-
-
-
Navala Prajalu – నవల ప్రజలు
0₹100.00మానవజాతి చరిత్రలో ఎన్నో కొత్తకళలు (ఉదాహరణకు సినిమా) పుట్టాయి. కానీ ఇంతవరకూ ఏ కళకూడా పూర్తిగా నశించిపోలేదు. తన చైతన్యాన్నీ వాస్తవిక ప్రపంచంపట్ల తన సంవేదననూ అభివృద్ధి చేసే ఏ అంశాన్ని కూడా మానవుడు జారవిడుచుకోడు. నవల కొత్తకళేకావచ్చు. కానీ దాని వేళ్ళు సూదూరగతంలో ఉన్నాయి. ప్రాచీనగ్రంథాలైన ”టిమాల్కియోస్ బాంక్వెట్,” ”డాఫ్నీ అండ్ ఓలీ” వద్దనో, మరింత వెనక్కువెళ్ళితే సుప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడు హెరొడోటస్ (క్రీ.పూ.5వ శతాబ్దం) వద్దనో నవల చరిత్ర ప్రారంభమౌతుంది. కానీ స్వతంత్ర ఆధునిక సాహిత్య ప్రక్రియగా నవల మన నాగరికతకు సంబంధించింది మాత్రమే. సొంత నిర్మాణ సూత్రాలను కలిగి, అందరిమెప్పునూ, ఆమోదాన్ని పొందిన సాహిత్య ప్రక్రియ అయిన నవల మన నాగరికతకు – మరీ ముఖ్యంగా ముద్రణా యంత్రయుగానికి చెందిన వస్తువే.
సాహిత్యంలో కొద్దిభాగం మాత్రమే వాస్తవికత. ఈ సూత్రం నాటకానికి కూడా వర్తిస్తుంది. అంతమాత్రంచేత కళగా నాటకానికున్న ప్రత్యేక గాంభీర్యాన్ని కాదంటున్నామని భావించకూడదు. నవల కేవలం కల్పనాత్మకమైన వచనం మాత్రమేకాదు. అది మానవ జీవితానికి సంబంధించిన వచనం. మానవుణ్ణి మొత్తంగా తన పరిధిలోకి తీసుకొని, అతణ్ణి సంపూర్ణంగా చిత్రించటానికి ప్రయత్నించిన మొట్టమొదటి కళారూపం నవల. మానవుడి రహస్య జీవితాన్ని దృశ్యమానం చేయగలిగిన శక్తి నవలకు ఉంది…..
-
-
Nelavanka
0₹120.00చంద్రునికి కళంకంలా క్రికెట్ చంద్రునికి క్రీడారంగంలో కీర్తి జీవిత రంగంలో అపకీర్తి. అలాంటి రౌడీ రవి చంద్రునికి మరో యువరాణి జతపడి డీ అంటే డీ అంది. తనపై హజంతో సాగించిన అమానుషానికి శిక్షపడే సమయంలో తాను మనసు మార్చుకుని మానవతియై ‘తప్పులు అందరు చేస్తారు, కొందరే మనుషుల్ని సంస్కారంతో’ తీర్చిదిద్దగలరని రుజువుచేసిన అమ్మాయి సాహస చరిత్ర నెలవంక.
ద్వేషించినా ప్రేమించినా ఫలించక అక్క బిడ్డ కోసం బావగార్ని పెళ్ళాడి అనుమానాలకు అవమానాలకు గురై అక్కబిడ్డను పోగొట్టుకుని కుందేలై మతి తప్పినా మానవతి కథే నెలవంక! ఆ శృతి తప్పిన వీణను ఏ దేవతలు సవరించారో, అమావాస్య చీకట్లను పారద్రోలి పున్నమి వెన్నెల సరాగాలను ఎలా పలకరించారో ‘నెలవంక’ చదివి ఓహో ఆహా అనండి. ఈ నెలవంక మీ నెలవంకే.. అమావాస్య చీకట్లు ఎవరివీ? మీవికావు! మరి ఎవరివి?
-
Nerajaanalu Magadheerulu
0₹80.00ఆ రోజు ఆదివారం.
అందరికి నిశ్చింత. హడావుడిగా నిదురలేవనక్కరలేదు. గడియారంతో పాటు తిరుగనక్కరలేదు. వస్తువుల కోసం, పుస్తకాల కోసం ఒకరి కాళ్ళు ఒకరు తొక్కనక్కరలేదు. మిగతా రోజులాగే దినచర్య జరిగిన తరుముతున్నట్టు అటు, యిటు పరిగెత్తనక్కరలేదు. తాపీగా నింపాదిగా పనులు చేసుకోవచ్చు.
సుశీలమ్మకు ఇరవై ఏండ్లుగా అయిదు గంటలక లేవటం అలవాటుయింది. ఆమె కాలనీకి వచ్చాక కొందరు పనిగట్టుకుని ఉదయము గడియారం చూడటము మానేశారు. సుశీలమ్మ వంటయింట్లో లైటు వెలిగిందంటే సమయము అయుదు గంటలన్నమాట. ఆమె కూడా ఆదివారం మరో అరగంట పడుకుందాము అనుకుంటుంది. కానీ అసంకల్పిత ప్రతీకారాచార్యలా ఆ సమయానికి లేచిపోతుంది. ఆ తరువాత గుర్తుకు వస్తుంది. అరే ఆ రోజు అరగంట సేపు పడకుందాo అనుకుంటుంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-మాదిరెడ్డి సులోచన.
-
-
Nija Bhakthuni Kulamedi?
0₹150.00“తన దేశం సౌభాగ్యవంతంగా ఉంటానికి, లాల్ బహద్దూర్ తన ప్రాణమైనా ఇస్తాడని నాకు నమ్మకముంది.”
అన్నది ఆ ధీరమాత.
వృద్ధుడు నిట్టూర్చి “కానీ ఈ రకమైన ఫీలింగ్స్ కోల్పోయిన తర్వాతా , నేనిక ఆదిమ వాసి వాణ్ణి ఎలాగవుతాను ?” అన్నాడు.
“నీకెంత కష్టమొచ్చింది అమ్మ. కళ్ళు కనిపించకుండా చెవులు వినిపించకుండా నువ్వెలా బ్రతుకుతావే హెలెన్ తల్లి” అంటూ విలవిలలాడిపోయింది ఆ అభాగ్యురాలు.
నీలో ఎరుక ఏర్పడగానే రెండో జన్మ నపేక్షించి , అందుకై వెతకనారాంబిస్తావు. నికి రెండో జన్మా ధ్యానమే ప్రసాదిస్తుంది.
-
Nireekshana
0₹70.00మాదిరెడ్డి సులోచన గారు దాదాపు 150 కథలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాశారు. వీటిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపజేసే అలవాటు చేసిన రచయితలలో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలూ, పెళ్ళిళ్ళకంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కథా రచయిత్రి అవార్డులు పొందారు.
ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే ఉంటాయి. అందరు తప్పక ఈ నవలలు చదవాల్సిందిగా కోరుచున్నాము.
-
Nithya Prerana
0₹200.00మనందరికీ నిత్య ప్రేరణ అవసరం. మనం చేసే పనిలో, జీవితంలో తెలివిగా ఉండడానికి. మనం ఎంతో ఇష్టంగా కన్నకలలను సాకారం చేసుకోవడానికి, మనమెలా ఉండాలని అనుకున్నామో అలా ఉండడానికి జీవితంలోని కష్టకాలాన్ని అధిగమించడానికి, మంచి క్షణాలను ఆస్వాదించడానికి.
ఫెరారీని అమ్మిన యోగి నుంచి తీసుకున్న నిత్య ప్రేరణలో ప్రముఖ రచయిత రాబిన్ శర్మ అంతర్జాతీయంగా అత్యధిక స్థాయిలో అమ్ముడైన ద మాంక్ హు సొల్ద్ హిజ్ ఫెరారీ నుంచి, ఆ క్రమంలో రాసిన మరికొన్ని పుస్తకాల నుంచి శక్తివంతమైన ఆలోచనలను ప్రతిరోజును విశిష్టంగా గడపగలిగేలా మీ కోసం సరళంగా కేలండర్ రూపంలో ఇచ్చారు.
వాస్తవమైన విజయం, ప్రతికూలతను అధిగామించడం. ఆశాభంగం, విశిష్టమైన బంధుత్వాలను ఏర్పరచుకొనడం, ప్రభావం, వారసత్వం వంటి ముఖ్యమైన విషయాలు దీనిలో ఉన్నాయి. మీరు విశిష్ట వ్యక్తులుగా మారే ప్రయాణంలో ఈ పుస్తకం మీకు జీవితకాలం తోడుగా ఉంటుంది. గమ్యం చేరాక మీరు గడిపిన జీవితాన్ని చూసి గర్వపడే విధంగా ఇది మిమ్మల్ని తయారుచేస్తుంది.
-
Oh My God
0₹200.00దైవ భక్తి, ధ్యానం, దాన్ని నేర్పే గురువులు, వారి ధ్యాన పద్ధతులు, ఆ సంస్థల వివరాలతో పాటు నిత్య జీవితంలో చేయగలిగే కొన్ని సాధనల గురించి మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఆధ్యాత్మిక వ్యాస సంకలనమే ‘ఓ మై గాడ్.
ఈ పుస్తకం ఆధ్యాత్మిక సాధకులకే కాక దాని మీద అభిరుచి గల పాఠకులకి కూడా ఉపయోగిస్తుంది. సాధనలో కలిగే అనేక సందేహాలని నివృత్తి చేస్తుంది.
-