీవమైన నవల…. మెరుపుల మరకలు.
-
Misrani
0₹260.00ఇది సస్పెన్స్ నవల కాదు. క్రై0 నవల కాదు.
ఇది స్వతంత్రానికి పూర్వం జైపూర్ సంస్థానానికి చెందిన 84 ఏళ్ళ ఓ మహిళ కథ. కాబట్టి విభజనకి పూర్వం భారతీయ చరిత్ర ఇందులో చదవచు.
ఇంకా సినిమా అవుట్ డోర్ షూటింగ్ విశేషాలు , వివిధ భారతీయ వంటకాల గురించి, ఓ మహిళ జీవితంలోని అనేక మలుపు తిప్పిన సంఘటనల గురించి ఇందులో చదవచ్చు.
ఒకటి ఒంటరి అంకె , అందమైన జీవితం, మందాకినీ , జాబిలి మీద సంతకం నవలల్లా ఇది కూడా ఓ మహిళ జీవిత కథ.
మీ అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి అందిస్తున్న 108 వ నవల మిస్రాణి
-
-
Mohana Roopa
0₹100.00దక్షిణ ఎక్సప్రెస్ లయబద్దంగా శబ్దంచేస్తూ హైదరాబాద్ వెడుతుంది.
పేరుకు మాత్రమే ఎక్సప్రెస్ . వేగం మాత్రం మందంగా పెళ్ళికూతురు నడకలా ఉంది. ఇంద్రమోహన్ కళ్ళు విప్పి చుట్టూ కలయజూచాడు. త్రి టైర్ స్లీపర్ కోచిలో అందరు నిదురబోతున్నారు.
కొందరు ఖరీదయిన పరుపులు పరుచుకుంటే మరికొందరు దుప్పట్లు పరుచుకుని చేతిసంచో, తోలుపెట్టొ, చెయ్య తలక్రింద పెట్టుకుని నిదుర బోతున్నారు.
మూడో అంతస్తులో పడుకున్నాడు. ఇంద్రమోహన్ కి క్రింది సీటే దొరికింది. నాగపూర్ లో ఓ లావుపాటి స్త్రీ యెక్కింది. ఆమెను చుస్తే నీళ్ళగోలెం పై చెంబు బోర్లించినట్లు అనిపిస్తుంది.తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-మాదిరెడ్డి సులోచన.