-
Panchatantram
0₹300.00ఆబాల గోపాలాన్ని అలరించే విజ్ఞాన వినోద నీతికథాసాగరమే ఈ “పంచతంత్రం”. ఇందులో అందమైన బొమ్మలతో అనేక పురాణనీతి కథలు వ్రాయబడ్డాయి. ఇందులో
. మిత్ర లాభం
. పులి బంగారు కడియం కథ
. జిత్తులుమారి నక్క కథ
. మోసకారి పిల్లి కథ
. కోడి తొక్కిన నువ్వుల కథ
. ఆశపోతు నక్క కథ
. తెలివి తక్కువ కోతి కథ
. నక్క నగారా శబ్దము కథ
. సర్పాన్ని నాశనం చేసిన కాకి కథ
. చీరపేను-నల్లి కథ
. పులి తోలు కప్పుకున్న గాడిద కథ
. రంగు మచ్చల నక్క కథ
. అపాయంలో ఉపాయం కథ
. చిక్కులు ఎదోర్కొన్న మంగలి కథ
……..ఇలా ఇంకా ఎన్నో రకాల నీతికథలు ఇందులో ఉన్నాయి.
-
-
Parusavedi – పరుసవేది
0₹299.00రోజువారీ జీవితంలోని సమస్యల పరిష్కారం కోసమో, జ్ఞాన సముపార్జన కోసమో, నిరంతరం పేరుకుపోయే విసుగుని బద్దలు కొట్టడం కోసమో సాహిత్యాన్ని ఆశ్రయించే పాఠకులకు తనదైన తత్వదర్శనం చేయించి విశ్వతత్వాన్ని అర్ధం చేయిస్తూ సమాజ స్వభావాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశం ఇస్తూ స్వీయ పరిణామానికి కావలసిన మార్గాన్ని సుగమం చేయడమే సాహిత్య ప్రధాన ప్రయోజనం.
మన బలహీనతలను రెచ్చగొడుతూ, భ్రమలలో జోకొడుతూ, భద్రతా రాహిత్యాల విముక్తి కోసం అవిటి ట్రిక్కులనీ, నిర్జీవమైన మార్గాంతరాలనీ అందించే సాహిత్యంలో పుస్తకాల సంత విలవిలలాడుతుంది. ఈ విషాద సందర్భాన మానవ తత్వాన్నీ, విశ్వతత్వాన్నీ సరళంగా, సహజంగా అర్ధం చేయిస్తూ, వాటి మధ్య ఉన్న అనుసంధానతని విపులంగా విశదీకరిస్తూ తెలుగు సాహిత్య రంగంలోకి ‘పరుసవేది’ ప్రవేశించడం ముదావహం.
తర్కాలకీ, హేతుబద్దతకీ, ఇంద్రియాల గ్రహింపుకీ కుదరని-అందని, నిశిత నిగూఢ స్ధాయిలో అసలైన మౌలిక ప్రజ్ఞలన్నీ గుప్త నిర్మాణంగా నెలకొని ఉంటాయని, ఈ ప్రజ్ఞలు సందర్భోచితంగా వ్యక్త నిర్మాణాలుగా నైపుణ్యాలుగా ప్రకటితమౌతాయనీ అర్ధం చేసుకోకపోతే నిండైన పరిణామానికి దూరమై, మన సంకల్ప వాస్తవాలను సృష్టించుకోవడంలో విఫలమౌతామని మనకి అర్ధం అయ్యేలా చేయడమే ఈ రచన యొక్క ప్రధాన గమ్యం. పాలో కొయిలో – ది ఆల్కెమిస్ట్ ఇంగ్లీషు పుస్తకాన్ని తెనిగించినది శ్రీ కె.సురేష్. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలలో 66 భాషలలోకి అనువాదమయ్యింది.
-
-
Peka Mukkalu – పేక ముక్కలు
0₹220.00సృజనాత్మక సాహితీ సేచనతో భారతదేశ సాహితీ క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్‌చందర్ తెలుగు పాఠకలోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన ఆయన రచనలు అనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.
కిషన్ చందర్ 1914 నవంబర్ 23న పంజాబ్‌లో జన్మించారు. ఎం.ఏ., ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకున్నారు. ప్రధానంగా ఆయన నవలా రచయిత. ఆయన నవలలు అనేకం భారతీయ భాషలతోపాటు ఇంగ్లీష్, రష్యన్, డేనిష్, పోలిష్, జర్మన్, హంగేరియన్, చైనా భాషలలోకి అనువదించబడ్డాయి.
ఆయన రచనలు సమాజ స్వరూపానికి అద్దం పడతాయి. మహోదాత్త శ్రమకీ నీరాజనమిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలి, జీవిత వైవిధ్యం, మానసిక అంతర్మథనానికి మాటలతో రూపమివ్వటం – కిషన్ చందర్ ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి. ”గాలిబ్ వారసుడు”గా సాహితీ లోక సమాదరణ పొందిన కిషన్ చందర్ 1977 మార్చి 8న కీర్తిశేషులయ్యారు.
ఈ నవలకు పెట్టిన ”పేకముక్కలు” అన్న పేరు చాలా విధాలా సార్థకనామం. ఇందులో ఉన్న పాత్రలు పేకముక్కలు. ఇందులో రాజులూ, రాణీలూ, జాకీలూ, జోకర్లూ, పొడిముక్కలూ అందరూ ఉన్నారు. సినిమా ఒక కళా కాదు, ఒక వ్యాపారమూ కాదు – పేకాట, జూదం! కాని అది కొద్దిమందికే జూదం. మిగిలినవారిలో సుఖజీవనం కోసం వచ్చినవాళ్ళుంటారు. తమ ఆదర్శాలు సఫలం చేసుకోవటానికి వచ్చినవారుంటారు. బ్రతుకు తెరువులలో ఇది ఒకటనుకుని, పెద్ద ఆశలేమీ లేకుండా వచ్చినవారుంటారు. ఈ రకాలన్నీ ఈ నవలలో ఉన్నాయి.
సినిమా జీవితం ఒక విలక్షణమైన జీవితం. మామూలు జీవితపు విలువలకిక్కడ చలామణీ లేదు. ఈ సంగతి తెలియగానే మామూలు జీవితపు విలువలను సునాయాసంగా విసర్జించేస్తారు కొందరు. మరి కొందరు వాటిని గాఢంగా అంటిపెట్టుకుంటారు. ఆ కారణంగా నలిగి హూనమైపోతారు. అంతులేని ఆశనూ, అగాధమైన నైరాశ్యాన్నీ రేకెత్తించగల విచిత్ర జీవితం సినిమా జీవితం.
జీవితాన్ని వాస్తవంగా చిత్రించటమే ఒక విశేషం కాదు. డిటెక్కివు నవలల్లో కూడా వాస్తవ జీవితమే ఉన్నది. ఈ నవలలో సినిమాకారుల జీవితాన్ని ఉన్నదున్నట్టు చిత్రించటంలో సరిపుచ్చుకోక, రచయిత ఆ జీవితంలోని సత్యాలన్నిటినీ నగ్నంగా ప్రదర్శించారు. ఆ కారణంచేత ఇది ఉత్తమ రచన అనిపించుకుంటుంది. ఎప్పటికైనా సినిమా కళ ఉన్నతికి రావాలంటే, అందుకు జరగదగిన కృషిలో ఈ నవల ఒక భాగమవుతుందా అంటే, అవుతుందని నేను నమ్మకంగా చెప్పగలను. – కొడవటిగంటి కుటుంబరావు
పేజీలు : 264
-
Penam Meeda Nundi Poyyilo Paddam – పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాం
0₹60.00అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది :
నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ గతంలో హైదరాబాద్ అభివృద్ధి పైనే కేంద్రీకరరించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని, తాను కూడా కొంతమేరకు పొరపాటు చేశానని, గతంలో వలే కాక 13 జిల్లాలలోను అభివృద్ధిని వికేంద్రీకరించి, నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలందరి సుఖసంతోషాలకు సౌభాగ్యానికి కృషిచేస్తానని హామీ యిచ్చారు. శ్రీకాకుళం జిల్లా నుండి అనంతపురం జిల్లా వరకు ఏయే జిల్లాలో ఏయే అభివృద్ధి పనులను తన ప్రభుత్వం చేపట్టనుందో సుదీర్ఘమైన జాబితా కూడా ప్రకటించారు. కానీ ఆ విషయాన్ని ఆయన మరచిపోయి అమరావతి, పోలవరం తన రెండు కళ్ళు అని పదేపదే ప్రకటిస్తూ వచ్చారు. నూతన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఆదాయం, కేంద్రం నుండి వచ్చు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన పథకాలు, అభివృద్ధి పనులు మరియు కొనసాగుతున్న ఇరిగేషన్ పథకాలను సత్వరమే పూర్తిచేయటం మున్నగు వాటిపైన లోతుగా అధ్యయనం చేసి సరైన నిర్ణయాలు తీసుకోకవలసి వుంటుంది. అందుకు భిన్నంగా ఆయన వ్యవహరించారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చాలా పెద్దదిగా, చాలా గొప్పదిగా వుంటే పెట్టుబడులు ఆకర్షించబడతాయి అనేది ఆయన భావన. ఒక ప్రాంతంలో లభ్యమయ్యే ముడి వస్తువులు, భౌతిక వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మున్నగు అంశాలను దృష్టిలో పెట్టుకుని నూతన పరిశ్రమలు ఏర్పాటవుతాయేతప్ప రాజధాని నగరం పెద్దదిగా వుంటే అక్కడికే పరిశ్రమలు వస్తాయనే భావన సరికాదు.
పేజీలు : 72
-
-
Pillala Perla Prapancham – పిల్లల పేర్ల ప్రపంచం
0₹100.005000 పేర్లు వున్న ఏకైక పుస్తకం – యండమూరి వీరేంద్రనాథ్
అందమైన పేరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
‘స్నేహ’ – మంచి పేరు. ‘సంధ్య’ చాలా మందికి వుండే అందమైన పేరు. కానీ – ‘స్నేహ సంధ్య’ మరింత అందమైన కాంబినేషన్. వినగానే ‘బావుంది’ అనిపించేటంత ముచ్చటైన పేరు. నీహారిక, వేదసంహిత లాంటి ఎన్నో అందమైన పేర్లను పాఠకలోకానికి పరిచయం చేసిన యండమూరి వీరేంద్రనాథ్ కలంలోంచి జాలువారిన ముత్యాల జల్లు ఈ పుస్తకం. గతంలో వచ్చిన పిల్లల పేర్ల పుస్తకాలకి భిన్నంగా – మరో 500 పేర్లు అధికంగా – నవ్యత కోరుకునే పాఠకులకి బహుమతిగా – యండమూరి అందించే ముచ్చటయిన పేర్ల పుస్తకం ”పిల్లల పేర్ల ప్రపంచం” చదవండి. ఎంపిక చేసుకోండి. తెలుగులో ఇన్ని (5000) పేర్లతో వెలువడుతున్న తొలి పుస్తకం ఇది. అంతేకాదు జన్మనక్షత్రాలకు అనుగుణంగా వీలైనన్ని పేర్లు పొందుపరుచబడ్డ పుస్తకం కూడా. చివరన పిల్లలు ఉండవలసిన సగటు బరువును సూచించే పట్టిక కూడా ఇందులో వుంది. -