-
-
-
-
Navala Prajalu – నవల ప్రజలు
0₹100.00మానవజాతి చరిత్రలో ఎన్నో కొత్తకళలు (ఉదాహరణకు సినిమా) పుట్టాయి. కానీ ఇంతవరకూ ఏ కళకూడా పూర్తిగా నశించిపోలేదు. తన చైతన్యాన్నీ వాస్తవిక ప్రపంచంపట్ల తన సంవేదననూ అభివృద్ధి చేసే ఏ అంశాన్ని కూడా మానవుడు జారవిడుచుకోడు. నవల కొత్తకళేకావచ్చు. కానీ దాని వేళ్ళు సూదూరగతంలో ఉన్నాయి. ప్రాచీనగ్రంథాలైన ”టిమాల్కియోస్ బాంక్వెట్,” ”డాఫ్నీ అండ్ ఓలీ” వద్దనో, మరింత వెనక్కువెళ్ళితే సుప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడు హెరొడోటస్ (క్రీ.పూ.5వ శతాబ్దం) వద్దనో నవల చరిత్ర ప్రారంభమౌతుంది. కానీ స్వతంత్ర ఆధునిక సాహిత్య ప్రక్రియగా నవల మన నాగరికతకు సంబంధించింది మాత్రమే. సొంత నిర్మాణ సూత్రాలను కలిగి, అందరిమెప్పునూ, ఆమోదాన్ని పొందిన సాహిత్య ప్రక్రియ అయిన నవల మన నాగరికతకు – మరీ ముఖ్యంగా ముద్రణా యంత్రయుగానికి చెందిన వస్తువే.
సాహిత్యంలో కొద్దిభాగం మాత్రమే వాస్తవికత. ఈ సూత్రం నాటకానికి కూడా వర్తిస్తుంది. అంతమాత్రంచేత కళగా నాటకానికున్న ప్రత్యేక గాంభీర్యాన్ని కాదంటున్నామని భావించకూడదు. నవల కేవలం కల్పనాత్మకమైన వచనం మాత్రమేకాదు. అది మానవ జీవితానికి సంబంధించిన వచనం. మానవుణ్ణి మొత్తంగా తన పరిధిలోకి తీసుకొని, అతణ్ణి సంపూర్ణంగా చిత్రించటానికి ప్రయత్నించిన మొట్టమొదటి కళారూపం నవల. మానవుడి రహస్య జీవితాన్ని దృశ్యమానం చేయగలిగిన శక్తి నవలకు ఉంది…..
-
Navvulo Sivudunnaduraa!
0₹180.00నిజం – నవ్వులో శివుడున్నాడు. నిరంతరం నవ్వేముఖంలో దైవం వుంటుంది . కొన్ని నవ్వులు ఉదయకిరణాల్లా హాయిహాయిగా వుంటయి. కొన్ని పొద్దెక్కిన సూర్యాకిరణాల్లా చురుక్కుమనిపిస్తాయి. కొన్ని నవ్వులు చంద్రుడి పై ప్రతిఫలించిన వెన్నెలమడుగుల్లా చల్లదనాలు పంచుతాయి. ఇంతకీ నవ్వులో శివుడున్నాడుగాని, శివుడులో నవ్వు కనిపించదు. ఆవేశం వచ్చినా , ఆనందం కలిగినా తాండవం చేస్తాడు.
-
-
Nelavanka
0₹120.00చంద్రునికి కళంకంలా క్రికెట్ చంద్రునికి క్రీడారంగంలో కీర్తి జీవిత రంగంలో అపకీర్తి. అలాంటి రౌడీ రవి చంద్రునికి మరో యువరాణి జతపడి డీ అంటే డీ అంది. తనపై హజంతో సాగించిన అమానుషానికి శిక్షపడే సమయంలో తాను మనసు మార్చుకుని మానవతియై ‘తప్పులు అందరు చేస్తారు, కొందరే మనుషుల్ని సంస్కారంతో’ తీర్చిదిద్దగలరని రుజువుచేసిన అమ్మాయి సాహస చరిత్ర నెలవంక.
ద్వేషించినా ప్రేమించినా ఫలించక అక్క బిడ్డ కోసం బావగార్ని పెళ్ళాడి అనుమానాలకు అవమానాలకు గురై అక్కబిడ్డను పోగొట్టుకుని కుందేలై మతి తప్పినా మానవతి కథే నెలవంక! ఆ శృతి తప్పిన వీణను ఏ దేవతలు సవరించారో, అమావాస్య చీకట్లను పారద్రోలి పున్నమి వెన్నెల సరాగాలను ఎలా పలకరించారో ‘నెలవంక’ చదివి ఓహో ఆహా అనండి. ఈ నెలవంక మీ నెలవంకే.. అమావాస్య చీకట్లు ఎవరివీ? మీవికావు! మరి ఎవరివి?
-
Nenu Nadichina Bata
0₹200.00ముందుమాట
నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) గారి స్వీయచరిత్రకు ముందుమాట రాయమని ఆయన కోరటం నాకు పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. నేను విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర బాధ్యుడిగా వున్నప్పటి నుండి నాకు నల్లూరితో పరిచయం. విద్యార్థిరంగ కార్యక్రమాలకు, ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు ఒంగోలు తరుచుగా వెళ్ళేవాడిని. ఆయన ప్రజానాట్యమండలి,
యువజన సమాఖ్య బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా తరుచుగా కలిసేవాళ్ళం. చర్చించుకునే వాళ్ళం.
నేను నడిచిన బాట” శీర్షికగా ఆయన జీవిత చరిత్ర ఆసక్తికరంగా వుంది. ఐతే | ఒక లోపం వుంది. ఆయన కుటుంబ జీవితం గురించి, సహచరి గురించి, పిల్లల గురించి సమాచారం లేదు. భార్యా పిల్లల సహకారం, మద్దతు లేకుండా ఆయన ఈ సుదీర్ఘమైన బాటలో విజయవంతంగా నడవగలిగేవారు కాదని నా అభిప్రాయం.
నిజాయితీ, నిబద్దత గల కమ్యూనిస్టు జీవితం ఎలా వుండాలో నల్లూరి వెంకటేశ్వర్లు గారి జీవితం అచ్చంగా అలా వుంది.
నల్లూరి స్వతహాగా కళాకారుడు. ఒకరకంగా ఆయన తన జీవితాన్ని, కళారంగానికి, కమ్యూనిస్టు పార్టీకి అంకితం చేశాడు. యువజన రంగంలో రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ప్రకాశం జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా సుదీర్ఘకాలం విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారు. సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు.
నల్లూరి వెంకటేశ్వర్లు గారిది చెరగని చిరునవ్వు. ఎవ్వరి మీద కోప్పడుతుండగా చూడలేదు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎవరినీ పరుషంగా విమర్శించడం చూడలేదు. ఆయనకు బాధ కలిగినా తాను దిగమింగటం తప్ప తగువుకుగానీ, ఘర్షణకు గానీ పోలేదు. కాని కమ్యూనిస్టులకుండాల్సిన వర్గ దృక్పథం నుండి పక్కకు మరల లేదు. ఆయన జీవనశైలి, నిరాడంబరత, నిబద్ధత కారణంగా, అన్ని వర్గాల చేత గౌరవింపబడ్డాడు……..
-
Nerajaanalu Magadheerulu
0₹80.00ఆ రోజు ఆదివారం.
అందరికి నిశ్చింత. హడావుడిగా నిదురలేవనక్కరలేదు. గడియారంతో పాటు తిరుగనక్కరలేదు. వస్తువుల కోసం, పుస్తకాల కోసం ఒకరి కాళ్ళు ఒకరు తొక్కనక్కరలేదు. మిగతా రోజులాగే దినచర్య జరిగిన తరుముతున్నట్టు అటు, యిటు పరిగెత్తనక్కరలేదు. తాపీగా నింపాదిగా పనులు చేసుకోవచ్చు.
సుశీలమ్మకు ఇరవై ఏండ్లుగా అయిదు గంటలక లేవటం అలవాటుయింది. ఆమె కాలనీకి వచ్చాక కొందరు పనిగట్టుకుని ఉదయము గడియారం చూడటము మానేశారు. సుశీలమ్మ వంటయింట్లో లైటు వెలిగిందంటే సమయము అయుదు గంటలన్నమాట. ఆమె కూడా ఆదివారం మరో అరగంట పడుకుందాము అనుకుంటుంది. కానీ అసంకల్పిత ప్రతీకారాచార్యలా ఆ సమయానికి లేచిపోతుంది. ఆ తరువాత గుర్తుకు వస్తుంది. అరే ఆ రోజు అరగంట సేపు పడకుందాo అనుకుంటుంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-మాదిరెడ్డి సులోచన.
-