• కరుణశ్రీ సాహిత్యం 2

    కరుణశ్రీ సాహిత్యం 2

    0

    ఉదయశ్రీ కావ్యస్పందనతో మందాకిని పొంగింది. నందనం నవ్వింది. బృందావనం వెలిసింది. మందారం విరిసింది. మకరందం కురిసింది. ఆమకరందం తెలుగుజాతిని పోతన వేమనల తర్వాత మరింత ప్రభావితం చేసింది. కరుణశ్రీ మాటలతో బొమ్మల్ని గీశారు. అక్షరాలతో మానవతాశిల్పాన్ని చెక్కారు. ఏయిజానికి చెందని హ్యూమనిజం మాత్రం తొణికిసలాడే ప్రజాకవి కరుణశ్రీ.

    225.00
    Add to cart
  • కరుణశ్రీ సాహిత్యం 5

    కరుణశ్రీ సాహిత్యం 5

    0

    ఉదయశ్రీ కావ్యస్పందనతో మందాకిని పొంగింది. నందనం నవ్వింది. బృందావనం వెలిసింది. మందారం విరిసింది. మకరందం కురిసింది. ఆమకరందం తెలుగుజాతిని పోతన వేమనల తర్వాత మరింత ప్రభావితం చేసింది. కరుణశ్రీ మాటలతో బొమ్మల్ని గీశారు. అక్షరాలతో మానవతాశిల్పాన్ని చెక్కారు. ఏయిజానికి చెందని హ్యూమనిజం మాత్రం తొణికిసలాడే ప్రజాకవి కరుణశ్రీ.

    200.00
    Add to cart
  • పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

    పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

    0

    “వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా ‘చెప్పించడం’ ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.”

    “ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.”

    “సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి ‘అలకనంద’ మంచి పనే చేసింది.”

    “తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ‘గోపీచంద్’ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’. “

    200.00
    Add to cart
  • యాజుష పూర్వ ప్రయోగ రత్నాకరము
  • శప్తభూమి

    శప్తభూమి

    0

    శప్తభూమి రాయలసీమ చరిత్ర నేపథ్యంగా రాసిన నవల. రాయల కాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు. అప్పటి జీవితము చిత్రించిన చారిత్రాత్మక నవల. హండే రాజుల కాలంనాటి సంఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ల దౌర్జన్యాల సమాహారం శప్తభూమి.

    ఈ నవలలోని చారిత్రక పాత్రలను సమీక్షించుకుంటున్నప్పుడు ఎక్కువమంది అణగారిన వర్గాల వారే అయి ఫున్నారన్న సంగతి తెలిసివచ్చింది. వారు దళిత బహుజన కులాలవారే ఈ విషయం గుర్తించిన తర్వాత రాయలసీమ చారిత్రక నవల కాస్తా, రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవలగా రూపం తీసుకోవడం ప్రారంభించింది. ఈ విధంగా, చారిత్రక కథ నుండి చారిత్రక నవలకూ, చారిత్రక నవల నుండి దళిత బహుజన చారిత్రక నవలకూ ప్రయాణించిన ఆలోచన క్రమం కూడా ఈ నవలా రచన వెనుక పనిచేసింది.

    – బండి నారాయణస్వామి

    135.00
    Add to cart
  • Shakespeare Naataka Kathalu - షేక్స్‌పియర్‌ నాటక కథలు

    Shakespeare Naataka Kathalu – షేక్స్‌పియర్‌ నాటక కథలు

    0

    నాటకాన్నినవరసాలలో ఆవిష్కరించడంలో తన రచనా కౌశలంతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానందాలలో ఓలలాడించిన విశ్వ విఖ్యాత నాటక రచయిత విలియమ్ షేక్స్ పియర్. ఈ అపురూప నాటక కథలులో షేక్స్ పియర్ రచించిన వెన్నిస్ వర్తకుడు, కింగ్ లియర్, కవలల కలకలం, నడిరేయి మిడిమేలం, జూలియస్ సీజర్, మెక్బెత్ ఆరు నాటకాలను కథారూపంలో మీకు అందిస్తున్నాం. ఈ ఆరు సుప్రసిద్ధమయినవే. ఆనంద ఆశ్చర్య వినోదాలతో పాటు లోకంలోని వివిధ రకాలైన వ్యక్తులు, వారి గుణస్వభావాలు – ఆశ, లోభం, క్రోధం, మొహం, అహంకారం మనుషుల్ని ఎలా బలితీసుకుంటాయో ఈ కథల్లో ఆయా పాత్రలద్వారా మనకు తేటతెల్లమవుతుంది. మనుషుల్లో ప్రాథమికంగా ఉండాల్సిన దయ, కరుణ, ప్రేమలకు ఈ కథలు ప్రభోదిస్తాయి.

    – ప్రచురణకర్తలు

    80.00
    Add to cart
  • Jashuva Rachanalu-1 (Gabbilam) - జాషువా రచనలు - 1 గబ్బిలం

    Jashuva Rachanalu-1 (Gabbilam) – జాషువా రచనలు – 1 గబ్బిలం

    0

    జాషువా రచనలు – 1 గబ్బిలం :

    జాషువా 1941లో గబ్బిలం వెలువర్చాడు. 20వ శతాబ్దంలో వచ్చిన ఆధునిక తెలుగు కావ్యాల్లో విశిష్టమైంది గబ్బిలం. ఖండకావ్య రచనలో సుమారు 22 సంవత్సరాలు పదునెక్కిన కలం సృష్టించిన అద్భుత ప్రతీకాత్మ కళాఖండం గబ్బిలం.

    ఖండకావ్య ప్రక్రియకు, ఊపిరులూది జవం జీవంతో తొణికిసలాడేలా చేసి ఆధునికాంధ్ర సాహిత్యంలో ప్రతిష్ఠాకరమైన స్థానం సంపాదించి పెట్టినవాడు జాషువ.

    సామాజిక అసమానతలపై ఏవగింపు, సంస్కరణల ఫలాలు చేతికి అందగలవన్న ఆశ రగుల్కొంటున్న తరుణంలో వర్ణాశ్రమ ధర్మాల పరిరక్షణను సమర్ధించే లక్షణాలు ముందుకొస్తున్నవైనం జాషువాను కలవరపరచాయి. హక్కుల సాధనకు ఉద్యమించే తరుణం ఆసన్నమైందని భావించాడు. హరిజనులుగా పిలవబడుతున్న వారిలో చైతన్యం రగిల్చి ఉద్యమించేలా చేసి దళితుల్లో ఆత్మగౌరవ సాధనకై తపించాలని ఊహించాడు. పీడకవర్గాల ముక్కుగుద్ది హక్కుల సాధనా దిశగా సాగిన మహాప్రస్థానంలో జాషువా ఎత్తిన అనల పతాకం గబ్బిలం. ఆగామి యుగంలో దళిత సూర్యుడి శిరసు నుంచిన అగ్ని కిరీటం గబ్బిలం.

    50.00
    Add to cart
  • Kadhanikalu

    Kadhanikalu

    0
    60.00
    Add to cart
  • Gulabi Meghaalu - గులాబి మేఘాలు

    Gulabi Meghaalu – గులాబి మేఘాలు

    0

    అంతరిక్షంలో ఎక్కడినుంచో, ఇంకొక గాలక్సీ నుంచో ఏమో, అత్యంత ఆశ్చర్యకరమైన గులాబి రంగు మేఘాలు మన భూమి మీదకు వస్తాయి. వాటి అన్వేషణ కోసం భారతీయ శాస్త్రజ్ఞుల బృందం అంటార్కిటికా వెళ్లి వారితో రకరకాల సంఘటనలలో తలపడుతుంది. ‘మేఘాలు’ అంటార్కిటికాలో ఉన్న మంచును అతి పెద్ద మొత్లాలలో కోసి అంతరిక్షంలోకి తీసుకొనిపోవడం శాస్త్రజ్ఞులు గమనిస్తారు. ‘మేఘాలు’ ఎటువంటి పరమాణు నిర్మాణాన్ని అయినా సరే, మానవ శరీరాలైనా సరే, పున:సృస్టించగలవు. నవలలోని పాత్రలు వారి వారి ప్రతిరూపాలతో తారస పడతారు. కాపీ చేయబడిన ఒక విమానాన్ని, కాపీ చేయబడిన ఒక ఊరిని చూస్తారు. మానవ మెడదులలోని ఆలోచనలకు (భూత, భవిష్యత్‌ కాలానికి చెందిన ఆలోచనలకూ) కూడా ‘మేఘాలు’ భౌతిక రూపకల్పన చేయగలరని మానవులు గ్రహిస్తారు. అటువంటి ప్రపంచంలోకి మన కథా పాత్రలు చొచ్చుకొని పోతారు. భూమి మీద జీవనాన్ని ఎందుకు మోడలీకరిస్తున్నారో శాఏజ్ఞులకి అర్థం కాదు. అంతరిక్షవాసులతో సంపర్కం ఏర్పరచుకోవడానికి (అంటే సంభాషించడానికి) చేసిన కొన్ని ప్రయోగాలు విఫలం అవుతాయి. అంతర్జాతీయ సదస్సులలో శాస్త్రజ్ఞులూ, రచయితలూ చర్చలు జరుపుతారు. ఎట్టకేలకు ఏమవుతుంది? శౄస్త్రజ్ఞులు చిక్కుముడి విప్పగలుగుతారా? ఇంకోక గాలక్సీకి చెందిన ఉత్కృష్ట నాగరికతతో సంబాషించగలుగుతారా? నవల చదివి తెలుసుకోండి…..

    పేజీలు : 245

    200.00
    Read more
  • Ghantaaravam - ఘంటారావం

    Ghantaaravam – ఘంటారావం

    0

    హెమింగ్వే రచనల్లో సుదీర్ఘమైన నవల ”ఫర్‌ హూమ్‌ ది బెల్‌ టోల్స్‌”. స్పెయిన్‌లో ఫాసిస్టులకూ, కమ్యూనిస్టులకూ జరిగిన సంఘర్షణ ఇందులోని వృత్తాంతం. నాలుగు దినాలలో నడిచిన ఘటనలు నాలుగువందల ముప్ఫైఅయిదు పుటలలో చిత్రించాడు. ఒక గుహలో కొద్దిమంది స్త్రీ పురుషులతో కథ నడిచినప్పటికీ మొత్తం ఉద్యమమంతా మన కళ్ళముందు కదులుతున్నట్లనిపిస్తుంది. ఫాసిస్టుల కిరాతక చర్యలతోపాటుగా, విప్లవకారుల అమానుష కృత్యాలు వర్ణించటంలో హెమింగ్వే ప్రదర్శించిన నిష్పాక్షిక నిర్లిప్తదృష్టి ఉత్తమ రచయితలకే సాధ్యమౌతుంది.

    290.00
    Add to cart
  • Thriller - థ్రిల్లర్‌

    Thriller – థ్రిల్లర్‌

    0

    చిన్నప్పుడు ఇంట్లో – తల్లి – తండ్రి – పనిమనిషి – పెద్దయ్యాక బాస్‌ – ఇంటి యజమాని – అతడికొడుకు – అందరూ తమ స్వార్ధం కోసం తమ జీవిత విధానానికి అనుగుణంగా కొన్ని -రీజనింగ్‌’లు సమకూర్చుకుని ఆమెకి మనష్యులంటే అసహ్యం పుట్టేలా చేశారు. ప్రేమకన్నా పెద్ద స్వార్ధం లేదనే సినికల్‌ భావానికి లోను చేశారు. ఆమె విద్యాధరి. అటువంటి పరిస్థితుల్లో ఆమెకి పరిచయమయ్యాడు ఓ విచిత్రమైన యువకుడు ….. అనుదీప్‌.
    ఆమె శరీరం మీదే ఆమెకి తెలియకుండా ప్రేమలేఖ రాసి ప్రజెంట్‌ చేశాడు. ఆమె కోసం, కుడి చేతిని భుజం వరకూ కోసేసుకున్నాడు. ప్రేమకన్నా గొప్ప శక్తి లేదని నిరూపించటం కోసం ప్రపంచం మొత్తం మీద విద్యుచ్ఛక్తి సరఫరాని ఇరవైనాలుగ్గంటల పాటు నిలిపివేశాడు. ఆమె కంగారు పడింది. కంగార్లోంచి ప్రేమ పుడుతుందా ? థ్రిల్లర్‌…. థ్రిల్లర్‌…. థ్రిల్లర్‌…. చదువుతున్నంతసేపూ ఉద్వేగమూ ఉత్కంఠా… చదివాక మనస్సంతా మధురమైన బాధా తియ్యటి వేదనా…. మనుషుల్లోని ప్రేమ రాహిత్యాన్ని ఎత్తి చూపిన నవల మాత్రమే కాదు. ఇది తెలుగులో ‘అబ్సర్డ్‌- రచనలు లేని లోటుని తీర్చిన నవల కూడా.

    80.00
    Add to cart
  • Tulasi - తులసి

    Tulasi – తులసి

    0

    ప్రశ్నలకు చూడకుండా సమాధానం చెబుతాననీ తాను దైవాంశ సంభూతురాలిననీ చెప్పుకుంటుంది సిద్ధేశ్వరీదేవి. జనం నుంచి లక్షలు వసూలు చేస్తూ మోసం చేస్తూన్న ఆ ”దేవి” బండారాన్ని బట్టబయలు చేయాలని ప్రయత్నిస్తుంది ఓ యువతి. ఆమె తులసి. ఈ తులసిని ఎలాగైనా కనిపెట్టి చేతబడి చేయాలని దార్కా అనే ఒక మహా మాంత్రికుడు బిస్తా నుంచి బయలుదేరతాడు. సిద్ధేశ్వరిదేవికి ఈ మాంత్రికుడు తారసిల్లుతాడు. అతడిని లోబరుచుకుని జనాన్ని ఇంకా దోచుకోవాలనే కుతంత్రం పన్నుతుంది సిద్ధేశ్వరి. అయితే అనుకోకుండా దార్కా తులసితో చేయి కలుపుతాడు. ఆ తర్వాతి కథ తులసిలో చదవాల్సిందే.

    తెలుగునాట సంచలనం సృష్టించిన ‘తులసీదళం’ నవలకు ఇది కొనసాగింపు. తులసి అనే చిన్నారికి చేతబడి చేసిన కాద్రా క్షుద్రదేవతల మూలాన చనిపోతాడు. దానికి పగ తీర్చుకోవాలనుకున్న విషాచి దార్కాసాహుకు మంత్ర విద్యలు నేర్పుతాడు. అందుకు ప్రతిఫలంగా అతడడిగే గురుదక్షిణ కాద్రా చావుకు కారకులైన ముగ్గురు నాగరికుల ప్రాణాలు. గురువుకు మాట యిచ్చిన దార్కా ఒకే ఒక్క వెంట్రుక సాయంతో ఒకే ఒక్క ఆధారమయిన తులసిని వెదుక్కుంటూ వెడతాడు.

    చివరికి ఏం జరిగింది ? దార్కాతులసి స్నేహితులెలా అయ్యారు ? క్షుద్రశక్తులు ఉన్నాయా ? లేవా ? దీనికి సైన్స్‌ ఏం చెబుతోంది ? హేతువాదానికీ చేతబడుల వంటి విశ్వాసాలకీ లంగరు వేసే నవల ‘తులసి’. ప్రచురణ – నవసాహితి బుక్‌ హౌస్‌.

    100.00
    Add to cart