-
-
Konni Kalaalu Konni Samayalu – కొన్ని కలాలు కొన్ని సమయాలు
0₹280.00సమాజంలో ఎక్కడ ఏ కొద్దిపాటి అవకతవకలు జరిగినా ముందు కవులూ, రచయితలు స్పందిస్తారు. తమ స్వరాన్ని వినిపిస్తారు. వారి వల్ల, వారి అక్షరాల వల్ల విప్లవాలు, సంస్కరణలు, మేళ్ళు నేరుగా జరగకపోవచ్చు కాని, జనాన్ని చైతన్యవంతుల్ని చేయడంలో వారు ముందుంటారు. వారి అక్షరాలు ముందుంటాయి. సృజనకారులకు అడ్డుగోడలు పనికిరావు. వారు విశ్వమానవులు! మానవీయ విలువల్ని కాపాడుతూ వచ్చిన కొంతమంది సాహితీ మహనీయుల జీవితాల్ని, వారి సృజనాత్మక కృషిని ఈ పుస్తకంలో గుర్తు చేసుకోవడం జరిగింది. ఇందులో ఎకడమిక్ విభజనలేవీ లేవు. ఇందులో చేర్చని మహాకవులు, రచయితలు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారి గూర్చి నేను రాయకపోవడం వల్ల చేర్చలేకపోయాను. భవిష్యత్తులో రాయగలిగితే, మరో పుస్తకంతో పాఠకుల ముందుకొస్తాను. ఇందులో తెలుగు రచయితలు, భారతీయ రచయితలు, విదేశీ రచయితలు అని మూడు విభాగాలుగా విభజించాను. పక్కపక్కనే ఉండడం వల్ల సాహిత్యకృషి పోల్చి చూసుకోవడానికి, బేరీజు వేసుకోవడానికి, అధ్యయన పరులకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నాను. చదవడం తగ్గించిన నేటి తరానికి వ్యక్తిత్వ వికాస దిశగా తపన గురించి, వారు నిలబెట్టాలనుకున్న జీవిత విలువల గూర్చి తెలియజేస్తుంది. – దేవరాజు మహారాజు
-
-
Lopali Daari
0₹250.00Lopali Dari Short Stories by Sowbhagya సౌభాగ్య అనబడే పాలెళ్ల విజయకుమార్ ఒక బహుముఖీన ప్రజ్ఞగల సాహిత్యవేత్త. ఏదో ఒక సాహిత్య ప్రక్రియలో మాత్రమే కాకుండా కవిత్వం, కథ, నవల, విమర్శ, అధ్యయనాత్మక సాహిత్యం, వ్యక్తిత్వ వికాస ఉద్దీపక సాహిత్యం ఇలాంటి వివిధ విభిన్న రంగాల్లో విశేషమైన కృషిచేసిన ప్రతిభాశాలి. కవిగా, దాదాపు తొమ్మిది సంపుటాలను వెలువరించారు. ముప్పది తొమ్మిది సాహిత్య విమర్శ గ్రంథాలను అందించి నాణ్యమైన విమర్శకునిగా పేరుపొందారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొథె, ఐన్స్టీన్, జాన్ కీట్స్, రస్సెల్, ఖలీల్ జిబ్రాన్, తావో తెచాంగ్, సిసిరో వంటి వ్యక్తుల ఆసక్తికర గ్రంథాలను సరళంగా పాఠకులకు అందించిన పరిశోధకుడు. ప్రధానంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఓషో భావజాలాన్నీ, చింతననూ అనేక గ్రంథాలుగా అందించారు. సాభాగ్య అనేక దశాబ్దాలుగా అనితర సాధ్యమైన ఈ రచనా కార్యక్రమాన్ని నిష్ఠతో కొనసాగించి దాదాపు 195 గ్రంథాలను యిప్పటివరకు వెలువరించారు. ఒక సాహిత్య కారుడు ‘సాహిత్య సాధన’ను తపస్సుగా స్వీకరించి, నిరంతర యజ్ఞంగా కొనసాగిస్తే తప్ప ఇంత నాణ్యమైన, ప్రామాణికమైన అక్షర సంపదను సృష్టించడం సాధ్యం కాదు. ఏ.గంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా మోతె గ్రామానికి చెందినవారు. 2006లో UK లోని బెడ్ ఫోర్డ్ యూనివర్సిటీ నుండి MBA పూర్తి చేశారు. కొంత కాలం అక్కడే జాబ్ చేసి, తిరిగి ఇండియాకు వచ్చారు. హైదరాబాద్ లో e-tutors world పేరుతో, మొట్టమొదటి online tuitions అకాడమిని ప్రారంభించారు. 2010 లో ఓ ఫిల్మ్ స్కూల్ నుండి డైరెక్షన్ కోర్స్ చేసి, రెండు తెలుగు సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్గా, సహ రచయితగా పనిచేశారు. 2016 నుండి మాయాజూమ్ ఫిలిమ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి, యాడ్ ఫిలిమ్స్న, డాక్యుమెంటరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. సాహిత్యం అంటే ఆసక్తి,
-
Loya Nunchi Sikharaniki – లోయ నించి శిఖరానికి
0₹150.00విద్యార్ధులకి శిక్షణాతరగతులు ప్రారంభిస్తూ ”మీలో జీవితంలో పైకి వద్దామనుకునేవారు చేతులు ఎత్తండి” అని అడిగినప్పుడు అందరూ ఎత్తుతారు. కొందరు నిలబడి మరీ ఎత్తుతారు.
”ఏ వయసులో?” అన్న రెండో ప్రశ్నకి హాలులో నిశ్శబ్దం అలుముకుంటుంది. మూల నుంచి ఎవరో, ”ఇరవై అయిదేళ్ళకి” అంటారు.
”అప్పుడేమి జరుగుతుంది? ఉద్యోగం వస్తుందా? పెళ్ళవుతుందా? (నవ్వులు)
అసలు పైకి రావటం అంటే ఏమిటి? ఒక లక్షాధికారి ముప్పై ఏళ్ళకే ముసలివాడై పోయాడు. మరొకడు తల్లి దండ్రుల్ని అనాధాశ్రమంలో చేర్చాడు. వీరు జీవితంలో పైకి వచ్చినట్టా?”
పెద్దవాళ్ళు కూడా అంత తొందరగా సమాధానం చెప్పలేని ప్రశ్న.
శఠగోప రహస్యాన్ని విశదీకరిస్తూ, షడ్గుణ ఐశ్వర్యాల్ని వివరిస్తూ, వ్యక్తిత్వ వికాసమంటే ”స్వార్థాన్ని పెంచడం” అన్న కొందరి అభిప్రాయాల్ని పటాపంచలు చేస్తూ, రెండు కోట్ల రూపాయలపైగా అమ్మకాలు సాధించిన ”విజయానికి అయిదు మెట్లు” రచయిత అందిస్తున్న మరో మాస్టర్ పీస్ ‘లోయ నుంచి శిఖరానికి’.