-
Chengalva Pudanda – చెంగల్వ పూదండ
0₹60.00నా భార్య కావలసిన అమ్మాయికి అన్యాయం చేసిన వాడిమీద పగ తీర్చుకున్నాను. నా తల్లిని మోసం చేసిన వ్యక్తి రక్తం కళ్ళ చూసేను. కానీ ఒక్క చుక్క రక్తం నేల చిందకుండా ఎంతమంది స్త్రీల మంగళ సూత్రాలనో అపహరిస్తున్న బాబాయిలూ – పుడమితల్లి అందిస్తున్న సంపదని పటిష్టమైన మార్గాలద్వారా గౌరవంగా కొల్లగొడుతున్న లక్ష్మీ నారాయణ్‌లూ… నా ఆర్తి ఏ గుండెల్ని సృజించగలదు ? ఠాకూర్ మాటలు జ్ఞాపకం వచ్చేయి. ‘నీ ధ్యేయం వ్యక్తిగతం బేటా … నాది సాంఘికం – నీ పరిధి విశాలం కావాలి. నీ దృక్పధం విస్తృతమవ్వాలి” యండమూరి వీరేంద్రనాథ్ నవల చెంగల్వపూదండలో కృష్ణస్వగతమది.
ఒక చురుకైన పల్లెటూరి అమాయకుడైన యువకుడు అన్యాయంగా, అక్రమంగా సమాజంలోని దుష్టశక్తుల కుట్రకు జైలుపాలయ్యాడు. ఏ కారణం చేత ఎవరెవరు ఎలా వచ్చి చేరినా జైలే అన్ని విప్లవోద్యమాలకూ పాఠశాల. అక్కడే ఒక మహోన్నత విప్లవమూర్తి తారసపడి సమాజం గురించి విప్లవాల గురించి సమగ్రంగా నూరిపోసి అతడిని చైతన్యవంతుడ్ని చేశాడు. తరువాత జైలు నుంచి విడుదలయి వచ్చాక తన వ్యక్తిగత కక్ష సాధింపులో తాను లౌకికంగా విజయం పొందినా – అది ఎంత అల్పాతి అల్ప విషయమో గ్రహించి, గురువు బోధ గుర్తుకు వచ్చి – సంపూర్ణ విప్లవం వైపు నరసింహావతారుడై, కొండల్లోకి నడచి వెళ్ళిన ఓ ఉదయ భాస్కరుని ఉగ్ర చరిత్ర ఈ ‘చెంగల్వ పూదండ’ ఇంటిల్లిపాదీ చదవదగ్గ పుస్తకం.
-
Dabbu Minus Dabbu – డబ్బు మైనస్ డబ్బు
0₹90.00డబ్బెందుకు సంపాదించాలి ?ఎందుకంటే బ్రతకడం కోసం. ప్రస్తుత వ్యవస్థలో డబ్బు లేకపోతే మనమేమీ చెయ్యలేం. డబ్బు సంపాదన ఒక కర్తవ్యం. అది సంపాదించడానికి కేటాయించిన సమయం కాక, మిగతా సమయం అంతా ఆనందంగా వుండాలంటే డబ్బు తప్పనిసరి.
తృప్తి అనేది అన్నిటికన్నా పరాకాష్ఠ. ఎంత సంపాదించినా నిరంతరం అసంతృప్తితో బాధపడుతూ ఉంటారు కొంతమంది. అవసరమైనంతవరకూ డబ్బు సంపాదించటానికి ఎన్ని త్యాగాలు చేసినా ఫరవాలేదు గాని, ఒక స్థాయి వచ్చిన తర్వాత తన వాళ్లు, తన కుటుంబం అనే భావం రాకపోతే జీవితమే నిరర్ధకం. ఒక స్థాయిలోనన్నా తృప్తిపడి, డబ్బు సంపాదించడంలో వుండే ఆనందం కన్నా, జీవించడంలో వుండే ఆనందం పొందలేకపోతే తర్వాత చాలా చింతించాల్సి వస్తుంది.
ప్రేయసి పుట్టిన రోజున కనీసం ఫోన్ చేసి విషెస్ చెప్పడానికి కూడా రూపాయి లేని ఓ యువకుడు, ప్రేమకు డబ్బుల రెక్కలు కట్టి ప్రేయసితో ఆకాశపుటంచుల్లో విహరించి – స్విట్జర్లాండ్ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రాసలీలా రమ్య శోభిత రసడోలికల్లో తేలియాడడం ‘కల’లో సాధ్యమేమోగానీ – ‘ఇల’లో కాదు. అసాధ్యాలను సుసాధ్యాలుగా మలచగల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ వినూత్న సృష్టి – నేటి బ్యాంకింగ్ సిస్టమ్ లొసుగుల నేపధ్యంలో ప్రేయసి కోసం లక్షలకు లక్షలు ఆర్జించిన ఓ జీనియస్ లవర్స్ లవ్లీ టేల్ ఆఫ్ లవ్ ‘డబ్బు మైనస్ డబ్బు’.
-
Dabbu To The Power Of Dabbu – డబ్బు టు ది పవరాఫ్ డబ్బు
0₹100.00‘నిజానికి డబ్బు సంపాదనే ధ్యేయం అయితే అయిదు సంవత్సరాల్లో ఓ యాభై లక్షలు సంపాదించటం పెద్ద కష్టం కాదు.”
”ఆయన మరింత బిగ్గరగా నవ్వి” అయితే సంపాదించు చూద్దాం. అలాగేగానీ సంపాదిస్తే నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తా” అన్నాడు. పక్క గదిలో హారిక ఉలిక్కిపడింది. ఈ గదిలో గాంధీ ఉలిక్కిపడ్డాడు. ఒక్కసారిగా గదిలో నిశ్శబ్దం పేరుకుంది….”
చట్టబద్ధంగా, న్యాయ పరిధిలోనే ఐదేళ్లలో యాభైలక్షలు సంపాదిస్తానంటూ కోటేశ్వరుడు రాజారామమోహన్‌రావుతో పందెంకాసిన గాంధీ ఏంచేశాడు ?
న్యాయానికీ చట్టానికీ ఉన్న తేడాను విడమరచి చెప్పి, డబ్బు సంపాదించటంలోని మెళకువలను వివరించిన తొలి తెలుగు నవల ‘డబ్బు టు ది పవరాఫ్ డబ్బు’. ఇరవైయేళ్ల కింద రాసిన ఈ నవల యండమూరి వీరేంద్రనాథ్ బెస్ట్ సెల్లర్స్‌లో ఒకటి. ఇది సినిమాగానూ వచ్చింది.
ప్రేరణకలిగించి ఎంత మందిలోనో ఆత్మవిశ్వాసం నింపిన ఈ నవల ఇన్వెస్టిగేటివ్ రచయితలకూ మార్గదర్శకంగా నిలిచింది. ఆర్థిక శాస్త్రాన్నీ న్యాయ శాస్త్రాన్నీ కలబోసుకుని ప్రతి పేజీలోనూ – ఉత్కంఠనునింపే కథనంతో సాగిపోతుంది – డబ్బు టుది పవరాఫ్ డబ్బు.
-
Dhyeyam – ధ్యేయం
0₹100.00నాకు చచ్చిపోవాలనుంది నిఖితా” అంది మహతి ఏడుస్తూ ఒక రోజు.
”ఎందుకు?” అని అడిగింది నిఖిత. ఇద్దరూ కాలనీలో వున్న పార్కులో చెట్టు కింద కూర్చుని వున్నారు. వాళ్ళిద్దరూ క్లాస్‌మేట్స్, మంచి స్నేహితులు కూడా.
”ఎందుకేమిటి ? మా అమ్మా నాన్నలకి నేనంటే ఇష్టం లేదు. ఈ రోజు తమ్ముడ్ని తీసుకొని పార్టీకి వెళ్ళిపోయారు. నన్నొక్కదాన్నే ఇంట్లో వదిలేశారు. నన్నెందుకు తీసుకెళ్ళలేదో తెలుసా. నాకు మంచి బట్టల్లేవని. వాళ్ళు కొని పెడితేనేగా నాకు మంచి బట్టలుండేది ! తమ్ముడికైతే ఎంతో ఖరీడైన బట్టలూ బొమ్మలూ కొనిపెడతారు. నాకు కొనాలంటే వాళ్ళ దగ్గర డబ్బుండదు.”
”నువ్వు మీ అమ్మ నాన్నలని ధైర్యం చేసి అడగొచ్చుగా” అంది.
”ఏమడగను? ఏం అడిగినా లేదు… లేదు… అని సమాధానం వస్తుంది. అంతా నా కట్నం కోసం దాచి వుంచుతారట. అమ్మ సంవత్సరానికొక నగ చేయిస్తుంది. వాటిని బ్యాంకు లాకర్లో పెడతారు. కట్టుకోవడానికి మంచి బట్టలు గానీ చదువుకోవడానికి పుస్తకాలు గానీ ఇవ్వరు. వాళ్ళు ఏ పని చేసినా అది నా పెళ్ళిని దృష్టిలో పెట్టుకునే. ఎలాగోలా నాకు పెళ్ళి చేయటమే వాళ్ళ జీవితాశయం అన్నట్టు మాట్లాడతారు” అంది మహతి….
ఇది ఒకానొక కాలనీలోని పిల్లల కథ. బ్రహ్మ భవిష్యత్తును నుదిటి మీద వ్రాస్తే పెద్దలు పిల్లల మనసు మీద వ్రాస్తారు. బ్రహ్మ నుదుటి గీతైనా మారుతుందేమో గాని మనసు మీద పెద్దలు గీసిన గీతల ప్రభావం మాత్రం జీవితాంతం పోదు.
ఆ కాలనీలో చిగురు తొడిగిన మొక్కలన్నీ పెద్ద పెద్ద చెట్లయ్యాయి. అయితే చెట్లకి అనుభవాలుండవు. కానీ మనుషులకి…? అక్కడ పుట్టిపెరిగిన పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు ? ఎలా చెదిరిపోయారు ? ఏమయ్యారు ? ఆ చెట్లకే నోళ్ళుంటే ఎన్ని కథలు చెబుతాయో ! తెలుగు, కన్నడ భాషల్లో నెంబర్ వన్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ సామాజిక దృష్టితో అందిస్తోన్న ప్రయోజనాత్మక నవల – ధ్యేయం.
-
Divyaa – దివ్యా
0₹200.00”ఇది చరిత్ర కాదు, చారిత్రక కల్పన మాత్రమే. వ్యష్టి, సమిష్టి ప్రవృత్తుల పురోగమనం చారిత్రక భూమికపై చిత్రించబడిన చిత్రం. చారిత్రక వాతావరణాన్ని ఆధారంగా చేసుకొని కళానురాగంతో రూపొందించిన కాల్పనిక చిత్రం. అందులోనే యథార్ధాన్ని ప్రతిబింబింప జేయడానికి చేసిన ప్రయత్నం.
మానవుని కంటే గొప్పది – అతని ఆత్మవిశ్వాసమే: అతడు నిర్మించుకున్న విధానమే. తన విశ్వాసానికీ, విధానానికీ పరతంత్రుడవుతాడు మానవుడు. అతడే స్వయంగా వాటిని మార్చివేస్తాడు కూడా. ఇదే సత్యాన్ని కళానురాగంతో, కాల్పనిక చిత్రంలో, చారిత్రక వాతావరణంలో చిత్రించడానికి చేసిన ప్రయత్నం దివ్యా.
పేజీలు : 247
-
Duppatlo Minnagu – దుప్పట్లో మిన్నాగు
0₹75.00‘మీరందరూ ఒప్పుకుంటే నేనో కొత్త రకం పందెం సూచిస్తాను” అన్నాడు విజ్జీ.
”ఏమిటి?”
”అయిదుగురం అయిదు కథలు చెప్పుకుందాం. ఎవరిది తక్కువ సస్పెన్సుతో వుంటే వారు ఈ రాత్రి ఈ బిల్లు ఇవ్వాలి” అన్నాడు.
అంతా ఓకే చెప్పారు. వెయిటరు. బీరు బాటిల్సూ చికెన్ మంచూరియా తీసుకొచ్చి బల్లమీద సర్దాడు. మొట్టమొదటి కథ శివ చెప్పటం మొదలు పెట్టాడు. అది ‘దుప్పట్లో మిన్నాగు’. ఆ తర్వాతిది విజ్జి కథ; ఓడ ప్రయాణం, వెంకు చెప్పింది ‘మానవాతీత వ్యక్తి’ కథ. ఇక ‘వరండా కుర్రాడు’ శేషు చెప్పిన కథ. చివరిది ‘అంతర్నేత్రం’. నరాలను తెంపేసే సస్పెన్సు, నమ్మక తప్పని కథనమూ గగుర్పొపడిచే సంఘటనలూ కొనమెరుపులూ వెరసి ‘దుప్పట్లో మిన్నాగు’.
ఒకటి హాస్యం, ఒకటి వ్యంగ్యం, ఒకటి శృంగారం, ఒకటి బీభత్సం, ఒకటి అద్భుతం, ఒకటి భయానకం – అన్నీ కలిపి చివరన ఒక ట్విస్టు – అది ఆశ్చర్యం. అంతర్లీనంగా ఆరు విభిన్న రసాల కథా వేదిక – ‘దుప్పట్లో మిన్నాగు’.
-
Graphology – గ్రాఫాలజీ
0₹50.00చేతి వ్రాతని బట్టి మనస్తత్వం తెలుసుకునే శాస్త్రం – యండమూరి వీరేంద్రనాథ్
”అక్షరాలు నిట్టనిలువుగా వ్రాసేవారు తమ మీద తమకి బాగా కంట్రోల్ వున్నవాళ్లై వుంటారు…. కుడివైపునకు అక్షరాలు వంగి వుండేలా వ్రాసేవారు నలుగురిలో బాగా కలిసిపోతారు. ప్రతి విషయంలోనూ ఏక్టీవ్‌పార్ట్ తీసుకుంటారు…. ఎడమవైపు అక్షరాలు వంచి వ్రాసేవారు చాలా వరకు అంతర్ముఖులు”.
దస్తూరీని బట్టి వ్యక్తిత్వం గురించీ, మూర్తి మత్వం గురించీ, మనస్తత్వం గురించీ, ఇట్టే చెప్పెయ్యవచ్చునంటున్నారు యండమూరి వీరేంద్రనాథ్. చేతి వ్రాతని చూసి మనస్తత్వాన్ని అంచనా వేసే గ్రాఫాలజీని ఆయన వివరణలతో తెలుగులో అందిస్తున్నారు.
-అమ్మాయి చేతి వ్రాతకీ అబ్బాయి చేతి వ్రాతకీ తేడా వుంటుందా ?
-చేతి వ్రాతని బట్టి – వ్రాసే వ్యక్తి మూడ్ చెప్పెయ్యొచ్చా?
-వయస్సును బట్టి వ్రాత మారుతుందా ?
-సంతకం బట్టి మనిషిని అంచనా వేయొచ్చా ?
-ఉద్యోగాలకి ఎందుకు సొంత దస్తూరితో అప్లికేషన్లు పూర్తిచేయమంటారు ?
రకరకాల చేతి వ్రాతల్ని బట్టి, వివిధ వ్యక్తుల మానసిక విశ్లేషణా వ్యక్తిత్వ పరిశీలనల గురించి -యండమూరి వీరేంద్రనాథ్’ అందిస్తూన్న తొలి తెలుగు సాంకేతిక పరిజ్ఞాన శాస్త్రం- గ్రాఫాలజీ -
Kasanova 99 – కాసనోవా 99
0₹100.001970లో భారతసైన్యం పాకిస్తాన్‌పై దండెత్తి బంగ్లాదేశ్‌ని విడగొట్టినప్పుడు, కాశ్మీర్‌ని భారత్ నుంచి కూడా అదేవిధంగా విడగొట్టటానికి, ఫాక్స్ అనే అంతర్జాతీయ గూఢచారి భారతదేశం ప్రవేశించి, తగిన సమయం కోసం ముప్ఫై సంవత్సరాలు వేచి వున్నాడు. అతడి వ్యూహం ఫలించటానికి సరిగ్గా నెల రోజులు టైముంది.
1990 మధువని అనే అమాయక డెంటిస్టు, స్వప్నమిత్ర అనే కాసనోవాని ప్రేమించి పెళ్ళాడబోతూ ప్రమాదవశాత్తు ఈ అంతర్జాతీయ గూఢచార్ల విషవలయంలో ఇరుక్కుపోయింది. తరువాత…?
పాపులర్ తెలుగు నవలా చరిత్రలోనే ఇంత వరకూ లేనటువంటి, రానటువంటి ప్రయోగంగా పాఠకుల చేత విమర్శకుల చేత కొని యాడబడిన నవల ‘కాసనోవా 99’.
-
Kshaminchu Supriya – క్షమించు సుప్రియా
0₹40.00‘చూడవోయ్ నీలాంటి వాళ్ళను చాలా మందిని స్టడీ చేశాన్నేను. కస్టమర్ రాగానే మామూలు ధరకన్నా దాదాపు రెట్టింపు ధర చెప్పేసి, ఆ కొనేవాడి మనసులో అసంతృప్తి కలిగించటం, ఆ పైన ధరను కొద్దిగా తగ్గించి, ఆ కొనే వాడిని ఒక రకమైన ‘ట్రాన్స్’లో పెట్టేసి, ఆ పుస్తకాన్ని అమ్మేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య అయితే అయివుండచ్చు కానీ, ఈ ప్రయోగం నా మీద చెయ్యలేవు. కాబట్టి నా అమూల్యమైన సమయాన్ని వృధా చేయకుండా ఒక ధర చెప్పు” ఇలా సాగింది ప్రొఫెసర్ గౌరీనాథ్ సంభాషణ. ఆ షాపు వాడి మనసులో ఆయన చెప్పిన మాటలు చాలా సూటిగా నాటుకున్నాయి. అతని కళ్ళకు ఆయనో ఋషిలా కనపడ్డాడు. చాలా భక్తితో ఆ పుస్తకాన్ని అందిస్తూ ”రెండు రూపాయలు తగ్గించుకోండి సార్. కానీ దయచేసి ఈ విషయాన్ని ఎక్కడా చెప్పద్దు” బ్రతిమాలేడు. ఆ షాపు వాడి కళ్ళలో కనబడే నమ్రతా భావాన్ని గౌరీనాధ్ తీక్షణమైన కళ్ళు పసిగట్టేశాయి. ఆయన కళ్లు గర్వంగా నవ్వేయి. అనూహ్యమూ, అభేద్యమూ అయిన ఆ షాపువాడి అంచనాల్ని పటాపంచలు చేస్తూ ఆ పుస్తకాన్ని రెండు రూపాయలకి తక్కువకి కొన్న సంతృప్తి ఆయన కళ్ళలో ప్రతిబింబించింది.
తను విపులీకరించిన పద్ధతిలోనే షాపువాడు తనని మోసం చేసేడని గుర్తించని గౌరీనాథ్, కార్లో పుస్తకాన్ని పెట్టుకొని ఇంటి కొచ్చేశాడు. యండమూరి వీరేంద్రనాథ్ కథల సంపుటి ‘క్షమించు సుప్రియా’ కథలోని సన్నివేశమిది. దీనితో పాటు ఇంకా ఇలాంటి రసవత్తర సన్నివేశాలున్న కథలు మరో పదకొండు ఉన్నాయి.
అంతే కాదండోయ్. మీ జీవిత భాగస్వామికి మీరు మానసికంగా ఎంత దగ్గరగా ఉన్నారోకూడా ఈ పుస్తకం చెబుతుంది. అయినా సంతృప్తి కలగటం లేదా మీకు. అయితే రచయిత మిమ్మల్ని తనతో పాటు ప్రపంచ పర్యటన చేయిస్తాడు. దేశదేశాల సంస్కృతులూ – వాళ్ళ సమస్యలూ – యండమూరి వీరేంద్రనాథ్ కథల సంపుటి – ‘క్షమించు సుప్రియా’.
-
Ladies Hostel – లేడీస్ హాస్టల్
0₹90.00అతడు లైటార్పి, బెడ్‌లైట్ వేసే లోపులో ఆమె దగ్గరగా చేరి బుగ్గని పంటితో నొక్కిపెట్టాడు. ఎంత గింజుకున్నా నిమిషం పాటు వదల్లేదు.
తరువాత బెడ్‌లైట్ వేసి ‘చాలా’ అన్నాడు. ఆమె చేత్తో చెంప రాసుకుంది …. దంతక్షతం – ఇంద్రధనుస్సులా మెరిసింది. శివుడి తపోభంగం కోసం ఇంద్రుడు పంపిన మన్మధుడు ఆ ధనుస్సు అందుకున్నాడు….
-ఇరవై నాలుగు సంవత్సరాలుగా పర్వతశ్రేణుల మధ్య ఘనీభవించిన నీటి చుక్క, కోర్కె స్పర్శకి కరిగి ఆవిరి కాబోతున్న వేళ…
-పదహారు సంవత్సరాల ప్రాయం నుంచీ పరువాన్ని నిలుపుకుంటూ వస్తున్న పౌరుషం-పురుషత్వం ముందు ఓడి గెల్చి-గెలుపు సిగ్గుతో తల వంచుకునే సమయాన … తలుపు మీద టక్‌టకా లాఠీ కర్రతో కొట్టిన చప్పుడు…
ఆమె బిత్తరపోయింది. అతడు అయోమయంలో చిత్తరువు అయ్యాడు. రెండు నిమిషాల తర్వాత తలుపు తీశాడు. ఎదురుగా పోలీసు ఇన్‌స్పెక్టర్ నిలబడి వున్నాడు.
”మిస్టర్ రాయన్నా! లేడీస్ హాస్టల్ రూమ్ నెంబర్ పదమూడులో అపురూపలక్ష్మి అనే అమ్మాయిని హత్య చేసిన కారణంగా మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాను.”
ఆ సమయంలో ఆ వార్తకి రాయన్న విభ్రాంతి చెందాడు.
రాయన్న ఒక మంచి క్రికెటర్. శోభనంనాటి రాత్రి ఓ హత్యానేరం మీద అరెస్టు అవుతాడు. హత్య చేయబడింది అపురూప లక్ష్మి అనే హాస్టల్ అమ్మాయి. ఒక యధార్ద సంఘటన ఆధారంగా లేడీస్ హాస్టళ్ల స్థితిగతులపై వెలుగు ప్రసరిస్తూ … సంచలన రచయిత యండమూరి వీరేంద్రనాథ్ వెలువరించిన ఇన్‌వెస్టిగేటివ్ నవల.
-
Manchu Parvatam – మంచుపర్వతం
0₹90.00‘తరచి చూస్తే ప్రతి మనిషి జీవితం ఒక కథే అవుతుంది. కేవలం సినిమాల్లో, కథల్లో జరుగుతాయనుకున్న సంఘటనలు మరింత మెలో డ్రమెటిక్‌గా జీవితంలోనూ ఎదురుపడవచ్చు. దాదాపు పదిహేనేళ్ల క్రితం నాటి స్నేహితురాలు ‘విశాల’ భర్త తన జీవితంలోకి అలా ప్రవేశిస్తాడని అనూరాధ కలలో కూడా ఊహించలేదు. అదలా జరిగిపోయిందంతే……”
ఆ నలుగురూ క్లాస్‌మేట్స్. జీవితం పొలిమేరల నాలుగురోడ్ల కూడలిలో ఆ నలుగురు పరికిణీ అమ్మాయిలు నిలబడి వీడ్కోలు తీసుకున్నారు. జీవితంలో మరికొన్నేళ్ల తర్వాత తమ అనుభవాలను పంచుకోవటానికి మరోసారి కలుసుకోవాలని నిర్ణయించుకుని విడిపోయారు. జీవితం అంటే పూలపాన్పని కలలు కనే వయసులోని ఆ టీనేజీ అమ్మాయిలకు వాస్తవలోకం తెలిసివచ్చింది. అనుకున్న టైమ్‌కి వాళ్లు ఏ పరిస్థితుల్లో కలుసుకున్నారు ? వాళ్ళకి ఎదురైన అనుభవాలేమిటి ? వాటిల్లో తీపెంత ? చేదెంత ? పురుషాధిక్యతని తన శైలికి భిన్నంగా – గుండెల్లోతుల్ని స్పృశిస్తూ యండమూరి వీరేంద్రనాథ్ వెలువరించిన సస్పెన్స్ లెస్ థ్రిల్లర్ మంచు పర్వతం. ఇది ‘జ్యోతి’ మంత్లీ సీరియల్.
-
Marana Mrudangam – మరణ మృదంగం
0₹100.00‘ఎక్కడికి వెళ్తున్నాం ?” అని అడిగింది అటూఇటూ చూస్తూ. జవాబుగా సలీం జేబులోంచి ఆసిడ్ సీసా తీసాడు.
ఆమెకి మొదట అర్ధం కాలేదు. అంతలో శంకర్ మొహం మీద వికృతమైన నవ్వు కనబడింది.
”నువ్వు చాలా తెలివైన దానివటగా ! మీ ఆఫీసులో అంతా అలాగే చెప్పుకుంటారుట” అన్నాడు.
”ఎవర్నువ్వు” అంది.
ఆ ప్రశ్నకి అతడు సమాధానం ఇవ్వలేదు. ”తెలివైనవాళ్ళు పడక మీద మంచి సుఖం ఇస్తారని నాకో గొప్ప నమ్మకం” అన్నాడు.
అప్పుడు అర్ధమయింది ఆమెకి అతడు పోలీస్ ఇన్‌స్పెక్టర్ కాదని. జీపు వేగంగా వెడుతోంది.
”నా పేరు శంకర్… సలీం శంకర్” అన్నాడు అతడు. ఆమె గుండె ఆగిపోయిందో క్షణం. స… లీం.. శం… క… ర్ . రేపు కోర్టులో నేరం నిరూపణ అయితే శిక్ష పడవలసిన బోస్టన్ స్ట్రాంగ్లర్!! తన పక్కన.
”ఇదేమిటో తెలుసా ? ఆసిడ్ సీసా” అన్నాడు ఒక చేత్తో మూత తీస్తూ. ”చుక్క పడితే చాలు, చర్మం సలసలా కాలిపోతుంది”.
ఆమె మెదడు ఆలోచించే శక్తి కోల్పోయింది…
వెరైటీ కోసం రకరకాల స్థలాల్లో రేప్ చేయటానికి ఉవ్విళ్ళూరే నరరూప ర్షాసుడు సలీంశంకర్. చీకటి ప్రపంచాన్ని తన చూపుడు వేలితో శాసించగల మాఫియా లీడర్ వసంత్‌దాదా.
తమ ఉనికికి ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా మారణహోమం సృష్టించే ఆ రక్తదాహపు క్రూరారణ్యంలోకి పొరపాటున అడుగుపెట్టింది లేడికూనలాంటి అనూష. అనుకోకుండా ఆ బేలకి భయంకరమైన రహస్యం ఒకటి తెలిసింది. అది గనక బయటికి పొక్కిందా వసంతదాదా చీకటి సామ్రాజ్యమే కుప్పకూలిపోతుంది. దాన్ని నివారించడానికి సలీంశంకర్ రంగంలోకి దిగాడు. మరణమృదంగ ధ్వని ప్రళయకాల ప్రభంజనంలా అనూషని వెంటాడింది…
మొదటి పేరా నుండి చివరి అక్షరం దాకా ఉక్కిరిబిక్కిరి చేసే సస్పెన్స్‌తో పాఠకుల్ని మెస్మరైజ్ చేసే యండమూరి వీరేంద్రనాథ్ థ్రిల్లర్.