-
-
Avadhana Sathakam- 1
0₹500.00ప్ర: పెళ్ళయిన ఆడవాళ్ళకు తాళిబొట్టు గుర్తు మరి పెళ్ళయిన మగవాళ్ళకు?
జ. ఏడుపుగొట్టు మొహం. హాయిగా నవ్వలేక పోవడం.ప్ర: దయ్యాలు రాత్రిపూటే ఎందుకు తిరుగుతాయి?
జ. పగలు మనం తిరుగుతామనే భయంతో
ప్ర: పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకను పెట్టుకుని వెళ్ళడం అంటే…
జ. అవధానానికి వెళ్తూ అప్రస్తుతం వారిని చంకన బెట్టుకుపోవడం.ప్ర: కరిచే కుక్క మంచిదా? మొరిగే కుక్క మంచిదా?
జ. మా యింట్లో కరిచే కుక్క మంచిది. మీ యింట్లో మొరిగే కుక్క మంచిది.ప్ర: పిల్ల ముందా? గుడ్డు ముందా?
జ. పిల్లే ముందు. పిల్ల పుట్టి బడిలో చేరి పరీక్ష రాశాక కదా మార్కుల్లో గుడ్డు పెట్టేది.ప్ర: పద్యా నికీ, శ్లోకానికీ తేడా ఏమిటి?
జ. పద్యం వేగంగా వస్తుంది, శ్లోకం నెమ్మదిగా వస్తుంది.ఎందుకంటే అది slow ……… come
ప్ర: ‘మండే’ని ఆ పేరుతో ఎందుకు పిలుస్తారు?
జ. సండే సెలవు అనుభవించిన వారికి మర్నాడు పనిచేయాలంటే
ఒళ్లు “మండే” – అందుకేప్ర: అంటరానితనం మహాపాపం. మరి వంటరాని తనం?
జ. మొగుడు పాపంప్ర: ఎక్స్ ప్రెస్ బస్ ను నాన్ స్టాప్ అంటారు. ప్యాసింజరు బస్ ను ఏమనాలి?
జ. నానాస్టాప్ అనాలి. -
Batukaata – బతుకాట
0₹150.00అమెరికావారి ‘తానా’ అవార్డు పొంది, నవ్యాంధ్రప్రదేశ్ డిగ్రీ మొదటి సంవత్సరానికి పాఠ్యాంశంగా వున్న విశిష్ట నవల ‘బతుకాట’.
బతుకాట పేరుకు నవలే కానీ, నిజానికి ఇది నిజమైన వ్యక్తుల జీవిత గాథ. నిజ జీవితాలను కథాత్మకంగా మలచి, నవలీకరణ చేసినట్లు స్పష్టమవుతుంది.
జగన్నాటకంలో జీవన నాటకం ఒక అంతర్భాగం. ముఖానికి రంగులేసుకుని, రంగస్థలంపైన గొంతు విప్పి ‘అడుగులు’ వేయకపోతే తమ బతుకు బండి ఒక అడుగు కూడా ముందుకు సాగలేని కుటుంబాలు ఎన్నో వున్నాయి. తమ బతుకులు కొవ్వొత్తిలా కాలి, కరిగిపోతున్నా ప్రజల్ని ఆనందింప చేయడంలోనే పరమార్థాన్ని వెతుక్కునే… అసలు సిసలైన కళాకారుల యథార్థ వ్యథార్థ జీవనగమనమే ‘బతుకాట’. – కె.ఆర్.కె.మోహన్
-
-
Bhinnamga Undataniki Sahasinchandi Sampannuluga Yedagandi
0₹225.00‘భిన్నంగా ఉండటానికి సాహసించండి సంపన్నులుగా ఎదగండి’ అనే ఈ పుస్తకం’ త్వరగా ధనవంతులు అవండి’ అనే మరో కరదీపికలాంటిది కాదు. ఇది ఒక వ్యావహారిక జ్ఞానంతో ఆలోచనలని రేకెత్తిస్తూ 150 ఏళ్ళ సాంస్కృతిక, వాణిజ్య చరిత్రలోకి చేసే ఒక యాత్ర. దీన్నిండా ఎన్నో ఉపయోగకరమైన సలహాలూ, ఆసక్తిదాయకమైన వాస్తవాలు, వినోదాన్ని పంచే వృతాంతాలు ఉన్నాయి. ఈ పుస్తకం కాలిఫోర్నియాలో బంగారం గనుల కోసం అన్వేషణ కొనసాగించిన కాలం నుంచి యుద్దకాలంలోని బెర్లిన్ నంగరం దాకా వెళ్లి, మళ్ళీ ఈనాటి సిలికాన్ వ్యాలీ వరకూ వస్తుంది. డిస్నీల్యాండ్ నుండి సౌది అరేబియాకీ, లీవై స్ట్రాస్ నుంచి స్టార్ బక్స్ కాఫీ దాకా, జాన్ డి రాక్ఫెల్లర్ చమురుబావుల నుంచి వారెన్ బఫెట్ ఒమాహ దాకా మనల్ని తీసుకుపోతూ, అన్ని రకాల ప్రతికూల పరిస్థితులనీ ఎదుర్కొంటూ విజయం సాధించాలనే పట్టుదల, మరింత ఎత్తుకి ఎదిగే ప్రయత్నం చేసే స్త్రీ పురుషుల కధలని మనసుకి ఆకట్టుకునేలా రచయిత చెబుతాడు.
వాణిజ్యవేత్తలైన స్త్రీ పురుషులు, ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన క్రీడాకారులు, సంగీత విద్వాంసులు, సుప్రసిద్దులైన స్టీవ్ జాబ్స్, కోకో షనేల్, ఆర్నాల్డ్ స్వాజినేగర్ లాంటి వారి విజయగాధలను ప్రస్తావిస్తూ, జీవితంలో కొద్దోగొప్పో (లేక ఏమాత్రం)సాఫల్యం సాధించని అధికశాతం జనానికీ ఈ విజేతలకీ మధ్య ఉన్న తేడా కేవలం ఎక్కువ సంపద ఉండడం వల్ల మాత్రమే కాదని ఈ పుస్తకం విశదీకరిస్తుంది. విజయానికి అవసరమైన ఒక స్పష్టమైన తాత్వికతని అందిస్తుంది. కలలుకనే సాహసం చెయ్యగలవారందరి కోసం రాయబడిన పుస్తకం.
-
Cancer Code
0₹150.00కెనడా దేశస్తుడైన డా॥ ఫంగ్ కిడ్ని వైద్య నిపుణులు. ఒబేసిటీ, డయాబెటిస్, ఫాస్టింగ్లపై ఆయన రాసిన పుస్తకాల ద్వారా సాంప్రదాయ వైద్యంపై
గొప్ప తిరుగుబాటు చేశారు. జర్మనీకి చెందిన హెన్రిచ్ వార్నర్ (1888-1970) ఒక భౌతిక శాస్త్రవేత. ఆయన కణాలు శక్తిని ఎలా తయారు చేసుకుంటున్నాయన్న అంశంపై విస్తృత అధ్యయనం చేశాడు. జీవశాస్త్రానికి భౌతిక, రసాయన శాస్త్రాలను జోడించాడు. సాధారణ కణాలకు, కాన్సరు కణాలకు జీవక్రియలలో గల తేడాలను గుర్తించాడు.. జీవశాస్త్ర పరిణామ వాద కోణం నుండి ఈ సమస్యను పరిశోధించారు.
అపుడు కాన్నరు మెట్లు మెట్లుగా ఎదగడం లేదని, పెరుగుదల, చొరబాటు, వ్యాప్తి వంటివి దశలవారీగా జరగడం లేదని అర్థమైంది. శరీరంలో కాన్సరు కొంతకాలం పాటు పెరిగాక మాత్రమే వ్యాప్తి చెందగలదన్న భావన తప్పు అని తేలింది. ఆరంభం నుండే వ్యాప్తి కూడా కాన్సరు లక్షణంగా గుర్తించారు.దశలవారీగా పెరుగుదల వుండి వుంటే కాన్సరుకు చికిత్స సులువయి ఉండేది. కాన్సరు వచ్చిన భాగాన్ని సర్జరీ చేసి తొలగిస్తే అది అక్కడికి నిలిచి ఉండాలి. కానీ కాన్సరు వచ్చినట్లు గుర్తించేనాటికే ఆ కణాలు ఇతర శరీర భాగాల్లోకి చేరుతున్నట్లు బయటపడింది.
మమ్మోగ్రఫి పరీక్ష చేసే 10 మందిలో ఒకరికి మాత్రమే కాన్సరు పాజిటివ్ అన్న ఫలితం వస్తుంది. అలా పాజిటివ్ గా తేలిన వాళ్ళలో నూటికి 5 మందికే కాన్సరు వుంది. 95 మందిలో అవసరం లేకున్నా ఆ పరీక్షకు కొనసాగింపుగా మళ్ళీ బయాప్సీ పరీక్షలు, గడ్డల సర్జరీ, కొందరికి కీమోథెరపీలు కూడా చేస్తున్నారు. ఎక్కువ మందిలో రొమ్మును మొత్తంగా తొలగించడం (Mastectomy), రేడియేషన్ ఇస్తున్నారు. అమెరికాలో తీసిన లెక్కలలో పాజిటివ్ ఫలితం వచ్చిన వాటిలో 30 నుండి 50 శాతం తప్పు రిపోర్టులని తేలింది. దీనితో పాటు మమ్మోగ్రఫీ అయ్యాక పెరిగే మానసిక, శారీరక వ్యధలవల్ల జీవితపు నాణ్యత తగ్గిపోతుంది.
35 శాతం కాన్సర్లు పోషకాహారంతో ముడిపడి ఉంటాయి. కాన్సరుకు పొగాకు తర్వాత రెండో కారణం ఆహార లభ్యతే. అదనపు బరువు కాన్సరును తెచ్చిపెట్టే అంశం అని చెప్పుకున్నాం. అనేక రకాల కాన్సర్లు తగ్గుముఖంలో ఉన్నప్పటికీ, ఊబకాయ సంబంధ కాన్సర్లు సోకడం పెరుగుతోంది. అందువల్ల వాటి నివారణ కోసం ఆహారపరమైన వ్యూహాలు రూపొందించుకోవలసిందేనంటాడు జాసన్ఫంగ్.
కాన్సరు రాకుండా అద్భుతాలు సృష్టించగల ఆహారాలేమీ లేవు. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇన్సులిన్ అధికం కావడం వల్ల వస్తున్న ఊబకాయం, మధుమేహం-2లను నివారించగల వ్యూహమే కాన్సరుకూ పనికి వస్తుంది.