• Pallavi Leni Pata

    Pallavi Leni Pata

    0

    రంగనాయకమ్మ గారు సమర్పిస్తున్న ఈ పుస్తకంలో పల్లవి లేనిపాట! శీర్షికతో ఒక నవలికా ‘కులవిధానం’ గురించీ. ‘దెయ్యాల శాస్త్రం’ గురించీ. ‘మార్క్సిజం’ గురించీ కొన్ని వ్యాసాలూ ఉన్నాయి.
    ఈ పుస్తకంలో వున్న ఎక్కువ వ్యాసాలు ‘వర్గాలకూ-కులాలకూ’ సంబంధించినవి. ఆ అన్ని వ్యాసాలలోనూ వున్నది ఒకే సమస్య. ఒకే పరిష్కారం, కాని, చర్చించిన కారణాలు వేరు వేరు.

    ఈ పుస్తకంలోనే వున్న ఇతర వ్యాసాలలో కొన్ని, ”దెయ్యాలూ-పరలోకాలూ కూడా సైన్సు విజ్ఞానమే” అని చెప్పే అజ్ఞానశాస్త్రం మీద విమర్శనా వ్యాసాలు.
    ఏదైనా ఒక సమస్య మీద వాదోపవాదాలు జరిగితే. అందులో హేతుబద్ధమైన వాదం కనపడితే, మన వాదం తప్పుగా వున్నట్టయితే, మనం మన వాదాన్ని తప్పకుండా మార్చుకోవాలి.
    అది ఎదుటి వాళ్ళ కోసం కాదు; మనకోసమే – మన అభివృద్ధి కోసమే.

    ఈ పుస్తకంలో వున్న చిట్టచివరి వ్యాసం, మార్క్సిజాన్ని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవడానికి అవసరమైనది.
    ఆ అవసరం కోసమే చర్చించదగ్గది. ‘పల్లవిలేని పాట’లో రెండు రకాల చర్చలు వున్నాయి. ‘కుల భేదాల’ గురించీ, ‘ప్రేమ సంబంధాల గురించీ’. ఈ చర్చల్ని కూడా పరిశీలించండి!

    100.00
    Add to cart
  • Panigrahanam

    Panigrahanam

    0

    పాణి తల్లి రోడ్ ఏక్సిడెంట్ కి గురైంది. ఆ ప్రమాదం చేసిన సినిమా ప్రొడ్యూసర్ కమలాకరం ఆవిడ చికిత్స కోసం డబ్బు ఇవ్వడానికి తిరస్కరించాడు. పాణి, అతని మేనమామ రోహిత్ ఎం చేసారు? అది వాళ్ళకి ఎం చేసింది?
    పోలీస్ వెంకటస్వామి, డేటిక్టివ్ సింహం, అతని అసిస్టెంట్ బ్రహ్మం, మృదుపాణిని ప్రేమించిన వరవిణ లాంటి పాత్రలతో, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ తో క్రైం, ప్రేమ, సస్పెన్స్ లతో సాగె కామెడీ థ్రిల్లర్ పాణిగ్రహణం.

    295.00
    Add to cart
  • Pantulamma - పంతులమ్మ

    Pantulamma – పంతులమ్మ

    0

    తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

    పంతులమ్మ :

    బస్సుదిగి స్కూలు వైపు దృష్టి సారించింది సుచరిత. పిల్లలూ, ఉపాధ్యాయులూ ప్రార్థన ముగించి తరగతులలోకి వెళ్తున్నారు. మనసంతా అదోలా అయింది. తొమ్మిది కాకముందే యింటివద్ద బయలుదేరి, లేటు మార్కువేయించుకోవాలంటే సిగ్గుగా వుంది. త్వరత్వరగా వెళ్ళి అటెండెన్సు రిజిష్టరులో సంతకము చేసి తరగతికి వెళ్ళిపోయింది. పాఠశాలంతా కలయతిరుగుతూ ప్రధానోపాధ్యాయులు కనిపించారు. ఆయనకు విష్‌ చేసే ధైర్యము లేకపోయింది. ఉపాధ్యాయులందరూ ప్రార్థన వేళకు విధిగా వుండాలంటారాయన. కాని తనే చేయగలదు? రాజధానిలో బస్సుల ప్రయాణం గురించి రాస్తే ఓ భారతం అవుతుంది. ఒక రోజు బిఫోర్‌ టైమంటూ మధ్య దార్లో ఆపుతారు. ఇంకో రోజు స్టాపుకు దూరంగా తీసుకుపోయి ఆపుతారు. ఇవి రెండూ లేనినాడు బస్సు దానంతటదే ఫేలవుతుంది. కండక్లర్లకు డబ్బులిచ్చి టికెట్‌ అడగ్గూడదు. అడిగితే ఆ మనిషి స్టేజి దగ్గర కనిపిస్తే చాలు బస్సును ఆపరు. అందరూ అలాగే ఉంటారని కాదు….

    పేజీలు : 151

    80.00
    Add to cart
  • Pardhu - పార్ధు

    Pardhu – పార్ధు

    0

    “…పది సంవత్సరాలు అతనితో కాపురం చేసిన నాకు నీతో మళ్ళి పెళ్ళా ! ఇది జరిగే పనేనా !
    రాంబాబు ముఖం ఎర్రబడింది. ఆగ్రహం అదిమిపెట్టాడు.
    “ఈ విషయం నీతో సంబంధం పెట్టుకునే టప్పుడు నీక గుర్తు రాలేదా! అంత నీతి గలదానివి. అంతనంటే అంత గౌరవం ఉన్నదానివి, నన్నెందుకు తిరస్క రించలేక పోయావు? నీ కడుపులో పెరుగుతున్ననా  శిశువుని  సత్యం సంతోషంగా చెలామణి చేయటం నీకు న్యాయంగా ఉందన్నమాట.
    “నువ్వు ఈ కుశంకలన్ని మానేయి! నీ మనసులో అసలు భయం నాకు తెలుసు, పరువు మర్యాద కోసం పెనుగులాడు తున్నావు నువ్వు. అవి మనిద్దరి సంతోషం కంటే విలువైనవి కావ. సత్యం వెళ్ళి పోమన్నపుడు నీకింక సందేహం ఎందుకు?
    “పార్ధు వున్నాడు. వాడినేం చెయ్యను. వాడు తండ్రిని విడిచి రాదు”
    పెద్దవాళ్ళ చేడునడతలకు పిల్లలు ఎలా బలి అవుతారో చిత్రించే నవల పార్ధు . ఓ పదకొండేళ్ళ పసివాడు. తల్లి లక్ష్మి, తండ్రి సత్యం. లక్ష్మి పిన్ని కొడుకుకని చెప్పుకుని రంగ ప్రవేశం చేస్తాడు రాంబాబు. అతడొట్టి జులాయి మనిషి. లక్ష్మి కి రాంబాబుకి  అక్రమ సంబంధం ఏర్పడుతుంది. వారిద్దరూ కలిసి ఉండగా , అది ఒకనాడు పార్ధు కంటపడుతుంది . అక్కడి నుండీ ఆ పసి మనసులో అలజడి మొదలవుతుంది.
    పెద్దవాళ్ళ అనైతిక వర్తన పసి హృదయాలనేలా ప్రవ్యలు చేస్తుందో అత్యంత ప్రతిభావంతంగా చిత్రించే యద్దనపూడి సులోచనా రాణి నవల – పార్ధు.

    75.00
    Add to cart
  • Paris Commune - పారిస్‌ కమ్యూన్‌
  • Patna Oka Prema Katha

    Patna Oka Prema Katha

    0

    సమకాలీన సందర్భంలో ముస్లిం అస్తిత్వ వేదనకి సంబంధించిన దాదాపూ ప్రతి కోణం ఈ నవలలో కనిపిస్తుంది. – అఫ్సర్

    మండల్ కమిషన్ నుంచి మోడీ ప్రమాణ స్వీకారం దాకా సాగిన 90 ల తరం ఆత్మ కథ అబ్దుల్లా ఖాన్ రాసిన నవల – పాట్నా ఒక ప్రేమ కథ. ఇది ఒక అనుభూతి. మనసుతోనే పలవరించు. బతుకును బతుకుగానే వుండనివ్వు, దానికి వేరే పేరెందుకు? – అనంతు చింతపల్లి

    భారతీయ సాహిత్యంలో అరుదుగా కనిపించే సమకాలీన ముస్లిం జీవితాల గురించి చేసిన ఒక నివేదిక ఈ నవల.    – అమితవ్ కుమార్

    ప్రేమ, దుఃఖం మరియు ఆకాంక్షల కథ ఇది. అంతే కాదు ఇది పాట్నా నగరపు భావగీతం కూడా!

    ఈ కథ మన గుండెల్ని మెలిపెడుతుంది ఇంతలోనే మనల్ని మైమరిపిస్తోంది. ఈ విషాద వీరుని కథ చదివి కన్నీరు పెట్టకుండా ఉండడం కష్టం.

    250.00
    Add to cart
  • Peka Medalu Chaduvukunna Kamala - పేక మేడలు చదువుకున్న కమల

    Peka Medalu Chaduvukunna Kamala – పేక మేడలు చదువుకున్న కమల

    0

    రంగనాయకమ్మ గారు రచించిన “పేకమేడలు మరియు చదువుకున్న కమల” అనే 2 నవలల సంపుటం ఈ పుస్తకం.
    ***
    భాను పగలబడి నవ్వుతోంది. ఉలిక్కిపడి లేచాను. ఏదో భయం ముంచుకొచ్చింది. భాను ఏడుస్తూందేమో! ఈ అర్ధరాత్రి! ఒక్కతీ! చాలా సేపు చీకటిలోనే లేచికూర్చున్నాను. ఒకసారి వెళ్ళివద్దామా అనిపించింది. కానీ నేను అంత అర్ధరాత్రి వెళ్తే అతను ఏమైనా అనుకోవచ్చు. అనవచ్చు కూడా. ఆలోచనలోనే మగతగా నిద్రపట్టింది కొంత సేపు.

    ఎవరో కంగారు కంగారుగా లేపుతున్నారు! తుళ్ళిపడ్డాను!

    అతను, భాను భర్త రాజశేఖరం! మనిషంతా కంపించిపోతున్నాడు. “భాను …. లేదు. ఈ ఉత్తరాలు….” అంటున్నాడు తడబడుతూ……..

    60.00
    Add to cart
  • Pelli + Pillalu = Jeevitam - పెళ్లి + పిల్లలు = జీవితం

    Pelli + Pillalu = Jeevitam – పెళ్లి + పిల్లలు = జీవితం

    0

    చెందు నీరసంగా వచాడు. దానితో ఒకటే శాపనార్ధాలు. అసలే నల్లటి మనిషి , అందులో ఎత్తు పళ్ళు . కాస్త ఎత్తు. ముఖం ఎంతయినా వికారంగా అన్పిస్తుంది.
    సవితకి తన మీద తనకే అపరితమైన జాలి వేసింది. వెల్లువలా సానుభూతి పొంగి వచ్చింది. ఛీ ! ఏం మొగుడు. వద్దు మొర్రో అంటుంటే వినకుండా అమ్మ అన్నయ్య కలిసి కానీ కట్నం ఇవ్వనవసరం లేదు కదా అని ఈ మృగానికి తనని కట్టబెట్టారు. ఈ గంగిరెద్దు ఎవరో కాదు. స్వయంగా తనకి మేనత్త కొడుకే ! ఈ చంద్రమోహన్ చిన్నప్పటినుంచీ అంతే ! అడంగిలా వాళ్ళమ్మ వెనుక చేరి ఇంటి పనుల్లో సాయం చేయమంటే ఫస్ట్.
    తను ఎండమావుల వెంట పరుగేడుతోందన్న సంగతి తెలుసుకోవడానికి సవిత కి చాలా సమయమే పట్టింది. అందం, ఆకర్షణ, గ్లామర్ , పేరు లాంటి వాటిని నమ్ముతూ బ్రతికేవారు ఎప్పుడో ఒకప్పుడు బంగపడక  తప్పదు . పెళ్లి , పిల్లలు లేని లోటు ఈ ప్రంపంచంలో ఏదీ తీర్చలేదు. ఈ బందం జీవితానికి ఇరుసు లాంటిది. అది లేకపోతె చక్రం ఉండదు. గమనమూ ఉండదు. జీవితంలో ఈ రెండింటి అవసమేమిటో చిత్రించే యద్దనపూడి సులోచనా రాణి నవల   పెళ్లి !+ పిల్లలు !! = జీవితం.

    50.00
    Add to cart
  • Pillala Kosam Aardhika Sastram - పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం

    Pillala Kosam Aardhika Sastram – పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం

    0

    పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం (మార్క్స్‌ ‘కాపిటల్‌’ని ఆధారం చేసుకుని రాసిన పాఠాలు) – రంగనాయకమ్మ
    పిల్లలకు సైన్సు విషయాలు కూడా అందుతూ వుండాలి. సైన్సు అంటే, మనం నివసించే ప్రకృతి గురించీ, మనం జీవించే సమాజం గురించీ, నిజమైన విషయాల్ని రుజువులతో సహా వివరించే జ్ఞానం.
    ప్రకృతి విషయాల్లో, ప్రతి సైన్సునూ నేర్చుకోనక్కరలేదు. వైద్యశాస్త్రం ప్రతిమనిషికీ క్షుణ్ణంగా అక్కరలేదు. రోజువారీగా పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు తెలిస్తే చాలు. అనారోగ్యాలు మీద పడ్డప్పుడు. వాటి సంగతి వైద్యులు చూసుకుంటారు. వైద్యులకు తెలిసినంత శాస్త్రం ప్రతి మనిషికీ అక్కరలేదు. ఇతర ప్రకృతి శాస్త్రాల సంగతి కూడా అంతే. కాని, మనం జీవించే సమాజం గురించి చెప్పే శాస్త్రం సంగతి అలా కాదు. మనం మనుషులం, జంతువులం కాదు. జంతువులైతే పుట్టినవి పుట్టినట్టే జీవించి మరణిస్తాయి. వాటికి ఏ శాస్త్రాలూ, జ్ఞానాలూ అక్కరలేదు. కానీ, మనుషులకు మనుషుల సంబంధాల గురించి తెలియాలి. ఆర్ధికశాస్త్రమే మనుషుల సంబంధాల్నీ, వారి జీవిత విధానాల్నీ వివరిస్తుంది. ఈ శాస్త్రమే, నిన్నటి ఇవాల్టి రేపటి జీవితాల్ని చూపిస్తుంది. ఇది ప్రతి మనిషికీ తెలిసి వుండాలి.
    పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం పుస్తకం రంగనాయకమ్మ గారు రాసారు. ‘పిల్లల కోసం’ అనే దృష్టితో పాఠాల్ని ఎక్కువ వివరాలతో ఇచ్చారు. ఇది పిల్లల కోసం కాబట్టి పుస్తకంలో అక్షరాలపైజు చాలా పెద్దది. కాని పాఠాలన్నీ చిన్నవే. ఈ మాత్రం పాఠాలు లేకపోతే ఈ సైన్సుని కనీసంగా అయినా తెలుసుకోవడం సాధ్యం కాదు.  ఈ పాఠాల పేర్లూ, వాటిల్లో మాటలూ, వాటిల్లో పాత్రలూ, పిల్లల చెవుల్లో, మనసుల్లో పడితే చాలు. అసలు ఇలాంటి శాస్త్రం ఒకటి వుందని పిల్లలకు తెలిస్తేచాలు. పిల్లలకు ఎక్కడన్నా అవసరమైతే, పెద్దవాళ్ళు కొంచెం సహాయం చేస్తే అసలు సమస్యే వుండదు.

    100.00
    Add to cart
  • Power of the Plus Factor

    Power of the Plus Factor

    0

    The key to fulfill your desires, realize your dreams and find true happiness is the Plus Factor. When activated, this key motivates you to achieve good health, confidence and security.

    Dr. Norman Vincent Peale, one of the most popular and inspirational writers of his time, explains how you can tap into this inexhaustible resource of energy and achieve your goals.

    This book will teach you how to:
    • Unlock your potential through creative dreaming
    • Set positive goals to enrich your inner self
    • Overcome setbacks by persistence and perseverance and
    • Achieve your ultimate goals

    Power of the Plus Factor will guide you and help you discover the joys of a healthy and happy lifestyle.

    Norman Vincent Peale is the internationally acclaimed author of 46 books, such as Be A Winner, Positive Living Day By Day and Six Attitudes for Winners. He was a progenitor of the theory of “positive thinking”.

    120.00
    Add to cart
  • Praavenya Jeevana Pradeepika

    Praavenya Jeevana Pradeepika

    0

    ప్రావీణ్య జీవన ప్రదీపికలో అనేకానేక భావాలు, సాధనాలు, ప్రపంచస్థాయిలో, నిండి నిబిడీకృతమై ఉన్నాయి. అవి మిమ్మల్ని క్షణాల మీద ప్రపంచ శ్రేణి విజేతల స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ పుస్తకంలో జీవితాన్ని అనూహ్యంగా మార్చే 36 అంశాలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి మిమ్మల్ని వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ పై స్థాయికి పెంచుతాయి.

                    ఒక్కొక్క రోజూ బ్రహ్మాండమైన ఫలితాలను సృష్టిస్తూ, ఒక మహాకావ్యంలా జీవించే హక్కుమీకుంది. నిరాశానిస్పృహలను పూర్తిగా పారద్రోలండి. మీరు అత్యంత గొప్పగా చేస్తున్నట్టు భావించుకోండి. ప్రావీణ్య జీవన ప్రదీపిక మీకు జీవితంలో ప్రావీణ్యం పొందాలన్న ప్రేరణనిచ్చి, మీ సాహసోపేతమైన కలలను మీరు గుర్తించేలా చేసి, మీ భవిష్యత్తు మీ గుప్పిట్లోనే ఉందని బోధించి, మీలో ఉన్న శక్తితో మీరు మళ్ళీ కలిసే ప్రదీపికగా నిలుస్తుంది. ప్రజ్ఞావంతమైన ఈ పుస్తకం మీ ప్రదీపిక ఇవాళే చదవటం మొదలుపెట్టండి!

    175.00
    Add to cart
  • Prasnale Samadhanalu

    Prasnale Samadhanalu

    0
    199.00
    Add to cart