• Ciprali

    Ciprali

    0

    తలకాయలు తమ తమ జే

    బుల లోపల దాచుకొనుచు పోలింగ్ కు  పో

    వలసిన రోజు వస్తే

    సెలవింక డెమోక్రసీకి సిరిసిరిమువ్వా

     

    పోలీసుల రాజ్యమిది

    పోలింగోక భూటకం

    ఫాసిజమై మారుతోంది

    ప్రజాస్వామ్య నాటకం

     

    విచిత్ర వీరులు నక్సలైట్లు

    అన్యాయాలకి డైనమైట్లు

    అంధకారంలో టార్చిలైట్లు

    నవయువ జీవన కాస్మోనాట్లు

    వాళ్ళంటే హడలిపోతారు నిక్సనైట్లు

     

    విప్లవకారుల విధ్వంస

    భీభత్సకాండకు నా ప్రశంస

    అదేన్నడూ కానేరదు హింస

    అది నూతన చేతనారిరంస

    మానవ మానస మానససరోవర హంస

    120.00
    Add to cart
  • Ankena

    Ankena

    0

        దేశ సామాజిక నిర్మాణంలో విముక్తిలేని చీకటి కోణం బడుగువర్గాలది. విషపరిణామాల బారినుండి వారిని కాపాడాలన్నదే ఈ నవల ఉద్దేశం.

                      “అంకేన ” అంటే ఒక ఫలవృక్షం. నీడనిచ్చి, ఆకలితీర్చి, సేదదీర్చేది. అదే ఇతివృత్తంతో నిగర్వి, అణుకువ, విజ్ఞానం, ఓర్పు, నేర్పులతో స్త్రీ తన చుట్టూవున్న సమాజాన్ని సేవాదృక్పధంతో ముందుకు నడిపించే తీరు ప్రశంసనీయం.

                      తాను అగ్రసరిగా, వినూత్నమైన భావాలుగా స్త్రీగా కథానాయిక ఈ నవల్లో కనిపిస్తారు. ఈ నవల ఒక నూతన దృకోణాన్ని ఆవిష్కరిస్తుంది.నేటి యువతీ యువకుల వ్యక్తిత్వానికి భిన్నంగా తన రచనలతో ఆలోచింప చేసి మార్పు, చైతన్యం తేవాలన్న రచయిత్రి కాంతి లిల్లీ పుష్పం గారి సంకల్పం ఎంతో ఆదర్శనీయమైనది.

    100.00
    Add to cart
  • Amma (Maxim Gorki)

    Amma (Maxim Gorki)

    0

    “గోర్కిని నేను వ్యక్తిగతంగా ఎరుగుదను. యూరోపియన్ రచయితల్లో ప్రజ్ఞావంతుడైనట్టి, ఘనుడైనట్టి రచయితగానే కాకుండా బుద్ధిశాలి, దయాళుడు, సానుభూతిపరుడైన మానవుడిగా కూడా నేనతన్ని అభిమానిస్తాను”.

    – లియో టాల్ స్టాయ్ డైరీ నుండి.

    “గోర్కి ప్రతిభా భాండారానికి ఒకటే పేరు – సత్యం”

    – సైఫాన్ జ్వైగ్.

    “నూతన సారస్వత పతాకపైన చిత్రించి వుంది – గోర్కి హృదయం. మరి ఈ హృదయంలో వుంది – సర్వ ప్రపంచ శాంతి.”

    – కృష్ణచంద్ర

    విశ్వ విఖ్యాత రష్యన్ రచయిత, సుప్రసిద్ధ రచనా విజ్ఞానవేత్త మక్సీమ్ గోర్కి (1868 – 1936) నవల “అమ్మ” తెలుగు పాఠకుల అపారాభిమానాన్ని చూరగొంది. ఈ నవలను చదివి కమ్యునిస్టులైన వాళ్ళు ఎంతోమంది వున్నారు. ఈ అభిమానాన్ని పురస్కరించుకొని తిరిగి ఈ నవలను వెలువరించారు.

    – రచయిత గురించి 

    300.00
    Add to cart
  • Sweet Home

    Sweet Home

    0

    Sint magnam sed optio est ut. Rerum facilis eos voluptatum non. Eius asperiores nulla amet.

    200.00
    Add to cart
  • Vismrutha Yatrikudu

    Vismrutha Yatrikudu

    0

    రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్కృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సంవత్సరాలు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్ర్య యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య భాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిందూ సన్యాసిగా, ఆర్యసమాజకునిగా, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బౌద్ధబిక్షువుగా ఈయన పేరు పొందారు. వీరు చేసిన భాషాసేవకు కాశీ పండితులు వీరిని “మహాపండిత్” బిరుదుతో గౌరవించారు. బౌద్ధవేదములు మూడింటిలోను ఈయన నిధి.

              అందువల్ల బౌద్ధ విజ్ఞానులు ఈయనకు “త్రిపీఠకాచార్య” బిరుదుని ఇచ్చారు. రాహుల్ జీ సాగించిన పరిశోధనలు భారత సంస్కృతిని 600 సంవత్సరాలు చరిత్రలో సుసంపన్నం చేశాయి. వీరి రచనలు హిందీ భాషకు 400 సంవత్సరాల చరిత్రను చేర్చాయి. వాటిలో హెచ్చువాటిని జైళ్ళలోను లేక నేపాల్. టిబెట్, సిలోన్ లలో రచించారు. వివిధ భాషలలో వీరి గ్రంథాలు 60కి పైగా ఉంటాయి. తెలుగు పాఠకులకు సుపరిచితమైన “విస్మృత యాత్రికుడు” రచనను 1953 సంవత్సరంలో రాశారు.

    280.00
    Add to cart
  • Andhra Pradesh Prajatheerpu

    Andhra Pradesh Prajatheerpu

    0

    ఎన్నికలకు సంబంధించి పుస్తకాలు రాయడం అన్నది అంత తేలికైన విషయం కాదు. 1952 లో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికలు మొదలు 2019 వరకు జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఫలితాల వివరాలు, గెలిచినవారికి సంబందించిన విశేషాలు, వారికీ ఉండే రాజకీయ నేపథ్యం, పూర్వాపరాలు, గెలిచినవారి విశిష్టతలు మొదలైనవాటిని క్రోడీకరించి పుస్తకం తయారు చేయడం అంటే ఎంతో క్లిష్టమైన పని. అయినా రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తితో పాతికేళ్ల క్రితం ఈ పుస్తక రచనకు శ్రీకారం చుట్టడం జరిగింది.

                                                                                                – కొమ్మినేని శ్రీనివాసరావు

    300.00
    Add to cart
  • Anantam

    Anantam

    0

    ఓ చెరిగిపోయిన అక్షరాల్లారా కరిగిపోయిన క్షణాల్లారా! ప్రవహించండి నా కలంలో సిరాలాగ ! సరే మరణించాను నాకు   1990లో చచ్చిపోవాలని ఉంది. బహుశ విమాన ప్రమాదంలో, లేదా జలగండం వల్ల ? అదీ ఇదీ కాకపోతే నేల మీదనే కాలధర్మం. నా శవం చుట్టూ చాలామంది చేరి ఏడుస్తున్నారు. “ఎందుకేడుస్తున్నారు, ఇప్పుడేమయిపోయిందని” అని నేనెంత ధారాపాతంగా అరుస్తున్నా ఎవరికీ నా మాటలు వినబడవు. ” అనంతర కార్యక్రమం గురించి ఆలోచించామన్నా” రెవరో! దహన సంస్కారం ఎజండాలోకి వచ్చింది. అదే వీల్లేదన్నాన్నేను. మతానికి సంబంధించిన ఏ విధమైన కర్మకాండకీ నా (సజీవ లేదా నిర్జీవ) కళేబరాన్ని అంకితం చెయ్యడం అనే పనికి నేను సుతరాము అంగీకరించను.     

     

                     చుట్టూ మూగిన వాళ్ళలో కొంతమందికి నేనొకసారి రాసిన మరణశాసనం జ్ఞాపకం వచ్చింది. అందులో నేను, “నేను చచ్చిపోయాక జరగవలిసిన మొట్టమొదటి పని నా శవాన్ని విశాఖపట్టణం లోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి అప్పగించడం” అని రాశాను. ఆ తర్వాత జరగవలసిన పని అక్కడున్న మెడికల్ కాలేజి విద్యార్దుల్లోని నిరీశ్వరవాదుల ఆధ్వర్యం కింద జరగాలని నా ఆకాంక్ష. 

                       ఏడ్చి, ఏడ్చి ఆగిపోయిన వాళ్ళు, ఆగిపోయినా, ఏడుస్తున్న వాళ్లింకా ఏడుస్తూనే ఉన్నారు. ఎడవమనండి నాకు అభ్యంతరం లేదు. 

                      విరసం వాళ్ళు నన్నూరేగిస్తామన్నారు. నా అభ్యంతరం లేదు. నా శవం మీద ఎర్రజెండా కప్పడం మాత్రం మరిచిపోకండని మరీ మరీ అభ్యర్ధించాను.  

    నా కొడుకే వచ్చి తన చేతుల్తో నా తలకి కొరివి పెడతానన్నాడు. ఇది వాడికి పుట్టిన బుద్దికాదనుకుంటాను. ఎవరో చెప్పించిన ట్యూషన్ అయినా అదే వీళ్ళేదంటాన్నేను.

    …..  శ్రీ శ్రీ

    240.00
    Add to cart
  • Amrutham Kurisina Ratri

    Amrutham Kurisina Ratri

    0

    తిలక్ కవిత అభ్యుదయ కవిత్వ కొన్ని పాళ్ళు, భావకవిత్వం కొన్ని పాళ్ళు, కలసిన మిశ్రమరూపం. “నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు; నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అని తిలక్ చెప్పుకున్నాడు. ఇందులో అతని భావమేదైనా, మొదటిది తన వస్తువును గురించీ, రెండవది తన శైలిని గురించీ చెప్పుకున్నట్లు నేనర్థం చేసుకున్నాను. తిలక్ అభ్యుదయ భావనకు అందమైన శైలిని సమకూర్చి; అభ్యుదయ కవితా కాలంలో ఉన్న దోషాన్ని తొలగించడానికి ప్రయత్నించాడని చెప్పుకోవచ్చు.

                 భావకవులు శబ్ద సౌందర్యానికి, శైలీ రమ్యతకూ ప్రాధాన్యం ఇచ్చారు. అభ్యుదయ కవులు ప్రగతి కారకమయిన వస్తువుకు ఈ రెండింటిలో మంచిని ఒకచోట చేర్చుకునే ప్రయత్నంలో తప్పేమీలేదు. భావన ఎంత అభ్యుదయకరమయినదయినా సుందరంగా వ్యంగ్య విలసితంగా చెప్పలేకపోతే రాణించాడు. అభ్యుదయ కవిత్వాన్ని కూడా పేలవంగా కాకుండా అందంగా చెప్పుదాం అన్నదే – తిలక్, ఆచరణ ద్వారా చేసిన సూచన.   

                                                          – కుందుర్తి    

    200.00
    Add to cart
  • Yugantam - యుగాంతం

    Yugantam – యుగాంతం

    0

    ‘భూమి మీద సకల చరాచరాలు నాశనం కాబోతున్నాయా? ప్రొఫెసర్‌ ఆనందమార్గం అంచనా నిజమయ్యే పక్షంలో ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ప్రాక్సిమా సెంక్చువరీ అనే నక్షత్రం భూమికి దగ్గరగా దూసుకు వస్తోంది. కొన్నివేల కోట్ల మైళ్ళ వేగంతో వస్తూన్న ఈ నక్షత్రం భూమి యొక్క పరిధిలోకి ఆగష్టు పదిహేడు ప్రొద్దున్న పదకొండు గంటలకి ప్రవేశించి, మూడు సెకన్ల కాలంపాటు ఉండి అనంత విశ్వంలోకి వెళ్ళిపోతుంది. అయితే భూమిలో వుండే పదార్థాలన్నీ పోటీపడి ఆ నక్షత్రాన్ని చేరుకోవడానికి తొందర పడడంలో భూమి పేలిపోతుంది. కాగితంలో పకోడీలు దట్టంగా కూరి నొక్కితే పేలినట్లు భూమి పేలిపోతుందా? పదిహేడో తారీఖు వరకూ వేచి చూద్దాం. ప్రొఫెసర్‌ మాటలే గాని యధార్థమైతే చూడడానికి మనం ఎలానూ వుండముగా….”

    ఇండియన్‌ టైమ్స్‌లో ప్రచురితమైన సంచలన వార్త అది. దాంతో అంతా గగ్గోలెత్తింది. మనిషి మనుగడ మీద జూదం మొదలయింది.

    అష్టగ్రహ కూటమి ఏర్పడి ప్రపంచ వినాశనం జరగుతుందని ఒకనాడు గగ్గోలు…

    స్కైలాబ్‌ విరుచుకుపడనుందని ఒకసారి చెలరేగిన గందరగోళం…

    గ్రహాలూ గ్రహశకలాలూ తోకచుక్కలూ భూమిని ఢీ కొంటాయంటూ తరచు పేపర్‌ వార్తలు సృష్టించే కంగారు…

    అలా ప్రపంచం నాశనమవుతుందంటే… ఆ క్షణాల్లో ప్రతి ఒక్కరికీ తెలిసే – రాజకీయ నాయకుల రంగులు. వ్యాపారస్తుల యావ. సైంటిస్టుల కీర్తి కాంక్ష. నిరుద్యోగుల నిస్సహాయత. కలుసుకోలేని ప్రేమికుల ఆవేదన. ముష్టివాళ్ళ అతిసాహస వైఖరి. మిడిల్‌క్లాస్‌ సంసారుల నైతిక క్షోభ… వీటన్నిటినీ చిత్రిస్తూ ఉత్కంఠభరితంగా సాగిపోయే యండమూరి వీరేంద్రనాథ్‌ ఫాంటసీ-

    60.00
    Add to cart
  • The Dairy Of Misses Sarada - ది డైరీ ఆఫ్‌ మిసెస్‌ శారద

    The Dairy Of Misses Sarada – ది డైరీ ఆఫ్‌ మిసెస్‌ శారద

    0

    ఏమిట్రా అంత దీక్షగా చదువుతున్నావ్‌ ?’ గ్లాసులో మందుపోస్తూ ఒకడు రెండో వాడిని అడిగాడు. పచ్చి మిరపకాయల బజ్జీల పొట్లం విప్పి, బజ్జీల్ని ప్లేట్లో పడేసి, కాగితం పారెయ్యబోతూ ఆగి దాన్ని చదువుతున్న రెండో వాడు తలెత్తి ”ఇదేదో ఇంటరెస్టింగుగా వుందిరా, డైరీలో కాగితంలా వుంది’ అన్నాడు. ఎప్పటిదో పాత డైరీలో కాగితం. ‘ఇదేదో ఆడపిల్ల డైరీలో కాగితంలా వుంది. క్రింద శారద అని వుంది’. మూడోవాడు ఆ కాగితాన్ని లాక్కుని బిగ్గరగా చదవడం ప్రారంభించాడు.

    ‘మనుష్యులు రెండు రకాలు. తెలివైనవాళ్ళు. తెలివితక్కువ వాళ్ళు – మనుష్యులు రెండు రకాలు. బలమున్న వాళ్ళు. బలం లేని వాళ్ళు – తెలివిగానీ బలముగానీ లేనివాళ్ళు సామాన్యులౌతారు – బలం వున్నవాడు నీతిని వదిలేస్తే పొలిటీషియన్‌ అవుతాడు – తెలివి వున్నవాడు నీతిని వదిలేస్తే కాపిటలిస్టు అవుతాడు – తెలివైన వాడు నీతిని వదిలెయ్యకపోతే టీచరో మేధావో అయిసంతృప్తి పడతాడు – బలమైన వాడు నీతిని వదిలెయ్యకపోతే శ్రామికుడై శక్తిని ధారపోస్తాడు – నా జీవితాన్ని దర్పణంగా చేసి, నలభై సంవత్సరాల చరిత్రని అందులో ప్రతిబింబంగా చేసి చూస్తే నాకు తెలిసిన సత్యం ఇది. ఎందుకో ఈ రాత్రి నా జీవితంలో ఆఖరిరోజు అనిపిస్తుంది. ఇదే నా డైరీలో ఆఖరిపేజీ అనిపిస్తుంది – శారద”.

    రెండు విభిన్నలోకరీతుల్ని రెండు విభిన్న కోణాల్లో యండమూరి వీరేంద్రనాథ్‌ వివరించిన విలక్షణమైన నవల ‘ది డైరీ ఆఫ్‌ మిసెస్‌ శారద’.

    100.00
    Add to cart
  • Vijayam Vaipu Payanam - విజయం వైపు పయనం

    Vijayam Vaipu Payanam – విజయం వైపు పయనం

    0

    ఒక శుక్రవారం సాయంత్రం – లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నాను. దూరంగా మైకులోంచి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వాయులీనం లీలగా వినిపించసాగింది. స్పష్టంగా వినడం కోసం, బయటికొచ్చాను. నాలాంటి మరికొంతమంది లైబ్రరీ బయట కనిపించారు. అందరమూ నిశ్శబ్దంగా ఆ ఫిడేలు మీద గమకాల్ని ఆస్వాదిస్తూ తాదాత్క్యంతో వింటున్నాం.

    ఆ సమయంలో ఒక ముఫ్పై ఏళ్ళ వ్యక్తి ఇద్దరు పిల్లల్తో వచ్చి కూర్చున్నాడు. ఆ పిల్లలిద్దరూ ఒకర్నొకరు కొట్టుకుంటూ, అల్లరిచేస్తూ మా మధ్య తిరుగుతూ అల్లరి చెయ్యసాగారు.

    అందరికీ అది చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇక సహించలేక ‘ఇది లైబ్రరీ, మీ పిల్లల్ని గోల చెయ్యవద్దనండి’ అన్నాను కరుగ్గా. అతడు తన నిస్తేజమైన కళ్ళతో నావంక చూసాడు. ‘గోల చేస్తున్నారు కదూ, అవును. పిల్లలు… వాళ్ళ అమ్మ ఇప్పుడే చనిపోయింది. అరగంట తర్వాత ఇస్తామన్నారు. ఆస్పత్రిలో గొడవ చేస్తున్నారని ఇలా తీసుకు వచ్చాను’ అన్నాడు.

    అతడి మీద అప్పటివరకూ ఉన్న కోపం జాలిగా మారింది. కోపం జాలిగా, అసూయ ప్రేమగా, ద్వేషం స్నేహంగా, పగ ప్రేమగా, అసమర్ధత సమర్ధతగా, ఆవేశం ఆలోచనగా మారవచ్చు.ఇవన్నీ మన బలహీనతల స్థాయి భావాలు.

    కావలసినదల్లా పరిస్థితిని పై స్థాయిలోంచి పరిశీలించగల్గడమే. సమస్యని అవతలి కోణంలోంచి చూడగల్గడమే.

    అప్పుడు మనకెవరూ శత్రువులుండరు. మనకి సమస్యలుండవు. ఉన్నా, వాటిని నవ్వుతూనే పరిష్కరించుకోగల స్థిరత్వం మనకి అలవడుతుంది. అదే యండమూరి వీరేంద్రనాథ్‌ చెపుతున్న ‘విజయం వైపు పయనం’

    60.00
    Add to cart
  • Aakhari Poratam - ఆఖరి పోరాటం

    Aakhari Poratam – ఆఖరి పోరాటం

    0

    ‘కృతజ్ఞత అంటే ఏమిటి ? కనుకొలుకుల్లో అశ్రువై నిలిచేది. మాటల్లో లాంఛన రూపం దాల్చేది. అదే కదూ, అందుకే కదూ, మాటలు అందని చోటుకు వెళ్ళిపోయావు. మంచులో తడి వున్న పుష్పాన్ని నా కంటి చివరి బాష్పం చేసి, మేఘరాగం తడి చినుకు పాటచేసి, మౌనరాగం గుండె తూట్లుగా పొడిచేసి మమ్మల్నొదిలేసి అందుకే వెళ్ళిపోయావా ? నిశ్శబ్దంలో కూడా నిన్ను వినగలిగినవాడే నిజమైన స్నేహితుడట. నిజమేనేమో! ఈ నిశ్శబ్దం మరొకరి కోసం చెదరటానికి ఎంత సమయం పడుతుందో. ఇక నుంచీ నేను మాట్లాడే ప్రతి మాటల వెనుక, చదివే పుస్తకాల పుటల – వాక్యాల, శబ్దాల, అక్షరాల మధ్యంతా లీలగా విషాదమే కనపడుతుందేమో”.

    స్పర్శకు ఆలోచన తెగింది

    సునాదమాల –

    మగవాడు పొరపాటున చెయ్యితాకితే ముందు ఇటుక పొడితో, తరువాత కొబ్బరి పీచుతో కడుక్కునే సునాదమాల అనే సనాతనాచారాల అమ్మాయిని, నికుంజ్‌ విహారి అనే అబ్బాయి ఒక ప్రమాదం నుంచి రక్షిస్తాడు. ఆ రాత్రినుంచీ ఒక అమ్మాయి అతడితో ఫోన్‌లో రొమాన్స్‌ చేయటం మొదలు పెడుతుంది. పైకి తులసి మొక్క టైపులా కనపడే సునాదమాలే ఈ విధంగా ఫోన్‌ చేసి ఏడిపిస్తోంది అని విహారి అనుకుంటాడు. ఫోన్‌ చేస్తున్నదెవరు ?

    ఈ విషయం తెలుసుకోవటానికి ప్రయత్నించిన విహారి అనుకోని పరిస్థితులలో ఒక సి.బి.ఐ. ఆఫీసరును కలుసుకుంటాడు ఆ ఆఫీసర్‌ ఎవరు ?

    సరదాగా సాగిపోతూ అనుకోకుండా అనూహ్యమైన సస్పెన్సుతో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే యండమూరి వీరేంద్రనాథ్‌ నవల ‘ఆఖరిపోరాటం’.

    100.00
    Add to cart