-
Misrani
0₹260.00ఇది సస్పెన్స్ నవల కాదు. క్రై0 నవల కాదు.
ఇది స్వతంత్రానికి పూర్వం జైపూర్ సంస్థానానికి చెందిన 84 ఏళ్ళ ఓ మహిళ కథ. కాబట్టి విభజనకి పూర్వం భారతీయ చరిత్ర ఇందులో చదవచు.
ఇంకా సినిమా అవుట్ డోర్ షూటింగ్ విశేషాలు , వివిధ భారతీయ వంటకాల గురించి, ఓ మహిళ జీవితంలోని అనేక మలుపు తిప్పిన సంఘటనల గురించి ఇందులో చదవచ్చు.
ఒకటి ఒంటరి అంకె , అందమైన జీవితం, మందాకినీ , జాబిలి మీద సంతకం నవలల్లా ఇది కూడా ఓ మహిళ జీవిత కథ.
మీ అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి అందిస్తున్న 108 వ నవల మిస్రాణి
-
-
Mohana Roopa
0₹100.00దక్షిణ ఎక్సప్రెస్ లయబద్దంగా శబ్దంచేస్తూ హైదరాబాద్ వెడుతుంది.
పేరుకు మాత్రమే ఎక్సప్రెస్ . వేగం మాత్రం మందంగా పెళ్ళికూతురు నడకలా ఉంది. ఇంద్రమోహన్ కళ్ళు విప్పి చుట్టూ కలయజూచాడు. త్రి టైర్ స్లీపర్ కోచిలో అందరు నిదురబోతున్నారు.
కొందరు ఖరీదయిన పరుపులు పరుచుకుంటే మరికొందరు దుప్పట్లు పరుచుకుని చేతిసంచో, తోలుపెట్టొ, చెయ్య తలక్రింద పెట్టుకుని నిదుర బోతున్నారు.
మూడో అంతస్తులో పడుకున్నాడు. ఇంద్రమోహన్ కి క్రింది సీటే దొరికింది. నాగపూర్ లో ఓ లావుపాటి స్త్రీ యెక్కింది. ఆమెను చుస్తే నీళ్ళగోలెం పై చెంబు బోర్లించినట్లు అనిపిస్తుంది.తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-మాదిరెడ్డి సులోచన.
-
-
-
Money Purse
0₹250.00డబ్బులు చెట్లకు కాస్తున్నాయా?… అవును కాస్తాయి!! విత్తునాటే నేలనుబట్టి చెట్టు పెరుగుదల ఫలాలు ఉంటాయి. రూపాయి కూడా అంతే! నువ్వు దాన్ని పోస్టాఫీసులో నాటుతావా? బ్యాంకులో నాటుతావా? షేర్స్ లో నాటుతావా? ఇంటిపై నాటుతావా? బీమాలో నాటుతావా? లేదా అన్నీకలిపిన నేలలో నాటుతావా? అన్నదాన్ని బట్టి ఫలం. మరి ఎక్కడ నాటాలి? మీరు ఎవరినీ అడగాల్సిన పని లేకుండా వంగా రాజేంద్రప్రసాద్ చెబుతారు. ‘ఫీజు’ రూపాయలు. ‘చదువులు మనకన్నీ నేర్పుతాయి. డబ్బును ఎలా వాడుకోవాలో తప్ప’ అన్న ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి చెప్పిన మాటలు మిమ్మల్ని ఆలోచనల్లో పడేసి ఉంటే ఆ మిగిలిన ఒక్క నైపుణ్యాన్ని నేర్పే టీచరే ఈ పుస్తకం. పత్రికల్లో ఆర్ధిక సలహాలు అందిస్తున్న రాజేంద్రప్రసాద్ వృధా వాక్యాలు వాడకుండా ఇంత సరళంగా ఆర్ధిక పాఠాలెలా చెప్పారన్నదే పెద్ద ప్రశ్న.
– సాక్షి దినపత్రిక
-
Money Purse 2
0₹300.00సంపాదించడానికి ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తూనే ఉన్నారు. భూమ్మీద లెక్కలేనన్ని ఆదాయ మార్గాలున్నాయి. కానీ మనలో చాలామంది – సంపాదించిన దానిని వృధా కాకుండా పొదుపు చేయడానికి, మంచి ఆదా మార్గమేదో తెలుసుకోవడానికి శోధించడం లేదు పూర్తిస్థాయిలో. అందుకే ఆదాయ మార్గాల గురించి కాకుండా, అనవసర వ్యయాల గురించి, ఆధిక లాభాలనిచ్చే ఆదా మార్గాల గురించి చర్చించా ఈ పుస్తకంలో.
చిట్ ఫండ్స్ లాభమా? నష్టమా?
నేలను నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడా…?
రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఏ జాగ్రత్తలు తీసుకొవాలి?
వంద రూపాయలతో పది వేల కోట్లు……. ఎలా?
ఏడాదికి 9% వడ్డీ గిట్టబాటయ్యే ఎండోమెంట్ బీమా పాలసీ ఏది?
ఎల్ ఐ సి ఎండోమెంట్ పాలసీ లో రాబడి ఎంత?
ఏది ఉత్తమ పెట్టుబడి?
నమ్మకానికి అమ్మ వంటిది ఎల్ ఐ సి మాత్రమేనా?
ప్రైవేటు బీమా కంపెనీలను నమ్మ వచ్చా?
ఏజంటు లేకుండా పాలసీ తీసుకోవచ్చా?
పిల్లలని కోటిశ్వరులను చేయడం ఎలా?
పోస్టల్ అర్ డి, బ్యాంక్ అర్ డి ల లో ఏది ఎక్కువ లాభం?
వేయి రూపాయలు= లక్ష రూపాయలు
బంగారానికీ కల్తీ కావాలి
ఆరోగ్య మహాభాగ్యానికి ఏమి చేయాలి?
బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ లాభమా? నష్టమా?
బంగారం ఎలా కొంటే మంచిది?
జీవిత బీమా తక్కువయితే నేరం, ఎక్కువయితే ప్రమాదం
….ఇంకా ఎన్నో ఆర్ధిక సందేహాలకు చదవండి….
ఇది 5వ ముద్రణ…
-
Money Purse 3
0₹300.00ఏడాదికోసారి ‘హెల్త్ చెకప్’ చేయించుకుంటే రోగాలు రాకుండా జాగ్రత్తపడొచ్చు. ‘వెల్త్ చెకప్’ చేయించుకుంటే ఆర్ధిక సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కానీ వెల్త్ చెకప్ ఎవరు చేస్తారు? మనీపర్స్ చదివితే వెల్త్ చెకప్ అయి ఆర్ధికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకాలు.
– గంపా నాగేశ్వరరావు గారు
లక్ష్మీదేవి తన భార్యే అయినా వెంకటేశ్వర స్వామి నిత్యం నిలబడి సంపాదిస్తున్నాడు. కానీ కుబేరుడు..? కుబేరుడిలా కూర్చొని, పడుకుని, నిద్రపోతూ కూడా సంపాదించాలి అనుకుంటారా? కుబేరుడిలా శ్రమలేని ఆదాయం రావాలంటే ఆయనలా మీ డబ్బుని ఎక్కడ, ఎప్పుడు, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియాలి. ఆ ఆర్ధిక అక్షరాశ్యతలో భాగంగానే మనీపర్స్ 1 & 2 వచ్చాయి. ఇప్పుడు మనీపర్స్ – 3 మీ చేతిలో ఉంది. చదవండి…
ఈ పుస్తకం ద్వారా ఎక్కువ లాభం పొందాలి అనుకుంటున్నారా మీరు? ఐతే, కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం అనే ఉద్దేశ్యంతో చదవకండి. తెలుసుకుంటే జీవితాలు మారవు. తెలిసిన విషయాలను ఎంతవరకు ఆచరిస్తున్నారని మిమ్మల్ని మీరు సమీక్షించుకోవడానికి చదవండి. పొద్దున్నే లేచి ఓ గంట నడిస్తే లాభం అని నాకు తెలిస్తే… ఏం లాభం? నడిస్తే లాభం. అలా రోజూ నడిచేంత వరకు నడక వల్ల ప్రయోజనాలు తెలుసుకుంటూనే ఉండాలి నేను. అలాగే మన జీవిత ఆర్ధిక ఆరోగ్యం ఎలా ఉందో మనకి మనం తెలుసుకునేందుకు మన ఫైనాన్స్ ని మనమే స్కానింగ్ చేసుకోవాలి. అందుకు ఈ పుస్తకం కొంతవరకు పనికొస్తుందని నమ్ముతున్నా.
ఈ పుస్తకంలో…
ఎంత సంపాదించాలి?
ఇల్లుకొందామా? అద్దెకుందామా?
పర్స్ లో పైసా తీయకుండా ఫ్లాట్ ఋణం తీర్చవచ్చా?
ఇంటి రుణ వాయిదాలు భారం అయితే.. ఏం చేయాలి?
అద్దెకారు తీయన… సొంతకారు పుల్లన ?
-
Mooka Pancha Sathi Telugu
0₹250.00Mooka Pancha Sathi Telugu
మూకపంచశతి (Mooka Pancha Sathi)
కాంచీపుర కామాక్షి దేవిపై మూక కవి రచించిన అద్భుతమైన 500 సంస్కృత శ్లోకాల కృతి. ఇది తెలుగులో తాత్పర్యాలతో (దోర్బల విశ్వనాథ శర్మ, కోటేశ్వర రావు వంటి వారి అనువాదాలు) లభిస్తుంది. కాటాక్ష, ఆర్య, పాదారవింద, స్తుతి, మందస్మిత శతకాలుగా విభజించబడిన ఈ పుస్తకం, దేవి కరుణను, సౌందర్యాన్ని వర్ణిస్తుంది.
-
Mr Sampath M A
0₹120.00ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే ఉంటాయి. మాదిరెడ్డి సులోచన సమగ్ర సాహిత్యం ఈ తరం పాఠకులకు అందచేయ్యాలని, ఈ నవలల్ని పాఠకులు ఆదరిస్తారనీ మా ఆలోచనలకు మిత్రులనుండి, పాఠకులనుండి సోదర ప్రచురణకర్తల నుండి ఎంతో ప్రోత్సాహం వచ్చింది. వారికి మా ధన్యవాదాలు.
సంపత్ హడావుడిగా లేచాడు. అతని అరచేతులు తడిగా ఉన్నాయి. ఎదో గాభరా! ఎదురుగా ఉన్న స్ప్రింగ్ తలుపును ఆనుకొని ఉన్నాడో వ్యక్తి. అతని చేతిలో ఫైలు లాంటి కార్డ్ బోర్డ్ ఉంది. దానివంకే పరీక్షగా చూస్తున్నాడు. అతని నోరు ఎండుకు పోతుంది. సంపత్ ముందుకు వెళ్ళాడు. నేనే ఆ సంపత్ ను అని చెప్పాలని ఉంది. నోట్లో నుండి మాట బయటికి రావటం లేదు. ఉద్యోగాల వేటలో మొదటి ప్రయత్నం ఇది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-
Mrutyunjayulu – మృత్యుంజయులు
0₹80.00జనంలోంచే వస్తారు ‘మృత్యుంజయులు’
ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా పాలకవర్గం పాలితవర్గం నడుమ పోరాటమంటూ ప్రారంభమయితే నాటి పరిస్థితుల అనుకూల్యతను అనుసరించి అంతిమ విజయం ఉంటుంది. ఇది చారిత్రక సత్యం. అలాటి సత్యావిష్కరణకు సృజన రూపం ‘మృత్యుంజయులు’ నవల.
1946లో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటం వస్తువుగా 1947లో ‘మృత్యుంజయులు’ నవల అచ్చయింది. ఆ పోరాటానికి తొలి అక్షరరూపం ఈ నవల. రచనా కాలానికి రచయిత బొల్లిముంత శివరామకృష్ణ వయసు 27 ఏళ్ళు. యువకుడుగా తన కాలంలో తన సమీప ప్రాంతం తెలంగాణలో ప్రారంభమైన ప్రజాపోరాట నేపథ్యాన్ని అవగాహన చేసుకొని, దాని ఆంతర్యాన్ని అర్థం చేసుకొంటూ, ఆ పోరాటం జరుగుతున్న తీరుతెన్నుల్ని గమనిస్తూ, ప్రజలపక్షమే అంతిమ విజయమని వైతాళిక గీతికగా ఆవిష్కరించిన కథా కథనం ‘మృత్యుంజయులు’ నవల.