-
Tulasi Dalam – తులసి దళం
0₹100.00‘ముగ్గు మధ్యలో కాద్రా కూర్చుని ఉన్నాడు. అతడి ప్రక్కన పాత్రలో మైదాపిండి ఉంది. తులసి చేతి కర్చీఫ్ ఉంది. తులసి తొక్కిన కాలిమట్టి ఉంది.
ముగ్గుకి ఎనిమిది వైపులా చిన్న చిన్న గొబ్బిళ్ళలాంటి మాంసపు ముద్దలు ఉన్నాయి…..
ముగ్గు మధ్యలో హ్రీం-క్రీం అన్న అక్షరాలు వ్రాయబడి ఉన్నాయి. సాంబ్రాణి పొగ దట్టంగా అలుముకొని వుంది. అతడు మైదాపిండితో బొమ్మను తయారు చేశాడు. తులసి తాలూకు చేతి గుడ్డ దానికి కట్టేడు. తులసి తొక్కిన మట్టిని ఆ బొమ్మ కాలికి అద్దేడు. బొమ్మ నెదురుగా పెట్టుకొని మంత్రం చదవటం మొదలుపెట్టాడు. అతడి పెదవులు కదులుతున్నాయి….”
తులసి అనే పదేళ్ళ చిన్నారిని చంపటానికి ముగ్గురు కిరాతకులు కాద్రా అనే మహామాంత్రికుడిని ఆశ్రయించారు. ‘కాష్మోరా’ అనే అతిభయంకరమైన క్షుద్రదేవతను ప్రయోగించి 21 రోజుల్లో పాపని చంపుతానని వాగ్దానం చేశాడు కాద్రా. రోజు రోజుకి తులసి క్షీణించిపోసాగింది. ఒక హిప్నటిస్టు, ఒక డాక్టరు కలసి ఆ చిన్నారిని కాపాడటానికి రంగంలో దిగారు.
1981లో వెలువడిన ఈ నవల – తెలుగు పాపులర్ నవలా సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పింది. సంచలనం సృష్టించింది. అనేక వాద వివాదాలకు కేంద్రబిందువయింది. అఖిలాంధ్ర పాఠకలోకాన్ని అలరించిన ఈ నవల ఇప్పటికీ బెస్ట్ సెల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది.
-
Yevaree Chatrapati Sivaji – ఎవరీ ఛత్రపతి శివాజి
0₹40.00భారతావనిలో యెంతమంది రాజులు లేరు? ఎంతమంది స్వతంత్రంగా పాలించలేదు. ముస్లిం పాలకులు, హిందూ పాలకులు సమాంతరంగా పరిపాలించిన దశలూ ఉన్నాయి. ముస్లిం పాలకులకి వ్యతిరేకంగా హిందూ పాలకులు కత్తిగట్టారనీ, హిందూ ధర్మస్థాపన కోసం కంకణబద్దులయ్యారనీ కొంతమంది చరిత్రకారులు వక్రీకరించి చెపుతూ వుంటారు. ”వక్రీకరించి” అనడం ఎందుకంటే వాళ్ళు ముస్లింలు కాబట్టే హిందువులు కత్తిగట్టనూలేదు. ముస్లిం రాజులు సాటి ముస్లింరాజుల మీద దాడులు చెయ్యకపోనూలేదు. ఇక్కడ సమస్య అల్లా మతంకాదు. పాలకుల నైజం, వ్యవహారశైలి, పాలితులపట్ల వాళ్ళ వైఖరి. హిందువు అయినా, ముస్లిం అయినా క్రూర చక్రవర్తిని ప్రజలు అసహ్యించుకున్నారు, ఎదిరించారు. దయగల ప్రభువుల్ని ఆదరించారు – వాళ్లు ముస్లింలు అయినా, హిందువులు అయినా, అలా ప్రజాదరణ పొందినవాడు శివాజి.
శివాజి దండయాత్రలు, దుర్గాల ముట్టడి, శత్రు శిబిరాల్లో పరాక్రమ ప్రదర్శన లాంటి వీరోచిత కృత్యాలన్నీ జనం నోళ్ళల్లో కథలు, గాథలుగా అల్లుకుపోయాయి.
‘రాయఘడ్’ రాజధానిగా ఆయన స్థాపించిన సామ్రాజ్యంలో ఎన్నో సంస్కరణలు కార్యరూపం ధరించాయి. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం, వాళ్ళని పెత్తందారుల ఆగడాల నుంచి బయటపడెయ్యడం కోసం ఆయన ఎన్నో ఘనకార్యాలు నిర్వహించాడు. సైన్యాన్ని, నావికదళాన్ని నిర్మించాడు. దుర్గాలని పటిష్ట పరిచాడు. అక్షరాస్యత వ్యాప్తికి నడుంకట్టాడు. పరిపాలనా భాష సంస్కరించాడు. రాజ వ్యవహారం కోశం అనే నిఘంటువును తయారు చేయించాడు. శిక్ష్మాస్మృతి సమన్యాయంతో అమలుచేశాడు. మొత్తం మీద ”ప్రజల మనిషి” అని ప్రజల మన్నన పొందాడు.
శివాజికి ముస్లింమత విద్వేషం యేమాత్రం లేదు. ఔరంగజేబ్‌తో పోరాడినా తన కొలువులో, సైన్యంలో ముస్లింలని యే శంకలూ లేకుండా నియమించాడు. ఆయన విశాలదృక్పథం, ఏ ఒక్క మతానికి సంకుచితం కాకుండా ఆయన్ని మహనీయుణ్ణి చేసింది.
-
Chivaraku Migiledi
0₹300.00చివరకు మిగిలేది – ఏమిటి? అన్నదానికి వెంటనే దేని చివరకు? అన్న ప్రశ్న పుడుతుంది. ఆ వెంటనే మిగిలేది ఎవరికి? – అన్న జిజ్ఞాసా రాక తప్పదు. వ్యక్తికా – జీవితానికా – వ్యక్తులతోనూ వాళ్ళ మధ్య అనేకానేక ఉత్పతి, పునరుత్పతి సంబంధాలతోనూ ఆవిష్కారమైన సమాజానికా – అన్నదే అది. ఈ ప్రశ్న భావనామాయమైంది. దీనికి సమాధానం భౌతిక రూపంలో వెదకడం సులువేనా? అసలీ “మిగలటం” – అన్న సమస్య గురించి విశ్వనాథ ‘వేయిపడగల’ లో చర్చించాడు. అలాగే చలం తన “మ్యూజింగ్స్” లో కొంత ఆలోచన చేశాడు.
ఒకానొక విశ్వాసం మిగులుతుందని విశ్వనాథ అంటే, మిగులుతుందనుకోవటం భ్రమగా తేల్చేశాడు చలం. వీరి తాత్త్విక విశ్వాసాలకు సృజనాత్మకరూపం కల్పించి నవలగా రూపొందించిన ఘనత బుచ్చిబాబుది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కొత్త విలువల రూపుకడ్తున్నాయి. నిరాశా నిస్పృహల్లో మునిగిన సమాజాన్ని “లోచూపు” లో చూడటం అన్న వాస్తవికతలకు నవలారూపమే ఈ రచన. పురుషస్వామ్య సామాజిక భావాజాలం – అది సృష్టించిన పాత్రలు – వీటి ప్రవర్తన ఈ నవలలో బొమ్మకడుతుంది.
ప్రపంచంలోని వ్యక్తులే సాహిత్యంలో పాత్రలౌతారు. అలాగే బుచ్చిబాబు ఈ నవలలో సృష్టించిన పాత్రలు; ఆ కాలంలో తెలుగు దేశంలోని ఆధునిక సాహిత్య – సామాజిక – తాత్విక ధోరణుల ప్రతిబింబాలనిపిస్తాయి. రాధాకృష్ణన్ – రసెల్ – జిడ్డు కృష్ణమూర్తుల సమాహార తాత్వికతే బుచ్చిబాబు దార్శనికత్వం అనిపిస్తుంది. ఆధునిక తెలుగు నవలల్లో మంచివేవి? అని ఏ సాహిత్య విద్యార్థిని ప్రశ్నించినా ముందుగా చెప్పేది; తెలుగు కల్పనా సాహిత్యంలో చివరికంటా మిగిలేది ఈ “చివరకు మిగిలేది”.
-
Avanism
0₹200.00చరిత్రను శోధించి సత్యాన్ని సాధించాలి. వాస్తవికత ఇచ్చే తృప్తి, ఆనందం మారేది ఇవ్వలేదు. ఈ “అవనిజం” పుస్తకంలో కూడా కొన్ని పరిశోధనలను గురించి రాస్తున్నప్పుడు ఎదో సంతోషం. ఎందుకంటే మన బాధ్యతగా కొన్ని నిజాలను ఆవిష్కరిస్తున్నామని. ప్రతి మనిషికి విశ్వం ఒక అంతుబట్టని రహస్యం. ఎంత తెలుసుకున్నామనే దానికంటే మనకు అందిన విషయం సముద్రంలో ఒక నీటి బొట్టు మాత్రమే. అయినా అది సాధించిన విజయం తక్కువదేం కాదు. ఎన్నో మూఢనమ్మకాల పొరలు ఛేదించి విజ్ఞానం వైపు ఆధునిక సమాజాన్ని నడిపిస్తున్న శాస్త్రీయతను ప్రాచీన అర్వాచీన విజ్ఞానం ద్వారా అందించాలనే చిన్న ప్రయత్నమే ఈ “అవనిజం”.
-
-
Asammathi Patram
0₹120.00“వారి కవితలు మేము మొదట చదివినప్పుడు, వాటిలో ఉపయోగించిన భాష అనునిత్యమూ మాట్లాడే భాషకూ, రాసే భాషకూ పూర్తిగా భిన్నమైనదిగా అనుకోవలసి వచ్చింది.”
– సి పి బ్రౌన్
“చిన్నయసూరికి ముందు ఆంద్రసారసత్వంలో వచన రచన లేదనుకోవడం పొరపాటు. వందలకొలది గ్రంథాలు వచనంలో ఉన్నవి కనబడినవి. అవి అన్నీ వాడుకభాషలో ఉన్నవి.”
– గిడుగు రామమూర్తి
“తమిళం నేర్చుకోవాలనుకున్న విదేశీయుడిని అయిన నాకు, ఉపాధ్యాయుడు నేర్పిన తమిళం వీధుల్లో ఎన్నడూ వినిపించలేదు. నేను సర్కారు జిల్లాలకు వచ్చినప్పుడు, తెలుగు సాహిత్యానికి, వాడుకలో ఉన్న తెలుగు భాషకు సంబంధం ఏమీ లేకపోవడం గమనించాను.”
– జె ఎ ఏట్స్
“నన్నయనాటి తెలుగుభాషే నేటికిన్ని ఏ మార్పు లేకుండా ఉన్నదనడం అబద్ధం. ఉండాలనుకోవడం అవివేకం. నన్నయనాటి గోదావరే ఈనాడూ ప్రవహిస్తుంది. కాని ఆనాటి జలం ఈనాటిది కాదు.”
– గిడుగు సీతాపతి
“తెలుగు సాహిత్యానికి సంకెళ్ళు వేసి కడుపు మాడ్చడమూ , లేక దానికి స్వేచ్చ, జావాసత్వాలనిచ్చి, దాన్ని ఒక గొప్ప నాగరికతా శక్తిగా చేయడమా అనేది మనపై ఆధారపడి ఉంది.”
– గురజాడ అప్పారావు
-
Jeevanayanam – జీవనయానం
0₹250.00నది జీవితం వంటిది. నది బిందువుగా మొదలవుతంది. జీవితం కూడా బిందువులా మొదలవుతుంది. నదిలో ఉపనదులు కలుస్తాయి. అది విశాలం అవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి. ఇది విశాలం అవుతుంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. జీవితం ప్రశాంతంగా ఉన్నంత కాలం ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. కొండలు కోనలు ఎదురవుతాయి. నది జలపాతం అవుతుంది. హోరును సృష్టిస్తుంది. జీవితంలో ఆపదలు ఎదురవుతాయి. అప్పుడే జీవితనాదం వినిపిస్తుంది. జీవితం వికసిస్తుంది. ఇంద్రధనుస్సులు సృష్టిస్తుంది. చిక్కుల్లోనే మనిషి ఎదుగుతాడు! ఆపదల్లోనే ఉన్నతుడు అవుతాడు. మనిషి అయినా జాతి అయినా అంతే. ఇది చరిత్ర చెప్పిన సత్యం!
-
Deepika – దీపిక
0₹200.00పెనుగొండ లక్ష్మీనారాయణ అభ్యుదయ రచయితల సంఘంలో ప్రదాన బాధ్యతలో ఉన్నారు. ఆధునిక తెలుగు సాహిత్య పరిణామాలతో సన్నిహితంగా ప్రయాణించినవారు. అభ్యుదయ సాహిత్యోద్యమంలో ఉద్ధండులతో కలిసి స్వయంగా పాల్గొన్నవారు. ప్రజా సాహిత్యం పట్ల, ప్రజా సాహిత్య చరిత్ర పట్ల వాస్తవిక దృష్టి కలిగినవారు. ‘దీపిక’ పేరుతో వెలువరించిన ఈ పుస్తకం వారి సాహితీ అనుభవానికి అద్దం పట్టింది. ఈ పుస్తకంలో పెనుగొండ తెలుగు సాహిత్యంలోని అనేక అంశాలకు సంబంధించి సాధికార సమాచారం ఇచ్చారు. అభ్యుదయ సాహిత్యోద్యమం రథసారధులు రాంభట్ల కృష్ణమూర్తి, సెట్టి ఈశ్వరరావు, ఆవంత్స సోమసుందర్, రెంటాల గోపాలకృష్ణ వంటి వారి సాహిత్య కృషిని ఎంతో స్ఫూర్తిమంతంగా పరిచయం చేసారు. సాహిత్య చరిత్రకు సంబంధించి దారితప్పించే ‘తొలి మలితరం తెలుగు కథలు’ సంకలనం గురించి వివరంగా చర్చించి తప్పులకు రుజువులు చూపిస్తూ సరిచేసిన వ్యాసం చాలా విలువైన సమాచారం ఇస్తుంది. పి.వి.నరసింహారావు రసిన ‘గొల్లరామవ్వ’ కథను చారిత్రకాంశాల నేపథ్యంలో విశ్లేషించారు…..
-
Divodasu Lokasanchari
0₹200.00“మానవజాతి ప్రగతి పథంవైపు సాగించిన ప్రతి అడుగూ రక్తతర్పణంతోనే సాగింది. నర రక్తం ఇంతగా ప్రవహించడానికి అన్ని మతాల ధర్మచార్యులే కారణం; వారే బాధ్యులు, ఏ ఒక్క మతము, ఏ ఒక్క మతాచార్యుడు గర్వించవల్సింది ఏమీలేదు” అని చారిత్రిక ఆధారాల రీత్యా తన రచనల ద్వారా ఆయన రుజువు చేశాడు. ప్రస్తుత రాజకీయ, సామాజిక వాతావరణంలో రాహుల్జీ పుస్తకాల పఠనం అత్యంత అవశకం. ఆ మహాపండితుని రచనలన్నింటినీ తిరిగి ముద్రించి తెలుగు పాఠకుల ముందుంచుతున్నందుకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ గర్వపడుతున్నది.
– గడ్డం కోటేశ్వరరావు