-
Prayanam
0₹295.00‘రాజశుక. మంచి పేరు పెట్టారు.’ పూజారి మెచ్చుకున్నాడు.
‘నాకు కొడుకు పుట్టాడని మా నాన్నగారికి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన భాగవతం మొదటి స్కంధం చదువుతున్నారు. ఆయనే ఈ పేరు సూచించారు.’ రాజశుక తండ్రి సుబ్బరాజు వివరించాడు.
‘పాలు పితికినంత సేపు రాజశుక ఒక చోట ఉండడు.’ పెద్దయ్యాక రాజశుక విన్నాడు.
ఆర్నెలల్లో 11 జ్యోతిర్లింగాలని రాజకుశ ఏ లాభం కోరి సందర్శించాడు?
రాజశుక తన ఆథ్యాత్మిక ప్రయాణంలో, తీర్థ యాత్రల్లో ఏం నేర్చుకున్నాడు?
అతనికి అనేక చోట్ల కలిగిన వివిధ అనుభవాలు ఏమిటి?
హిందూ సంప్రదాయంలోని సన్న్యాసాశ్రమం నియమాలు ఏమిటి?
ఆసక్తి కలిగించేలా, హాయిగా చదివించేలా ఆథ్యాత్మికతని రాయగల మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ప్రయాణం.
జయం, పరంజ్యోతి, విధాత నవలల తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నాలుగో ఆధ్యాత్మిక నవల ప్రయాణం.
-
Premaki Mugimpu Eppudu?
0₹80.00ఈ పుస్తకంలో, కధలూ – వ్యాసాలతో పాటు ఇంకా ఏ యే విషయాలున్నాయో అవన్నీ ‘విషయ సూచిక’ లోనే తెలుస్తాయి. దానిలో వున్న 2,3 విషయాల గురించి, కొంచెం చెప్పాలని ఈ ముందు మాట!
కధల్లో, 2వ కధ ‘సుమ ప్రేమ కధ’, ఇందులో వున్న కధా వస్తువు కొంత కొత్తదే! ఇటువంటి వస్తువుని నేనెక్కడా చదవలేదు. కొన్ని ప్రాంతాల్లో ఆహారాల అలవాట్లు ఫలానా రకంగా తేడాలుగా ఉంటాయని తెలుసు. కానీ ఇది తెలిసింది కొన్నాళ్ళ కిందట! అప్పటి నించీ ఆ వస్తువుతో ఒక కధ రాయాలని ఆలోచన! సుమకి జరిగినట్టే, నా వయసులో నాకు జరిగి వుంటే, నేను కూడా సుమ లాగే ప్రవర్తించేదాన్ని అనుకుంటాను. అలా అనుకుంటున్నాను గానీ, అలాగే జరిగేదో లేదో! ఈ కధ ‘స్వాతి’ మాస పత్రికలో మొదట వచ్చినప్పుడు, ఈ కధ కొందరికి నచ్చడమూ, కొందరికి నచ్చక పోవడమూ, రెండూ జరిగాయి. ఇతర కధలకు కూడా, నచ్చడాలూ – నచ్చక పోవడాలూ జరుగుతూనే వుంటాయి. కానీ ఈ ‘సుమ కధ’ విషయంలో మాత్రం, 2 రకాలూ గట్టిగా కనపడ్డాయి. నాకైతే, ఈ కధ చాలా నచ్చింది. నేను రాశాను కదా అని కాదు; ఆ వస్తువుని బట్టి!
– రంగనాయకమ్మ
-
-
SHANKARABHARANM By Vamsi
0₹200.00SHANKARABHARANM By Vamsi
ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ చిరస్మరణీయ చిత్రం ‘శంకరాభరణం’ వెండితెర నవల (Novelization) రూపంలో పుస్తకంగా అందుబాటులో ఉంది. వంశీ రచించిన ఈ అపురూప గ్రంథాన్ని విశ్వనాథ్ తనయుడు కె. నాగేంద్రనాథ్ ఇటీవల పునర్ముద్రించారు. ఈ పుస్తకం శంకరాభరణం సినిమాలోని భావోద్వేగాలు, సంగీత, సాహిత్య విశేషాలను అక్షర రూపంలో అందిస్తుంది.
-
-
Sri Lekha
0₹275.00“ఖారమేలా! నీకు మనిషంటే భయం. నీ నీడంటేనే నీకు భయం. అందుకే నిరంతరం అప్రమత్తతో నిద్రలేకుండా బ్రతుకుతుంటావు. ఇనుప కవచాల కటకటాల మధ్య నిన్ను నీవే బంధించుకుంటూ, చుట్టూ వందలాది సైనికులను నీకు నీవే కాపలా పెట్టుకుని స్వేచ్ఛలేని జీవంలా అరుస్తూ, రోదిస్తూ జీవిస్తున్నావు. ఖారమేలా! ఇదీ ఒక జీవితమేనా? నీవు నిజంగా వీరుడవైతే ఈ పావురం కాలికి దెబ్బ తగిలింది. దీని కంటినీరు తుడవగలవా?” అని ప్రశ్నించింది. శ్రీలేఖ.
“ఏమే సీతలా, సావిత్రిలా ధర్మోపదేశాలు చేస్తున్నావు?”
“అనవసరంగా పౌరాణికపు పోలికలు వద్దు. నేను సీతనైతే, నీవు రావుణుడివి కావలసివస్తుంది.”
“ఓరోరి! ధాన్యకటకపు వన్నెల చిలక కూనిరాగాలు పాడుతుందిరా! దీనిని కట్టేసి మనం జరపబోయే సింహక్రీడలో ఆహారంగా పడేయండి”
“రసవత్తరమైన ఇటువంటి సంభాషణలతో నిండిన ఈ చారిత్రక నవల క్రీ.పూ.200సంవత్సరాలకు పూర్వం నేటి గుంటూరు జిల్లాలోని అమరావతి (ధాన్యకటకము) రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఆంధ్ర శాతవాహనుల గాధ.
– ముదిగొండ శివప్రసాద్
-
Sri Sri Suktulu (Samajikam) 2nd Part
0₹125.00అతని పేరు కొంచెం అతని ఊరు ప్రపంచం
అతడే శ్రీశ్రీ
జాజికం
001
ఢంకాని జోకొట్టాలనీ,
అలల్ని అరికట్టాలనీ, గాలిని ఉరి తియ్యాలనీ ఇదివరకెన్నో ప్రయత్నాలు
జరిగాయి. ఇక ముందు కూడా జరుగుతాయి.
కాని అవి ఎన్నడూ ఫలించలేదు.
ఇకముందు కూడా
ఫలించబోవు.
-