• Matruthvam

    Matruthvam

    0

    డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి వైద్య సాహిత్య రంగాలలో సుప్రసిద్ధులు. గైనకాలజీ మరియు ఆబెట్రిక్స్ నిపుణులైన వీరు కాకినాడలో “విజయలక్ష్మి నర్సింగ్ హోమ్” ప్రారంభించి గత 38 సంవత్సరాలుగా వైద్య సేవలందిస్తున్నారు. వైద్య రంగంలోనే కాక, సాహిత్య రంగంలో కూడా ప్రసిద్ధి గాంచిన వీరి రచనలు – “మీరు ప్రేమించలేరు”, “మాకీ భర్త వద్దు”, “పేషంట్ చెప్పే కధలు”, “జ్వలిత” – కధానికా సంపుటాలు : ‘సజీవ స్వప్నాలు’, ‘చైతన్య దీపాలూ’, ‘ప్రత్యూష పవనం’, ‘వెలుతురు పువ్వులు’ – నవలలు : ‘మన దేహం కధ’, ‘కౌమార బాలికల ఆరోగ్యం’ – వైద్య పరిజ్ఞానానికి సంబంధించిన రచనలు : ‘వైద్యడు లేని చోట’, ‘మనకు డాక్టరు లేని చోట’, ‘రక్తం కధ’ – అనువాదాలు ఉన్నాయి.

    ‘డా. ఆలూరి విజయలక్ష్మి రచనలు’ అను అంశంపై నాగార్జున యూనివర్సిటీ తెలుగు విభాగం విద్యార్ధిని పరిశోధనా పత్రాన్ని సమర్పించి ఎమ్.ఫిల్. డిగ్రీ పొందారు.

    డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి అనేక సుప్రసిద్ధ సాహితీ సంస్థల నుండి, సామాజిక సంస్థలనుండి ఎన్నో సాహితీ పురస్కారాల్ని, సామాజిక సేవా పురస్కారాల్ని పొందారు.

    తెలుగు పాఠకులకు డాక్టర్ విజయలక్ష్మిగారు ఇచ్చిన మరో వినూత్న కానుక – ‘మాతృత్వం : ప్రసూతి సమస్యలు – సలహాలు’. ఈ పుస్తకం గతంలో అశేష పాఠకుల ఆదరణపొంది పలు ముద్రణలు పొందింది. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మరెన్నో మార్పులు, చేర్పులతో కూడిన పరిస్కృత ముద్రణ.

    – ఆలూరి విజయలక్ష్మి

    200.00
    Add to cart
  • Matti Mogallu

    Matti Mogallu

    0
    150.00
    Add to cart
  • Mee jeevitanni Mee vruttini anandamga  yela anubhavinchali
  • Mee Medaduki Padunenta - మీ మెదడుకు పదునెంత

    Mee Medaduki Padunenta – మీ మెదడుకు పదునెంత

    0

    నేటి బాలసాహిత్య నిర్మాతలలో వాసాల నరసయ్యగారొకరు. వీరు కరీంనగర్‌ జిల్లా చౌలమద్దిలో 1942లో జన్మించారు. మెట్‌పల్లిలో చదివారు. స్కూలు మాస్టారుగా ఉద్యోగజీవితం ప్రారంభించి, పోస్టు మాస్టారుగా రిటైరయ్యారు. విద్యార్ధిగా ఉన్నప్పుడే 1955లో ”సాగంధికాహరణము” వీధి నాటకం రచించారు. 1958 – 1960 వరకు స్కూల్‌ మాగజైను ‘అభ్యుదయవాణి’కి సంపాదకత్వం నెరిపారు.
    పిల్లల మాసపత్రికల్లోనూ, దిన, వార పత్రికల్లోనూ బాలల కథలు, పొడుపు కథలు, గేయాలు, గ్రంథసమీక్షలు, చాలా వ్యాసాలతోపాటు అనేక గ్రంధాలు వెలువరించారు.

    40.00
    Add to cart
  • Mee Rajyam Meerelandi

    Mee Rajyam Meerelandi

    0

    బాబ్రీ మసీదును రామజన్మభూమిగా విశ్వసిస్తే తప్ప
    హిందువు కాడంటే

                                నేను హిందువును కాను

    నాస్తికుడైతే తప్ప

    కమ్యూనిస్టు కానేరడు అంటే

                         నేను కమ్యూనిస్టును కాను

    అవినీతిని తాత్వికరించుకున్న దొంగలరాజ్యమ్ లో

    ఆ దోపిడీ స్వభావపు పాలనాధికారమ్ కోసమే

    తమ దళిత రాజకీయాలూ ఉన్నాయంటే

                       నేను దళితవాదిని కాను.

    భిన్న భిన్న ప్రాంతాల వివిధాత్మక జీవితాన్ని

    గుర్తించి ఆమోదిస్తే తప్ప

                     నేను ప్రతియా తాత్వికుణ్ణి కాలేను.

    200.00
    Add to cart
  • Meepai Nammakam Unchandi

    Meepai Nammakam Unchandi

    0

      మీరు మీ కలలను నిజం చేసుకోవాలని ఆశిస్తున్నారా? మీరు మీ శక్తి సామర్థ్యాలను వాటి గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నారా? అవును, అయినట్టయితే ఈ పుస్తకం మీరు తప్పక చదవాలి!

     

                  ‘మీపై నమ్మకం ఉంచండి’ పుస్తకంలో మానవ నిక్షిప్తశక్తి ఉద్యమ పురోగాముల్లో ఒకరైన డాక్టర్ జోసెఫ్ మర్ఫీ – మీ కలలను సాకారం చేసుకుని మీ జీవితంలో ఘనవిజయం సాధించడం ఎలాగో చూపిస్తారు. మనం ప్రతి ఒక్కరం పుట్టుకతోనే బ్రహ్మాండమైన శక్తిని కలిగి ఉన్నాం. సరైన మానసిక వైఖరితో – విజయవంతం కావడానికి కావలసినవన్నీ ఉన్నాయి. అందుకు మీ సుప్తచేతనాత్మక మనసుకు శక్తినిచ్చే ఇంజనులాంటి చేతనాత్మక మనసును ఉద్దీపనం చేయగలగాలి. అప్పుడు ఇది మీ ఆశలనూ, ఆశయాలనూ పూర్తిస్థాయిలో సాధించే మార్గంలో నడవడానికి మిమ్మల్ని ఆయత్తం చేసే అసలు పనిని చేస్తుంది.

    కవులు, కళాకారులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు – ఇలావిభిన్న రంగాలలో విజయాలు సాధించినవారు – తమ సుప్తనాత్మక మనసును ప్రోగ్రామింగ్ చేసి క్రమబద్ధంగా ఉపయోగించుకోవడం ద్వారా లక్ష్యాలను చేరుకోవడానికి తమ కలలను, భావాలను లాభదాయకమైన రీతిలో ఎలా అమలు చేసేవారో తెలుసుకుని, మీరు కూడా మీ జీవితాలను సుసంపన్నం చేసుకోవడానికి, అలాంటి మెళకువలను అమలు చేయడం సునాయాసంగా నేర్చుకోగలుగుతారు.

    95.00
    Add to cart
  • MEERU SREELU

    Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)

    0

     

     

     

     

     

       

     

    Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)

     

    విభాగం-1

    వదిలించుకోవలసినవి
    “ఉద్ధరేద్ ఆత్మనాఆత్మానం నాత్మానం అవసాదయేత్ |
    ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||”
    (శ్రీమద్భగవద్గీత – అధ్యాయం-6 శ్లోకం -5)

    భావం: మనం మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనల్ని మనమే దిగజార్చు కోకూడదు – (ఎందుకంటే) మన ఆత్మే మనకు మిత్రుడు, (కావచ్చు, అదే
    మన ఆత్మ మనకు శత్రువు (గా మారవచ్చు)
    మన ఆత్మ (అంటే మన మనస్సు), మన ఆలోచనలు, మన అలవాట్లు – ఇవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన మనస్సు మనకు మిత్రుడిగా ఉండాలంటే చెడు అలవాట్లను వదలాలి. అలా వదలకపోతే, ఈ చెడు అలవాట్లు మన ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.
    మనం నాజూగ్గా కనపడాలంటే, మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును వదిలించుకోవాలి. అలాగే, చురుగ్గా తయారవ్వాలంటే, భయాన్ని, పిరికితనాన్ని, ఆత్మన్యూనతను, అభద్రతా భావాన్ని, ఒత్తిడిని, జాలిని మరియు కొన్ని అపోహలను వదిలించుకోవాలి.
    ఈ విభాగం మనల్ని మనం ఎలా మార్చుకోవాలో, ఎలా మలచుకోవాలో చూపిస్తుంది. మన లోపాలను గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలియజేస్తుంది…………

    200.00
    Add to cart
  • Mega Cooking Book (Vegetarian)

    Mega Cooking Book (Vegetarian)

    0

    దీనిలో ఉదయపు బ్రేక్ ఫాస్ట్ మొదలు…. అంటే ఇడ్లీ, దోసె, ఉప్మా, పురీ వెరైటీల దగ్గర్నుంచి స్వీట్స్ – హాట్స్ – చాట్స్ – స్నాక్స్ – పిండివంటలు; భోజనంలోని అన్ని రుచులు కూరలు – పచ్చళ్ళు – పులుసులూ – పులిహోరలు – పాయసాలూ – కిచిడీలూ – బాత్ లూ – పులావ్ లు ; రకరకాల ఉరగాయలు; ఇవి గాక పరోటాలు, వాటికీ కూరలు, కొత్తరకం అల్పాహారాలు… ఇలా ఒకటేమిటి? – మనకు ఎన్ని రకాల ఆహారాలున్నాయో అవన్నీ దీనిలో దర్శించవచ్చు! అందుకే ఇదీ భారీ వంటల పుస్తకం.

    ఇది ఉంటే చాలు! వంటింటికి శోభ – మీ వంటికి ఆరోగ్యం.

    180.00
    Add to cart
  • Mein Kampf Adolf Hitler Aatmakatha

    Mein Kampf Adolf Hitler Aatmakatha

    0

    Mein Kampf Adolf Hitler Aatmakatha

    ‘మీన్ కాంఫ్’ తొలిసారిగా 1925-26లో రెండు సంపుటాలుగా ప్రచురించబడింది. హిట్లర్ జీవించి ఉన్న కాలంలో ఇది ఎనిమిది నుండి తొమ్మిది మిలియన్ల ప్రతులు అమ్ముడవడమే కాకుండా, విస్తృతంగా అనువదించబడింది. ఇది ఇరవయ్యవ శతాబ్దపు అత్యంత అపఖ్యాతి పాలైన రాజకీయ గ్రంథం. నమ్మశక్యంకాని ఆత్మకథ, అసంపూర్ణ రాజకీయ తత్వశాస్త్రాల కలయికతో ఇది జర్మనీకి, ప్రపంచానికి విషాదాన్ని తెచ్చిపెట్టింది.

    ‘మీన్ కాంఫ్’ ఒక దుష్ట గ్రంథం, కానీ హోలోకాస్ట్‌ను అర్థం చేసుకోవాలనుకునే వారికి, నిరంకుశ మనస్తత్వశాస్త్ర విద్యార్థులకు, మరియు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకునే వారందరికీ మాన్‌హీమ్ అనువాదం తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథంగా మిగిలిపోయింది.

    600.00
    Add to cart
  • -10% మెయిన్ కాంఫ్

    Mein_Kampf -మెయిన్ కాంఫ్ (అడాల్ఫ్ హిట్లర్ ఆత్మకథ)

    0

    మెయిన్ కాంఫ్ (అడాల్ఫ్ హిట్లర్ ఆత్మకథ)

    మెయిన్ కాంఫ్అడాల్ఫ్ హిట్లర్ ఆత్మకథ అయిన ‘మీన్ కాంఫ్’, అక్షరాలా ఒంటరిగా చరిత్ర గమనాన్ని మార్చి, తరతరాలుగా ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీసిన ఒక వ్యక్తి మనస్తత్వాన్ని మనకు తెలియజేస్తుంది.

    మైన్ కాంఫ్ (జర్మన్: [maɪn kampf] అక్షరాలా నా పోరాటం) అనేదినాజీ పార్టీనాయకుడైనఅడాల్ఫ్ హిట్లర్రాసినఆత్మకథాత్మకమరియు రాజకీయప్రణాళికహిట్లర్ యొక్కఅనేక, అతని రాజకీయ సిద్ధాంతం, మరియుజర్మనీమరియు ప్రపంచం కోసం అతని భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తుంది. మైన్ కాంఫ్ యొక్క మొదటి సంపుటం 1925లో మరియు రెండవ సంపుటం 1926లో ప్రచురించబడ్డాయి.

    నవంబర్ 1923లో మ్యూనిచ్‌లో జరిగిన తన విఫలమైన తిరుగుబాటు మరియు ఫిబ్రవరి 1924లో దేశద్రోహం ఆరోపణలపై విచారణ తరువాత , హిట్లర్ లాండ్స్‌బర్గ్ జైలులో ఖైదీగా ఉన్నప్పుడు ‘మీన్ కాంఫ్’ రాయడం ప్రారంభించాడు . ఈ విచారణలో అతనికి కోట నిర్బంధంలో ( ఫెస్టంగ్‌షాఫ్ట్ ) ఐదు సంవత్సరాల శిక్ష విధించబడింది. మొదట్లో చాలా మంది సందర్శకులు వచ్చినా, అతను త్వరలోనే పూర్తిగా ఆ పుస్తకానికే అంకితమయ్యాడు. అతను రాస్తూ ఉండగా, అది రెండు సంపుటాలుగా ఉండాలని గ్రహించాడు. ఆ సమయంలో జైలు గవర్నర్ ఇలా పేర్కొన్నారు, “[హిట్లర్] ఈ పుస్తకం అనేక ముద్రణలకు రావాలని ఆశిస్తున్నాడు, తద్వారా అతను తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చగలడు మరియు తన విచారణ సమయంలో అయిన ఖర్చులను భరించగలడు. హిట్లర్ ఒక సంవత్సరానికి పైగా జైలులో గడిపాడు మరియు విడుదలైన తరువాత వేసవిలో మొదటి సంపుటాన్ని ప్రచురించాడు. మొదట్లో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ, 1933లో హిట్లర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పుస్తకం జర్మనీలో బెస్ట్ సెల్లర్‌గా మారింది.

    మైన్ కాంఫ్ (జర్మన్: [maɪn kampf] అక్షరాలా నా పోరాటం) అనేదినాజీ పార్టీనాయకుడైనఅడాల్ఫ్ హిట్లర్రాసినఆత్మకథాత్మకమరియు రాజకీయప్రణాళికహిట్లర్ యొక్కఅనేక, అతని రాజకీయ సిద్ధాంతం, మరియుజర్మనీమరియు ప్రపంచం కోసం అతని భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తుంది. మైన్ కాంఫ్ యొక్క మొదటి సంపుటం 1925లో మరియు రెండవ సంపుటం 1926లో ప్రచురించబడ్డాయి.

    నవంబర్ 1923లో మ్యూనిచ్‌లో జరిగిన తన విఫలమైన తిరుగుబాటు మరియు ఫిబ్రవరి 1924లో దేశద్రోహం ఆరోపణలపై విచారణ తరువాత , హిట్లర్ లాండ్స్‌బర్గ్ జైలులో ఖైదీగా ఉన్నప్పుడు ‘మీన్ కాంఫ్’ రాయడం ప్రారంభించాడు . ఈ విచారణలో అతనికి కోట నిర్బంధంలో ( ఫెస్టంగ్‌షాఫ్ట్ ) ఐదు సంవత్సరాల శిక్ష విధించబడింది. మొదట్లో చాలా మంది సందర్శకులు వచ్చినా, అతను త్వరలోనే పూర్తిగా ఆ పుస్తకానికే అంకితమయ్యాడు. అతను రాస్తూ ఉండగా, అది రెండు సంపుటాలుగా ఉండాలని గ్రహించాడు. ఆ సమయంలో జైలు గవర్నర్ ఇలా పేర్కొన్నారు, “[హిట్లర్] ఈ పుస్తకం అనేక ముద్రణలకు రావాలని ఆశిస్తున్నాడు, తద్వారా అతను తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చగలడు మరియు తన విచారణ సమయంలో అయిన ఖర్చులను భరించగలడు. హిట్లర్ ఒక సంవత్సరానికి పైగా జైలులో గడిపాడు మరియు విడుదలైన తరువాత వేసవిలో మొదటి సంపుటాన్ని ప్రచురించాడు. మొదట్లో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ, 1933లో హిట్లర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పుస్తకం జర్మనీలో బెస్ట్ సెల్లర్‌గా మారింది.

     

     

     

     

    Original price was: ₹620.00.Current price is: ₹558.00.
    Add to cart
  • Merupula Marakalu

    Merupula Marakalu

    0

    ఈ నవల చదివినంత సేపు ఒక రసవత్తరమైన సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే ఉషారాణి పాత్ర మొదటి నుంచి చివరి వరకు ఈ నవలని ఏకబిగిని అద్భుతమైన టెంపోలో నడిపిస్తుంది. సంభాషణలు ఇప్పటికి ఆధునీకమే. ప్రతి దృశ్యాన్ని ఆధునిక కళాఖండంగా మలిచారు నాన్న గారు. నవల ముగింపు ఒక అనూహ్యం.

                     మానవుని స్వయం శక్తీ ఒక పక్క, ఆధ్యాత్మిక సంపద మరో పక్క పెనవేసుకుని ఈ నవలకి దీప్తిని, శోభని చేకూర్చాయి. నాన్నగారి సాహితి జైత్రయాత్రలో అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ఒక గొప్ప సజీవమైన నవల…. మెరుపుల మరకలు.

    200.00
    Add to cart
  • Mi Kalalanu Kollagottindevaru? ?

    Mi Kalalanu Kollagottindevaru? ?

    0

    నేను ఈ పుస్తకాన్ని ఎందుకు రాసాను?

    మిమ్మల్ని వేళాకోళం ఎవరైనా చేసారా…? మీరు తప్పు చేసారని నిరూపించడానికి ఎవరైనా ప్రయత్నించారా…? మిమ్మల్ని అపహాస్యం పాలు చేసారా…? మిమ్మల్ని అవమానించారా…? మిమ్మల్ని పడదోయడానికి ఎవరైనా ప్లాన్ చేశారా ? అయినా మీరు నిలదొక్కుకుని అరిచారా . . .

    ఇక చాలు, మరీ ఎక్కువ అయింది… తస్మాత్ జాగ్రత్త………

    నా జీవితంలో నేను ఒకప్పుడు ఇటువంటి పరిస్థితులలోనే చిక్కుకుపోయాను. ఇక సహించలేకపోయాను. చెలియలికట్ట తెగిపోయింది…. అందువలనే ఈ పుస్తకం రాసాను. మీకు అసలు సిసలైన నిజాలను చూపించాలి. నిజాలు తెలుసుకున్నాక మీ కళ్ళు తెరుచుకుంటాయని నా నమ్మకం….. తరతరాల నుండి వస్తున్న బిజినెస్లో మీరు ఎంత కాలం నిలదొక్కుకోగలుగుతారు. వాటిల్లో లాభాలు తక్కువ వస్తున్నాయి. జీతాన్ని చాలా వరకు తగ్గిస్తున్నారు. ఇక తమ ఆఫీసుల్లో పనిచేసే వర్కర్లను తీసేస్తున్నారు.

    నేను తరతరాల నుండి వస్తున్న బిజినెస్ గురించి చెప్పాను. దీనికి వ్యతిరేకంగా మరో మార్గం కూడా ఉంది. ఈ మార్గంలో నడిస్తే మీరు బాస్ కూడా కాగలుగుతారు. దీనిని అపరంపరాగత బిజినెస్ అని కూడా అనవచ్చును. ఈ బిజినెస్ ఈనాడు ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ కొత్త పద్ధతి ప్రజల కార్యప్రణాళికలను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు వాళ్ళ లైఫ్ స్టైలే మార్చేస్తోంది.

    నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీలెవల్ మార్కెటింగ్ (ఎమ్.ఎల్.ఎమ్) అన్న పేరున నడిచే ఈ వ్యాపారం. ఎంతో పై ఎత్తున మీరు మీ లక్ష్యం దాకా… పనిచేసే సమయం, ఎన్నిగంటల పని చేయాలి అన్న నిర్ణయం తీసుకోగలుగుతారు. పార్ట్ టైమ్ పనిచేస్తూ బోలెడంత సంపాదించవచ్చు. ఇదంతా ఉత్తి కల్పనేనా? లేకపోతే ఏదైనా స్కామా?

    225.00
    Add to cart