-
Kasibhatla Venugopal- 3 Novels (Nenu Chikati, Thapana, Digantham)
0₹300.00గత దశాబ్ద కాలంలో “నేను – చీకటి” తెలుగు నవలా సాహిత్యంలో ఒక ప్రభంజనమైతే “తపన” ఒక ఘంఘా మారుతం అయింది. “రాళ్ళెత్తిన కూలి” కథ సాహిత్యంకి పచ్చ బొట్టయింది. స్వతహాగా కవి. వీరి రచనల్లో కవిత్వపు వాసనలు గుబాళిస్తుంటాయన్నది కాదనలేని సత్యం. అది ఆయా రచనలకు అలంకార ప్రాయమే అవుతోంది.
“సర్టిఫికెట్స్ చదువుకి కొలబద్దలైతే నాకు చదువు రాదన్నమాటే! నా దగ్గర ఒక సర్టిఫికెట్ కూడా లేదు మరి! చదువంటే నలభై అయిదేళ్ళ జీవితమే నాకు. భుక్తికి ఇన్సూరెన్సమ్మాకల్తో పాటు ఒ రెండు చిన్న వ్యాపార లావాదేవీల్లో ఇంకింత చిన్న వాటాలు, అంతే!” అంటారు శ్రీ వేణు గోపాల్.
ఇంకా-
“బ్రహ్మచారిని. మంచి పద్యమూ, పద్యమూ – రెండు నాకు ప్రీతి . అమ్మ కి||శే|| మనుమాంబ చిన్నప్పుడే పల్లె వేయించిన “అమరకోశము” చదివించిన “రఘు వంశము” ఈ రోజుకి నాకు ఉపయోగపడుతున్నాయి” అని గురువుని స్మరిస్తుంటారు.
-
Kasyapa Yodhudu – కశ్యప యోధుడు
0₹200.00మాతృభూమి రక్షణకై యోధుడుగా మారిన ఒక బ్రాహ్మణ యువకుని కథ. మహారాజు క్షమాపణలు చెప్పటాన్ని అక్కడి ప్రజలు ఊహించలేదు. వారందరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సముద్రఘోషగా ఖాసి సైన్యం సూర్యదేవాలయాన్ని చేరుకుంది. నిరాయుధులైన అందరినీ వధించిన తరువాత నిశ్ఛేష్టులై విగ్రహాల్లా నిల్చొని ఉన్న రాజును, రాజగురువును ఖాసిం స్వయంగా తన ఖడ్గంతో వధించాడు. అద్భుతమైన సౌందర్యం, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన దేవాలయ ప్రాంగణం రక్తసిక్తమై ఒక్కసారిగా భయానకంగా తయారైంది. సూర్యుడు కూడా ఈ ఘోరాన్ని చూడలేనట్టు మబ్బుల వెనకాల దాక్కున్నాడు. కొద్దిసేపటికే వర్షం ముంచెత్తి ఆకాశం తన బాధను తీర్చుకుంది. ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకునే మాతృభూమి ముస్లింల వశమైంది.
కశ్యపాపుర మహాసామ్రాజ్యానికి రాజు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్తితి ఎందుకొచ్చింది? యోధానుయోధులను కన్న భరతభూమి పోరాటపటిమ లేకుండా ఖాసిం సైన్యానికి ఎందుకు దాసోహమైంది? కట్టుబాట్లు, సాంప్రదాయాలు అంటూ వేదమంత్రాలు వల్లెవేసుకునే సౌమ్యుడైన బ్రాహ్మణ యువకుడు యుద్ధమే ఊపిరిగా బ్రతికే ఖాసింని ఎదుర్కొనే యోధుడుగా ఎలా మారాడు..? ”మాతృభూమిని రక్షించటం అంటే పరాయి దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయటమేనా? తరతరాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్యకు పరిష్కారం కనుగొనగలిగాడా?”… తెలుసుకోవాలంటే ఈ నవల చదవక తప్పదు.
-
Katha 2021
0₹140.00కల్లోల వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయా?
వాసిరెడ్డి నవీన్
కథారచనకు స్వేచ్ఛావ్యవస్థ తప్పనిసరి.
ఆమాటకొస్తే ఏ రచనకైనా అది అవసరమే. ఇప్పుడు ఆ వ్యవస్థ బలహీన పడుతోంది. అంటే రచయితలకు స్వేచ్ఛ లేదని కాదు. (అప్పుడప్పుడు ప్రభుత్వాలు ఆ స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అది వేరు.) కానీ కనపడని ఇనుపతెరలు దానికి అడ్డుగా వేలాడుతున్నాయి. రచయిత తన అభిప్రాయాలను, భావావేశాలను, దృక్పథాన్ని, తనకు తెలిసిన జ్ఞానాన్ని, తెలివిడిని తన చుట్టూ ఉన్న ప్రపంచంతో పంచుకోవాలని తపన పడతాడు. రచనకున్న ఈ ప్రాథమిక ఉద్దేశానికి ఆటంకాలు ఏర్పడుతున్న దశ ఇది. మరీ ముఖ్యంగా సృజనాత్మక రచనలకు.
కథలకు కానికాలం వచ్చేసింది.
ఇటీవల కాలంలో కథల నిడివి రానురాను కుంచించుకుపోతోంది. ఎంచు కున్న కథావస్తువుకు అవసరమనిపించినంత, రాయవలసిన అవసరం ఉండి, రాయగలిగి కూడా రచయిత రాయలేకపోవడం విషాదం కదా! పత్రికల్లో సాహిత్యానికి జాగా తగ్గిపోవడము, కథలను ప్రచురించే పత్రికలు కనుమరుగైపోవడము, తెలుగు సాహిత్యాన్ని వారసత్వ సంపదగా
-
Katha Sravanthi (Set of Ten books)
0₹670.00కనపర్తి వరలక్ష్మమ్మ కథలు, తల్లూరి నాగేశ్వరరావు కథలు, కరుణ కుమర కతలు, బలివాడ కాంతరావు కథలు, – శశిశ్రీ కాఠ్ఠలు, సంతి నారాయణ కథలు, – సతీశ్ చంద్ర కాఠ్ఠలు, పెద్దింటి అశోక్ కుమార్ కథలు, వి. ఆర్. రసాని కథలు, సన్నాపురెడ్డీ వేంకటరామిరెడ్డి కథలు,
-
KGH Kathalu
0₹150.00మనసులో మాట
మనసులోంచి తన్నుకొచ్చే ఆలోచనలన్నీ బిగబట్టి భద్రంగా దాచి ముప్ఫై ఏళ్ళ పైగా చదువులో మునిగి తేలి, ఇన్నాళ్లకు ఈ చదువిక అవ్వదని తెలుసుకుని, ఆ ఆలోచనలకి ఒక స్వేచ్ఛనిచ్చి మళ్ళీ పుస్తక రూపంలో బంధిస్తే వచ్చినవే ఈ కథలు.
మనసు మాతృభాషలోనే ఆలోచిస్తుంది. అందుకని తెలుగులో కాకుండా మరే భాషలోనూ నా ఆలోచనలని నిజాయితీగా రాయడం కుదరని పని. నిరంతర పోటీ పరిశ్రమలో బట్టీలు పట్టి వైద్యుడినైపోయిన నేను, ఎక్కడో ఏ మూలో నేను విన్న కథలు నాలో నన్ను అనే ఒకడ్ని సృష్టించి, ఆ భావం నిద్రాణమైపోకుండా నన్నెప్పుడూ మేల్కొల్పుతూ ఉండి చివరికి ఒక సృజనగా ఈ కథాసంపుటంగా ఇన్నాళ్లకు బయటకు వచ్చింది. – నేనొక మానసిక వైద్యుడిని. ఎందరివో బాధలు, గాధలు వింటాను; అయినప్పటికీ ఈ కథల్లో వారెవరి వివరాలు గానీ, అనుభవాలు గానీ లేకుండా జాగ్రత్త తీసుకుని కేవలం నా అనుభవాలు లేదా పరిశీలనలు మాత్రమే రాశాను. ఈ కథలన్నీ కూర్చొని ఆలోచించి పథకం ప్రకారం రాసినవి కావు, అన్నీ ఆశువుగా ఒక సాయంత్రం సోఫాలో కూర్చునో, ఏ రైలు ప్రయాణంలో తూర్పుకనుమలు చూస్తూనో రాసేసినవి. కాబట్టి నిడివి, లోతు, కథావస్తువు మొదలైన వాటిల్లో తారతమ్యం ఉంటుంది…………..
-
Kishan Chandar Rachanalu – 1 Gadidala Kathalu – కిషన్ చందర్ రచనలు – 1 గాడిదల కథలు
0₹100.00సాహిత్యంలో వ్యంగ్యానికున్న శక్తి అందరికీ తెలిసిందే! వ్యంగ్యం అనండి; అవహేళన అనండి; అందులో కిషన్ చందర్ పెట్టింది పేరు. శరీరానికి దెబ్బ తగలకుండా మనస్సుకు మెత్తగా చురుకపెట్టే శక్తి కిషన్ చందర్ రచనకుంది. గాడిదను ఆసరగా తీసుకొని ఢిల్లీ రాజనీతినీ, బొంబాయి వ్యాపారనీతినీ ఎండ గట్టాడు కిషన్ చందర్ ”ఒకానొక గాడిద ఆత్మకథ”లోనూ ‘తిరిగి వచ్చిన గాడిద”లోను. అదే గాడిద మరో దేశానికి ప్రయాణం చేసి తన అనుభవాలను పాఠకుల కందించేలా రాశాడు ”నేఫాలో గాడిద”లో.
పేజీలు : 216
-
Kollayi Gattithe Nemi
0₹250.00ఆంద్రదేశ చరిత్రలోనే 1920 -45ల పాతికేళ్ళకు అనిదంపూర్వమైన ప్రాముఖ్యం ఉంది. సామాజికంగా వీరేశలింగం ప్రభ్రుతులు సంస్కరణవాదధోరణులతో జాతి సంస్కారాన్ని ఎన్నో మెట్లెక్కించిన కాలం అది.
సహాయ నిరాకరణం, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు జాతిని అపార త్యాగాలకు సంసిద్ధం చేసిన కాలం అది. సాహితీ, నవ్యసాహితీ, అభ్యుదయోద్యమాలు సాంస్కృతిక రంగాన్ని నూతన స్థాయికి చేర్చిన కాలం అది.
తెలుగు ప్రాంతంలో జాతీయోద్యమ చరిత్ర శాస్త్రీయమైన అవగాహనతో అన్ని వైపుల నుంచి అధ్యయనం చేసి, కళాత్మకత దెబ్బతినకుండా “కొల్లాయిగట్టితేనేమి?” ‘దేశం కోసం’, ‘జ్వాలాతోరణం’, ‘రథచక్రాలు’, అనే చారిత్రక నవలలు మహీధర రామమోహనరావు రాశారు.
కాంగ్రెస్, కాంగ్రెస్ సోషలిస్ట్, ఫార్వర్డుబ్లాకు, రాయిస్టు, కమ్యూనిస్ట్ పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ, అన్నీ కలిసి పరాయి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ, సంక్లిష్ట చారిత్రిక గతితో మానవ సంబంధాలలో వస్తున్న మార్పుల్ని సజీవ రీతిలో చిత్రించిన నవలలు ఇవి.
– మహీధర రామ మోహన రావు