-
Vivahallo Vichitra Hatyalu
0₹300.00వివాహాల్లో విచిత్ర హత్యలు
రాత్రి పదీ ముప్ఫై రెండు అయింది. కమలా కళ్యాణ మండపం వందలాది అతిథులతో క్రిక్కిరిసి వుంది. ముందువరసలో వున్న సోఫాలో నేనూ పార్వతీ కూర్చున్నాం. ఎలక్ట్రిట్ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. పురోహితుడు మంగళసూత్రాన్ని నా దగ్గరకు తీసుకొచ్చాడు. నేనూ పార్వతీ ముట్టుకుని రాజేశ్వరి దాంపత్య జీవితం నాలుగు కాలాలపాటు సుఖంగా సాగాలని దీవించాం. రాజేశ్వరి బి.ఎస్.సి. పాసయింది. నా మిత్రుడు కమలాకర్రావు కూతురు, పురోహితుడు మంగళసూత్రాన్ని తతిమ్మా పెద్దల వద్దకు తీసుకు వెళ్ళాడు.
నిముషాలు గడుస్తున్నాయి. పెద్దల అరుపులు, పిల్లల కేకలు, బయట రోడ్డుమీద కారు హారన్లు వినిపిస్తున్నాయి. వుడ్బైన్ సిగరెట్ వెలిగించాను. పురోహితుడు మా ముందున్న పెళ్ళి పీటవద్దకు వెళ్ళాడు. మంగళసూత్రాన్ని పెళ్ళికొడుక్కి అందించాడు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. పెళ్ళికొడుకు లేచాడు. కాస్సేపట్లో బాజా భజంత్రీలు రణగొణధ్వనులు చెయ్యసాగాయి. పెళ్ళికొడుకు మంగళసూత్రాన్ని కట్టడానికి ముందుకి వంగాడు. ఢాం అని పిస్టల్ పేలింది!
మరుక్షణంలో ఎందరో పరుగెడుతూన్న బూట్ల చప్పుడు వినిపించాయి. సోఫాలోంచి లేచాను. నలువైపులా చూశాను. చటుక్కున లైట్లు ఆరిపోయాయి. కమలా కళ్యాణమండపాన్ని చీకటి తెరలు కప్పేశాయి.
ఏవో అరుపులు, ఏడ్పులు, పరుగెడుతూన్న బూట్ల చప్పుళ్ళు, పార్వతిని దగ్గరగా లాక్కున్నాను. జేబులోంచి టార్చితీశాను. టార్చికాంతిలో పెళ్ళి పీటవైపు చూశాను. అక్కడ అనేకమంది గుంపులుగా నిలబడ్డారు. గబగబా అటు నడిచాను. బలంగా అతిథులను తోసుకుంటూ లోపలకు జరిగాను.
టారి కాంతిలో పెళ్ళిపీట మీద వెల్లకిలా వెనక్కి పడిపోయిన రాజేశ్వరి కనిపించింది. గొంతు ప్రాంతంలో రక్తం విశేషంగా చిమ్ముతోంది. ముందుకు వంగి ఆమె నాడిని పరిశీలించాను. రాజేశ్వరి చనిపోయిందని వెంటనే గ్రహించాను. లేచి నిలబడ్డాను. చుట్టూ చీకటి. ఆ అంధకారంలో నా కంఠం గంభీరంగా మ్రోగింది. “ఎవ్వరూ కదలకండి! మండపం గేట్లు మూసివేయండి!”…………………..
-
VYAKTITVA DEEPAM
0₹150.00వ్యక్తిత్వ దీప వికాసం
భారతీయ జీవన విధానంలో ఏ ఆచారం పాటించినా, ఏ సంప్రదాయం అనుసరించినా, ఏ పండుగ జరుపుకొన్నా అందులో భౌతిక ప్రయోజనం, మానసిక అనుభూతి, ఆధ్యాత్మిక తత్త్వం అనే మూడు కోణాలుంటాయి. “దీపావళి లో ఈ మూడు కోణాలు మరింత స్పష్టంగా వెలుగులీనుతూ ఉంటాయి.
వర్ష ఋతువుకి, శరదృతువుకి ఇది సంధికాలం. నేల తడిసిపోవడం కారణంగా, ఎండ తీక్షంగా ఉండకపోవడం మరో కారణంగా ఈ కాలంలో సూక్ష్మక్రిములు విపరీతంగా పెరుగుతాయి. ఈ దీపాల కాంతికి, వేడికి, చిటపటలకి వాటి వృద్ధి బాగా తగ్గిపోతుంది. అది ప్రజల ఆరోగ్యానికి మంచిది. ఇది భౌతిక కోణం. ఇంటింటా దీపతోరణాలు కళ్ళకు కాంతిని. మనస్సుకి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆ దీప కాంతుల్లో మనకి మనమే కొతగా, తేజోమూర్తులుగా కనపడతాం. ఇది మానసిక కోణం. బయటి చీకటిని బయటి దీపం పోగొడుతోంది. అంటే మనస్సులో ఉండే చీకటిని మనస్సులో వెలిగించే దీపం పోగొడుతుందన్నమాటే గదా! అదే జ్ఞానదీపం. | జనం అంటే అద్వైతం. అభేదభావం. అంతా ఒక్కటే అని భావించగలగదం. ఆ భావం వల్ల రాగద్వేషాలు మన మనస్సుని కలుషితం చెయ్యవు. అప్పుడు | మనం చేసే అన్ని ఆలోచనలు, మనం తీసుకొనే అన్ని నిర్ణయాలు ధర్మానికి,
డా॥ గరికిపాటి నరసింహారావు
-
Vyasa Ramaniyam By Sri Ramana
0₹120.00సమకాలీన సాహిత్యం, కథలు, వార్తాపత్రికలు, కాలమ్స్ చదివే అలవాటు బొత్తిగా లేని నాకు 2010 వరకూ శ్రీరమణగారు తెలియకపోవటం వింతేమీ కాదు. 2010లో బొంబాయిలో మిత్రుడి ఇంట్లో మూణెల్లు ఉన్నా. మా అమ్మానాన్నల అన్యోన్యత మాటల్లో వచ్చినప్పుడు, మా మిత్రుడి తల్లి అంటూండేది, “కౌటిల్యవాళ్ళ అమ్మానాన్నా మిథునం జంటరా” అని. దానికి నా క్వశ్చన్మార్కు ఫేసు చూసి మావాడు, “శ్రీరమణ అని ఒక కథారచయిత ఉన్నారే, ఆయన రాసిన కథ ‘మిథునం.’ చదువు, బావుంటుంది” అన్నాడు. తెలుగుపీపుల్. కామ్ అప్పట్లో పబ్లిష్ అయ్యి ఉన్న కథని ప్రింటు తీసి ఇచ్చాడు. గంటలో గబగబా చదివా. మళ్ళా నింపాదిగా ఇంకో నాలుగు సార్లు చదివాను. నచ్చింది. అలా రచయిత కళ్ళల్లోంచి చెప్పుకొచ్చే కథనం నాకు బాగా ఇష్టం. పాఠకుణ్ణి తనతోపాటు నడిపించుకెళ్ళగలిగే ప్రతిభ చాలా కొద్దిమందికి ఉంటుంది.
-
Warrior Shadow
0₹120.00చారెడేసి కన్నులు, చేమంతి బంతులు
ముంగురుల ముద్దుమోము – మనస్సు నిలువనీయదే
బావికాడ కడవతో వయ్యారపు నీ నడక
గుండెపట్టి గిల్లిందే-ఒళ్ళు తిమ్మిరెక్కిందే
నా వంక చూడవా నడుమొంపు చిన్నదాన
ఒక్క నవ్వు నవ్వవా రంగపూరు నెరజాణఇవ్వాళో రేపో విరిగిపోయేటట్లున్న చెక్కబల్లమీద ఎడమచేత్తో దరువు వేస్తూ పెద్ద గొంతుతో పాడటం మొదలు పెట్టాడు గంగారాం.
మాట్లాడేటప్పుడు మహా కరుకుగా ధ్వనిస్తుంది అతని కంఠం.
పాటలు మొదలు పెట్టిన మరుక్షణం మార్దవంగా మారిపోతుంది.
తలలు వంచుకుని తమదారిన తాము వెళ్ళిపోవాలనుకునే వారుకూడా ఆగిపోవాల్సిందే. పాట పూర్తి అయ్యేవరకూ ఆగి విని తీరాల్సిందే.
-
Yedi Gamyam Yedi Maargam – ఏది గమ్యం? ఏది మార్గం?
0₹50.00మేరీని పెళ్ళి చేసుకుంటానని విశ్వనాథం తల్లిదండ్రులకు చెప్పేసరికి వాళ్ళెంత దెబ్బలాడారో – యీ నిశ్చయం విన్నాక అంతకు పదిరెట్టు పేచీపెట్టారు మేరీ తరపు వాళ్ళు. విశ్వనాథం – మేరీ యీద్దరూ థర్డ్ యమ్.జి.లో వుండగా – తమ స్నేహం మామూలు స్నేహం కాదని, ఇది ప్రేమ భావమనీ గ్రహించుకున్నారు. అయితే వీరి కుటుంబాలు రెండూ ఉత్తర దక్షిణ ధ్రువాలు. అవి కలవడమన్నది కలలోని వార్త అని తెలుసుకుని రెండు వైపులవారినీ ఎదరించి పెళ్ళి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
విశ్వనాథం ఆంధ్ర శ్రోతియ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. తెల్లగా, బక్కపలచగా, ఆకర్షణీయంగా ఉంటాడు. నలుగురు అన్నదమ్ముల్లో రెండో వాడు. పెళ్ళిగావలసిన యిద్దరు చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ వున్నారు. బస్తీగాక, పల్లెటూరూ గాక మధ్యస్తమైన ఊరు వాళ్ళది. అది ఒక జమీందారిలోది. ఆ ఊళ్ళో నాలుగైదు భవంతులు జమీందారులవి వున్నాయి. కోట గుమ్మాలూ, విశాలమైన లోగిళ్ళూను. జమీందారీపై ఆధారపడ్డ కుటుంబాలూ, ఆ ఎస్టేట్లలో పనిచేస్తున్నవారి కుటుంబాలూ ఎక్కువ. ఆ ఊళ్ళో, విశ్వనాథం పూర్వీకులంతా ప్రభువు ప్రాపకంలో గడిపారు. తేనె తుట్టెలాగా తల్లివైపు – తండ్రివైపు బంధులవి పది పదిహేను కుటుంబాలున్నాయి స్వంత వూళ్ళోనే. అతని బంధువులందరిలోకి – వీళ్ళే కొంచెం సంపన్నులూ, చదువుకొన్నవారూను. విశ్వనాథం అన్నగారు రామ్మూర్తి హైస్కూల్లో హిస్టరీ టీచరు. ఆయనకి ఇద్దరు పిల్లలు. పెద్ద చదువులు చదివిన విశ్వనాథం – తమ వంశానికి గౌరవం, ఇంటికి ధనం తెస్తాడని ఆశపడ్డ తండ్రి కలలు కల్లలయాయి…… -
Yoga Bala Shiksha
0₹450.00యోగ బాలశిక్ష
గీతా సారాంశము
అయ్యిందేదో మంచికే అయింది. అవుతున్నదేదో అదీ మంచికే అవుతుంది. -అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతోంది.
నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావ్? నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావ్?
నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది. నీవు ఏదైతే పొందావో అవి ఇక్కడనుండే పొందావు. -ఏదైతే ఇచ్చావో ఇక్కడ నుంచే ఇచ్చావు. -ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా,నిన్న ఇంకొకరి సొంతం దాచిపెట్టిన ధనం భూమి పాలు – అందమైన ఈ దేహం అగ్నిపాలు – అస్తికలన్నీ గంగపాలు ఈ జీవం యముని పాలు – కొడుకు వండిన కూడు కాకిపాలు మన వస్తువులన్నీ ఎవరి పాలో తాను చేసిన దానం, ధర్మం, పుణ్యం మాత్రం తన పాలు |
తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అందరినీ మరిచినా నీ తల్లిదండ్రులను మరువ వద్దు. వాళ్ళను మించి మంచి కోరే వారూ ఉండరని తెలుసుకో… నువ్వు పుట్టాలని ఎన్నో పూజలు, త్యాగాలు చేశారు వారు, రాయివై వారి హృదయాలను ముక్కలు చేయవద్దు. కొసరి కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారు వారు, నీకు అమృతమిచ్చిన వారి పైన నువ్వు విషాన్ని విరచిమ్మవద్దు.. ముద్దు మురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు, ఆ ప్రేమమూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు. నువ్వెన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానమౌతాయా? సేవాభావం లేకపోతే అంతా వ్యర్థమే, గర్వం పనికిరాదు. సంతానం వల్ల సుఖం కోరుతావు. నీ సంతాన ధర్మం మరువ వద్దు. ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువవద్దు. నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను పొడిపొత్తుల్లో పడుకోబెట్టారు.
అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళలో అశ్రువులను నింపకు. .నీవు నడిచే దారిన పూలు వేసారు వారు, ముల్లువై వారిని బాధించకు.
డబ్బుపోతే మళ్ళీ సంపాదించవచ్చు, తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించలేవు. తల్లి యొక్క గౌరవం భూమి కంటే మహత్తరమైనది, తండ్రి ఆకాశం కంటే గొప్పవాడు, వారి గొప్పతనం జీవితాంతం మరువవద్దు. తల్లిదండ్రులను, శాస్త్రములను, గురువులను, పెద్దలను, స్నేహితులను గౌరవించేవాడు అందరికి ఆదర్శవంతుడు కాగలడు.
-
Youth and Truth: Unplug with Sadhguru
0₹157.00What happens when millennials meet a mystic? An avalanche of queries and an unflinching stream of answers. In this compilation of five talks from Youth and Truth events, Sadhguru fields questions that are quirky, personal, profound and shockingly bold from university students.
In a camaraderie bridging age, they adventure through a mind-boggling spectrum of subjects like romance and sexuality, loneliness and jealousy, parenting and education, career and business, politics and spirituality, artificial intelligence, racism, drugs, food, Yogic sciences, and god-making. Equally wide-ranging is the mood of the talks – from playfulness and hilarity to moments of gobsmacked speechlessness, dawning clarity and paradigm shifts, all infused with the fizzing energy of youth.
Here is a book not just for youth, but for the youthful in search of truth.
-
Yudha Kala
0₹150.00యుద్ధ కళ అనేది రాజ్యానికి చాలా కీలకమైన విషయం. ఇది చావు, బతుకుల సమస్య . ఇది సురక్షిత మార్గం వైపు లేదా పూర్తిగా వినాశనంవైపు తీసుకెళ్లే మార్గం. ఇది విచారణకు సంబంధించిన విషయం కావడంతో , దీన్ని పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు.”
తూర్పు ఆసియా దేశాల సంస్కృతి, చరిత్రల్లో ప్రత్యేక స్థానం కలిగిన అద్భుత దృశ్యకావ్యం… యుద్ధకళ . ఈ పుస్తకం రాణానితి , సైనిక వ్యూహాలలోని రాజకీయాలు, సిద్ధాంతాలకు సంబంధించిన ప్రాచీన చైనా పాఠం. ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్దుడైన యోధుడు. తత్వవేత్త అయిన సన్ ట్జు క్రుస్తుపూర్వం 6 వ శతాబ్దంలో రాశారు. -
Yuri Alekseyevich Gagarin – యూరీ అలెక్స్‌యేవిచ్ గగారిన్
0₹30.00అంతరిక్షం నుండి భూగోళాన్ని చూసిన మొదటి మానవుడు యూరీ అలెక్స్‌యేవిచ్ గగారిన్.
ఆకాశం అద్భుతాలకు నిలయం. పగలు సూర్యుడు ఉంటాడు. రాత్రి నక్షత్రాలు వస్తాయి. పెరుగుతూ, తరుగుతూ చంద్రుడు వస్తాడు. అప్పుడప్పుడూ తోకచుక్కలు కనిపిస్తాయి. ఇవి అన్నీ ప్రాచీన మానవులకు ఆశ్చర్యపరిచాయి. క్రమక్రమంగా విజ్ఞానం వికాసం చెందుతూ ఆకాశంలోని వింతల గురించి అవగాహన కలిగించింది. ఆకాశంలో పక్షలు ఎరుగుతూ ఉంటాయి. వాటిలాగా ఎగిరి పోవాలని ప్రయత్నాలు చేశారు. మొదట వేడి గాలి గుమ్మటాలు ఆకాశంలో ప్రయాణించడానికి దారి చూపించాయి. తరువాత విమానాలు వచ్చాయి. భూమి నుండి 7 మైళ్ళ ఎత్తు వరకే ఇవి ప్రయాణం చేయగలుగుతున్నాయి. ఆకాశంలో గాలిలేనిచోటు ఉన్నది. అక్కడ ప్రయాణించడానికి ప్రత్యేకమైన సాధనాలు కావాలి. దానికోసం రాకెట్లు రూపుదిద్దుకున్నాయి. ఇవి గాలిలేని ప్రదేశాలలో కూడా ప్రయాణించగలుగుతాయి. వీటితో ఆకాశం చాలావరకు అందుబాటులోకి వచ్చింది. భూమి నుండి చాలాఎత్తు పోయిన తరువాత అంతరిక్షం ఉన్నది. దీనినే రోదసి అనికూడా అంటారు. అంతరిక్షాన్ని అందుకోవాలని, దానిలో ప్రయాణం చేయాలనీ ఆకాంక్ష పెరిగింది. దానికోసం కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్షనౌకలు అవతరించాయి. ఇక అంతరిక్షంలోకి మానవులను పంపే కార్యక్రమం మొదలయ్యింది. వోస్టాక్ అనే అంతరిక్ష నౌకలో రాకెట్టు సహాయంతో, అంతరిక్షంలో ప్రయాణించగల సాహసి కోసం అన్వేషణ మొదలయ్యింది. యూరీ అలెక్సేయెవిచ్ గగారిన్ ఎన్నికయ్యాడు. గగారిన్ రష్యాకు చెందిన వాడు. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి మానవుడు. అతడి ప్రయాణం మానవ విజయానికి చిహ్నం. ఆ వీరుడి గురించి, అతడి సాహసయాత్ర గురించీ ఈ పుస్తకంలో వివరిచబడింది. -
Zero to One: Notes on Start Ups, or How to Build the Future
0₹490.00What Valuable Company is Nobody Building? The next Bill Gates will not build an operating system. The next Larry Page or Sergey Brin won’t make a search engine. If you are copying these guys, you aren’t learning from them. It’s easier to copy a model than to make something new: doing what we already know how to do takes the world from 1 to n, adding more of something familiar. Every new creation goes from 0 to 1. This book is about how to get there.
-
కరుణశ్రీ సాహిత్యం 1
0₹225.00ఉదయశ్రీ కావ్యస్పందనతో మందాకిని పొంగింది. నందనం నవ్వింది. బృందావనం వెలిసింది. మందారం విరిసింది. మకరందం కురిసింది. ఆమకరందం తెలుగుజాతిని పోతన వేమనల తర్వాత మరింత ప్రభావితం చేసింది. కరుణశ్రీ మాటలతో బొమ్మల్ని గీశారు. అక్షరాలతో మానవతాశిల్పాన్ని చెక్కారు. ఏయిజానికి చెందని హ్యూమనిజం మాత్రం తొణికిసలాడే ప్రజాకవి కరుణశ్రీ.