-
-
Prajaa Nayakudu V.Subbayya – ప్రజా నాయకుడు వి.సుబ్బయ్య
0₹60.00ఆయన పేరు సుబ్బయ్య. ప్రజలు ముద్దుగా పిలుచుకునేది వీఎస్. ఇదేదో ఓ వ్యక్తికి సంబందించింది కాదు. ఓ స్వాతంత్య్ర సమరయోధునికి, అదీ ఫ్రెంచ్-ఇండియా విముక్తి ఉద్యమానికి అంకితమైన సర్వస్వాన్నీ త్యాగం చేసిన వ్యక్తి జీవితంతో ముడిపడి ఉన్న పేరది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహరహారం పరితపించిన హృదయమది. సుమారు మూడు దశాబ్ధాల పాటు ప్రజల కోసం, ప్రజలతో మమేకమై సమరాంగణాన నిలబడిన మహామనిషి కామ్రేడ్ వీఎస్. వలసవాదుల గుండెల్లో నిదురించి, పాండీచ్చేరి ప్రజల మనసుల్లో స్వేచ్ఛా స్వాతంత్య్రాల కాంక్షను రగిలించి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ధీరుడు, వీరుడు. ఆయనో సామాజిక వేత్త. ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా, చివరకు తన ప్రాణాలకు ముప్పొచ్చినా ఏ మాత్రం వెరవక ప్రజల పక్షాన నిలిచిన చరితార్థుడు. అటు ఫ్రెంచ్-ఇండియా ఇటు బ్రిటీష్-ఇండియా చరిత్రపుటలకెక్కిన నేతలకే ఆదర్శప్రాయుడు. అటువంటి మహనీయుని సంక్షిప్త జీవిత చరిత్ర ఈ పుస్తకం.
కావడానికిది వీఎస్ జీవిత చరిత్రే కావచ్చు గాని వాస్తవానికిది పుదుచ్ఛేరి 20 శతాబ్దపు చరిత్ర కూడా. వీఎస్ జీవిత చరిత్ర నుంచి పుదుచ్ఛేరి స్వాతంత్య్ర పోరాటాన్ని విడదీసి చూడడం అసాధ్యం. అసంభవం.
-
Pranam Unnantha Varaku – ప్రాణం ఉన్నంత వరకు
0₹160.00ప్రేమ ఒక అందమైన, అద్వితీయమైన, అద్భుతమైన అనుభవం.
మాతృప్రేమ, పితృప్రేమ, సోదరప్రేమ ఇలా అనేకమైన ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా లభించేవే. అవి మానవ జీవితానికి అవసరమైనవని చెప్పేందుకు ఎలాంటి సందేహంలేదు.
కానీ ఒక పురుషుడు, స్త్రీ మధ్య ఏర్పడే ప్రేమ, యవ్వనం నుంచి మరణం వరకు సాగే ప్రేమ, సృషఙ్టకి నాంది పలికే ప్రేమ, మిగిలిన అన్ని ప్రేమలకు ఆధారమయ్యే ప్రేమ అన్నింటికన్నా ప్రత్యేకమైనదని నా అభిప్రాయం. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలు కలిసి చదువుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని, ప్రణయాన్ని వివాహం ద్వారా సార్థకపరచుకుని సాగించే ప్రయాణం అత్యుత్తమైనది.
ప్రేమ కుల మతాలకు, భాషా ప్రాంతాలకు అతీతమైనది.
ప్రేమించేందుకు నిజాయితీ కలిగిన ధైర్యం, ధైర్యంగా చెప్పగలిగే సత్యం, సత్యం కోసం చేసే త్యాగం, త్యాగంలో కూడా మరుగుపడని అనురాగం అనేవి నాలుగు స్తంభాలు. బలమైన ఈ నాలుగు స్తంభాలపై నిలబడిన ఒక ప్రేమ కథ ఇది.
నిజమైన ప్రేమకు నిర్వచనం ఈ నవల. జీవితంలో వాస్తవిక దృక్పథం, ఆత్మాభిమానం, మంచిని పెంచే పట్టుదల, ఎన్ని కష్టాలు ఎదురైనా సడలని వ్యక్తిత్వంతో నిజాయితీగా, ధైర్యంగా ఉంటే అదే కష్టాల మెడలు వంచి మనకు విజయం చేకూరుస్తుందని చెప్పేదే ఈ నవల. అంతే కాదు ఈ రోజుల్లో మన దేశంలోని సాంఘిక సమస్యలపై కూడా కొరడా ఝళిపించి, మార్గదర్శం చేయిస్తుంది. కేవలం కాలక్షేపం కాదు, మీకు ఎన్నో కొత్త విషయాలు, విద్య, వైద్య, పారిశ్రామిక పురోగతి లాంటి వాటిపై ఒక కొత్త కోణంలో ఆలోచింపచేస్తుంది.
పేజీలు : 192
-
-
Prema Oka Kala – ప్రేమ ఒక కళ
0₹150.00ఈ పుస్తకం ‘స్నేహం-ఆప్యాయత-ప్రేమ-మోహం-దాంపత్యం-రొమాన్స్-అనుబంధం’ అని ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధం పెరిగేది ఈ పరిణామక్రమంలోనే కాబట్టి, పుస్తకం కూడా ఈ ఎవల్యూషన్లో ఉంటేనే బాగుంటుందని భావించటం జరిగింది.
అమ్మ నుంచి ప్రేమతో తొలిముద్దు, నాన్నతో పొరపాటుల దిద్దుబాటు, స్నేహితుల్లోని నచ్చిన గుణాల్ని ప్రేమించటం, వారి మైనస్-పాయింట్స్ మనస్ఫూర్తిగా ఒప్పుకోవటం… ఆ విధంగా మనిషి తన ప్రేమ పరిధిని పెంచుకుంటాడు. (అయితే కొన్నిసార్లు నమ్మిన సిద్ధాంతం కోసం విభేధించటానికి వెనుకాడడు కూడా. కానీ విభేధం వేరు, శత్రుత్వం వేరు).
ఈ పుస్తకంలో….
స్నేహం : స్నేహంలోంచి ప్రేమలోకి…స్నేహితుల్లో రకాలు…అకస్మాత్తుగా గుడ్‌బై చెప్పే స్నేహితులు…ఖరీదైన స్నేహాలు…మంచి స్నేహితుడి పది లక్షణాలు… స్నేహం స్వార్థమా?… ఎటువంటి స్నేహితుల్ని వదిలిపెట్టాలి?
ప్రేమ : తూపు తొలి చూపు… తొలి స్పర్శ… పప్పీ లవ్… పెళ్ళికి ముందు ప్రేమ… ప్రేమ వివాహాలు… పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు… ప్రేమలో ఎమోషన్స్… ప్రేమ – ఈర్ష్య.
దాంపత్యం : ఈ నాటి ఈ బంధం ఈ నాటిదే… లివ్-ఇన్-రిలేషన్… సెకండ్ సెటప్… సర్దుబాటు.
శృంగారం : వద్దనకు ఈ ముద్దు … రొమాన్స్… వాత్సాయన… విరహ వర్ణన… శృంగారానికి ఆరు మెట్లు
అనుబంధం : మూడు రకాల అనుబంధాలు ఉన్నాయి.
-
-
-
Rahasyam (The Secret) – రహస్యం (ది సీక్రేట్)
0₹499.00మీరు మీ చేతుల్లో ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకుని ఉన్నారు
ఎన్నో యుగాలుగా ఇది అందరూ ఎంతో ఆకాంక్షించేది, దాగివున్నది, చేజారినది, అపహరించబడినది, లెక్కలేనంత డబ్బిచ్చి కొనుగోలు చేయబడినది, తరువాతి తరాల వారికి అందించబడుతూ వస్తున్నది. శతాబ్ధాల కిందటి ఈ రహస్యాన్ని చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చాలా మంది అర్థం చేసుకున్నారు. : ప్లేటో, గెలీలియో, బిథోవెన్, ఎడిసన్, కార్నేగి, ఐనస్టీన్ వంటి వారు. వీరితో పాటు మరికొందరు ఆవిష్కర్తలూ, వేదాంతులు, శాస్త్రవేత్తలు, గొప్ప తాత్త్వికులు కూడా దీన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ రహస్యం లోకానికి వెళ్ళడి చేయబడుతోంది.
”ఈ రహస్యాన్ని నేర్చుకునే ప్రక్రియలో, మీరు ఇష్టపడే వ్యక్తిత్వాన్ని ఎలా అలవరుచుకోగలరో, మీ మనస్సుకు నచ్చే పని ఎలా చేయగలరో, మీరు ఇష్టపడే వస్తువును ఎలా పొందగలరో తెలుసుకుంటారు. నిజంగా మీరెవరో మీకు తెలియవస్తుంది. జీవితంలో మీకోసం వేచివున్న దివ్యత్వం ఏమిటో మీరు తెలుసుకుంటారు”.
పేజీలు : 198
-