• Aathade Ame Sinyam

    Aathade Ame Sinyam

    0

    ‘మీరంతా అలా ఎందుకున్నారు ? నా గురించి ఎవరూ రాలేదేమిటి ?” చుట్టూ చూస్తూ అడిగాడు.

    ” మీ గురించి ఎవరొస్తారని మీరనుకుంటున్నారు ?”

    ”ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్‌లు, నన్ను మీరెవరూ గుర్తు పట్టలేదా ? నేనూ చైతన్యని.”

    ”అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో టాప్‌ స్టార్స్‌లో ఒకరైన చైతన్య మీరని మీ ఉద్దేశ్యమా ?”

    ”ఉద్దేశ్యమేమిటి ? నాన్సెన్స్‌-నేనే చైతన్యని.”

    ఒక నర్స్‌ నవ్వాపుకోలేక మొహం పక్కకి తిప్పుకుంది. కానీ అనుభవజ్ఞుడైన డాక్టర్‌ ముఖంలో విషాదం తొంగిచూసింది. సానునయంగా అన్నాడు. ”చూడు బాబూ! నీ పేరు సుబ్బారావు. బయట నీ భార్యా కూతురూ ఉన్నారు. నీ బ్రెయిన్‌ సెల్స్‌ పూర్తిగా చచ్చిపోక ముందే ఆక్టివేట్‌ చేయడానికి ప్రయత్నించు….”

    అతడొక సినిమా హీరో. సినిమా షూటింగ్‌ జరుగుతూ వుండగా ఏక్సిడెంటయి స్పృహ తప్పింది. స్పృహ వచ్చేసరికి అతడు ఆసుపత్రిలో ఉన్నాడు. డాక్టర్లు, నర్సులు అందరూ అతడిని సెక్రటేరియట్‌ గుమాస్తాగా గుర్తించారు. తాను సినిమా హీరోనని నిరూపించుకోవటానికి అతడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి కన్న తల్లి కూడా అతడిని కొడుకుగా గుర్తించటానికి నిరాకరించింది. కారణం ?…..

    అడుగడుగునా సస్పెన్స్‌తో ఆద్యంతమూ ఉత్కంఠతో నిండి ఉక్కిరిబిక్కిరి చేసే సస్పెన్స్‌ థ్రిల్లర్‌. అతడే ఆమె సైన్యం.

    100.00
    Add to cart
  • Abhilasha - అభిలాష

    Abhilasha – అభిలాష

    0

    ‘మనిషి మనసంత కుత్సితమైనదీ, అనూహ్యమైనదీ. మరొకటి లేదని నా ఉద్దేశ్యం. పాతిక సంవత్సరాలు క్రిమినల్‌ లాయరుగా పనిచేసి నేను కనుక్కున్న దేమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ క్రిమినలే. కొందరు చట్టపరిధిలోకి వస్తారు, కొందరు రారు. నేను రెండో రకానికి చెందినవాణ్ని అని నాకు తెలుసు. అయినా మనసుని అదుపులో పెట్టుకోలేక పోయేవాణ్ణి. పొద్దున్నే దేవుడి పూజ చేసి బెడ్‌రూమ్‌లోకి వచ్చి పధ్నాలుగేళ్ళ అమ్మాయిని నిద్రలేపటం చిత్రమైన సంతృప్తినిచ్చేది – లేపేముందు మోకాళ్ళమీద గౌనుసర్దటం, ఇంకో రెండు మూడేళ్ళు పోయాక తొలగిన పైట సర్దకుండా లేపటానికి ప్రయత్నించటం అలవాటయింది. నేను కొద్ది కొద్దిగా ఫెటసిస్ట్‌గా మారసాగేను. ఒకరోజు బాత్‌రూమ్‌లో నాకంటిని పుల్లతో పొడిచావుకూడా”.

    వింటున్న అర్చన శిలే అయింది. ఇంత నిజాన్ని ఆస్వాదించే శక్తి ఆమెకు లేకపోయింది. ప్రొద్దున్నే పూజగదినుంచి సరాసరి తన గదికి వచ్చి ‘లే అమ్మా లే, ఎనిమిదవుతుంది’ అనితట్టి లేపే మావయ్య తన స్వంతమావయ్య మనసులోనూ, చర్యవెనుక ఇంత ఘాతుకమైన ఆలోచన వుందా ?

    ఆమె సిగ్గుతో కుదించుకుపోయింది. ఆయన తనగదిలో ఉన్నప్పుడు స్వంతతండ్రే ఉన్నట్టు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించేది! అనుక్షణమూ తన కదలికల్నీ ఒంపుల్నీ పరిశీలిస్తూ ఉండేవాడన్నమాట. ఇంత కాలం బైరాగే ఫెటసిస్ట్‌ అనుకుంటూ వచ్చింది. తెలివి తక్కువవాడు కాబట్టి వాడు బైటపడేవాడు. అయినా ఇంత చిన్న విషయం కనుక్కోలేకపోయిందంటే ఏమైనవి తన తెలివితేటలన్నీ ?

    సరికొత్త టెక్నిక్‌తో తెలుగు నవలను కొత్తదారికి మళ్ళించి పాఠకలోకాన్ని సస్పెన్సుతో పరవళ్ళు తొక్కించిన యండమూరి వీరేంద్రనాథ్‌ నవల ‘అభిలాష’ ఉరిశిక్షకు దగ్గరవుతున్న కొద్దీ, చిక్కనవుతున్న సస్పెన్స్‌ ఉరిత్రాడులా చిరంజీవి మెడకు చుట్టుకోకముందే – ఆంధ్రజ్యోతి వారపత్రిక పాఠకుల తాపత్రయాన్ని ఆకాశమంత ఎత్తుకు, నక్షత్ర సీమలపైకి, గెలాక్సీలను దాటించి, సంభ్రమాశ్చార్యానందాలలో పడగొట్టి పరవశింపచేసిన ఫెంటాస్టిక్‌ నవల ‘అభిలాష’.

    90.00
    Add to cart
  • Agni Pravesam - అగ్ని ప్రవేశం

    Agni Pravesam – అగ్ని ప్రవేశం

    0

    ప్రేమలో పడటాన్నీ, ప్రేమించటాన్నీ, ప్రేమించబడటాన్నీ ఒకటేలా భావిస్తారు చాలామంది. ఇద్దరు వ్యక్తులు కలుసుకుని, ఒకర్నొకరు అద్భుతమైన వ్యక్తులుగా గుర్తించుకోవటంతో మొదలైన ఈ ప్రేమ, తన అద్భుతాన్ని కోల్పోకుండా వుండాలంటే యిద్దరికి బేసిక్‌గా కొన్ని అర్హతలు వుండాలి.

    ప్రేమించటానికి ముఖ్యమైన అర్హత వ్యక్తిత్వం. ప్రేమించటానికి ముఖ్యమైన అనర్హత ఆధారపడటము.

    ఒక పసివాడు ఎదుగుతుంటే, అతడి వ్యక్తిత్వాన్ని నిర్దేశించేవి అతడి తల్లిదండ్రుల తెలివితేటలు, వారసత్వం, జీన్స్‌, డబ్బు-ఇవేవి కావు. అతడి చుట్టూ వున్న పరిసరాలు. అందులో అన్నిటికన్నా దగ్గరయిన, అతి ముఖ్యమయిన పరిసరం తల్లి.

    తల్లికడుపులోంచి బయటి కొచ్చి మొట్టమొదటిసారి స్వతంత్రంగా ఊపిరి పీల్చుకునే శిశువులాగానే, తల్లిదండ్రుల ప్రభావం నుంచి బయటికొచ్చి స్వతంత్రంగా, జీవిత సవాళ్ళను ఎదుర్కోవటం ప్రారంభించిన మనిషి, ఆ పరీక్షలో ఓడిపోతే మాడి మసైపోతాడు. గెలిస్తే పునీతుడవుతాడు, స్త్రీకయినా పురుషుడికయినా ఈ పరీక్ష జీవితంలో ఏదో ఒక స్టేజిలో తప్పదు. ఇదే అగ్ని ప్రవేశం.

    భిన్నమైన కథతో, విభిన్నమైన పాత్రలతో, స్త్రీ సమస్య గురించి ఇంతకు ముందు ఏ రచయిత్రీ వ్రాయనంత సూటిగా తనదైన శైలిలో, సస్పెన్సు, టెన్షన్‌ మేళవించి యండమూరి వీరేంద్రనాథ్‌ వ్రాసిన ప్రయోజనాత్మక నవల ‘అగ్నిప్రవేశం’.

    90.00
    Add to cart
  • Aharam Manchi- Chedu

    Aharam Manchi- Chedu

    0

       నిత్య జీవితావసరాల కోసం రోజూ ఎంతో శ్రమిస్తూ మనం సంపాదించుకున్న విలువైన డబ్బును వెచ్చించి పౌష్టికాహారం  పేరుతో విషాన్ని తినాల్సి/ తాగాల్సి రావడం ఈ శతాబ్దపు గొప్ప విషాదం. ఏ ఆహారం తింటే ఆరోగ్యం చేకూరుతుందో మనకు చెప్పాల్సిన బాధ్యతలున్న ప్రభుత్వ, ప్రజారోగ్య, వైద్య పత్రికా వ్యవస్థలన్నీ కేవలం తమ స్వార్ధం  కోసం ఆహార రంగంలోని బహుళ జాతి కంపెనీల ప్రలోభాలకు లొంగి తినకూడనిది తినమని ప్రచారం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి కీడు చేస్తున్నాయి. వీరందరూ కలిసి శాస్త్రీయత మాటున అశాస్త్రీయతను ప్రచారం చేస్తున్న ఫలితంగా సామాన్యులు రోగగ్రస్తం అవుతున్నారు. లాభార్జనే ధ్యేయంగా  నడుస్తున్న వైద్య , ఆరోగ్య శాఖలూ/వ్యక్తులూ/ప్రజల రోగాలను, మరణాలను కూడా సొమ్ము చేసుకునే ఒక క్రూరమైన వ్వవస్థను ఆవిష్కరించారు.

    100.00
    Add to cart
  • Anamakudu - అనామకుడు

    Anamakudu – అనామకుడు

    0

    ధనస్వామ్య దుర్గమైన అమెరికాలో 1876లో ఓ కటిక నిరుపేద కుటుంబంలో పుట్టాడు జాక్‌లండన్‌.  అతని జీవితం ఒక అనుభవాల గని.  అదే అతణ్ణి రచయితగా చేసింది. రచయిత కావాలనేది అతని జీవితాశయం.
    జీవితం మధించి అజరామర కావ్యాలు, కథలు, నవలలు సృజించిన శిల్ప సామ్రాట్టుల్ని ఆపోశన పట్టాడు.  మానవ పురోగమన మార్గాలు తెరచిన మార్క్స్‌ ప్రభృత ప్రవక్తల రచనలు జీర్ణించుకున్నాడు.  వికసించిన శాస్త్రీయ దృష్టితో, తన బాల్య కౌమారాలలో చెరగని పదచిహ్నాలకి అద్భుతంగా అక్షరరూపం ఇచ్చాడు.  ‘జీవితం, మేధస్సు కలబోసి ప్రపంచాన్ని కుదిపివేసిన యాభై సంపుటాలు రాసి’ నలభయ్యో యేట జీవితం నుంచి నిష్క్రమించాడు.
    తెలుగు పాఠలోకానికి చిరపరిచితమైంది జాక్‌ లండన్‌ ‘ఉక్కుపాదం’ నవల, పెట్టుబడిదారీ వ్యవస్థ మీద ఎగరేసిన తిరుగుబాటు జండాగా ప్రజల మనోవీధుల్లో కలకాలం రెపరెపలాడుతూనే ఉంటుంది.
    లక్షల మెదళ్ళను కదలించిన జాక్‌లండన్‌ కలం నుంచీ వెలువడ్డది ‘మెక్సికన్‌’ అనే ఈ కథ.  ఆద్యంతం ఉత్కంఠతో చదివించే, విప్లవోద్రేకంతో కదిలించే ఈ కథ జాక్‌లండన్‌ రాసిన కథలన్నింట్లో గణగణమండే కాగడా లాంటిది.

    15.00
    Add to cart
  • Anando Brahma - ఆనందో బ్రహ్మ

    Anando Brahma – ఆనందో బ్రహ్మ

    0

     13 ముద్రణలు పొందిన యండమూరి వీరేంద్రనాథ్‌ నవల
    యండమూరి వీరేంద్రనాథ్‌
    కోనసీమ కొబ్బరాకు – గలగలా గోదావరి …. ఆ ఇసుక తిన్నెల మీద నుంచి గాలి తరంగాల్లోంచి వచ్చే వేద పఠనంలా ఒక కుర్రవాడు ఎగిరి పట్నం వచ్చిపడ్డాడు. ఉక్కిరి బిక్కిరి అయ్యేడు.
    ఓ ఇరవై నాలుగేళ్ల గృహిణి అతడికి లలితంగా సేద తీర్చింది.
    అది ప్రేమా ? ఆకర్షణా ? స్పందనా ? సెక్సా?
    ఆ బంధం నిర్వచనం ఏమిటి ? అమ్మాయిలయితే స్వీట్‌ సిక్స్‌టీన్‌ అంటారు. మరి అబ్బాయిలకి స్వీట్‌ ఎయిటీనా ?
    నవల 2054 ఎ.డిలో మొదలవుతుంది. మళ్ళీ అక్కడి నుండి వందేళ్ళు వెనక్కు మళ్ళుతుంది. అబార్షన్‌కు తండ్రిని డబ్బడిగే పెళ్ళికాని కూతురు దగ్గర్నుంచి, అనిర్వచనీయ ఆత్మీయబంధం పెనవేసుకున్న సోమయాజీ మందాకినిల వరకూ ఎన్నో విలక్షణ పాత్రలు తారసిల్లే అపురూపమైన నవల ‘ఆనందో బ్రహ్మ’. ఫ్యూచరాలజీకి పాస్టాలజీ మిక్సు చేసి అచ్చ తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్‌ అల్లిన లలిత పదాల సన్నజాజి పందిరి ‘ఆనందోబ్రహ్మ’.

    100.00
    Add to cart
  • Ankitam - అంకితం

    Ankitam – అంకితం

    0

    ఆందోళనని భూతద్దం లోంచి చూస్తే భయం అవుతుంది. అయితే ఆమె పరుగెడుతున్నది ఆందోళనతోనూ భయంతోనూ కాదు. భర్తతో కాపురం చేసిన ఏడాదికాలంలో భయమూ, ఆందోళనా లాంటి స్థాయా భావాల్ని ఆమె ఎప్పుడో దాటిపోయింది. ప్రస్తుతం ఉన్నవి కసీ, పట్టుదల. కాళ్ళలోనూ కనబడుతుంది. అయినా అతడినుంచి దూరంగా పరుగెత్తలేకపోతోంది. అతడు క్రమక్రమంగా దగ్గరవుతున్నాడు. అతన్నించి ఎలాగయినా రక్షించుకోవాలన్నదే ఆమె ప్రయత్నం. తనని కాదు, తన కొడుకుని. అంకిత్‌ ఎనిమిదేళ్ళ కుర్రాడు. ‘ఇలాంటి కొడుకు తమకుంటే బాగుండును’ అని ప్రతి తల్లీదండ్రీ అనుకునే లాంటి అందమైన చురుకైన కుర్రాడు. అటువంటి కుర్రాడికి ఒక సమస్య వచ్చింది. మొదట్లో అది చాలా చిన్న సమస్య అనుకున్నాడు అతడి తండ్రి.

    కానీ చూస్తుండగానే అది పర్వతంలా పెరిగిపోయింది. ఉప్పెనలా కబళించి వేయటానికి ముందుకు దూకింది. అతడినీ అతడి తండ్రినీ రక్షించగలిగేది ఆ పరిస్థితుల్లో ఒక్కరే.

    అంకిత్‌ తల్లికి తాళి కట్టిన భర్త!

    తండ్రంటే ఎలా వుండాలి ? కొడుకంటే ఎలా వుండాలి ? కుటుంబమంటే ఎలా వుండాలి ? దిగజారిపోతున్న బాంధవ్యాల బంధాన్ని సున్నితపు సెంటిమెంటు తీవెల్తో బంధించి. అనురాగశృతుల్ని మ్రోగించిన నవల ‘అంకితం’.

    సెంటిమెంటు,  ఆర్ధ్రత, సస్పెన్సుల మేళవింపుల సంచలన రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ సంతకం ‘అంకితం’.

    80.00
    Add to cart
  • Antarmukham - అంతర్ముఖం

    Antarmukham – అంతర్ముఖం

    0

    తులసిదళం నవల ద్వారా నవలా సాహిత్యంలో సంచలనం సృష్టించిన యండమూరి ఈ నవలలో మానవ సంబంధాలని అత్యద్భుతంగా విశ్లేషించారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల చిరస్థాయిగా ఉంటుంది. ప్రతి పుస్తకాభిమాని చదివి గుండె లోతులో దాచుకోవలసిన భావాలూ ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతి గ్రంధాలయంలోను ఉండాల్సిన పుస్తకం ఈ నవల.

    – ఇండియాటుడే

    ******

    యండమూరి రచనా జీవితంలో ఈ పుస్తకం అత్యుత్తమ మైనదని ఆయన ప్రకటించడం అతిశయోక్తి కాదు.

    – ఈనాడు

    ******

    ప్రతి పేజీ లోనూ గొప్ప వాక్యాలు ఉన్నాయి. ప్రతి వాక్యంలోనూ గొప్ప గొప్ప భావాలున్నాయి. ప్రతి పాఠకుడి గుండెని కదిలిస్తుంది. “నేను వయసులో ఉన్న వృద్ధ శవాన్ని జ్ఞానంతో శైశవాన్ని” లాంటి గొప్ప భావాలూ ఎన్నో…”

    – ఆంధ్రజ్యోతి

    100.00
    Add to cart
  • Ashtavakra - అష్టావక్ర

    Ashtavakra – అష్టావక్ర

    0

    అంగుళంలో మూడువందలో వంతు మాత్రమే వున్న అతడు – చిన్న తల, పెద్దతోక వేసుకుని, చేప ఎదురీదినట్టు ప్రవాహానికి కొన్ని వేలమైళ్ళు ఎదురీదుతూ, ఎదురొచ్చే ద్రవాలతో పోరాడి తన ఉనికిని నిలుపుకుంటూ ఆమెను చేరుకున్నాడు.

    జైగోట్‌!

    ఒక శుక్లకణ,ం ఒక బీజాన్ని వలయంలా చుట్టుముట్టి ఇరవైమూడుని ఇరవైమూడు జతలు చేసే సమయాన – అదే సమయాన – ఆగర్భంలో నిక్లిప్తం అవటం కోసం – సుషుప్తిలోంచి నెమ్మదిగా కనులు విప్పింది.

    కాష్మోరా!!!

    ఆ పిండానికే ప్రాణం వస్తే-తొమ్మిది నెలల తరువాత పుడతాడు – ప్రపంచాన్ని ఏలటానికి, బీభత్సం సృష్టించటానికి, కాష్మోరా అంశగల అష్టావక్ర.

    దట్టంగా పేరుకున్న ఎండుటాకుల క్రింద నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎవరో నిద్రలేచి బద్ధకంగా నిట్టూర్చిన వేళ! ఆనందనృత్య హేల!! చీకటి ప్రపంచపు గణాధిపతుల కాష్మోరా అంశతో ప్రపంచాన్ని ఏలటానికి వస్తున్నాడు ‘అష్టావక్ర’. అతడి ఆగమనానికి సూచనగా అప్పుడే ఏడుగురు వికృత శిశువులు ఆ గ్రామంలో జన్మించారు. దేశం దృష్టి యావత్తూ ఆగ్రామం మీద పడింది. ఎనిమిదోనాడు కేదారి గర్భాన ప్రవేశించాడు. అతడి పుట్టుకని ఎవరాపగలరు ?

    కొన్ని వేల సంవత్సరాల క్రితం శిశువు జన్మించగానే శరీరం అంతా ఉప్పుజల్లి బ్యాండేజీతో కట్టేసేవారట. ఇంత అనాగరికమైన పరిస్థితి నుంచి ఎదిగాడు మనిషి. మ్యుటేషన్స్‌ రహస్యాన్ని శోధించాడు. క్లోనింగ్‌ ప్రయోగాల్లో విజయం సాధించాడు. కానీ ఇదంతా వెళ్ళి ఎక్కడ కలుస్తుంది ?

    సామాన్యులు కలలో కూడా వూహించని చోటుకి రచయిత మిమ్మల్ని తీసుకువెళ్తాడు. మనిషి పుట్టుకలో వస్తున్న పరిణామాల భూత, భవిష్యత్‌ వర్తమానాల సైన్సు-సస్పెన్సుల మరోకలయిక శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ కలంలోంచి జారిన ‘అష్టావక్ర’ నవల.

    100.00
    Add to cart
  • Atadu Ame Priyudu - అతడు ఆమె ప్రియుడు

    Atadu Ame Priyudu – అతడు ఆమె ప్రియుడు

    0

    భార్యని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన హంతకుడు అతడు.
    …… ఉరిశిక్షకు ముందు రోజు జైల్లోంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడని పేపర్లో చదివిన సిరి దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఆ తరువాత ఆ హంతకుడు తన ఇంట్లోనే వున్నాడని తెలిసి కంగారు పడింది.

    ఇన్ని సంవత్సరాలుగా తనని అజ్ఞాతంగా ప్రేమిస్తున్నాడని, తనని చివరిసారి చూడాలని అతడు వచ్చాడనీ తెలిసి కలవరపడింది. అతడి ప్రేమను చూసి కదిలి పోయింది.

    కానీ ఆ రాత్రే అతడు తన భర్త మీద హత్యాప్రయత్నం చేసాడని తెలిసింది. ఎందుకు ?

    ఆమె ఆరా తీయడం ప్రారంభించింది. గని త్రవ్వకాల్లో శిధిలాలు బయటపడ్డట్టు ఒక్కొక్క నిజమే బయటపడసాగింది. భయంకరమైన నిజాలూ, మనుష్యుల జీవితాల వెనుక చీకటి రహస్యాలూ తెలిసాయి.

    ప్రమాదం ఆమెని వెంటాడ సాగింది.

    ఏమిటా ప్రమాదం ? దాని నుంచి ఆమె ఎలా బయటపడింది. తెలుసుకోవాలంటే యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన అతడు ఆమె ప్రియుడు’ నవల చదివి తీరాల్సిందే.

    80.00
    Add to cart
  • Bharya Gunavathi Satru

    Bharya Gunavathi Satru

    0

    ఏడో నెలలో 12 పౌండ్ల బేబీ – చాలా ఆరోగ్యంగా – మామూలు ప్రసవంలా పుట్టటం దాదాపు అ…. సం….భ…వం…. హఠాత్తుగా ఆగిపోయి, మరణ శిక్ష కోసం ఎదురు చూస్తున్న వాడిలా ఉండిపోయాడు బాలూ, రిజల్టు చెప్పటం మొదలు పెట్టింది డాక్టర్‌ మృదుల.

    ”మీ బ్లడ్‌ గ్రూప్‌ ‘ఏ’. మీ భార్య బ్లడ్‌ గ్రూప్‌ ‘ఓ’ ఆ విధంగా మీ పిల్లవాడి బ్లడ్‌ గ్రూప్‌ ‘ఏ’ అయితీరాలి. కానీ…..”

    ”కానీ…” ”కానీ.. మా వాడి బ్లడ్‌ గ్రూప్‌ ”బి”. ఆమె చెప్పటం పూర్తి చేసింది.

    అనెషిస్తీయా యివ్వకుండా ఆపరేషన్‌ చేసినంత బాధతో కూడిన షాక్‌ తగిలింది బాలూకి ఆ మాటలు వినగానే.

    బాబు తన కొడుకు కాదు!… తనకు ఇంతద్రోహం చేసిన సౌదామినికి ఎలాంటి శిక్ష విధించాలి. అతడు ఆవేశంతో వూగిపోతున్నాడు…….

    అవును ! తను సౌదామినిని చంపబోతున్నాడు ……”

    సౌదామినికి ఎవ్వరూ లేరు. ఆమె బ్రహ్మానంద ఆశ్రమంలో పెరిగింది. కోరి పెళ్లి చేసుకున్నాడు బాలు. అయితే అనుమానపు నీడలు పరచుకున్నాయి. వారిరువురి దాంపత్యంపై పెను చీకట్లు ముసురుకున్నాయి. తనను వంచించిందనే కక్షతో భార్యనే మట్టుబెట్టాలనుకున్నాడు. అప్పుడే జరిగింది ? సౌదామినిని బాలు చంపాడా ? బాలు అనుమానాలు నిజమేనా? గుణవతి అయిన భార్య శత్రువవుతుందా ? కేవలం యండమూరి వీరేంద్రనాథ్‌ మాత్రమే సృష్టించగల మాస్టర్‌ విలనీ. మ్యూజిక్‌, రొమాన్స్‌ల బ్యాక్‌ డ్రాప్‌లో ఎత్తులూ పై ఎత్తులతో సాగిపోయే థ్రిల్లర్‌ ‘భార్యా గుణవతి శత్రు’.

    90.00
    Add to cart
  • Cheekatlo Suryudu - చీకట్లో సూర్యుడు

    Cheekatlo Suryudu – చీకట్లో సూర్యుడు

    0

    నిఖిల్‌ ఒళ్లు జలదరించింది. కళ్లు చిట్లించి అటువైపు చూశాడు. యు.ఎఫ్‌.ఓ.! ఫ్లయింగ్‌ సాసర్‌ !! ఎగిరే పళ్లెం!!!

    అంతవరకూ కేవలం పుస్తకాల్లో మాత్రమే చదివాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు… ఆ ఆలోచన రాగానే ఉద్వేగంతో అతడు పక్కకి తిరిగి చూశాడు. ఇద్దరు పైలెట్లూ లేరు. లోపలికి వెళ్లినట్టున్నారు.

    అతడు చెవులకున్న ఫోన్లు తీయాలన్న విషయం కూడా పట్టించుకోకుండా ఆ వస్తువు తమకెంత దూరంలో వుందో లెక్కగట్టడానికి ప్రయత్నించాడు… ఈ విశాల విశ్వంలో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో వున్న యే గెలాక్సీలోని గ్రహవాసులో తమ ఇంధనం కొరతను తీర్చుకోవడానికి సూర్యుడి లాంటి నక్షత్రాల కోసం వెదుకుతుండగా వారి దృష్టి మన సూర్యుడి మీద పడితే ?!

    వారు తమ అద్భుత సాంకేతిక శక్తితో సూర్యుడిని తమ గ్రహానికి చేరువగా తీసుకుపోవడానికి ప్రయత్నిస్తే …. ? ఆ పరిస్థితిని నివారించడం కోసం భూలోకంలోని శాస్త్రజ్ఞులు ఆ సుదూర గ్రహానికి రాయబారం నిమిత్తం ఓ బృందాన్ని పంపితే ?! అప్పుడేం జరుగుతుంది ? భూలోకవాసుల రాయబారం ఫలిస్తుందా ? సూర్యుడి చుట్టూతా కమ్ముకున్న చీట్లు తొలగిపోతాయా ? అద్భుతమైన కథాకథనంతో  తనదైన శైలిలో ఆగ్రశ్రేణి రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ అందిస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ – చీకట్లో సూర్యుడు

    90.00
    Add to cart