-
Rekkadinantha Kaalam.. – రెక్కాడినంత కాలం…
0₹200.00అన్నంగుడ్డ’, ‘సానరాయి’ వంటి కథల్లో కంసాలుల జీవితాన్ని ప్రతిభావంతంగా చిత్రించిన దేవేంద్ర విస్తృతమైన కాలభూమికపైన మరింత విశాలంగా ఆ పనిని యీ నవలలో నిర్వహించాడు…. ఈ నవల రాజకీయాల గురించీ పెద్దగా ప్రసక్తి తీసుకురాకుండానే, ఈ దురన్యాయానికున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాన్నంతా నిలదీసి ప్రశ్నిస్తుంది. – మధురాంతకం నరేంద్ర
పేజీలు : 255
-
-15%
Rich Dad Poor Dad: What the Rich Teach Their Kids About Money That the Poor and Middle Class Do Not! Mass Market Paperback – 11
0Original price was: ₹499.00.₹424.00Current price is: ₹424.00. -
Sadhuvu Alochana
0₹399.00సాధువులా ఆలోచిస్తే విముఖత ఎందుకు అంటువ్యాధి అవుతుందో మితిమీరిన ఆలోచన ఆపటం ఎలాగో తారతమ్యం ప్రేమను ఎలా హరిస్తుందో మీ భయాన్ని వినియోగించటం ఎలాగో అన్వేషణలో ఆనందం ఎలా కనిపించదో మీరు కలిసే ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవటం ఎలాగో మీరు మీ ఆలోచనలు ఎందుకు కారో మీ ప్రయోజనం తెలుసుకోవటం ఎలాగో సఫలతను కరుణ ఎందుకు అత్యవశక్యమో ఇంకా చాలా….మీరు అర్థం చేసుకుంటారు. వివేచనా వర్తమానానికి అన్వయించి, దానిని మీకు అందుబాటులోకి తీసుకురావటం జీశెట్టి అగ్రాసమర్థ్యం. అయన పుస్తకం ప్రగాఢం, తీక్ష్ణం, ఆచరణాత్మకం. ఇది చాలా మందికి కొత్త అలవాట్లు, అభ్యాసాలు, వారు కోరుకున్న విధంగా జీవించటానికి దరి చూపే వివేచనా కలిగిస్తుందని మా విశ్వాసం. -
-
Samasyalu – Parishkaralu – సమస్యలూ – పరిష్కారాలు
0₹120.00సమస్య రాగానే మనం పరిష్కారం ఆలోచించటం మానేసి, విచారించటం ప్రారంభిస్తాం.
సముద్రం ఎంత పెద్దదైనా, నీళ్ళని లోపలికి రానివ్వకపోతే పడవ మునగదు. సమస్య ఎంత పెద్దదైనా, మనసులోకి రానివ్వకపోతే బాధ ఉండదు.
పాతికశాతం సమస్యలు పరిష్కారం లేనివి. పరిష్కారం లేని ఈ పాతిక శాతం గురించీ మనం జీవితంలో సగవంతు కాలం ఆలోచిస్తూ గడిపేస్తాం. ఇంకో యాభై శాతం సమస్యలు మనకి ఇతరుల వల్ల వచ్చేవి. అవి తీరాలంటే మారవలిసింది వాళ్ళు. మనం కాదు. తాగుబోతు భర్త, దుబారా భార్య, గయ్యాళి అత్తగారు, చెడుదార్లో సంతానం వగైరా. వాళ్ళని మార్చటం ఎలా అని నిరర్ధకంగా విచారిస్తూ మరో పాతిక శాతం కాలం గడిపేస్తాం.
మిగిలిన పాతిక శాతం సమస్యల్నుంచి బయటపడాలంటే కఠినమైన నిర్ణయాలు అమలు జరపాలి. దురదృష్టవశాత్తూ ఇటువంటి సందర్భాల్లో మనం ఆలోచిస్తూ కూర్చుంటాము తప్ప నిర్ణయాలు తీసుకోము. తీసుకున్నా, అమలు జరపం.
ఏ సమస్యకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే సమస్య తాలూకూ సాంద్రత తగ్గుతుందో ఆత్మీయంగా చెప్పే పుస్తకం.
పేజీలు : 183
-
Samkshipta Prapancha Charitra
0₹225.00గతకాలపు సంఘటనలను వివరించేదే చరిత్ర. గతాన్ని విస్మరించిన వ్యక్తికి, జాతికి సరియైన భవిష్యత్తు ఉండదు. అయితే చరిత్ర అధ్యయనం గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన తారీఖులను, వ్యక్తుల పేర్లను నేమరువేయడానికే పరిమితమైతే దానివలన ఉపయోగం ఉండదు. గతంలో జరిగిన సంఘటనల కారణాలను, ఫలితాలను, పర్యవసానాలను, మంచి చెడ్డలను గ్రహించి వాటి నుండి గుణపాఠం నేర్వగలిగినప్పుడే చరిత్ర అధ్యయనానికి సార్ధకత ఉంటుంది. – అప్పుడే భవిష్యత్తుకు మార్గ దర్శకమవుతుంది. జాతులు వివేకవంతమవుతాయి. ఈ దృష్టితో చూసినప్పుడు చరిత్ర అధ్యయన ఆవశ్యకత అర్ధమవుతుంది.
అంతర్జాతీయ వాణిజ్యం, శాస్త్రవిజ్ఞానం శీఘ్రగతిని విస్తరిస్తున్న ఆధునికయుగంలో ప్రపంచం రోజురోజుకీ సంకుచితమై వివిధ దేశాలూ పరస్పరాధారభూతమవుతున్నాయి. ఈ స్థితిలో మానవుడు తన దేశ చరిత్రనే కాక ప్రపంచ చరిత్రను కూడా అధ్యాయం చేయవలసిన అగత్యం ఏర్పడింది. అయితే తెలుగులో ప్రపంచ చరిత్ర గ్రంధాలు తగినంతగా లభ్యం కావడం లేదు. ఈ కొరత కొంతవరకైనా తీర్చడమే ఈ సంక్షిప్త గ్రంథ రచనా లక్ష్యం.
– రచయిత
-
-