-
Intelligent Idiot
0₹175.00దీన్ని రాయడానికి ప్రవీణ్ ఎంచుకున్న రచనా పద్ధతి విశిష్టంగా కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలోని ఒక కవితనో, ఒక కథనో, ఒక పద్యాన్నో, ఒక సన్నివేశాన్నో వివరిస్తాడు. దాన్ని రామ్ గోపాల్ వర్మ జీవితానికి, అతని జీవితంతో ముడిపడిన జీవితాలకు అన్వయించే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే ఏ ఇంగ్లీష్ కవి చెప్పిన వాక్యంగాని, ఒక ఫిలాసఫర్ గాని చెప్పిన అభిప్రాయంతో గానీ దాన్ని ముడి పెడతాడు. అదీ సరిపోదనుకుంటే ఏవో కొన్ని నవలల్ని చెప్పి, వాటిలోని సన్నివేశాలతో కూడా కలిపి విశ్లేషిస్తుంటాడు. దీని ద్వారా ప్రవీణ్ అధ్యయన విస్తృతి తెలుస్తూనే, రామ్ గోపాల్ వర్మ అప్పటికైనా తనకు దొరుకుతాడో లేదోననే అన్వేషణతో మరికొన్ని మార్గాల్ని కూడా వెతుకుతూ ముందుకి వెళ్తుంటాడు. – ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆర్జీవి ఒక బుద్ధిహీనుడైన మేధావి’ అని ప్రవీణ్ ఒక పుస్తకం రాశాడు…చాలా ‘ విషయాల్ని ఎంతో విపులంగా చర్చించాడు… RGV కొత్తసీసాలో ఉన్న పాత బాగుంది.మందులాంటి వాడు… చప్పరించే కొద్దీ బావుంటుంది…. ఒకదశలో అలవాటైపోతుంది.. కొన్నాళ్ళకి మనం మెల్లి మెల్లిగా RGVలైపోతాం అదే వర్మ మ్యాజిక్..! -తనికెళ్ళ భరణి Evolution లో కోతులన్నీ మనుషులైపోయాయి. కానీ ఒక్కటి మాత్రం తిరిగి కోతిగా మారిపోయింది. ఆ కోతి పేరు ఆర్జీవి. అది తెలివైన కోతి. దానికన్నీ తెలుసు. బాగా చదువుకుంది. దానికి లాజిక్ తెలుసు, మనుషుల ఎమోషన్స్ తెలుసు, సైకాలజీ తెలుసు, అడ్డమైన విషయాలన్నీ తెలుసు. అందుకే అది మనుషులతో ఆడుకోవడం మొదలెట్టింది. -పూరి జగన్నాథ్
-
Janglee – జంగ్లీ
0₹150.00కిషన్‌చందర్ రాసిన ”జంగ్లీ” (నవల) ఒకనాటి బొంబాయ్ నగర జీవితాన్నీ, మహానగరంగా పెరుగుతున్న ఆ నగర వైరుధ్యాలనూ ప్రత్యేకించి కూటికీ, గుడ్డకూ, గూడుకూ కరువైన సాదాసీదా జనజీవనాన్ని గురించి అత్యంత అద్భుతంగా మన కళ్ల ముందు ఆవిష్కరింపజేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరుగుదలతోపాటు దాన్ని అంటిపెట్టుకుని ఉండే దారిద్య్రం, సంపన్నతలను మనం ఈ నవల ద్వారా గమనించవచ్చు. జీవిత వైవిధ్యాన్ని, మానసిక అంతర్మథనాన్ని కిషన్‌చందర్ గొప్పగా చిత్రించాడు. అనామకులైన ఇద్దరు పేద యువతీయువకుల ప్రేమగాథను కష్టాలకూ, కన్నీళ్ళకూ వేదికైన బొంబాయ్ నగర ”ఫుట్‌పాత్” అలగాజన’ జీవనస్రవంతిలో ఆ ప్రేమజంట ఏ విధంగా జీవనాన్ని సాగిస్తూ కలలు కన్న విషయాన్ని కిషన్‌చందర్ సాహితీలోకానికి అందిస్తాడు. అందుకే ఆయన భారతీయ సాహిత్య శిఖరంలో నిలవగలిగిన కొద్దిమందిలో ఒకరైనారు.
పేజీలు :186
-
Jeevitham mee Chetullone
0₹225.00నన్ను కప్పివేసే నిశి రాత్రిలో
ఈ చివరి నుంచి ఆ చివరకు పరుచుకున్న అంధకారం
దేవుడు ఏదైనా, ఎవరైనా
అపరాజితమైన ఆత్మను ఇచ్చినందుకు కృతజ్ఞతలు
పరిస్థితుల గుపిటిలో చిక్కుకున్నప్పుడు
నేను రచ్చ చెయ్యలేదు, బిగ్గరగా ఏడవలేదు
విద్ధి విసిరే సవాళ్ళను, దెబ్బలకు
నా శిరస్సు రక్తసిక్తమైంది, కానీ బెసగలేదు
– ప్రీతీ షెనాయ్
-
Kaala Rekha
0₹135.00ప్రజా భారత ఐతిహాసికుడు ఒక సహస్రాబ్ది దార్శనిక కవి శేషేంద్ర పునఃసంస్మరణ కవిత్వానికి తక్షణ ప్రయోజనం, కవిత్వాన్ని విని శ్రోత ఒక ఆత్మిక తృప్తిని పొంది వ్వాప్ అనడం, భోజనం తిని గుర్రున త్రేన్చినట్టు. అయితే తిన్న ఆన్నం జీర్ణమై శరీరాన్ని, మెదడును నడిపే ఇంధనమై రక్తప్రవాల్లోకి ప్రవేశించి, నఖశిఖ పర్యంతం వేలాది రక్తనాళాల్లో ప్రవహిస్తూ క్రమంగా మనిషిని శారీరకంగా మానసికంగా బలిష్టుణ్ణి ఎలా చేస్తుందో ఎలా సజీవునిగా నిలబెడుందో అలాగే కవిత్వం శ్రవణంచేత ప్రభావితుడౌతాడు. అలంకార బింబ ప్రతీకలు శ్రవణేంద్రియాల ద్వారా మనిషిలోని రక్తంలోకి ప్రవేశించి అనదుల్లో కరిగిపోయి సమస్త శరీరవ్యాప్తమౌతాయి. రక్తనిష్టమౌతాయి. అలా ఒక తరం మానవుల్లో రక్తనిషమైన అలంకార బింబ ప్రతీకలు తదనంతర తరానికి జన్యుకణాల ద్వారా సంక్రమింపజేయబడతాయి. అలా తరతరాలు రక్తనిష్టంగా సంక్రమింపజేయబడి, అవి మనిషి ఆలోచనల్నీ, అలవాట్లనీ, చర్యల్నీ, స్వభావాన్సీ రూపాయితం చేస్తాయి. ఒక దేశపు పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఆ దేశపు ప్రజలకు ఇదే చేశాయి. ఆ పార్యంతిక ఫలాల్నే ఆ దేశపు సంస్కృతి అనీ, నాగరకత అనీ అంటారు. ఈ రెంటికీ కవులే జనకులు. ఇదే కవిత్వం కలిగించే శాశ్వత ప్రయోజనం. | శేషేంద్ర, కవిసేన మానిఫెస్టో, నేటి కవిత్వం – వివిధ దృక్పథాలు- ఆగస్ట్, 1994).
1977 లో ప్రథమ ముద్రణగా వెలువడ్డ ఆధునిక కావ్యశాస్త్రం ‘కవిసేన మానిఫెస్టోను వెలువరిస్తూ శేషేంద్ర ‘అపూర్వ చైతన్య వ్యాప్తి కోసం ఐతిహాసిన పరిస్థితుల్లో ఆవిర్భవించిన | ఒక కవితోద్యమ పత్రమనీ’ మానిఫెస్టోను అభివర్ణిస్తూ… ప్రాచీన ప్రాక్ పశ్చిమ కావ్యతత్త్వ చింతన, ఆధునిక కావ్యతత్త్వ చింతన, మార్క్సిస్ట్ కావ్యతత్త్వ చింతన, అనే చింతనా చతుష్టయ శాఖల్ని కలిపి పరిశీలించి ఆ నాల్గింటిలో ఉన్న ఆశ్చర్యజనక అభిన్నతనూ, ఐకమత్యాన్ని……………
-
Kadapa Jila Vignana Deepika
0₹300.00చరితకు దర్పణంగా నిలిచే పుస్తకం
భూగోళం ఒక్కటే అయినా విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, వివి జీవన విధానాలు, సాంప్రదాయాలు విస్తరిల్లి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాలు అనేక ప్రత్యేకతలతో జీవిస్తున్నాయి. ఆహారవిహారాది అం? నుండి ఆధ్యాత్మిక సంగతులు దాకా ప్రతి అంశంలోనూ విభిన్నత ఆయా సమాజ సుస్పష్టంగా కనిపిస్తాయి. మానవ వికాస చరిత్రను అధ్యయనం చేస్తే యుగాలు తరబడి జరిగిన పరిణామాలు కూడా ఆశ్చర్యపరుస్తాయి. కోటానుకోట్ల సంవత్సరాల నుండి జరిగిన జీవపరిణామం శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసినప్పుడు ఏక కణ జీవి నుండి నేటి మనిషి దాకా జరిగిన పరిణామాలు భారతదేశ సంప్రదాయ శాస్త్రాల
కోణం నుండి చూసినప్పుడు చాలా భిన్నంగా కన్పిస్తాయి. వేద పురాణాలు, కావ్యశాస్త్రాలు బోధించిన విషయాకడప లు శాస్త్ర పరిజ్ఞానంతో విభేదిస్తుంటాయి. అయినా మనషులు సంప్రదాయాల్ని ఆరాధిస్తూనే ఆధునిక శాస్త్ర సాంకేతికత అందించే | సౌకర్యాలను అనుభవిస్తున్నారు. ఇంతటి సంక్లిష్ట భావాలు కలిగిన మానవ సమాజం | గురించి దాని చరిత్ర గురించి రాయాలంటే అంత సులువైన పని కాదు. ఇన్ని మాటలు ఎందుకు చెబుతున్నానంటే సంప్రదాయ పునాదులమీద ఆధునిక జీవనం గడుపుతున్న చారిత్రాత్మక గడ్డ అయిన ‘కడప’ గురించి రాసిన “కడపజిల్లా విజ్ఞాన దీపిక” అనే పుస్తకంపై నాలుగు మాటలు చెప్పడానికే. మిత్రుడు డా.చింతకుంట శివారెడ్డి మాతృగడ్డ రుణం తీర్చుకోవడానికై అన్నట్లు కడప జిల్లా ప్రత్యేకతలను పూసగుచ్చి ఒక గ్రంథంగా సమాజానికి అందిస్తున్నాడు. ఒక బృహత్తర కార్యక్రమంగా శివారెడ్డి సాగించిన విషయ సేకరణ, పరిశీలన, విశ్లేషణలు ‘కడప చరిత్ర’కు కొత్త గొంతును ప్రసాదించింది. కడప నామరూప చరిత్రతో మొదలు పెట్టి కడపయాసపై,
కడపజిల్లా విజ్ఞాన దీపిక
-
Kale neta
0₹500.00మనకు తెలియని మహిళల ఆత్మకథ
పాశికంటి (బల్ల) సరస్వతిగారు తన 69వ యేట (2012) మొదలు పెట్టి తన 76వ యేటకు (2019) పూర్తి చేసిన ఆత్మకత ‘కలెనేత’. ఒక బహుజన (పద్మశాలి), తెలంగాణ ఉపాధ్యాయురాలు రాసిన రెండవ ఆత్మకథ. సుమారు అటుయిటుగా నూటా ఇరువై సంవత్సరాలు ఏడుతరాల నేతపనివారి గెలుపోటముల విషాద విధ్వంసక పోరాట చరిత్ర… ‘కలెనేత’లో సరస్వతిగారు నాలుగోతరం ప్రతినిధి. భారతదేశంలో జాతీయోద్యమ పోరాటం, తెలంగాణాలో రైతాంగ సాయుధ పోరాటం రూపుదిద్దుకుంటున్న కాలంలో సరస్వతిగారు నడక నేర్చుకున్నారు. అక్కడి నుండి ఒక మహిళగా, ఉపాధ్యాయురాలిగా తన జీవితాన్ని, తన బతుకు చుట్టూ విస్తరించి యున్న గ్రామీణ జీవితాన్ని తార్కికంగా అర్థం చేసుకున్నారు… మూడు తరాలు వెనక్కి తన తల్లిదండ్రులైన పాశికంటి రామదాసు, లక్ష్మమ్మలను – తాత వీరయ్య – అతని తండ్రి ధర్మయ్యదాకా లోపలికి వెళ్లారు. అక్కడి నుండి 2019 దాకా తను, సాగిన జీవనయానం – దాని చుట్టూ విస్తరించి ఉన్న జీవితాన్ని అంటే మరో మూడు తరాల సమకాలీన జీవితాన్ని ఆత్మకథలో చిత్రించారు. తెలంగాణా సాయుధ పోరాటం ఉధృతంగా నడిచిన ఆలేరు, జనగామ, వరంగల్లు, నల్గొండ ప్రాంతాలు – అక్కడి గ్రామాలు, చిన్న పట్టణాలు ఈ ఆత్మకథలో కన్పిస్తాయి.
ఇదే ప్రాంతం నుండి ఇంతకన్నా ముందు ముదిగంటి సుజాతరెడ్డిగారు ‘ముసురు’ అనే పేరుతో ఆత్మకథగా రాశారు. సుజాతారెడ్డిగారు ఉపాధ్యాయురాలే. నకిరేకల్ (నల్గొండ) నుండి కరీంనగర్ దాకా అదే పోరాటకాలంలో దొరల జీవన నేపథ్యంలో రాశారు. తెలంగాణాలో బహుజన మహిళ సంఘం లక్ష్మీబాయమ్మ రాసిన మొట్టమొదటి
ఆత్మకథ ‘నా అనుభవములు’. ఈ ఆత్మకథను కాంగ్రెస్ రాజకీయాల నేపథ్యంలో రాసారు. తెలంగాణాలో పురుషులు రాసిన ఆత్మకథలు… సామల సదాశివ ‘యాది’, దాశరథి రంగాచార్య ‘జీవన యానం’, దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’, కాళోజీ ‘నా గొడవ’, బోయి భీమన్న ‘పాలేరు నుండి పద్మశ్రీ వరకు’, పి.వి. నర్సింహారావు ‘లోపలి మనిషి’, రావినారాయణరెడ్డి స్వీయచరిత్రము’ రాశారు.
ఈ మూడు మహిళల ఆత్మకథలు తెలంగాణా మహిళా సాహిత్యంలో (సుమారుగా ఏడువందల నవలలు వచ్చినా కూడా) ప్రామాణికంగా నిలుస్తాయి………….
బల్ల సరస్వతి – in
-
KarunaKumara Kathalu
0₹150.00గ్రామజీవనమే కథా వస్తువుగా తీసుకుని మోతుబరీ భూస్వాముల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి పూటకు గతిలేని కష్టజీవుల దయనీయ జీవిత గాధలను కండ్లకు కట్టినట్లు చిత్రీకరిస్తూ బలవంతులు బలహీనులపై చూపే పాశవిక ప్రవృత్తినీ, కర్కశ కఠిన మనస్తత్వాలను తూర్పారపట్టి, ఎంతో రసభరితంగా బహిర్గతం చేసిన పరమ కరుణారస హృదయులు శ్రీ కరుణ కుమార. అయన గతించగా ఇక ఆంధ్ర కథా సాహిత్యానికి మిగిలినవి ఆయన కథలే. అప్పుడీ కథలు ఉదయిని, భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, కిన్నెర, స్వతంత్ర మొదలైన పత్రికలలో ప్రచురితమైనాయి. అప్రకటితములుగా కూడా మిగిలిపోయాయి కొన్ని.
ఆంధ్రదేశంలో అడుగునపడియున్న ఉత్తమ సాహిత్యాన్ని అచ్చోత్తించి పాఠక లోకానికి అందించడం వారి ఉన్నతాశయం. ముందు కూడా తెలుగు సాహిత్య లోకాన్ని మరింత సుసంపన్నం చేయగలరని విశ్వసిస్తున్నాను.
– ఇవటూరి కామేశ్వరరావు