-
Malapalli – మాలపల్లి
0₹300.00అవి జాతీయోద్యమం రోజులు,
ఈ రచనను బ్రిటీషు ప్రభుత్వం
రెండు పర్యాయాలు నిషేధించింది.
రచయితను – రచనను ప్రముఖులు
వేనోళ్ళ కొనియాడారు.
తెలుగు సాహిత్యంలోని గొప్ప నవలలో ‘మాలపల్లి’ ఒకటి. స్వాతంత్య్రోద్యమ కాలంనాటి తెలుగు జన జీవితాన్ని, విభిన్న భావజాలాల సంఘర్షణలను అద్బుతంగా చిత్రీకరించిన నవల ‘మాలపల్లి’. తెలుగువారిపై ‘మాలపల్లి’ చూపించిన ప్రభావం బ్రిటీషువారిని కలవరపరచి ఈ నవలను నిషేధించేలా చేసింది. -
-
-
-
Mana Telugu Peddalu
0₹400.00డాక్టర్ మల్లాది కృష్ణానంద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖలో అడిషనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. శ్రీ కృష్ణానంద్ జిల్లా పౌరసంబంధాల అధికారిగా గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలలో పనిచేసారు. అనంతరం, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేషీలో ప్రజా సంబంధాల అధికారిగా, ప్రెస్ సెక్రటరీ టు గవర్నర్ గా, గ్రామీణాభివృద్ధి సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్ అఫ్ హైదరాబాద్. రాష్ట్ర పర్యాటక శాఖ, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లలో ప్రధాన పౌరసంబంధాల అధికారిగా పనిచేశారు.
పలు రంగాలలో విశిష్ఠ సేవలందించిన కీర్తిశేషులైన తెలుగు పెద్దల జీవన చిత్రాలపై శ్రీ మల్లాది రాసిన తెలుగు పెద్దలు, చరితార్థులు మన తెలుగు పెద్దలు గ్రంథాలు విశేష ఆదరణ పొందాయి.
– డా. మల్లాది కృష్ణానంద్
-
Manchi Swiya Prema Dwara
0₹399.00స్వీయప్రేమ అంటే ఏమిటి?
మానసిక ప్రశాంతత చేకూరాలంటే జీవితంలో తప్పనిసరిగా సంతులనం ఉండాలి. పనికి- విశ్రాంతికి, కార్యాచరణకి – సహనానికి, ఆదాయానికి -వ్యయానికి, హాస్యానికి-గాంభీర్యానికి, వదిలించుకోటానికి కొనసాగ టానికి మధ్య సమతుల్యత ఉండాలి. జీవితంలోని అన్ని పార్శ్యాలలోనూ మీరు సమతుల్యతను గనక సాధించకపోతే, మీరు తీవ్రంగా అలిసిపోతారు. విపరీతమైన భావోద్వేగాలు మిమ్మల్ని కుంగదీస్తాయి. అపరాధభావన మిమ్మల్ని వెంటాడుతుంది.
ఉదాహరణకు, కార్యాచరణకు- సహనానికి మధ్య సంతులనం గురించి చెప్పుకుందాం. మీరు చివరి సంవత్సరం యూనివర్సిటీ పరీక్షలకు
ప్రాజెక్టు లీడర్ గా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో మీరు అధికంగా అభిమానించే ఆటగాడొకరు తన బృందానికి సహకరించటం లేదన్న విషయాన్ని మీరు గుర్తించారు. అదే అనేక మార్లు కొనసాగినప్పుడు తప్పనిసరిగా మీరు సంబంధిత అధికారుల దృష్టికి ఆ విషయాన్ని తీసికెళ్లాలి. అప్పుడు కూడా వారు మీ సూచనలను నిర్లక్ష్యం చేస్తుంటే, ఏ చర్య తీసుకోలేకపోయానన్న అపరాధభావన మిమ్మల్ని వెంటాడుతుందా
‘మీరు దయ,
జాలి గల వ్యక్తులయితే, అనవసరంగా వారి మనసును గాయపరిచి, ఇబ్బందులోకి నెటానేమోనన్న భావనా మిమ్మల్ని ఇబ్బంది
-
Manishi Lopali Mahasamudralu
0₹80.00నా చిన్న మాట….
పదిహేడేళ్ళ అమ్మాయి తన ప్రాణాన్ని థానే తీసేసుకుంది. కలకలం రేపింది. చిన్నాపెద్దా “అయ్యో” అన్నారు. గాలి కూడా సానుభూతి చూపింది. ఆకాశం కన్నీళ్ళు కార్చింది. “జీవితాన్ని ఎం చూసిందని” అన్నారు. నిజమే! కలలకు చోటులేని ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. “అంత బరువెం మౌసిందని” అన్నారు మరికొందరు. పరీక్షలో ఫెయిలవడం కూడా ఒక కారణమేనా అన్నారు. ఏమో! ఎం తెలుసు. ఆ పరీక్ష చుట్టూ ఎన్ని కలల సాలిగూళ్లు అల్లుకున్నాయో. సమాజం తనకై నిర్మించిన ఎన్ని సౌధాలను ఆ వైఫల్యం కూల్చివేసిందో. మొత్తనికి ఆ ఘటన నన్ను కుదిపేసింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-కిల్లాడ సత్యనారాయణ.
-
Manishi Roopalu – మనిషి రూపాలు
0₹280.00కొండప్రాంతాలలో నివసించే ఒక వితంతు యువతి కథ ఇది. ఇందులో మనిషి యొక్క అనేక రూపాలను ఎంతో నైపుణ్యంతో చిత్రించాడు రచయిత. మన సంఘంలో ప్రబలివున్న వైరుధ్యాలనూ, తారతమ్యాలనూ వేలెత్తి చూపించాడు. మనిషి పరిస్థితులకు కేవలం బానిస అనీ, పరిస్థితులే అతని జీవితాన్ని నడిపిస్తాయనీ నమ్ముతాడు రచయిత.
యశ్‌పాల్ విప్లవవాది. అతను తన జీవితంలో అనేక పోరాటాలను ఎదుర్కొన్నాడు. అతని రచనల్లో సాంఘిక, రాజకీయ భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. నిరుపేదలపై జరుగుతున్న దౌర్జన్యాన్ని ఎదుర్కొనేందుకు, సాంఘిక చైతన్యం కలగజేసేందుకు అతను తన కలాన్ని శక్తివంతంగా ఉపయోగించారు.
పేజీలు : 314
-