-
-
Sapiens
0₹399.00నిప్పు
మనకి శక్తినిచ్చింది
పోచికోలు కబుర్లు
సహకరించేందుకు సాయపడ్డాయి
వ్యవసాయం
ఇంకా కావాలన్న కోరికని పెంచింది
పురాణాలు
చట్టాన్ని న్యాయాన్ని నిలిపి ఉంచాయి
డబ్బు
మనం నిజంగా నమ్మదగిన దాన్ని ఇచ్చింది
వైరుధ్యాలు
సంస్కృతిని సృష్టించాయి
విజ్ఞానశాస్త్రం
మనని ప్రాణాంతకంగా తయారుచేసింది
ఇవి మన అసాధారణమైన చరిత్ర తాలూకు సంచలనాత్మకమైన వివరాలు – ఏ ప్రత్యేకతా లేని వానరులనుంచి ప్రపంచానికి ఏలికలుగా తయారు చేసిన చరిత్ర ఇది.
-ఆర్.శాంతసుందరి.
-
Science Vijayalu
0₹75.00నిప్పును ఎవరు కనుగొన్నారు… చక్రాన్ని ఎవరు రూపొందించారు… నేడు అందరూ ఎంతో ఇష్టపడే కాఫీకి మూలం ఎవరు… దూరాన ఉన్న మనుషుల సైతం మాటలతో కలిపే టెలిఫోన్ రూపకర్తలు ఎవరు… ఇటువంటి ఎన్నో విషయాలు నాటి చరిత్రగా మిగిలిపోయినా… నేటికి… రేపటికి కూడా నూతనంగా ఉంటాయి. ఇక్కడి ఆర్యభట్ట నుండి అక్కడి ఐన్స్టీన్… ఈ పుస్తకంలో పలువురు శాస్త్రవేత్తలు రూపొందించిన పరికరాలు, వాటి కాలాలు తదితర విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసారు. ఇలా ప్రపంచంలో ఎందరో శాస్త్రవేత్తల జీవితాలే కాదు, వారి పరిశోధనలు చరిత్రలుగా మిగిలినా భవిష్యత్ ప్రగతికి కొత్త మార్గాల అన్వేషణలో సహాయపడుతూనే ఉన్నాయి. నిత్య నూతనంగా… విజ్ఞాన సంబంధమైన విషయాలకు సంబంధించిన పుస్తకాలు చదవాలని ఎంతోమందికి ఉన్నా.. క్లిష్టమైన బాష అడ్డుగా మారింది. ఆయా అంశాలు మాతృబాషలో లభిస్తే ఎంతో ఉపయుక్తం. కనీసం క్లుప్తంగానైనా మాతృబాషలో ఉండి పలు అంశాలు ఒకచోట చేర్చితే చదువరులకు ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించడంతో పాటు భద్రపరచుకునేందుకు వీలుగా ఉంటుంది. ఆ ప్రయత్నమే ఇది.
– జె.ఎస్. భాస్కర్
-
-
-
-
-
-
Soonyam
0₹275.00పంజరంలో చువ్వమీద కూర్చుని, నింపాదిగా ధాన్యం ముక్కన కరుచుకుంటున్న పక్షితో “ఎగిరిపో! నీకు స్వేచ్ఛనిస్తున్నాను” అన్నాడట ఒక యువకుడు. “ఎగిరిపోవాలనే ఉంది. ఆకాశంలో పట్టుకోవడానికి చువ్వలుంటాయా?” అని అడిగిందట పక్షి. 83లో అదీ పరిస్థితి. ఆకలికన్నా పెద్ద భయం. రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్లతో సహా, ఉస్మాన్ గంజ్ లో బస్తాలెత్తే కూలీలతో సహా జేబుదొంగలు, ఇతర పెట్టి క్రిమినల్స్ సహా అందరూ నా ప్రతిరూపాలే. – ముక్తవరం పార్థసారథి తనకు విలువలున్నాయంటే అది ధిక్కారంలాగా కనిపిస్తుంది. తనకూ వాళ్ళకూ మధ్య యింత ఎడం ఎందుకు? ఈ నిత్య జీవితపు రొచ్చులో ఎవరూ తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోయినా రాసేటప్పటి తన నిజాయితీనయినా నమ్ముతారా? ఈ వూహలూ, ఈ అనుభవం మరపుతెరల మరుగున మాయం కాకముందే – రొటీన్ జీవితపు అడుగున పడిపోకముందే అక్షరరూపంలో వ్యక్తమయ్యే నిజాయితీయే సాహిత్యం. అటువంటి సాహిత్యం అది శూన్యంకాదు – జీవితం. అర్థవంతమైన జీవితం. – – వరవరరావు
-
Spoorthi
0₹100.00మధ్యతరగతి కుటుంబ జీవనం చుట్టూ నడిచిన కథ. కుటుంబ జీవనంలో ఉండే ఆటుపోట్లు, అత్తగారి అసహనాలు, అన్నదమ్ముల ఆప్యాయతలు, రాగానురాగాలు, అక్కడక్కడ ప్రేమమైకాలు, ఊహాచిత్రాలతో పాఠకులను ఆకట్టుకుంటుంది ఈ నవల. హద్దుల్లో ఉండే భార్యభర్తల “శృంగారం” అక్కడక్కడ ఆనందాన్ని కలిగిస్తుంది. మనస్సును ఆహ్లాద పరుస్తుంది. వారి మధ్య తియ్యని జ్ఞాపకాల నెమరులతో వివాహబంధం ఇంకా దృఢమవుతుంది. ఉన్నత వర్గాల జీవనాన్ని అనుకరించే పాత్రలున్న కుటుంబంలో పక్కదారేపట్టే వ్యక్తులనూ, ప్రత్యేకించి యువతీ, యువకులనూ సరిదిద్దడంలో పరిణతిచెందిన ఒక యువతి పాత్ర చిత్రణ ఆమోద యోగ్యంగా ఉంది. స్త్రీ కేంద్రంగా కథ నడుస్తుంది.
భార్యాభర్తల వ్యక్తిగత జీవితంలోకి అన్ని కోణాలనూ ఈ నవలలో రమాదేవిగారు చిత్రించారు. కుటుంబ వ్యవస్థలో భార్యగా, కోడలిగా, వదినగా, సోదరిగా ఒక స్త్రీ తన పాత్రను ఎట్లా నిర్వహించాలో ఈ నవలలో ఆమె చిత్రించ ప్రయత్నించారు. తనకంటే చిన్నవారిని, పెద్దలను సహితం దారిలో పెట్టడానికి ఒక స్త్రీ పడే తపనను మన కళ్ళముందుంచారు.