• Naa Jeevana Gamanam

    Naa Jeevana Gamanam

    0

      అత్యంత గౌరవనీయుడు, మేధావీ, రాజకీయవేత్త అయిన అబ్దుల్ కలామ్ జీవితంలోని స్పూర్తిదాయకమైన ఉదంతాలు.

    రామేశ్వరంలో గడిపిన బాల్యంతో మొదలు పెట్టి దేశాధ్యక్షుడిగా ఎదగడం వరకు అబ్దుల్ కలామ్ నడిచిన దారి అసాధారణమైనది. పట్టుదలా, కృతనిశ్చయం, ధైర్య సాహసాల రహదారి……..ఈ పుస్తకంలో అయన తన గతంలోని కొన్ని ముఖ్యమైనవి, కొన్ని సాధారణమైనవి అయిన అనుభవోదాంతాలను, కొందరి వ్యక్తిత్వాలను స్మరించుకుంటూ, అవి తనకు ఎట్లా స్పుర్తినిచ్చాయో సుందర సులభమైన శైలిలో చెప్పారు. తాను పెరిగి పెద్దవాడువుతున్నప్పుడు తన వ్యక్తిత్వంపై ముద్ర వేసిన వ్యక్తులను వాత్సల్య గౌరవాలతో తలుచుకున్నారు. వారితో తనకు గల సాంగత్యంలో తాను నేర్చుకున్న విలువైన పాఠాలను నెమరువేసుకున్నారు. తనకు అత్యంత ప్రేమ పాత్రుడైన తన తండ్రిని, ఆయన దైవభక్తిని వివరంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఒక దేశాధ్యక్షునిగా ఎదిగిన క్రమంలో ఎదుర్కొన్న సమస్యలను, సంఘర్షణలను, చేసిన త్యాగాలను ఒక్కసారి వెనుతిరిగి చూసుకున్నారు.

    వెనుకటి తీపి జ్ఞాపకలతోను, మరెంతో నిజాయితితో చెప్పిన ఈ వ్యక్తిగత అనభవ పరంపర ఒక అసాధారణమైన వ్యక్తి జీవిత కథ. ఇందులోంచి నేర్చుకోవలసిన విలువైన పాఠాలతో సహా………

    175.00
    Add to cart
  • Nalla Chepapilla Katha - నల్ల చేపపిల్ల కథ

    Nalla Chepapilla Katha – నల్ల చేపపిల్ల కథ

    0

    చైతన్య ప్రవాహంలో ఈదులాడే ఓ చిన్న ‘నల్ల చేపపిల్ల’ కథ ఇది. ప్రపంచం అంచుల్ని చుంబించాలనే తపన. నూతన ప్రపంచంలో ఆవిష్కృతం కావాలనే తిరుగులేని పట్టుదల. ఆ అద్భుత ప్రయత్నంలో చేప పిల్ల పొందిన ఎన్నో వింత అనుభవాలు, ప్రకృతి పారవశ్యాలు, విరుచుకుపడ్డ ప్రమాదాలు, వాటితో చెలగాటాలు, ఎవరెవరితోనో పరిచయాలు. శత్రు మిత్ర భావనలు, అననుకూల పరిస్థితులు, శత్రువుపై పన్నిన యుద్ధ వ్యూహాలు, మొక్కవోని ధైర్యసాహసాలతో ముందుకు మున్ముందుకు సాగించిన స్వేచ్ఛా ప్రయాణం. అదో భయమెరుగని జీవనగమనం.

    నిజంగా ఇది కేవలం చేపపిల్ల కథేనా! అవును నిజమే బెహరంగీ అల్లిన మరో ‘పంచతంత్రం’ కథ. ఇది మనిషి స్వేచ్చా పిపాసకు, జ్ఞాన తృష్ణకు ఎత్తిపట్టిన ప్రతీక.

    తన జాతిజనులలో, ఇంకా చెప్పాలంటే ప్రపంచ మానవాళిలో స్వాతంత్య్రేచ్ఛని, అందుకవసరమైన చైతన్యాన్ని రగుల్గొలిపేందుకు సమద్‌ బెహరంగి చేసిన అద్భుత సృజన ‘నల్ల చేపపిల్ల కథ’.

    20.00
    Add to cart
  • Nalugukalla Mandapam
  • Neelaveni - నీలవేణి

    Neelaveni – నీలవేణి

    0

    అవును ఇది కథన కుతూహలమే. పి.వి.సునీల్‌ కుమార్‌ కథల్లో తొంగి చూసేది, పొంగి పొరలేదీ సామాజిక అన్యాయంపై కదన కుతూహలం.

    ప్రేమరాహిత్యం నుండి సామాజిక న్యాయం వరకూ, పోలీసు నుండి పొలిటీషియన్‌ వరకూ ఏ అంశం ఆయన  కలం స్పృశించినా పాఠకుడికి వ్యంగ్యపు పంట పండినట్టే.

    అంతర్జాతీయ సాహిత్యంలోనే అరుదూ, తెలుగు సాహిత్యంలో అయితే అసలు ఊసేలేకుండా పోయిన సెటైర్‌ (వ్యంగ్యం) సునీల్‌ కుమార్‌ కలం నుండి తీయటి గోదావరి ధారలాగా పరవళ్ళు తొక్కుతోంది ఈ కథా సంపుటిలో.

    ”దెయ్యాలు’ ప్రేమను పంచినా, ‘డిసిప్లి’లు సామాన్యుడి కోసం మొరిగినా అన్నీ సునీల్‌ కుమార్‌ మార్కు పంచ్‌ లోనే.

    ‘థూ’ అన్నా, ‘చీకటి’ కన్నా, ‘పరిశుద్ధంగా’ వివాహాన్ని ‘దేవదాసు’ జరిపించినా ధిక్కార స్వరమే కానీ, మరీముఖ్యంగా వినోదాలు జల్లు.

    ఈ కథల్లో జీవం ఉంది, జీవితం ఉంది…. రంగుల హరివిల్లులా నవ్వులు పూయించగల హాస్య-వ్యంగ్య వైభవం ఉంది.

    అక్షరాల ఇది అనితరసాధ్యం… అందుకోండి అక్షర తూణీర వ్యంగ్య నీరాజనం.

    100.00
    Add to cart
  • Nene Naa Ayudham - నేనే నా ఆయుధం

    Nene Naa Ayudham – నేనే నా ఆయుధం

    0

    ఓటమి పట్ల నిరాశ చెందకూడదనీ, కష్టాల్ని ధైర్యంతో ఎదుర్కొంటేనే విజయం సాధ్యమని నమ్మి,

    వేలాదిమందికి మార్గదర్శిగా నిలిచిన “మేధ” సంస్థల అధినేత డా.చిరంజీవి జీవితం,

    మెగా రైటర్ యండమూరి కలం నుండి…..


    ”ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ బ్రేక్‌ఫాస్ట్‌ టేబుల్‌ ముందు కూర్చున్నప్పుడు…

    కాకినాడలో పోస్టర్లు అతికించడానికి వాడగా మిగిలిపోయిన మైదా పిండితో

    చపాతీలు కాల్చుకుని తిన్న రోజులు గుర్తొచ్చి కళ్ళనీళ్ళొచ్చాయి.”

    వ్యాపారంలో పోటీ… ఎత్తులు-పైఎత్తులు…

    విస్తరించటానికి చేసే ప్రయత్నాలు… ఎక్కే శిఖరాలు, పడే లోయలూ….

    ఆర్టీసీ బల్లల మీద నిద్ర… సులభ్‌ కాంప్లెక్స్‌లో స్నానం…!

    పదో క్లాసు ఫెయిలు నుంచి.. డాక్టరేట్‌ వరకూ…!

    అట్టడుగు స్థాయి నుంచి లక్షల సంపాదన వరకూ ఎదిగిన

    ఒక నిరుద్యోగి జీవిత చరిత్ర!

    ప్రతీ నిరుద్యోగీ, వ్యాపారవేత్తా,

    జీవితంలో పైకి రావాలనే తపన ఉన్న ప్రతి వ్యక్తీ చదవ వలసిన పుస్తకం ”నేనే నా ఆయుధం”.

    150.00
    Add to cart
  • Nissabda Visphotanam - నిశ్శబ్ద విస్ఫోటనం

    Nissabda Visphotanam – నిశ్శబ్ద విస్ఫోటనం

    0

    కిడ్నాపులు, బ్లాక్‌ మెయిలింగ్‌, డ్రగ్‌ ట్రాఫికింగ్‌, పరువు హత్యలు, బ్యాంకు అప్పులు ఎగ్గొట్టినవారిని విదేశాలకు పంపటం – ఇలా ప్రభుత్వానికి సమాంతరంగా నడిచే ఈ మాఫియా పేరు ‘ట్రయాడ్‌’…! ఇదొక బలమైన కోటరీ. రాజకీయంగా వారి వెనుక చాణుక్యని మించిన మేధావులు ఉన్నారు. రక్తం తాగే రౌడీలున్నారు. నువ్వొక చిన్న స్కూల్‌ టీచర్‌వి. ఇంత పెద్ద మాఫియాని ఎలా ఎదుర్కొంటావ్‌? నిన్ను నువ్వు ఎలా రక్షించుకుంటావ్‌?”

    ”నన్ను రక్షించుకోవటానికి డాలూ; నేను ఎదుర్కోవటానికి కత్తీ ఉన్నాయండీ.”

    ”కత్తీ, డాలూనా?”

    ”అవునండీ. ఎదుర్కోవటానికి ‘భారతం’, రక్షించుకోవటానికి ‘భగవద్గీత”’

    బోల్డెంత సస్పెన్సూ, కాసింత రొమాన్సూ, అక్కడక్కడ పురాణాలూ, కొండకచో ప్రబంధ వర్ణనలూ… భారతంలోని లౌక్యం, భాగవతంలోని అర్థం కలగలిపి….. నిశ్శబ్ద విస్ఫోటనం.

    పేజీలు : 232

    150.00
    Add to cart
  • NTR Rajakiya Jeevithachitram Asalu Katha
  • Nuvvellipoyaka - An Anthology of Breakup Stories
  • Okka Vana Chalu

    Okka Vana Chalu

    0

    ఈ నవల రాయటంలో రెండు ఉద్దేశ్యాలున్నాయి. రాయలసీమ రైతు, రైతు కూలీల బతుకులు ఇప్పుడు వలస బతుకులయ్యాయని చెప్పటం ఒకటైతే. రెండవ విషయం ఏమిటంటే – ఎన్ని కష్టాలు వెంటాడుతూ వున్నా ఏడుస్తూ కూచోవటం ఇక్కడి మనుషుల లక్షణం కాదు. ఎంత ఆకలేసినా చేతులు చాచి అడుక్కోవటం ఇక్కడి రైతులకు అలవాటు లేదు. నిరంతరం బతికేందుకే పోరాడుతుంటారు. బండరాతి మీద అయినా సరే పిడికెడు అన్నం పుట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు.

              చెతుర్లాడుకోవటంలో ఆకలిని మరుస్తారు. బూతు పదాలు కలిసిన మాటలతో హాస్య సంఘటనలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కష్టాలు మరవటానికి ప్రయత్నిస్తారు. సద్ది సేరవలో పుల్లనీళ్ళ మీద తేలే పచ్చిమిరపకాయ మీద కూడా జోకులేసుకుంటూ దుర్భరమైన ఆ తిండినే కడుపారా తిని పనికి పోగలరు. బీడీకట్టకు లెక్కలేనంత దరిద్రంలో ఉందికూడా ఒకే బీడీని నలుగురు పంచుకు తాగుతూ తమ దరిద్రం మీద తామే జోకులేసుకోగలరు. ఇక్కడి రైతు కరువుకు అలవాటు పడ్డాడు – ఆకలికి లాగే నాయకుల వాగ్దానాలకు అలవాటు పడ్డాడు – వట్టి మేఘాల ఉరుములకు లాగే.

                                                                 – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

    110.00
    Add to cart
  • ONTARI
  • Padamati Koyila Pallavi - పడమటి కోయిల పల్లవి

    Padamati Koyila Pallavi – పడమటి కోయిల పల్లవి

    0

    పాశ్చాత్య కవితా ఝరిని తెలుగు సాహితీ క్షేత్రానికి తీసుకురావాలన్న ప్రయత్నంలో ‘పడమటి కోయిల పల్లవి’కి ‘తీయ తెనుగు అను పల్లవి’ జత కూర్చి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ సారధిగా కట్టిన కవితా వారధి ఈ పుస్తకం.

    కీట్స్‌, వర్డ్స్‌వర్త్‌, కోలరిడ్జ్‌, డన్‌మోర్‌, ఈట్స్‌ లాంటి కవుల కవితల్లో అంతర్లీనంగా ఉన్న భావం చాలా అద్భుతంగా వుంటుంది. ఇవన్నీ నారికేళ పాకాలు. మామూలుగా చదివితే అంతగా ఆకట్టుకోవు. లోతుగా వెళ్ళి పరిశీలించాలి. ముఖ్యంగా ‘ప్రాఫెట్‌’ అయితే ప్రతి వాక్యమూ ఆణిముత్యమే.

    ‘పిల్లల్ని ప్రేమించే ప్రయత్నం తప్పుకాదు. వారు తిరిగి ప్రేమను ఇవ్వాలన్న నిబంధనే మహాపాపం’. (ప్రాఫెట్‌)

    మనిషి జీవితపు విందులో పంచభక్ష్య పరమాన్నాలన్నీ వడ్డించబడతాయి. చివర – మృత్యువు వాటిని తుడిచి పెట్టుకు పోతుంది (రిచర్డ్‌ బ్రాన్‌ ఫీల్డ్‌)

    అనుభవం శయ్యమీద కలిసిన రెండు శరీరాలు. మనసు మాత్రం నీది నీదే- నాది నాదే (డి.హెచ్‌.లారెన్స్‌)

    ఇలాంటి గొప్ప భావాలు ఈ కవితల్లో వున్నాయి. భావాన్ని యధాతధంగానే అనువదించినా, కొన్ని చోట్ల తెలుగు దనం చేర్చారు. ఇంగ్లీషు కవిత్వానికి అవసరమైన ‘మాత్రల్ని’ వదిలి, వీలైన చోట్ల అంత్యప్రాసల్ని చేర్చారు.

    ఈ కవితల్ని కళ్ళతో చదవకండి. మనసుతో చదవండి. కొన్ని వాక్యాల్ని మనల్ని నిలబెట్టేస్తాయి. ఆ కవులు ఎంత మధనపడి, ఎంతచిన్న వాక్యాలలో ఎంత పెద్ద భావాల్ని పొదిగారో అర్ధమవుతుంది.

    50.00
    Add to cart
  • Pagulu

    Pagulu

    0
    500.00
    Add to cart