-
Mana Navalalu Mana Kathanikalu – మన నవలలు మన కథానికలు
0₹90.00సాహిత్య విమర్శా రంగంలో నా కృషి అటు ప్రాచీన సాహిత్యం మీదా, ఇటు ఆధునిక కవిత్వం, కథానిక, తెలుగు సాహిత్య విమర్శల మీద జరిగింది. నవల మీద నా కృషి చాలా పరిమితమని ఈ గ్రంథమే రుజువు చేస్తున్నది. తెలుగు నవలల మీద నేను రాసిన ఈ పదమూడు వ్యాసాలే నేనింకా చెయ్యవలసిన కృషిని గురించి హెచ్చరిస్తున్నాయి. వీటిలో కొన్నింటిని అఫ్సర్ రాయించగా, తక్కినవి ఇతర సందర్భాల కోసం రాసినవి. ‘జగడం’ నవలకు ముందు మాట రాయమని బోయ జంగయ్య గారు నన్ను కోరడం నాకు పరమానందమైంది. ఏ ప్రక్రియ మీద విమర్శ రాసినా వస్తు చర్చ మనక బాగా ఇష్టమైంది, అలవాటైంది. నందిని సిధారెడ్డి ‘ప్రజల మనిషి’ నవలా శిల్పం మీద వ్యాసం రాయమని కోరినప్పుడు ఆనందంగా ప్రయత్నించాను. నవలా శిల్ప శాస్త్రాన్ని ముందు బెట్టుకొని కాక, నవలలో శిల్ప విశేషాలుగా నాకు కనిపించిన వాటిని చెప్పడానికి ప్రయత్నించాను.
‘కథాంశం’ తర్వాత 2006-2008 మధ్య మూడేళ్ళలో కథానికల మీద నేను రాసిన వ్యాసాలు పది. వీటిలో కొన్ని ముందు మాటలు. అయినా విమర్శనాత్మకంగా రాయడానికే ప్రయత్నించాను. – రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
ఓ పుష్కర కాలంలో వచ్చిన తెలుగు నవలలు, కథానికల మీద విమర్శనా గ్రంథం ‘మన నవలలు మన కథానికలు’. సంఘ సంస్కరణ, జాతీయ, అభ్యుదయ, విప్లవ, దళిత, బహుజన, స్త్రీ, ప్రాంతీయ అస్తిత్వవాదాలను, ఉద్యమాలను ప్రతిబింబించిన నవలలు, కథలపై సమకాలీన వాస్తవికతతో చేసిన సద్విమర్శ ఇది. రాగద్వేషాలకు అతీతంగా వస్తు వివేచనతో సాగే విమర్శనా పద్ధతికి నిలువుటద్దం ఈ పుస్తకం.
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా..సాహిత్య, సామాజిక చైతన్యానికి నిరంతరం కృషి చేస్తున్న ఈ కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత కలం నుండి వెలువడిన ‘మన నవలలు – మన కథానికలు’ అత్యంత అసాధారణ పుస్తకం.
-
-
Manchi Mutyalu – మంచి ముత్యాలు
0₹70.00తెలుగు సాహిత్యపు గత వైభవాన్ని పరిశీలిస్తే మనకందులో ఎందరో మణిదీపాలవలె వెలిగినవారు కనిపిస్తారు. గురజాడ అప్పారావు, శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ మొదలైన లబ్ధ ప్రతిష్ఠులే కాక కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్, బుచ్చిబాబు లాంటి సమర్థులైన మనోవిశ్లేషకులను కూడా తెలుగుతల్లి మనకందించింది. సామాజిక దురన్యాయాలపై తిరుగుబాటు బావుటాలెత్తిన రాచకొండ, చలం మొదలైన వారు ఎటూవున్నారు. ఇక నాటకరంగాన్ని పరిశీలిస్తే మాలపల్లి, కన్యాశుల్కం నుంచి మరో మొహంజొదారో, రాగ రాగిణి, రాతి మనిషి లాంటి గొప్ప నాటకాలందించిన రచయితలూ మనకు వున్నారు. వీరు గాక, చాసో, కాళీపట్నం, పెద్దిభొట్ల వంటి అత్యుత్తమ కథకులూ బాలగంగాధర తిలక్, జంధ్యాల పాపయ్య శాస్త్రి, బసవరాజు అప్పారావు లాంటి భావుకులయిన కవులూ తెలుగు సాహితీ పీఠానికి ముత్యాలు అద్దేరు.
వేర్వేరు రంగాలలో అత్యున్నత స్థాయి సంపాదించిన మహా రచయితల సరసన యండమూరి వీరేంద్రనాథ్‌ని నిలబెట్టే సాహసం మేము చేయము గాని, ఆయనకి కథ, నవల, నాటకం, కవిత్వం, సినిమా కథా, మాటల రచన ఈ రంగాల్లో ప్రవేశమూ, తగు మాత్రపు ఖ్యాతీ ఉన్న సంగతీ మరువలేము.
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గత 35 సంవత్సరాల సాహితీ జీవనంలో జీవితం పట్ల, సమాజం సట్ల, మనిషి ప్రవర్తన పట్ల తన రచనల్లో వెలువరించిన భావాలనూ, పరాకాష్ఠగా భావించదగిన ఆణిముత్యాల్నీ ఏరికూర్చి మనకందిస్తున్నారు ప్రచురణకర్తలు. విభిన్నమైన రీతుల్లో, ఇన్ని ప్రక్రియల్లో చేపట్టిన ఒకే రచయిత రచనలోని విలువైన మాటలన్నీ ఒక పుస్తక రూపంలో రావటం తెలుగు సాహిత్య చరిత్రలో ఇదే మొదలు.
-
Manchupula Varsham – మంచుపూల వర్షం
0₹50.00వ్యక్తుల్ని ప్రేమించేకొద్దీ, వారి నుంచి దూరమైతే విరహం, వారికి కోపం వస్తే బాధ. వారు వేరే వారిపట్ల కాస్త ఎక్కువ శ్రద్ద చూపితే ఈర్ష్య! అదే ప్రాణంలేని సంగీతం, పెయింటింగ్, రచన, పఠనం మొదలైన వాటి పట్ల అభిరుచి పెంచుకుంటే మనకి మనమే వాటితో రమించవచ్చు. అవి అలగవు, కోరికలు తీర్చమని బలవంతపెట్టవు. మరికొంత సమయం తమకోసం కేటాయించమని అడగవు. అందుకే ప్రకృతితో స్నేహం ఎల్లప్పుడూ నిరపాయకరం.
సామాన్యుడు ఎవరేం చెప్పినా నమ్ముతాడు. ఎలా ? ఎందుకు? అని ఆలోచించడు. హేతువు వున్నదాలేదా ? ఇదెలా జరుగుతుంది ? అని తెలివైనవాడు తర్కిస్తాడు. తనకి తెలియని హేతువు కూడా వుండొచ్చుకదా, కారణం వున్నదే కరెక్టనుకోవటం దేనికి ? అని మేధావి ఆలోచిస్తాడు. హేతువు కన్నా, తనకిగానీ, ప్రపంచానికి గాని ఆ పనివల్ల వచ్చే ‘ఉపయోగం’ గురించి జ్ఞాని ఎక్కువ పరిశీలిస్తాడు.
మనిషి ఎలా సంతృప్తిగా బ్రతకాలో చెప్పేదారిలో, ఒక మైలురాయి లాంటి వాడు భగవంతుడు. కర్తవ్య నిర్వహణ మానేసి కేవలం అతణ్ణి పూజించేవాడు, ప్రయాణం మానేసి ‘మైలురాయి’ని పూజిస్తున్నవాడి కింద లెక్క.
ఈ ప్రపంచంలో మోసగాళ్ళందరూ ఎప్పుడూ రకరకాల అబద్ధాలు ఆడుతూ వుంటారనీ, అందమైన కట్టుకథలు విపరీతంగా చెప్పేస్తూ వుంటారనీ, మామూలు మనుషుల కన్నా వాళ్ళు చాలా డిఫరెంట్‌గా వుంటారని మనమనుకుంటే అది చాలా తప్పు. వాళ్లూ మనలాగే ఉంటారు. వారి సిన్సియారిటీని హానెస్టీగా ఎప్పుడూ భావించకూడదు. సిన్సియారిటీ అంటే శ్రద్ధ. హానెస్టీ అంటే నిజాయితీ. అతడు చాలా సిన్సియర్ అనటానికీ, అతడు చాలా హానెస్ట్ అనడానికీ చాలా తేడా ఉంది. నమ్మకద్రోహులే ఒక్కోసారి చాలా శ్రద్దగా వుంటారు.
మనో వైజ్ఞానిక సాహిత్యంలో అపూర్వ సంచలనాలను సృష్టిస్తున్న వ్యక్తిత్వ పుస్తకాలు – తప్పుచేద్దాంరండి, విజయానికి ఆరోమెట్టు, మైండ్ పవర్ నెంబర్ 1 అవటం ఎలా, విజయంలో భాగస్వామ్యం, విజయానికి అయిదుమెట్లు-గెలుపుకోసం ప్రతి వ్యక్తి ఆచరించవలసిన సూత్రాల్ని పై పుస్తకాల్నుంచి క్లుప్తీకరించి పాఠకుల సౌలభ్యం కోసం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ అందిస్తున్న విజయ రహస్యాల సంకలనం ‘మంచుపూల వర్షం’.
-
-
-
Mind Power – మైండ్ పవర్
0₹270.00ఈ ‘మైండ్ పవర్’ పుస్తకంలో మానవ జీవితాన్ని సమూలంగా మార్చివేయగల అంశాలు వున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక మనోతాత్త్విక విశ్లేషణ (). సైద్ధాంతికంగా చెబితే అంత తేలిగ్గా అర్ధంకాని విశ్లేషణలను సైతం చిన్నచిన్న సంఘటనల సాయంతో విడమరచి చెప్పడంలో రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గొప్పతనం వెల్లడయింది. పుస్తకం ఆరంభం నుంచీ, అంతం వరకూ రచయిత తన సహజశైలిలోని జిగి, బిగిని సడలనివ్వలేదు. ఇతర ‘పర్సనాలిటి డెవలప్‌మెంట్’ పుస్తకాల లాగా ఒకసారి చదివేసి పక్కన పెట్టేసే పుస్తకం కాదిది.
జీవితంలోని వివిధ దశల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు ఇందులో పొందుపరచారు. అందువల్ల ప్రతివ్యక్తీ దీనిని పదేపదే చదివి తీరాల్సిందే. అసామాన్యులు మెదడు చెప్పినట్లు చేయకుండా, తాము చెప్పినట్లు ‘మెదడు’ నడుచుకునేటట్లు ‘ట్యూన్’ చేసుకుంటారు. అలాంటివారే నెంబర్‌వన్ కాగలుగుతారు. మనిషిని మెదడు వాడుకునే దశనుండి మెదడును మనిషి వాడుకునే దశకు చేరుకోవాలంటే యండమూరి వీరేంద్రనాథ్ ‘మైండ్‌పవర్’ మంచి అక్షర సాధనం కాగలదు.
సామ్యవాదం కోసం మనోశక్తి, మనో ప్రణాళిక, మనోధైర్యం, మనో విశ్లేషణ, మనశ్శాంతి కాక ‘ఆర్ధికావగాహనావలోకం’ కోసం అవన్నీ తెలుసుకోవాలనుకుంటే, అదే పాజిటివ్ థింకింగ్ అనుకుంటే ఇది అవశ్య పఠనీయ గ్రంథం. పాఠకుడి మానసిక స్థాయిని పెంచి తద్వారా సమస్యల్ని పరిష్కరించే ఆత్మవిశ్వాసాన్నీ, నేర్పునీ, అందించిన ఈ ప్రయత్నం ప్రశంసనీయం.
-
-