• Heart Prints

    Heart Prints

    0

    హార్ట్ ప్రింట్స్

    దయగల చూపు

    అమెరికన్ కథ

    జాన్ అప్ డైక్ ఆ వసంతంలో అకస్మాత్తుగా సుత్తితో కొట్టే చప్పుడు వినిపించసాగింది. ఓ అరడజనుసార్లు సుత్తితో కొట్టాక బండ గొంతు లోంచి వచ్చే బాణీ కాని, శృతి కాని లేని శబ్దం పాటలా వినిపించసాగింది.

    బేర లో సౌకర్యంగా ఉన్న, కాంతివంతమైన ఆ గదిలోని కొందరు సైనికులు ఆ శబ్దానికి చెవులు మూసుకున్నారు. అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఓ రాజశాసన పత్రాన్ని వాళ్ళకి చూపించాడు.

    “నువ్వేనా? ఆ కూనిరాగం తీసేవాడి దగ్గరకి వెళ్ళు.” దాన్ని చదివిన అధికారి సూచించాడు.

    “నువ్వు రాజు గారి సైన్యంలో కొత్తగా చేరావు. నిన్నో ఉద్యోగానికి ఎంపిక చేసారని విన్నాను. డీషియస్ ఎస్కులస్ పేరు ఎప్పుడైనా విన్నావా?” అతను ప్రశ్నించాడు.

    “నిపుణుడు అని పిలిచేది అతన్నే అని విన్నాను. అతని గురించేనా మీరు అడిగేది?” ఆ యువకుడు అడిగాడు……….

    200.00
    Add to cart
  • Helavathi

    Helavathi

    0

    ‘హేలావతి’ తొలి తెలుగు దళిత నవల. మన దేశంలోని సామాజిక నిరంకుశత్వాన్ని, అమానుషత్వాన్ని నిరసించిన తొలి నవల. హైందవ సమాజ సంస్కరణ కోసం పొలికేక వేసిన నవల. ఇప్పటి దాకా తెలుగులో వచ్చిన 100 కి పైగా దళిత నవలలకు ఈ నవల పునాది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంస్కర్తలు, ఉద్యమకారులు, ఆధునికులు, సంప్రదాయవాదులు, సామాన్యులు, మేధావులు – అందరూ చదవాల్సిన నవల. అందరికన్నా ముందే మేల్కొన్న నవల. వైతాళిక నవల. ఇది కాలంచెల్లిన నవలకాదు, నేటికీ తాజాగా ఉన్న నవల. పరిమాణంలో చిన్నది. ప్రభావంలో పెద్దది.

    35.00
    Add to cart
  • Homo Deyus Repati Sankshiptha Charitra

    Homo Deyus Repati Sankshiptha Charitra

    0

    హోమో సేపియన్స్ హోమో డేయుస్ గా మారుతుంటే మనకు మనం ఎటువంటి భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం?

    పరిణామక్రమం యొక్క ప్రధాన శక్తీ – స్వాభావిక ఎంపిక – తెలివైన రూపకల్పనకు దారి ఇస్తుంటే మానవుల భవితవ్యం ఎలా మారుతుంది?

    గూగుల్ ఇంకా ఫేస్ బుక్ లు మన రాజకీయ ఇష్టాయిష్టాలను గురించి మనకు తెలిసినదానికన్నా ఏక్కువగా తెలుసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది?

    పేలుసయినా భూగ్రహాన్ని కడకు మానవజాతిని మన స్వoత విధ్వంసక శక్తుల నుండి ఏ రకంగా కాపాడుకుంటాము?

    ఈ పుస్తకంలో ప్రొఫెసర్ పరారీ ఇటువంటి ప్రశ్నలను మన ముందు ఉంచుతారు. వాటికీ వీలైన జవాబులను ఆసక్తి కలిగించే, ఆలోచనలు పుట్టించే పద్దతిలో వెతుకుతారు.

    499.00
    Add to cart
  • How To Win Friends And Influence People

    How To Win Friends And Influence People

    0

    Do you feel stuck in life, not knowing how to make it more successful? Do you wish to become more popular? Are you craving to earn more? Do you wish to expand your horizon, earn new clients and win people over with your ideas? How to Win Friends and Influence People is a well-researched and comprehensive guide that will help you through these everyday problems and make success look easier. You can learn to expand your social circle, polish your skill set, find ways to put forward your thoughts more clearly, and build mental strength to counter all hurdles that you may come across on the path to success. Having helped millions of readers from the world over achieve their goals, the clearly listed techniques and principles will be the answers to all your questions.

    96.00
    Add to cart
  • How To Win Friends And Influence People
  • Hrudaya Ganam - హృదయ గానం

    Hrudaya Ganam – హృదయ గానం

    0

    నేనంటే నీకు ఇష్టం ఉందా? నిజం చెప్పు” – మృదుల అంది .
    హర్షకిరణ్ మాట్లాడలేకపోయాడు.
    చెప్పు చెప్పు మృదుల అతన్ని చేతులతో తన మీదకి లాక్కుంది. హర్శకిరాన్ తోలి మంచం మీద కూలబడ్డాడు. మృదుల అతని మీదకి జరిగి అతని మెడ ఓంపులో ముఖం దాచుకుంది. “నేనెంత నరకం పద్తున్నానో నీకు తెలుసా ! నీకు తెలియదు. నీకెలా తెలుస్తుంది ! అంది. మృదుల అతని మెడ చుటూ చేతులు పెనవేసి ,, అతని గుండెల్లో తలదాచేసుకుంది.
    మృదుల ఓ పాతికేళ్ల అమ్మాయి. హిస్టరీ లెక్చరర్ గా భవానిపురం వెడుతుంది. అక్కడ తన స్టూడెంట్ శాంత అన్నయ్య హర్షకిరణ్ తో పరిచయం అవుతుంది. అది అనురాగంగా మారుతుంది. క్లాసులో మరో స్టూడెంట్ రమేష్ మృదుల పట్ల అభిమానం పెంచుకుంటాడు. మధ్యలో శాంత రేప్ కి గురవుతుంది. కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది.
    నాదంటూ ఒక చిన్న ఇల్లు, నన్ను ప్రేమించి ణా ప్రేమని పొందే భర్త, మా అనురాగానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలు అంటూ ఒక కలల గూడు కట్టుకున్నాడు. కానీ .. విధి రాకాసిలా తన భయంకరమైన పాదంతో దాన్ని తోక్కివేసింది. ఆ గూడు పడిపోయింది. ణా జీవితం ఎడారి అయిపొయింది. .. అంటూ వాపోతుంది మృదుల . ఇష్టం వేరూ ప్రేమ వేరూ అనీ, వాటి అర్ధాలు వేరు వేరనీ మృదుల కు నెమ్మది మీద స్పష్టంగా అర్ధం అవుతుంది. సున్నితమైన ఆడపిల్ల మనసుని అతి సున్నితంగా చిత్రించిన నవల హృదయగానం .

    100.00
    Add to cart
  • Hrudayanetri - హృదయనేత్రి

    Hrudayanetri – హృదయనేత్రి

    0

    ‘గోపాలాన్ని – నా వెంట తీసుకెడతానురా తమ్ముడూ. వాడు బట్టలు సంచీలో పెట్టుకు ఏడుస్తున్నాడురా!” అంటూ తండ్రిని రాముడత్తయ్య అడగటం, తలుపు వెనకన నక్కి నిల్చుని వింటున్నాడు గోపాలం.
    పొందూరు ఖద్దరు చీరె – గోచీపోసి ట్టుకుని, గుండ్రటి సిగమధ్యన రాళ్ళ చామంతి పువ్వు చుట్టుకున్న రాముడత్తయ్య అంటే గోపాలానికి ప్రాణం. రాముడత్తయ్య ‘వందేమాతరం’ అంటుంది. ఎవరో గాంధీగారుట, ఆయన్ని మహాత్ముడంటూ, ‘ఆ గాంధీగారు స్వరాజ్యం తెచ్చిపెడతాడు – తెల్లవాళ్ళందరిని తరిమి కొడతాడు’ అంటూ – రాత్రిళ్ళు పక్కన పడుకోపెట్టుకుని కథలు చెప్పే రాముడత్తయ్య, వూరికి వెళ్ళిపోతోందీ అంటే ఏడుపు వచ్చింది గోపాలానికి –
    ”నీతో నేనూ వచ్చేస్తాను” అంటూ సంచీలో చొక్కాలాగూ పెట్టుకుని, రాముడత్త కొంగు వదలకుండా తిరుగుతున్నాడు పదేళ్ళ గోపాలం.
    రాముడత్తయ్య అని పిలవబడే రామలక్ష్మమ్మగారు ఆ యింటి పెద్దాడబడుచు. నలభై ఏళ్ళుపైన వుంటాయి. పిల్లలు లేరు. ఆవిడ గురించి – విడ్డూరంగా పెద్దవాళ్ళు చెప్పుకోవటం చాలాపార్లు వినివున్నాడు గోపాలం. తన తల్లి సుబ్బమ్మకి, ఒదినగారంటే భయం – పైకి ‘ఒదినగారూ’ అంటూ – గౌరవంగా పిలుస్తూ – భయభక్తులతో వున్నా! ….

    80.00
    Add to cart
  • Ide Na Nyayam

    Ide Na Nyayam

    0
    50.00
    Add to cart
  • Idi Manava Samajamena

    Idi Manava Samajamena

    0

       మానవులు ఉన్నది, ‘మానవ సమాజమే’ అవుతుంది. అయితే, ఆ సమాజంలో ఉన్న తీరు తెన్నుల్ని చూస్తే, అడుగడుగునా, ‘ఇది మానవ సమాజమేనా?’ అనే ప్రశ్న రావలసి ఉంటుంది. సమాజంలో ఉన్న మొత్తం సమస్యల్లో, తక్షణం మొట్టమొదట పరిష్కారం కావలసిన కౄర సమస్య ఒకటి ఉంది. మానవుల మనస్సుల్నీ, మేధస్సుల్నీ, అతి కౄరత్వంలోకి ఈడ్చిన ఈ సమస్య, అట్టడుగు కులపు హిందూ స్త్రీ పురుషుల్నీ, అతి బీద స్థితిలో ఉన్న ముస్లిం స్త్రీ పురుషుల్నీ, కొన్ని తెగల ఆదివాసీ స్త్రీ పురుషుల్నీ, యజమానుల ఇళ్ళల్లో ఉండే పాయిఖానా దొడ్లలోని మలమూత్రాల్నీ తమ స్వంత చేతులతో ఎత్తివేస్తూ శుభ్రాలు చేసే ‘పాకీ చాకిరీ’కి కట్టిపడేస్తుంది!

                  ‘పాకీ చాకిరీ’ అనే దాన్ని, రోడ్లని ఊడ్చే పని లాగానో, చచ్చిన జంతువుల్ని పాతిపెట్టే పని లాగానో, జమ కడితే, పాకీ పనిలో ఉండే బాధల్నీ, అవమానాల్నీ, దుఃఖాల్నీ, అర్ధం చేసుకునేదేమీ ఉండదు. ధనిక మానవుల ఇళ్ళల్లో కుక్కులూ పిల్లులూ ఉంటే, వాటి మల మూత్రాల్ని ఎత్తడం కూడా ఆ ఇంటి సేవకులైన బీద మానవుల పనే కదా?

              మానవులు నివసించే సమాజాన్ని గురించి, ‘ఇది, మానవ సమాజమేనా?’ అని ప్రశ్నించుకోవచ్చునా? అటువంటి ప్రశ్న ఎందుకు వచ్చిందో ఈ పుస్తకం చదివి తెలుసుకోండి..

    – రంగనాయకమ్మ

     

    50.00
    Add to cart
  • Iduguru Lofarlu - ఐదుగురు లోఫర్లు

    Iduguru Lofarlu – ఐదుగురు లోఫర్లు

    0

    సాధారణంగా జైలు నుండి విడుదల అయిన వ్యక్తి బాగా చిక్కిపోయి నీరసంగా బికారిలా కనిపిస్తాడు. జైలు నుండి విడుదల అయిన తాంతియా అలాకాక, వెనుకటికన్న పిక్కబలిసి, మానమర్యాదలు గల గౌరవనీయుడుగా కనిపిస్తున్నాడు. జేబులో నలభై ఎనిమిది రూపాయల పండ్రెండణాల నగదుతో, ముఖమంతా ప్రసరించిన ముసిముసి నవ్వులతో అతను జైలు నుండి బయట అడుగుపెట్టాడు.

    అలా బయటకు రాగానే ”యిప్పుడింక నేను దుర్వృత్తుల జోలికి పోను మాహిమ్‌లో ఏ బంకో తీసుకొని మంచి చిల్లర వ్యాపారమేదైనా చేస్తాను” అని స్నేహితులతో చెప్పాడు తాంతియా….

    పేజీలు : 120

    100.00
    Add to cart
  • Incredible-Goddess (Kshutra Devata) By Dr Kesava Reddy
  • Inko Kothi Kommacchi

    Inko Kothi Kommacchi

    0

    రమణ పత్రికారంగాన్ని విడవడంతో మొదటి భాగం పూర్తి అవుతుంది. ఆ తర్వాతి నిరుద్యోగ విజయాలు, సినీరంగ ప్రవేశం, తొలిదశలో ఎదురైనా అవమానాలు, హేళనలు, సినీరచయితగా నిలదొక్కుకోవడం, ఓ డైరెక్టర్ ప్రవర్తనతో విసిగి సినీరంగాన్ని వదిలివేసి వచ్చేసినా ఆ రంగమే రెట్టింపు పారితోషికంతో పునరాహ్వనించడం, బాపుతో కలిసి చేసిన ‘జ్యోతి’ ప్రయోగం మేలు చేయడం మానేయడంతో ఏకంగా సినీనిర్మాతలు అయిపోవడం, ప్రయోగాత్మక సినిమాల నుండి అక్కినేని అందించిన సాయంతో కమర్షియల్ సినిమా వైపు మరలడం, ‘బుద్దిమంతుడు’ సంపూర్ణ రామాయణం’ సినిమా నిర్మాణాలలో ఔత్సాహిక నిర్మాతలుగా పడిన కష్టాలు…. వీటన్నిటితో రెండవ భాగం మరింత పరిచితంగా, రసవత్తరంగా సాగింది.

    225.00
    Add to cart