-
-
Thirumala Divyakshetram
0₹450.00శ్రీనివాసుడి అవతరణ ఎలా ఎందుకు జరిగింది?
తిరుమల దేవుడి రూపు విష్ణువుదా? శివుడిదా ? శక్తిదా ?
కాళీ మాయల్నుండి శ్రీనివాసుడు భక్తుల్ని ఏ విధంగా రక్షిస్తున్నాడు?
ఆలయ తలుపులు మూసేసే ముందు గర్భగుడిలో పూజాద్రవ్యాలు ఎందుకు ఉంచుతారు.
స్వామివారి హస్త విన్యాసాలు బోధించే తత్వం ఏమిటి?
ఆనంద నిలయంలో కొలువైన ఇతర దేవత మూర్తులేవారు?
అది మానవుడు తిరుమల పరిసరాల్లో తిరుగాడాడా?
ఏడుకొండల కి ఆ పేర్లు ఎలా ఎందుకు వచ్చాయి.
మెట్ల దారిలో అడుగడుగునా మైమరిపించే విశేషాలేమిటి?
మరెన్నో…
సింహప్రసాద్ -
Unnava Lakshminarayanagari Malapalli Oka Paramarsha
0₹200.00ప్రవేశిక
బహుముఖమైన మానవ జీవిత చిత్రణకు అనువైన ఆధునిక వచన సాహిత్య ప్రక్రియ ‘నవల’. జీవితాన్ని సహజంగా చిత్రించి, వ్యాఖ్యానించటమేగాక, అందలి సమస్యల్ని చర్చించి, పరిష్కార మార్గాల్ని గూడా నవల చూపగలుగుతోంది. వ్యక్తి జీవితంలోనూ, సమాజంలోనూ వస్తున్న పరిణామాల్ని చక్కగా ప్రతిబింబిస్తూ, కొత్త కొత్త శిల్ప ధోరణుల్ని సంతరించుకుంటూ, ‘నవల’ నానాటికీ ఎదుగుతోంది. ఇట్లా ప్రజా జీవితానికి సన్నిహితంగా ఉంటున్నది కాబట్టే ‘నవల’ ఇతర సాహిత్య ప్రక్రియల కంటే అధికంగా ఆదరింపబడుతోంది.
తెలుగు నవలకు నూరేళ్లు దాటాయి. ఈ నూరేళ్ల పైచిలుకు కాలంలో వేల సంఖ్యలో నవలలు వెలువడ్డాయి. వీటిలో “యివీ మా తెలుగు నవలలు” అని తెలుగు జాతి చెప్పుకోదగ్గ స్థాయిలో గల ఉత్తమ నవలలు కొన్ని ఉన్నాయి. దీనిలో “మాలపల్లి, ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు..
తెలుగు నవలా సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానాన్ని సాధించుకొన్న ‘మాలపల్లి” పరామర్శకు “మాలపల్లి” రచయిత శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి జీవిత విశేషాలు, ఆనాటి మాలపల్లి ప్రచురణ, ఆదరణలకు సంబంధించిన విశేషాలు తెలిసి కోవడం అవసరం.
ఉన్నవ జీవిత విశేషాలు :
‘మాలపల్లి’ నవలా రచయిత, సుప్రసిద్ధ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమర యధులు, ఆంద్రోద్యమ సూత్రధారుల్లో ఒకరూ, శారదానికేతన సంస్థాపకులూ అయిన ఆ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు గుంటూరు జిల్లా వేములూరు పాడులో 1877 డిసెంబరు 4న జన్మించారు. (ఈశ్వర నామ సంవత్సర కార్తీక బహుళ 30, ప్రక్క గ్రామమైన ‘అమినాబాదు’లో ప్రాథమిక విద్య అభ్యసించిన అనంతరం, గుంటూరు ఎ.ఇ.యల్.యమ్. కళాశాలలో యఫ్.ఎ. వరకు చదువుకొన్నారు. ఉపాధ్యాయుడుగా,…………..
-
Untitled
0₹185.00ఒక రచయితగా సాటి రచయితలు ఏం రాస్తున్నారో తెలుసుకోవడం చాలా ఆసక్తిగా చూస్తుంటాను. ఒక పబ్లిషర్‌గా కొత్త రచయితలు ఎవరున్నారా అని అన్వేషిస్తూనే ఉంటాను. రచయితగా స్వరూప్ వాక్యం చదివి ఈర్ష్య కలిగింది. తెలుగులో కన్సిస్టెంట్ గా ఇంతమంచి వాక్యం రాసే రచయితను నేనైతే ఇంతవరకూ చూడలేదు. ఒక పబ్లిషర్‌గా స్వరూప్ అనే రచయితను కనుక్కోవడం ఒక యురేకా మొమెంట్. స్వరూప్ ఫేస్ బుక్ లో రాసిన మ్యూజింగ్స్ ని పబ్లిష్ చేయడం ఆన్వీక్షికి ప్రచురణాలయానికి ఒక గర్వకారణం. స్వరూప్ రాతలు చదువుతుంటే అతను ఏమేం పుస్తకాలు చదువుతుంటాడో అని తెలుసుకోవాలనిపిస్తుంది. ఫేస్ బుక్ లో పోస్ట్ రాసే ముందు అతనేం తింటాడో, తాగుతాడో అని క్యూరియస్ గా ఉంటుంది. అసలు అతను జీవితాన్ని, ప్రపంచాన్ని చూసే కళ్ళని కొన్ని రోజులు అద్దెకు తీసుకోవాలనిపిస్తుంది. స్వరూప్ మ్యూజింగ్స్ చదవడమంటే తెలుగు భాషను కొత్తగా డిస్కవర్ చేసినట్టుంటుంది. ఎప్పుడైనా కథలో ఎక్కడో ఒక చోట ఒక మంచి అబ్జర్వేషన్ ని రాసి శభాష్ అని భుజం తట్టుకుంటుంటాం. కానీ స్వరూప్ ప్రతీవాక్యం ఒక వండరలా తోస్తుంది.
వెంకట్ శిద్దారెడ్డి రచయిత, సినీ దర్శకులు
-
-
Ushasri Rachanalu
0₹750.005 BOOKS OF SETఇంటింటా వుండవలిసిన ఉషశ్రీ గారి రచనలుఉషశ్రీ రామాయణంఉషశ్రీ భారతంఉషశ్రీ భాగవతంఉషశ్రీ భగవద్గితఉషశ్రీ సుందరకాండఅఖిలాంద్ర శ్రోతలను తన కంచు కంఠంతో రేడియో తరంగాల ద్వార ఉర్రుతలుగించిన సాంప్రదాయ ఘనవాచస్పతిఉషాశ్రీగారిచే ఫై రచనలు అన్ని సరళ వచనములో (అందరు తేలికగా చదువుకొనేలా) వ్రాసారు. -
Vamsankuram – వంశాంకురం
0₹80.00తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.
వంశాంకురం :
కొడుకుని తమ యిష్టాయిష్టాలకు బలిచేసినా మనవడి కోసం పెద్దతరం వారు పడే ఆవేదన, ఆ ఒక్క కోరిక తీరడానికై నలిగిన రేఖలాంటి కోడల్ని ఇంటికి తెచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నా, ఆ అమ్మాయి అదుకు అంగీకరించక పోవడం పెద్దలకు మింగుడు పడని ప్రశ్న.
స్త్రీ జీవిత సాఫల్యం వంశాంకురాన్నిచ్చి తానుగా రాలిపోవటమేనా?
రేఖ జీవితం ఓ కన్నీటి కెరటాల వెన్నెల, ఆ వెన్నెలను తన వారికిచ్చి తాను నిశీధంలోకి నిష్క్రమించిన స్త్రీ ఎదుర్కొన్న జటిలమైన సమస్యలకు ”వంశాంకురం” నవలాదర్పణం!
పేజీలు : 175
-
Vamsi Evo Konni Gurtukostunnayi
0₹600.00‘ఏవరినన్నా పెళ్లి చేసుకోవాలి ఈ నెలలో…
అనుకుంటా బజార్లో నడుస్తా వస్తున్న నాకు ఒంట్లో నలతగా ఉన్నట్టనిపించడంతో, హాస్పిటల్కెళ్తే తెలిసింది గర్భవతినని…’ అంటా రాయడం మొదలెట్టానో లేదో ఒక్క కుదుపుతో ఆగి మళ్లీ కదిలింది మేమెక్కినా రైలు.“నా పేరు కళ… పూర్తి పేరు జీవకళ…’
“నీ పేరేంటీ?”
“రూప.”
“పూర్తి పేరు చెప్పు?”
“సాధురూప.”…………
Features
-