• Nija Bhakthuni Kulamedi?

    Nija Bhakthuni Kulamedi?

    0

    “తన దేశం సౌభాగ్యవంతంగా ఉంటానికి, లాల్ బహద్దూర్ తన ప్రాణమైనా ఇస్తాడని నాకు నమ్మకముంది.”

    అన్నది ఆ ధీరమాత.

    వృద్ధుడు నిట్టూర్చి “కానీ ఈ రకమైన ఫీలింగ్స్ కోల్పోయిన తర్వాతా , నేనిక ఆదిమ వాసి వాణ్ణి ఎలాగవుతాను ?” అన్నాడు.

    “నీకెంత కష్టమొచ్చింది అమ్మ. కళ్ళు కనిపించకుండా చెవులు వినిపించకుండా నువ్వెలా బ్రతుకుతావే హెలెన్ తల్లి” అంటూ విలవిలలాడిపోయింది ఆ అభాగ్యురాలు.

    నీలో ఎరుక ఏర్పడగానే రెండో జన్మ నపేక్షించి , అందుకై వెతకనారాంబిస్తావు. నికి రెండో జన్మా ధ్యానమే ప్రసాదిస్తుంది.

    150.00
    Add to cart
  • Nikasham

    Nikasham

    0

    ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు

    నిన్నటి ప్రత్యూషం నేడు లేదు

    ఈ రోజుటి ప్రదోషసంధ్య, రేపటికి పాతది….మాసినది…..

    ఓ గంట క్రితం చుట్టేసిన దు:ఖం యిప్పుడు శూన్యం

    ఈ చిటికెడు విషాదాలు

    క్షణకాలప్పాటు మెరిసే ఆనందాలు….. సుఖాలు……

    వీటిని మోస్తూ యిన్ని కోట్ల ప్రాణాలు….

    అన్నీ… అందరూ కల్సి ఎక్కడికి?

    ఎటువేపుకి ప్రస్థానం?

    ఒక అనుభూతి నింకో అనుభూతిని కబళిస్తూ….

    అంతం లేని దారిలో

    అక్కడక్కడా ఆగిపోతూ……చివరికి?

    అంతా…..అన్నీ……అందరూ…. ఒకే గాహ్వారంలోకి ……

    కాంతిని కూడా స్వాహా చేసే మహా బిలంలోకి….

    భావాతిత……అనుభూతి రాహిత్య

    మహా శూ……..న్యం………లో……కి

    70.00
    Add to cart
  • Nireekshana

    Nireekshana

    0

    మాదిరెడ్డి సులోచన గారు దాదాపు 150 కథలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాశారు. వీటిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపజేసే అలవాటు చేసిన రచయితలలో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలూ, పెళ్ళిళ్ళకంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కథా రచయిత్రి అవార్డులు పొందారు.

    ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో  మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే ఉంటాయి. అందరు తప్పక ఈ నవలలు చదవాల్సిందిగా కోరుచున్నాము.

    70.00
    Add to cart
  • Nithya Prerana

    Nithya Prerana

    0

    మనందరికీ నిత్య ప్రేరణ అవసరం. మనం చేసే పనిలో, జీవితంలో తెలివిగా ఉండడానికి. మనం ఎంతో ఇష్టంగా కన్నకలలను సాకారం చేసుకోవడానికి, మనమెలా ఉండాలని అనుకున్నామో అలా ఉండడానికి జీవితంలోని కష్టకాలాన్ని అధిగమించడానికి, మంచి క్షణాలను ఆస్వాదించడానికి.

    ఫెరారీని అమ్మిన యోగి నుంచి తీసుకున్న నిత్య ప్రేరణలో ప్రముఖ రచయిత రాబిన్ శర్మ అంతర్జాతీయంగా అత్యధిక స్థాయిలో అమ్ముడైన ద మాంక్ హు సొల్ద్ హిజ్ ఫెరారీ నుంచి, ఆ క్రమంలో రాసిన మరికొన్ని పుస్తకాల నుంచి శక్తివంతమైన ఆలోచనలను ప్రతిరోజును విశిష్టంగా గడపగలిగేలా మీ కోసం సరళంగా కేలండర్ రూపంలో ఇచ్చారు.

    వాస్తవమైన విజయం, ప్రతికూలతను అధిగామించడం. ఆశాభంగం, విశిష్టమైన బంధుత్వాలను ఏర్పరచుకొనడం, ప్రభావం, వారసత్వం వంటి ముఖ్యమైన విషయాలు దీనిలో ఉన్నాయి. మీరు విశిష్ట వ్యక్తులుగా మారే ప్రయాణంలో ఈ పుస్తకం మీకు జీవితకాలం తోడుగా ఉంటుంది. గమ్యం చేరాక మీరు గడిపిన జీవితాన్ని చూసి గర్వపడే విధంగా ఇది మిమ్మల్ని తయారుచేస్తుంది.

    200.00
    Add to cart
  • Nityajivithamlo 33 Rakala Manava Samsyalaku Remedies Tantralu
  • Noone Sukka Inkinni Kathalu - నూనె సుక్క ఇంకిన్ని కథలు

    Noone Sukka Inkinni Kathalu – నూనె సుక్క ఇంకిన్ని కథలు

    0

    సమూహంలోంచి వెలివేయబడితే అది ఒంటరితనం. ఆ సమూహాన్నే వెలివేస్తే అది ఏకాంతం. ఒంటరితనం భయపెడుతుంది, ఏకాంతం పునరుజ్జీవింపచేస్తుంది. – ఒంటరి ఏకాంతం

    జిందగీ అంటేనే ఊర్లు, పట్నాలల్ల బత్కేటివన్ని పానమున్న పీనిగెలు. పానంతోటి బత్కాలంటే ఊర్లల్లనే బత్కాలె. – రెండో ఉత్తరం

    మాత కైకేయి కోరిక అయోధ్యావాసుల పాలిట దు:ఖహేతువైనది, అదే మా పాలిట వరమైనది. – కాకి రామం

    మనం అడిగినవన్నీ ఇచ్చేవాడే దేవుడు అయితే, మరి మనకు కావలసినవన్నీ మనం అడగకుండానే, మనల్ని అడగకుండానే ఇచ్చే ఈ ప్రకృతిని ఏమనాలి? దేవుడే ప్రకృతి-ప్రకృతే దేవుడు. – 3456 జిబి

    ”ఆడపుట్క’ పుట్టుంటే సల్లగ బతుకుతుంటివి కొడకా,” అన్నది అమ్మ – బలిపసువు

    పేజీలు : 143

    120.00
    Add to cart
  • NTR A Biography

    NTR A Biography

    0

    విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగువారుండరు. అన్నగారి సినీ జీవితం, రాజకీయ చరిత్ర గురించి ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఇటీవల వచ్చిన ‘యన్.టి.ఆర్ – కథానాయకుడు’ చిత్రం ద్వారా ఆయన గురించి తెలియని మరిన్ని విషయాలను నేటి యువత తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ మహానుభావుడి గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ జీవితంలో మనకు తెలియని ఎన్నో విషయాలను పొందుపరిచి ఆయన జీవిత కథను ఇద్దరు విశ్రాంత ఉన్నతాధికారులు పుస్తక రూపంలో అందిస్తున్నారు. ‘ఎన్టీఆర్ బయోగ్రఫీ’ పేరిట ప్రచురితమైన ఈ పుస్తకాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి కె.చంద్రహాస్ సంయుక్తంగా రచించారు.

    650.00
    Add to cart
  • NTR Samagra Jeevitha Katha

    NTR Samagra Jeevitha Katha

    0

     శ్రీమంతం, సారవంతం అయిన కృష్ణాతీరాన రైతుబిడ్డగా పుట్టిన నందమూరి తారక రామారావు ఈడు రాగానే పక్వానికొచ్చిన కళాకాంతుల్ని మూటగట్టుకుని వైనతేయుడిగా రెక్కవిదిల్చి చెన్నపట్నంలో వాలారు. రాముడై, కృష్ణుడై విశ్వవిఖ్యాత నటసార్వభౌముడై వెండితెరకు సొగసులద్దారు. తెలుగునాట పూజామందిరాలలో నిలువెత్తు స్థానం సంపాదించుకున్నారు. కర్మయోగిగా జనామోదం పొందారు. మరోసారి రెక్కవిదిల్చి ప్రభంజనమై  తెలుగుజాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. జననేతగా జేజేలందుకుని తెలుగువాడికి కొండగుర్తుగా నిలిచిన ఆ మహనీయుని జీవితాన్ని ఆవిష్కరించే పుస్తకం యన్.టి.ఆర్.

    400.00
    Add to cart
  • Nurella Telugu Kadhalu
  • Nuvvellipoyaka

    Nuvvellipoyaka

    0

    “బ్రేకప్ ఒక కెథార్సిస్. ఇది నిలిచే బంధం కాదేమో అన్న ఆలోచనతో మొదలై, మేము విడిపోయాము అన్న ప్రకటన దాకా పూర్తి స్పృహతోతీసుకోవాల్సిన నిర్ణయాలు వుంటాయి. వాటికి నిందలు, కొట్లాటలు, బాధలు, ఏడుపులు,

    జ్ఞాపకాలు ఇవన్నీ అడ్డం పడతాయి. ఒకరు తోడుగా వుంటారన్న నమ్మకం నుంచి నాకు నేనే తోడు అన్న ధైర్యం దాకా సాగే ప్రయాణం ఇది.ఇదంతా ఒక మనిషిని ప్రక్షాళన చేస్తుంది.ఫీనిక్స్ పక్షిలా మళ్లీ బతికిస్తుంది.” |

                                                               this is how it ends

    ఝాన్సీ పాపుదేశి • నాగేంద్ర కాశి .వి. మల్లికార్జున్ • ఉషాజ్యోతి బంధం – కడలి సత్యనారము మూడి • వెంకట్ ఇద్దారెడ్డి • మానస ఎండ్లూరి – రిషి శ్రీనివాస • అరుణ పప్పు • మహి బెజవ

    250.00
    Add to cart
  • Oh My God

    Oh My God

    0

    దైవ భక్తి, ధ్యానం, దాన్ని నేర్పే గురువులు, వారి ధ్యాన పద్ధతులు, ఆ సంస్థల వివరాలతో పాటు నిత్య జీవితంలో చేయగలిగే కొన్ని సాధనల గురించి మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఆధ్యాత్మిక వ్యాస సంకలనమే ‘ఓ మై గాడ్.

    ఈ పుస్తకం ఆధ్యాత్మిక సాధకులకే కాక దాని మీద అభిరుచి గల పాఠకులకి కూడా ఉపయోగిస్తుంది. సాధనలో కలిగే అనేక సందేహాలని నివృత్తి చేస్తుంది.

    200.00
    Add to cart
  • Oka Charitra Konni Nijalu