• Ashtavakra - అష్టావక్ర

    Ashtavakra – అష్టావక్ర

    అంగుళంలో మూడువందలో వంతు మాత్రమే వున్న అతడు – చిన్న తల, పెద్దతోక వేసుకుని, చేప ఎదురీదినట్టు ప్రవాహానికి కొన్ని వేలమైళ్ళు ఎదురీదుతూ, ఎదురొచ్చే ద్రవాలతో పోరాడి తన ఉనికిని నిలుపుకుంటూ ఆమెను చేరుకున్నాడు.

    జైగోట్‌!

    ఒక శుక్లకణ,ం ఒక బీజాన్ని వలయంలా చుట్టుముట్టి ఇరవైమూడుని ఇరవైమూడు జతలు చేసే సమయాన – అదే సమయాన – ఆగర్భంలో నిక్లిప్తం అవటం కోసం – సుషుప్తిలోంచి నెమ్మదిగా కనులు విప్పింది.

    కాష్మోరా!!!

    ఆ పిండానికే ప్రాణం వస్తే-తొమ్మిది నెలల తరువాత పుడతాడు – ప్రపంచాన్ని ఏలటానికి, బీభత్సం సృష్టించటానికి, కాష్మోరా అంశగల అష్టావక్ర.

    దట్టంగా పేరుకున్న ఎండుటాకుల క్రింద నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎవరో నిద్రలేచి బద్ధకంగా నిట్టూర్చిన వేళ! ఆనందనృత్య హేల!! చీకటి ప్రపంచపు గణాధిపతుల కాష్మోరా అంశతో ప్రపంచాన్ని ఏలటానికి వస్తున్నాడు ‘అష్టావక్ర’. అతడి ఆగమనానికి సూచనగా అప్పుడే ఏడుగురు వికృత శిశువులు ఆ గ్రామంలో జన్మించారు. దేశం దృష్టి యావత్తూ ఆగ్రామం మీద పడింది. ఎనిమిదోనాడు కేదారి గర్భాన ప్రవేశించాడు. అతడి పుట్టుకని ఎవరాపగలరు ?

    కొన్ని వేల సంవత్సరాల క్రితం శిశువు జన్మించగానే శరీరం అంతా ఉప్పుజల్లి బ్యాండేజీతో కట్టేసేవారట. ఇంత అనాగరికమైన పరిస్థితి నుంచి ఎదిగాడు మనిషి. మ్యుటేషన్స్‌ రహస్యాన్ని శోధించాడు. క్లోనింగ్‌ ప్రయోగాల్లో విజయం సాధించాడు. కానీ ఇదంతా వెళ్ళి ఎక్కడ కలుస్తుంది ?

    సామాన్యులు కలలో కూడా వూహించని చోటుకి రచయిత మిమ్మల్ని తీసుకువెళ్తాడు. మనిషి పుట్టుకలో వస్తున్న పరిణామాల భూత, భవిష్యత్‌ వర్తమానాల సైన్సు-సస్పెన్సుల మరోకలయిక శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ కలంలోంచి జారిన ‘అష్టావక్ర’ నవల.

    100.00
    Add to cart
  • Atadu Ame Priyudu - అతడు ఆమె ప్రియుడు

    Atadu Ame Priyudu – అతడు ఆమె ప్రియుడు

    భార్యని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన హంతకుడు అతడు.
    …… ఉరిశిక్షకు ముందు రోజు జైల్లోంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడని పేపర్లో చదివిన సిరి దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఆ తరువాత ఆ హంతకుడు తన ఇంట్లోనే వున్నాడని తెలిసి కంగారు పడింది.

    ఇన్ని సంవత్సరాలుగా తనని అజ్ఞాతంగా ప్రేమిస్తున్నాడని, తనని చివరిసారి చూడాలని అతడు వచ్చాడనీ తెలిసి కలవరపడింది. అతడి ప్రేమను చూసి కదిలి పోయింది.

    కానీ ఆ రాత్రే అతడు తన భర్త మీద హత్యాప్రయత్నం చేసాడని తెలిసింది. ఎందుకు ?

    ఆమె ఆరా తీయడం ప్రారంభించింది. గని త్రవ్వకాల్లో శిధిలాలు బయటపడ్డట్టు ఒక్కొక్క నిజమే బయటపడసాగింది. భయంకరమైన నిజాలూ, మనుష్యుల జీవితాల వెనుక చీకటి రహస్యాలూ తెలిసాయి.

    ప్రమాదం ఆమెని వెంటాడ సాగింది.

    ఏమిటా ప్రమాదం ? దాని నుంచి ఆమె ఎలా బయటపడింది. తెలుసుకోవాలంటే యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన అతడు ఆమె ప్రియుడు’ నవల చదివి తీరాల్సిందే.

    80.00
    Add to cart
  • Bharya Gunavathi Satru

    Bharya Gunavathi Satru

    ఏడో నెలలో 12 పౌండ్ల బేబీ – చాలా ఆరోగ్యంగా – మామూలు ప్రసవంలా పుట్టటం దాదాపు అ…. సం….భ…వం…. హఠాత్తుగా ఆగిపోయి, మరణ శిక్ష కోసం ఎదురు చూస్తున్న వాడిలా ఉండిపోయాడు బాలూ, రిజల్టు చెప్పటం మొదలు పెట్టింది డాక్టర్‌ మృదుల.

    ”మీ బ్లడ్‌ గ్రూప్‌ ‘ఏ’. మీ భార్య బ్లడ్‌ గ్రూప్‌ ‘ఓ’ ఆ విధంగా మీ పిల్లవాడి బ్లడ్‌ గ్రూప్‌ ‘ఏ’ అయితీరాలి. కానీ…..”

    ”కానీ…” ”కానీ.. మా వాడి బ్లడ్‌ గ్రూప్‌ ”బి”. ఆమె చెప్పటం పూర్తి చేసింది.

    అనెషిస్తీయా యివ్వకుండా ఆపరేషన్‌ చేసినంత బాధతో కూడిన షాక్‌ తగిలింది బాలూకి ఆ మాటలు వినగానే.

    బాబు తన కొడుకు కాదు!… తనకు ఇంతద్రోహం చేసిన సౌదామినికి ఎలాంటి శిక్ష విధించాలి. అతడు ఆవేశంతో వూగిపోతున్నాడు…….

    అవును ! తను సౌదామినిని చంపబోతున్నాడు ……”

    సౌదామినికి ఎవ్వరూ లేరు. ఆమె బ్రహ్మానంద ఆశ్రమంలో పెరిగింది. కోరి పెళ్లి చేసుకున్నాడు బాలు. అయితే అనుమానపు నీడలు పరచుకున్నాయి. వారిరువురి దాంపత్యంపై పెను చీకట్లు ముసురుకున్నాయి. తనను వంచించిందనే కక్షతో భార్యనే మట్టుబెట్టాలనుకున్నాడు. అప్పుడే జరిగింది ? సౌదామినిని బాలు చంపాడా ? బాలు అనుమానాలు నిజమేనా? గుణవతి అయిన భార్య శత్రువవుతుందా ? కేవలం యండమూరి వీరేంద్రనాథ్‌ మాత్రమే సృష్టించగల మాస్టర్‌ విలనీ. మ్యూజిక్‌, రొమాన్స్‌ల బ్యాక్‌ డ్రాప్‌లో ఎత్తులూ పై ఎత్తులతో సాగిపోయే థ్రిల్లర్‌ ‘భార్యా గుణవతి శత్రు’.

    90.00
    Add to cart
  • Cheekatlo Suryudu - చీకట్లో సూర్యుడు

    Cheekatlo Suryudu – చీకట్లో సూర్యుడు

    నిఖిల్‌ ఒళ్లు జలదరించింది. కళ్లు చిట్లించి అటువైపు చూశాడు. యు.ఎఫ్‌.ఓ.! ఫ్లయింగ్‌ సాసర్‌ !! ఎగిరే పళ్లెం!!!

    అంతవరకూ కేవలం పుస్తకాల్లో మాత్రమే చదివాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు… ఆ ఆలోచన రాగానే ఉద్వేగంతో అతడు పక్కకి తిరిగి చూశాడు. ఇద్దరు పైలెట్లూ లేరు. లోపలికి వెళ్లినట్టున్నారు.

    అతడు చెవులకున్న ఫోన్లు తీయాలన్న విషయం కూడా పట్టించుకోకుండా ఆ వస్తువు తమకెంత దూరంలో వుందో లెక్కగట్టడానికి ప్రయత్నించాడు… ఈ విశాల విశ్వంలో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో వున్న యే గెలాక్సీలోని గ్రహవాసులో తమ ఇంధనం కొరతను తీర్చుకోవడానికి సూర్యుడి లాంటి నక్షత్రాల కోసం వెదుకుతుండగా వారి దృష్టి మన సూర్యుడి మీద పడితే ?!

    వారు తమ అద్భుత సాంకేతిక శక్తితో సూర్యుడిని తమ గ్రహానికి చేరువగా తీసుకుపోవడానికి ప్రయత్నిస్తే …. ? ఆ పరిస్థితిని నివారించడం కోసం భూలోకంలోని శాస్త్రజ్ఞులు ఆ సుదూర గ్రహానికి రాయబారం నిమిత్తం ఓ బృందాన్ని పంపితే ?! అప్పుడేం జరుగుతుంది ? భూలోకవాసుల రాయబారం ఫలిస్తుందా ? సూర్యుడి చుట్టూతా కమ్ముకున్న చీట్లు తొలగిపోతాయా ? అద్భుతమైన కథాకథనంతో  తనదైన శైలిలో ఆగ్రశ్రేణి రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ అందిస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ – చీకట్లో సూర్యుడు

    90.00
    Add to cart
  • Chengalva Pudanda - చెంగల్వ పూదండ

    Chengalva Pudanda – చెంగల్వ పూదండ

    నా భార్య కావలసిన అమ్మాయికి అన్యాయం చేసిన వాడిమీద పగ తీర్చుకున్నాను. నా తల్లిని మోసం చేసిన వ్యక్తి రక్తం కళ్ళ చూసేను. కానీ ఒక్క చుక్క రక్తం నేల చిందకుండా ఎంతమంది స్త్రీల మంగళ సూత్రాలనో అపహరిస్తున్న బాబాయిలూ – పుడమితల్లి అందిస్తున్న సంపదని పటిష్టమైన మార్గాలద్వారా గౌరవంగా కొల్లగొడుతున్న లక్ష్మీ నారాయణ్‌లూ… నా ఆర్తి ఏ గుండెల్ని సృజించగలదు ? ఠాకూర్‌ మాటలు జ్ఞాపకం వచ్చేయి. ‘నీ ధ్యేయం వ్యక్తిగతం బేటా … నాది సాంఘికం – నీ పరిధి విశాలం కావాలి. నీ దృక్పధం విస్తృతమవ్వాలి” యండమూరి వీరేంద్రనాథ్‌ నవల చెంగల్వపూదండలో కృష్ణస్వగతమది.

    ఒక చురుకైన పల్లెటూరి అమాయకుడైన యువకుడు అన్యాయంగా, అక్రమంగా సమాజంలోని దుష్టశక్తుల కుట్రకు జైలుపాలయ్యాడు. ఏ కారణం చేత ఎవరెవరు ఎలా వచ్చి చేరినా జైలే అన్ని విప్లవోద్యమాలకూ పాఠశాల. అక్కడే ఒక మహోన్నత విప్లవమూర్తి తారసపడి సమాజం గురించి విప్లవాల గురించి సమగ్రంగా నూరిపోసి అతడిని చైతన్యవంతుడ్ని చేశాడు. తరువాత జైలు నుంచి విడుదలయి వచ్చాక తన వ్యక్తిగత కక్ష సాధింపులో తాను లౌకికంగా విజయం పొందినా – అది ఎంత అల్పాతి అల్ప విషయమో గ్రహించి, గురువు బోధ గుర్తుకు వచ్చి – సంపూర్ణ విప్లవం వైపు నరసింహావతారుడై, కొండల్లోకి నడచి వెళ్ళిన ఓ ఉదయ భాస్కరుని ఉగ్ర చరిత్ర ఈ ‘చెంగల్వ పూదండ’ ఇంటిల్లిపాదీ చదవదగ్గ పుస్తకం.

    60.00
    Add to cart
  • Dabbu Minus Dabbu - డబ్బు మైనస్‌ డబ్బు

    Dabbu Minus Dabbu – డబ్బు మైనస్‌ డబ్బు

    డబ్బెందుకు సంపాదించాలి ?ఎందుకంటే బ్రతకడం కోసం. ప్రస్తుత వ్యవస్థలో డబ్బు లేకపోతే మనమేమీ చెయ్యలేం. డబ్బు సంపాదన ఒక కర్తవ్యం. అది సంపాదించడానికి కేటాయించిన సమయం కాక, మిగతా సమయం అంతా ఆనందంగా వుండాలంటే డబ్బు తప్పనిసరి.

    తృప్తి అనేది అన్నిటికన్నా పరాకాష్ఠ. ఎంత సంపాదించినా నిరంతరం అసంతృప్తితో బాధపడుతూ ఉంటారు కొంతమంది. అవసరమైనంతవరకూ డబ్బు సంపాదించటానికి ఎన్ని త్యాగాలు చేసినా ఫరవాలేదు గాని, ఒక స్థాయి వచ్చిన తర్వాత తన వాళ్లు, తన కుటుంబం అనే భావం రాకపోతే జీవితమే నిరర్ధకం. ఒక స్థాయిలోనన్నా తృప్తిపడి, డబ్బు సంపాదించడంలో వుండే ఆనందం కన్నా, జీవించడంలో వుండే ఆనందం పొందలేకపోతే తర్వాత చాలా చింతించాల్సి వస్తుంది.

    ప్రేయసి పుట్టిన రోజున కనీసం ఫోన్‌ చేసి విషెస్‌ చెప్పడానికి కూడా రూపాయి లేని ఓ యువకుడు, ప్రేమకు డబ్బుల రెక్కలు కట్టి ప్రేయసితో ఆకాశపుటంచుల్లో విహరించి – స్విట్జర్లాండ్‌ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రాసలీలా రమ్య శోభిత రసడోలికల్లో తేలియాడడం ‘కల’లో సాధ్యమేమోగానీ – ‘ఇల’లో కాదు. అసాధ్యాలను సుసాధ్యాలుగా మలచగల రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ వినూత్న సృష్టి – నేటి బ్యాంకింగ్‌ సిస్టమ్‌ లొసుగుల నేపధ్యంలో ప్రేయసి కోసం లక్షలకు లక్షలు ఆర్జించిన ఓ జీనియస్‌ లవర్స్‌ లవ్లీ టేల్‌ ఆఫ్‌ లవ్‌ ‘డబ్బు మైనస్‌ డబ్బు’.

    90.00
    Add to cart
  • Dabbu To The Power Of Dabbu - డబ్బు టు ది పవరాఫ్‌ డబ్బు

    Dabbu To The Power Of Dabbu – డబ్బు టు ది పవరాఫ్‌ డబ్బు

    ‘నిజానికి డబ్బు సంపాదనే ధ్యేయం అయితే అయిదు సంవత్సరాల్లో ఓ యాభై లక్షలు సంపాదించటం పెద్ద కష్టం కాదు.”

    ”ఆయన మరింత బిగ్గరగా నవ్వి” అయితే సంపాదించు చూద్దాం. అలాగేగానీ సంపాదిస్తే నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తా” అన్నాడు. పక్క గదిలో హారిక ఉలిక్కిపడింది. ఈ గదిలో గాంధీ ఉలిక్కిపడ్డాడు. ఒక్కసారిగా గదిలో నిశ్శబ్దం పేరుకుంది….”

    చట్టబద్ధంగా, న్యాయ పరిధిలోనే ఐదేళ్లలో యాభైలక్షలు సంపాదిస్తానంటూ కోటేశ్వరుడు రాజారామమోహన్‌రావుతో పందెంకాసిన గాంధీ ఏంచేశాడు ?

    న్యాయానికీ చట్టానికీ ఉన్న తేడాను విడమరచి చెప్పి, డబ్బు సంపాదించటంలోని మెళకువలను వివరించిన తొలి తెలుగు నవల ‘డబ్బు టు ది పవరాఫ్‌ డబ్బు’. ఇరవైయేళ్ల కింద రాసిన ఈ నవల యండమూరి వీరేంద్రనాథ్‌ బెస్ట్‌ సెల్లర్స్‌లో ఒకటి. ఇది సినిమాగానూ వచ్చింది.

    ప్రేరణకలిగించి ఎంత మందిలోనో ఆత్మవిశ్వాసం నింపిన ఈ నవల ఇన్వెస్టిగేటివ్‌ రచయితలకూ మార్గదర్శకంగా నిలిచింది. ఆర్థిక శాస్త్రాన్నీ న్యాయ శాస్త్రాన్నీ కలబోసుకుని ప్రతి పేజీలోనూ – ఉత్కంఠనునింపే కథనంతో సాగిపోతుంది – డబ్బు టుది పవరాఫ్‌ డబ్బు.

    100.00
    Add to cart
  • Dhyeyam - ధ్యేయం

    Dhyeyam – ధ్యేయం

    నాకు చచ్చిపోవాలనుంది నిఖితా” అంది మహతి ఏడుస్తూ ఒక రోజు.

    ”ఎందుకు?” అని అడిగింది నిఖిత. ఇద్దరూ కాలనీలో వున్న పార్కులో చెట్టు కింద కూర్చుని వున్నారు. వాళ్ళిద్దరూ క్లాస్‌మేట్స్‌, మంచి స్నేహితులు కూడా.

    ”ఎందుకేమిటి ? మా అమ్మా నాన్నలకి నేనంటే ఇష్టం లేదు. ఈ రోజు తమ్ముడ్ని తీసుకొని పార్టీకి వెళ్ళిపోయారు. నన్నొక్కదాన్నే ఇంట్లో వదిలేశారు. నన్నెందుకు తీసుకెళ్ళలేదో తెలుసా. నాకు మంచి బట్టల్లేవని. వాళ్ళు కొని పెడితేనేగా నాకు మంచి బట్టలుండేది ! తమ్ముడికైతే ఎంతో ఖరీడైన బట్టలూ బొమ్మలూ కొనిపెడతారు. నాకు కొనాలంటే వాళ్ళ దగ్గర డబ్బుండదు.”

    ”నువ్వు మీ అమ్మ నాన్నలని ధైర్యం చేసి అడగొచ్చుగా” అంది.

    ”ఏమడగను? ఏం అడిగినా లేదు… లేదు… అని సమాధానం వస్తుంది. అంతా నా కట్నం కోసం దాచి వుంచుతారట. అమ్మ సంవత్సరానికొక నగ చేయిస్తుంది. వాటిని బ్యాంకు లాకర్లో పెడతారు. కట్టుకోవడానికి మంచి బట్టలు గానీ చదువుకోవడానికి పుస్తకాలు గానీ ఇవ్వరు. వాళ్ళు ఏ పని చేసినా అది నా పెళ్ళిని దృష్టిలో పెట్టుకునే. ఎలాగోలా నాకు పెళ్ళి చేయటమే వాళ్ళ జీవితాశయం అన్నట్టు మాట్లాడతారు” అంది మహతి….

    ఇది ఒకానొక కాలనీలోని పిల్లల కథ. బ్రహ్మ భవిష్యత్తును నుదిటి మీద వ్రాస్తే పెద్దలు పిల్లల మనసు మీద వ్రాస్తారు. బ్రహ్మ నుదుటి గీతైనా మారుతుందేమో గాని మనసు మీద పెద్దలు గీసిన గీతల ప్రభావం మాత్రం జీవితాంతం పోదు.

    ఆ కాలనీలో చిగురు తొడిగిన మొక్కలన్నీ పెద్ద పెద్ద చెట్లయ్యాయి. అయితే చెట్లకి అనుభవాలుండవు. కానీ మనుషులకి…? అక్కడ పుట్టిపెరిగిన పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు ? ఎలా చెదిరిపోయారు ? ఏమయ్యారు ? ఆ చెట్లకే నోళ్ళుంటే ఎన్ని కథలు చెబుతాయో ! తెలుగు, కన్నడ భాషల్లో నెంబర్‌ వన్‌ రైటర్‌ యండమూరి వీరేంద్రనాథ్‌ సామాజిక దృష్టితో అందిస్తోన్న ప్రయోజనాత్మక నవల – ధ్యేయం.

    100.00
    Add to cart
  • Duppatlo Minnagu - దుప్పట్లో మిన్నాగు

    Duppatlo Minnagu – దుప్పట్లో మిన్నాగు

    ‘మీరందరూ ఒప్పుకుంటే నేనో కొత్త రకం పందెం సూచిస్తాను” అన్నాడు విజ్జీ.

    ”ఏమిటి?”

    ”అయిదుగురం అయిదు కథలు చెప్పుకుందాం. ఎవరిది తక్కువ సస్పెన్సుతో వుంటే వారు ఈ రాత్రి ఈ బిల్లు ఇవ్వాలి” అన్నాడు.

    అంతా ఓకే చెప్పారు. వెయిటరు. బీరు బాటిల్సూ చికెన్‌ మంచూరియా తీసుకొచ్చి బల్లమీద సర్దాడు. మొట్టమొదటి కథ శివ చెప్పటం మొదలు పెట్టాడు. అది ‘దుప్పట్లో మిన్నాగు’. ఆ తర్వాతిది విజ్జి కథ; ఓడ ప్రయాణం, వెంకు చెప్పింది ‘మానవాతీత వ్యక్తి’ కథ. ఇక ‘వరండా కుర్రాడు’ శేషు చెప్పిన కథ. చివరిది ‘అంతర్నేత్రం’. నరాలను తెంపేసే సస్పెన్సు, నమ్మక తప్పని కథనమూ గగుర్పొపడిచే సంఘటనలూ కొనమెరుపులూ వెరసి ‘దుప్పట్లో మిన్నాగు’.

    ఒకటి హాస్యం, ఒకటి వ్యంగ్యం, ఒకటి శృంగారం, ఒకటి బీభత్సం, ఒకటి అద్భుతం, ఒకటి భయానకం – అన్నీ కలిపి చివరన ఒక ట్విస్టు – అది ఆశ్చర్యం. అంతర్లీనంగా ఆరు విభిన్న రసాల కథా వేదిక – ‘దుప్పట్లో మిన్నాగు’.

    75.00
    Add to cart
  • Graphology - గ్రాఫాలజీ

    Graphology – గ్రాఫాలజీ

    చేతి వ్రాతని బట్టి మనస్తత్వం తెలుసుకునే శాస్త్రం – యండమూరి వీరేంద్రనాథ్‌
    ”అక్షరాలు నిట్టనిలువుగా వ్రాసేవారు తమ మీద తమకి బాగా కంట్రోల్‌ వున్నవాళ్లై వుంటారు…. కుడివైపునకు అక్షరాలు వంగి వుండేలా వ్రాసేవారు నలుగురిలో బాగా కలిసిపోతారు. ప్రతి విషయంలోనూ ఏక్టీవ్‌పార్ట్‌ తీసుకుంటారు…. ఎడమవైపు అక్షరాలు వంచి వ్రాసేవారు చాలా వరకు అంతర్ముఖులు”.
    దస్తూరీని బట్టి వ్యక్తిత్వం గురించీ, మూర్తి మత్వం గురించీ, మనస్తత్వం గురించీ, ఇట్టే చెప్పెయ్యవచ్చునంటున్నారు యండమూరి వీరేంద్రనాథ్‌. చేతి వ్రాతని చూసి మనస్తత్వాన్ని అంచనా వేసే గ్రాఫాలజీని ఆయన వివరణలతో తెలుగులో అందిస్తున్నారు.
    -అమ్మాయి చేతి వ్రాతకీ అబ్బాయి చేతి వ్రాతకీ తేడా వుంటుందా ?
    -చేతి వ్రాతని బట్టి – వ్రాసే వ్యక్తి మూడ్‌ చెప్పెయ్యొచ్చా?
    -వయస్సును బట్టి వ్రాత మారుతుందా ?
    -సంతకం బట్టి మనిషిని అంచనా వేయొచ్చా ?
    -ఉద్యోగాలకి ఎందుకు సొంత దస్తూరితో అప్లికేషన్లు పూర్తిచేయమంటారు ?
    రకరకాల చేతి వ్రాతల్ని బట్టి, వివిధ వ్యక్తుల మానసిక విశ్లేషణా వ్యక్తిత్వ పరిశీలనల గురించి -యండమూరి వీరేంద్రనాథ్‌’ అందిస్తూన్న తొలి తెలుగు సాంకేతిక పరిజ్ఞాన శాస్త్రం- గ్రాఫాలజీ

    50.00
    Add to cart
  • Kasanova 99 - కాసనోవా 99

    Kasanova 99 – కాసనోవా 99

      1970లో భారతసైన్యం పాకిస్తాన్‌పై దండెత్తి బంగ్లాదేశ్‌ని విడగొట్టినప్పుడు, కాశ్మీర్‌ని భారత్‌ నుంచి కూడా అదేవిధంగా విడగొట్టటానికి, ఫాక్స్‌ అనే అంతర్జాతీయ గూఢచారి భారతదేశం ప్రవేశించి, తగిన సమయం కోసం ముప్ఫై సంవత్సరాలు వేచి వున్నాడు. అతడి వ్యూహం ఫలించటానికి సరిగ్గా నెల రోజులు టైముంది.

        1990 మధువని అనే అమాయక డెంటిస్టు, స్వప్నమిత్ర అనే కాసనోవాని ప్రేమించి పెళ్ళాడబోతూ ప్రమాదవశాత్తు ఈ అంతర్జాతీయ గూఢచార్ల విషవలయంలో ఇరుక్కుపోయింది. తరువాత…? 

    పాపులర్‌ తెలుగు నవలా చరిత్రలోనే ఇంత వరకూ లేనటువంటి, రానటువంటి ప్రయోగంగా పాఠకుల చేత విమర్శకుల చేత కొని యాడబడిన నవల ‘కాసనోవా 99’.

    100.00
    Add to cart
  • Kshaminchu Supriya - క్షమించు సుప్రియా

    Kshaminchu Supriya – క్షమించు సుప్రియా

    ‘చూడవోయ్‌ నీలాంటి వాళ్ళను చాలా మందిని స్టడీ చేశాన్నేను. కస్టమర్‌ రాగానే మామూలు ధరకన్నా దాదాపు రెట్టింపు ధర చెప్పేసి, ఆ కొనేవాడి మనసులో అసంతృప్తి కలిగించటం, ఆ పైన ధరను కొద్దిగా తగ్గించి, ఆ కొనే వాడిని ఒక రకమైన ‘ట్రాన్స్‌’లో పెట్టేసి, ఆ పుస్తకాన్ని అమ్మేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య అయితే అయివుండచ్చు కానీ, ఈ ప్రయోగం నా మీద చెయ్యలేవు. కాబట్టి నా అమూల్యమైన సమయాన్ని వృధా చేయకుండా ఒక ధర చెప్పు” ఇలా సాగింది ప్రొఫెసర్‌ గౌరీనాథ్‌ సంభాషణ. ఆ షాపు వాడి మనసులో ఆయన చెప్పిన మాటలు చాలా సూటిగా నాటుకున్నాయి. అతని కళ్ళకు ఆయనో ఋషిలా కనపడ్డాడు. చాలా భక్తితో ఆ పుస్తకాన్ని అందిస్తూ ”రెండు రూపాయలు తగ్గించుకోండి సార్‌. కానీ దయచేసి ఈ విషయాన్ని ఎక్కడా చెప్పద్దు” బ్రతిమాలేడు. ఆ షాపు వాడి కళ్ళలో కనబడే నమ్రతా భావాన్ని గౌరీనాధ్‌ తీక్షణమైన కళ్ళు పసిగట్టేశాయి. ఆయన కళ్లు గర్వంగా నవ్వేయి. అనూహ్యమూ, అభేద్యమూ అయిన ఆ షాపువాడి అంచనాల్ని పటాపంచలు చేస్తూ ఆ పుస్తకాన్ని రెండు రూపాయలకి తక్కువకి కొన్న సంతృప్తి ఆయన కళ్ళలో ప్రతిబింబించింది.

    తను విపులీకరించిన పద్ధతిలోనే షాపువాడు తనని మోసం చేసేడని గుర్తించని గౌరీనాథ్‌, కార్లో పుస్తకాన్ని పెట్టుకొని ఇంటి కొచ్చేశాడు. యండమూరి వీరేంద్రనాథ్‌ కథల సంపుటి ‘క్షమించు సుప్రియా’ కథలోని సన్నివేశమిది. దీనితో పాటు ఇంకా ఇలాంటి రసవత్తర సన్నివేశాలున్న కథలు మరో పదకొండు ఉన్నాయి.

    అంతే కాదండోయ్‌. మీ జీవిత భాగస్వామికి మీరు మానసికంగా ఎంత దగ్గరగా ఉన్నారోకూడా ఈ పుస్తకం చెబుతుంది. అయినా సంతృప్తి కలగటం లేదా మీకు. అయితే రచయిత మిమ్మల్ని తనతో పాటు ప్రపంచ పర్యటన చేయిస్తాడు. దేశదేశాల సంస్కృతులూ – వాళ్ళ సమస్యలూ – యండమూరి వీరేంద్రనాథ్‌ కథల సంపుటి – ‘క్షమించు సుప్రియా’.

    40.00
    Add to cart