-
Telugu Navala Sahithyamlo Manovisleshana
0₹200.00ఒక మహా వృక్షాన్ని విశ్లేషించేప్పుడు దాని మూలాల్ని తరచి చూసినట్టే తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణా విభాగాన్ని విశ్లేషించేప్పుడు తెలుగు నవలా పరిణామ విశ్లేషణ, మనోవైజ్ఞానికపరమైన ప్రపంచ సాహిత్యాల ప్రభావం, ప్రపంచ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల సిద్ధాంతాల పరిశీలన కూడా జరిగితేనే ఆ అధ్యయనం సమగ్రం అవుతుంది. అందుకు మనోవిజ్ఞాన శాస్త్రం పై పట్టు ఉండాలి.
– కోడూరి శ్రీరామమూర్తి
-
-
Tenuginti Balarasalu Panuganti Sakshi Vyasalu – తెనుగింటి బాల రసాలు పానుగంటి సాక్షి వ్యాసాలు
0₹110.0012 అధ్యాయాలుగా సాగిన ఈ గ్రంథం – సాక్షివ్యాస విజ్ఞాన సర్వస్వంగా రూపొందింది. ఆయన విషయాలను వింగడించిన తీరు, యుక్తియుక్తంగా వాదాలను మలిచి చూపిన వైనం, లోతైన అవగాహన, సరళమైన వ్యక్తీకరణ ఇవన్నీ ఈ గ్రంథానికి వన్నెతెచ్చాయి. వర్తమాన తరానికి ఒక తాజా భోజనం వడ్డించినట్లుగా ఈ రచన ప్రాసంగిక రమ్యంగా వుంది.
-
The Business School
0₹225.00ఇతరులకు సాయం చేయాలనుకునే వారి కోసం
అత్యధికంగా అమ్ముడుబోయే తన పుస్తకం రెండో ప్రచురణలో రాబర్ట్ టి. కియోసాకీ, నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో తన మౌలికమైన ఎనిమిది ‘దాగివున్న విలువలను’ అప్ డేట్ చేస్తూ, విశదీకరిస్తాడు. స్పెషల్ బోనస్ – కిమ్ కియోసాకీ, షెరాన్ లెక్టర్, డయాన్ కేన్నేడిల మూడు అదనపు ‘దాగివున్న విలువలు’.
నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి రాబర్ట్ ఇలా వివరిస్తారు…
….. సంపదను పొందేటందుకు అదొక విప్లవాత్మకమైన పధ్ధతి.
….. అది ఎవరికైనా గొప్ప సంపదను పొందగలిగే అవకాశాన్ని ఇస్తుంది.
….. కోరిక, దృఢనిశ్చయం, పట్టుదల ఉన్న ప్రతివారికీ అది అందుబాటులో ఉంటుంది.
“నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ సాయంతో నేను భాగ్యవంతుడిని కాలేదు కనుక, ఆ పరిశ్రమ గురించి నేను కొంచెం నిష్పాక్షపాతంగా ఉండగలను. నా దృష్టిలో నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కున్న లాభాలను – కేవలం అధిక ధన సంపాదనకె పరిమితం కాని లాభాలను – ఈ పుస్తకం వివరిస్తుంది. చివరికి నేను హృదయమున్న ఒక వ్యాపారాన్ని కనుగొన్నారు.”
-
-
The Secret- Magic
0₹499.00ఒక పదం అన్నింటినీ మార్చేస్తుంది
ఇరవై శతాబ్దాలకు పైగా ఒక పవిత్ర గ్రంథంలోని కొన్ని పదాలను చదువరులందరూ అపార్థం చేసుకున్నారు. ఆ పదాలు వారిని గందరగోళపరిచాయి. చరిత్రలో కొంతమంది పాఠకులు మాత్రమే ఆ పదాలలో ఒక గూడార్థం వున్నదనీ, ఆ అర్థాన్ని కనుక్కోగలిగితే మన కళ్ళముందు ఒక నూతన ప్రపంచం సాక్షాత్కరిస్తుందనీ తెలుసుకున్నారు.
“మ్యాజిక్” లో రోండా బర్న్ ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచం ముందు పరిచింది. ఒక 28 రోజుల అద్భుతమైన సాధనతో ఆమె ఈ జ్ఞానాన్ని నిత్యజీవితానికి ఎట్లా అన్వయించుకోవాలో మనకు భోదిస్తున్నది.
మీరెవరైనా కానీ మీరెక్కడున్నా కానీ మీ ప్రస్తుత పరిస్థితులెలా వున్నా గానీ ఈ “మ్యాజిక్” మీ జీవితం మొత్తాన్నీ మార్చివేస్తుంది.