-
-
Gaddaladatandayi
0₹200.00ఈ నవలను చదవటం ఏ పాఠకుడికైనా తన సామజిక జీవితానుభవాన్ని విస్తృతపరుస్తుందని నా నమ్మకం. ఈ నవలకు కేంద్రం ఒక చిన్నపల్లె అయినప్పటికీ, దాని పరిధి దేశమంత విస్తృతమైనట్టిది. కొన్ని నదుల నీళ్ళు ఒక జలాశయంలో ఇమిడినట్టుగా, ఎన్నో సాంఘిక , ఆర్ధిక రాజకీయ సవ్యాపసవ్య సందర్భాలు ఈ నవలలో ఎంతో చిక్కగా, కుదురుగా ఇమిడి వుండటం, రచయిత శిల్పప్రతిభకు పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను. ఇందులోని ప్రతి వాక్యం వెనుకా, వెన్నాడుతున్నట్టుగా రచయిత గొంతుక ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. మన సామజిక జీవితం ఎంత భీభత్సంగా ఉందొ, మానవ సంబంధాలు గానుగలో పిప్పిలా ఎలా పిండీకృతం అవుతున్నాయో’ ఎంతో భయానకంగా, రౌద్రంగా, వర్ణించి చూపెడుతుంది ఈ నవల. మౌఖిక సంప్రదాయాన్ని రచయిత పాటించడం ద్వారా పాఠకుడిని తల ప్రక్కకు తిప్పనివ్వకుండా నిమగ్నం చేయటం ఈ నవల రచనలో రచయిత సాధించిన అద్భుత శిల్ప ప్రయోజనం – పాత్రలూ, జీవితమూ, భాషా, యాసా, సన్నివేశ కల్పనా, విమర్శనాపూర్వక వాస్తవికత, రచయిత కంఠస్వరం, ప్రయోజన దృష్టి, యిలాంటివన్నీ ఒకే కూర్పులో కలిసిపోవటం ద్వారా, ఈ నవల సాధారణ పాఠకుడి నుండి నద్విమర్శకుని వరకూ హృదయగతమవుతుందని నేను గాఢంగా నమ్ముతున్నాను.
-
Gadditine Manushulu – గడ్డితినే మనుషులు
0₹90.00తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.
గడ్డితినే మనుషులు :
”వెనుక దగా, ముందు దగా, కుడియెడమల దగాదగా”..
కుట్రలూ, కుహకాలూ, మోసాలూ, ద్వేషాలూ, నిచ్చెనలుగా వేసుకుని, మేడిపండు నిగనిగలతో, జీవితంలో పెద్ద మనుషులనిపించుకోవడం, ధ్యేయం కొందరికి. ఆ మార్గంలో, వారికి బంధుత్వాలు, అనుబంధాలు కళ్ళకు రక్తసంబంధీకులు కూడా కంటకాలుగా తోస్తారు. స్వార్ధాన్ని వస్త్రాలుగా ధరించి జీవితాన్ని రంగుల మయం చేసుకున్నామని భ్రమిస్తారు. కానీ, వారినీ, వారి రాక్షసత్వాన్నీ, స్వార్ధపిశాచాలనూ, ఎదుర్కొనే శక్తులుగా యువతరంలో కొందరైనా ఎదిరించి నిలబడతారు.
ఈ అక్షరసత్యాలలోంచి, గోముఖ వ్యాఘ్రాల్ని బయటపెట్టి, ప్రభుత్వంలో పలుకుబడి పేరున జరిగేమోసాలు, ప్రజాహిత సంస్థల పేరుతో స్త్రీ పవిత్ర శీలాన్నే విక్రయించే కూటాల రంగులు.
పల్లెలపాలిట కుచ్చితపు నడతతో చీడపురుగులుగా అవతరించిన ప్రబుద్ధుల బండారాలు.
కొల్లగొట్టి బయటపెట్టి, అటువంటి వాల్ళు ఏ గడ్డితినడానికైనా వెరవరని నిరూపించి, నిరవధికంగా పోరాడిన ఆదర్శ పోలీసు ఉద్యోగికి అగ్నిపరీక్ష.
అతనికి సహకరించిన యువతుల అనుదిన సహాయ దీక్ష, ఈ నవల మీకందిస్తుంది. రచయిత్రి కలం మిమ్మల్ని వెంబడిస్తుంది.
పేజీలు : 192
-
Gajubommalu – గాజుబొమ్మలు
0₹70.00తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.
గాజుబొమ్మలు :
కలిగిన యింట్లో ఆస్తికి ఏకైక వారసుడయినా తల్లీ మేనత్తల పెంపకంలో అడుగుదాటలేని కథానాయకుడో గాజుబొమ్మ.
మధ్య తరగతి కుటుంబంలో పుట్టి కలవారి ప్రాపకంతో పైకివచ్చి వున్నతస్థాయి నందుకున్న గాజు బొమ్మకాని ఉప హీరో.
పేదరికంలో పుట్టినా కలవారి దయతో పెరిగిన అంద చందాల బాల, పరిస్థితుల తాకిడికి నిలబడలేక, తను కోరుకుని మనసిచ్చిన వానిని గాక, తనను కోరిన వారిని పెళ్ళాడిన మరో గాజు బొమ్మ.
ఇలా ఎవరి జీవితాలను గాజు బొమ్మలు కాకుండా మలుచుకోగోరే వారంతా ”గాజు బొమ్మలు” తప్పక చదవండి!
పేజీలు :157
-
Gali Poralu
0₹250.00నివురుగప్పుకున్న (కథలు) నిప్పులు మధురాంతకం నరేంద్ర
చలికాలపు తెల్లవారుజాముల్లో మంచు కురుస్తున్నప్పటి మసక వెలుతుర్లూ, నిద్రకూ మెలకువకూ మధ్యలో వుండే సుషుప్త సమయాలూ, నిన్న కాసిన యెండ జ్ఞాపకాలూ, చావుకూ బతుక్కూ మధ్య వేలాడే సన్నటి తెరలూ, రాత్రి తలలో తురుముకున్న మల్లెల వాసనల్ని మోసుకొచ్చే వుదయాలూ, చలిలో నానిన నిద్రలేని ముఖాలూ, దుప్పటి మడతల మధ్య లోయలోకి జారిన నక్షత్రాల్లా మినుకుమినుకుమనే ముక్కు పుల్లలూ, నిద్రమత్తులో వుంటే చెవుల్లోకి దూరీదూరని మాటలూ, గాలిలోకి తెరుచుకునే కళ్ళపైన కమ్ముకునే నీడలూ, వులిక్కిపడేలా నిద్రలోంచి లేపేసే కలవరింతలూ, మోటారు వాహనాల రొదల్లోంచీ ముక్కలై విరిగిపడే సంభాషణలూ, చెమటకు తడిసి కనిపించీ కనిపించకుండా మిగిలే బొట్లూ, మసక వెలుతుర్లో తేరిపారజూస్తేగాని కనిపించని మనుషులూ, పొద్దువాలే సంధ్యాసమయాల్లో దాగిపోయే నవ్వులూ, సగం తెరిచిన తలుపుల వెనక తారట్లాడే చీకట్లు, కూలినగోడలూ పిచ్చిమొక్కల వెనక దాక్కునే పురాతన మహిడీలూ వెరసి అజయ్ ప్రసాద్ కథలనిండా నిప్పుల్ని దాచేసే నివురులే దోబూచులాడుతూవుంటాయ్.
తెల్లగా కప్పేసిన బూడిదకింద యెర్రెర్రని నిప్పుకణికలు మండుతూనే వున్నాయని తెలుసుకోవడం కష్టం. సనసన్నగా పలచగా వస్తున్న పొగల్ని చూసి అక్కడ నిప్పు ఆరిపోయిందని భ్రమలో పడిపోతాం. చేతనకూ, అచేతనకూ మధ్య వెంట్రుక కంటే సన్నగావుండే వుపచేతనే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేశించినట్టుగానే నిప్పును కప్పిన…………
-
Gangs Of Bangalore Naa Dadagiri Rojulu
0₹375.00నా బయటి ప్రపంచానికి లోపలి ప్రపంచానికి సముద్రమంత వెలితి ఉండేది. బయటి ప్రపంచంలోని నా కార్యలాపాలను నా లోపలి సున్నితత్వం అంగీకరించేది కాదు. అక్కడి క్రౌర్యం, భయం, హింసా, మోసం కుట్రలు నా ఆత్మసాక్షిని ప్రశ్నించేలా ఉండేవి, దాన్ని ఎలా మార్చాలి? మార్చటానికి సాధ్యమా? ఒంటరిగా , గాఢంగా జీవితాన్ని ఆ ప్రశ్నల కొలిమిలో మధించ సాగాను. అప్పుడు అర్ధమయ్యింది , మారవలసింది ప్రపంచం కాదు. నేనని . ప్రపంచం అద్భుతంగా ఉంది. అక్కడ అంత క్రమబద్ధంగా మేళవించి ఉంది. తేడా నాలోనే …
– అగ్ని శ్రీధర్.
-
-
Garbhagudiloki
0₹150.00దేవుడు గమనిస్తాడు
మంచి భోజనం, భార్యాబిడ్డలు
దేవుడు వెనక నిలబడతాడు
విజయాలు, కష్టాలు దూరాలు
దేవుడు చేయి పట్టుకుంటాడు
సంగీత సాహిత్యాలు,
సకల కళాకోవిదులు
దేవుడు మిలోకి ప్రవేశిస్తాడు
ఇక మీదెగ్గరేం ఉంచుకోరు
మిరే అందరికి కావాల్సివస్తుంది.
-
Garuda Puranamu
0₹800.00హిందూ మత ధార్మిక గ్రంధాలలో స్మృతులు ఒక భాగము. పురాణాలు కూడా స్మృతులే. పురాణాలలో గరుడపురాణం అంతగా అపనమ్మకాలు పాలైన వాటిల్లో మరొకటిలేదు. కొందరు పూర్వాచార పరాయణులు గరుడపురాణం చదవటం కాదు, కనీసం తాకడానికి కూడా ఇష్టపడరు. అందుకు కారణం ఆ పురాణం బ్రహ్మఖండంలో జీవికి మరణం తర్వాత కలిగే వివిధ సంస్కారాలు, అంత్యేష్టి వివరించబడటమే. అయితే గరుడపురాణం గరుడపురాణం మూడు భాగాలని అందులో బ్రహ్మ ఖండం చాలా చిన్నదని, ఆ ఖండంలోనే కొంత జీవి మరణానంతర కర్మకాండల గురించి చెప్పబడినదని ఎక్కువమందికి తెలియదు.
గరుడపురాణం వైష్టవ పురాణాలలో ఒకటి. ఇది మహావిష్ణువుకు అయన వాహనమైన గరుడునికి సంభాషణగా వివరింపబడిన పురాణం. గరుడపురాణం లో చాలా విలువైన సమాచారాన్ని పురాణ పాటకులకు తెలియచేస్తుంది. ఈ పురాణంలో చాలా విలువైన సమాచారాన్ని పురాణ పాటకులకు తెలియచేస్తుంది. ఈ పురాణంలో వైద్యము, వ్యాకరణము, రత్నపరీక్ష, జ్యోతిష్యము, వంటి అనేక శాస్త్రాలు వివరించబడ్డాయి. అందుకని దీనిని విజ్ఞాన సర్వస్వ లక్షణాలు ఉన్న పురాణంగా పురాణ పండితులు విశ్లేషిస్తున్నారు. అంతేగాక భారతీయ విజ్ఞానం అనేక సందర్భాలలో ఎటువంటి మినహాయింపులు లేకుండా ఈ పురాణంలో వివరించబడ్డాయి. అందువలన ఈ పురాణాన్ని విజ్ఞానం కావాలనుకునే వారందరూ అధ్యయనం చేయటం అవసరం. ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలను పెట్టుకోనవలసిన అవసరం లేదు. దీనిని జిజ్ఞాసువులైన వారందరూ పటించిన భక్తి ముక్తి పొందగలరు.
-
Gelupu Naade – గెలుపు నాదే
0₹70.00అనగనగా ప్రేమ సముద్రంలో ఒక షిప్పు ! అదే లవ్… హేట్ రిలేషన్‌షిప్ ! ఆ షిప్పులో ఓ జంట !
ఆమె పెళ్ళి చూపులనుకుంది. చదువులేని ఆడపిల్లకి తన హృదయంలో చోటులేదని అనాలోచితంగా అన్నాడతను. ఆ నిరసనతో ఆమెలో ఛాలెంజీ జ్వాలలు ప్రజ్వరిల్లేయి. మారుతున్న సమాజంలో ఆడపిల్లకి అర్థం ఏమిటో చెప్పాలని పంతం పట్టింది. చదువు ప్రారంభించింది. బ్రిలియంట్ స్టూడెంట్‌గా, మోస్ట్ మోడ్రన్‌గాళ్‌గా పదుగురి ముందూ నిలిచింది. ఆమె వున్న క్లాసుకే అతను లెక్చరర్‌గా వచ్చాడు. అతన్నామె గుర్తించింది. అతని గుండెల్లె కితకితలు పెట్టింది, కవ్వించింది, అతన్ని ముగ్గులోకి దించి, సుందర ప్రేమకాండకి కథానాయకుడ్ని చేసింది. విరహాగ్నిలో పడేసింది. ఇక వాళ్ళ షిప్పు రసవత్తర తరంగాల్లో చిక్కుకుంది.
ఆ ప్రేమ నావ అనురాగ దీవికి ఆనందంగా చేరిన వైనమే గెలుపు నాదే !
ఇంతేగాక ఇందులో చదువుకునేందుకు మిమ్మల్ని మెరిపించే మురిపించే ఆరు మంచి ముత్యాల్లాంటి కథలున్నాయి కూడా…
పేజీలు : 147