• Mahodayam
  • Management

    Management

    0

    పరిచయం

    రెండువందల సంవత్సరాలకు పూర్వం, పారిశ్రామిక విప్లవం జరిగిన తొలి సంవత్సరాలలో, ప్రపంచంలో అత్యధికభాగం పేదరికంతో అలమటిస్తూ ఉండేది. ఇవాళ కూడా పలు ప్రపంచ దేశాలు పేదరికంలోనే మగుతున్నాయి. గత రెండువందల సంవత్సరాలలో ఆవిరియంత్రం, విద్యుత్తు కనుగొనడంతో ప్రారంభమైన సాంకేతిక విప్లవం ద్వారా ఇవాళ మనకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు అందుబాటులో ఉంటున్నాయి. హై టెక్నాలజీ – పాశ్చాత్య ప్రపంచంలోని పేదరికాన్ని చాలావరకు తగ్గించి, మానవ చరిత్రలోనే ఎవరూ ఎన్నడూ ఊహించలేనన్ని సంపదలను చాలా మందికి సృష్టించిందని చెప్పబడుతోంది.

    అయితే, నిజానికి అది టెక్నాలజీ వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. అది టెక్నలాజికల్ రెవల్యూషన్ సాంకేతిక విప్లవం కాదు; యాజమాన్య విప్లవం మేనేజీరియల్ రెవల్యూషన్. ప్రగతి గొప్పగా పెల్లుబికడానికి బాధ్యులు, కారణమైనవారు ఎంటర్ ప్రైజెస్లోనూ, సంస్థలలోనూ అన్ని స్థాయుల్లోని మేనేజర్లు. మేనేజిరియల్ డెవలప్మెంటును అనుసరించే టెక్నాలజీ ఎల్లప్పుడూ

    నడిచింది.

    కావడానికి

    ఈ పుస్తకంలో నేను, మరింత ఎక్కువ ప్రభావశీలుడైన ఎఫెక్టివ్ మేనేజర్ నికి మీరు ఉపయోగించదగ్గ ఇరవైఒక్క కీ ఐడియాస్ కీలక అంశాల ఈ వివరించబోతున్నాను. ఈ సబెక్ ఎందుకు ముఖ్యంగా సంవత్సరాల నా అధ్యయనంలో వందలాది పుస్తకాలు చదివాను; బిజినెస్ డిగ్రీ

    తరబడి నా అధ్యయనంలో………..

    150.00
    Add to cart
  • Manasuku MaroVepu

    Manasuku MaroVepu

    0

    నా కథల్తో పాటు…

    ‘గతంలో, అంటే అరవై ఏళ్ళ క్రితం జన జీవితంలో ఇంతటి విపరీత వేగం లేదు. స్థిరత్వం, స్తిమితం ఉండేవి. సమాజంలో ఒకళ్ళనొకళ్ళు పట్టించు కోటం ఎక్కువగా ఉండేది. విలువల్లో మార్పు రావటానికి చాలాకాలం పట్టేది. మెజారిటీ జన అభిప్రాయం అంటూ ఒకటి బలంగా ఉండేది. ఎవరైనా అనుభవంతో ఏదైనా చెపితే చాలామందికి నచ్చేది. ఎక్కువ మంచితనం, దానికన్నా తక్కువగానే చెడుతనం ఉండేవి. అన్ని వయసుల వాళ్ళలో సంతోషం కనిపించేది.. ముఖ్యంగా వృద్ధుల్లో,

    పిల్లల్లో, ఎవరేనా ఇంటికి వస్తే, ఆ కలిసి మెలిసి గడిపే జీవితం పండుగలా ఉండేది. ఇరుగు పొరుగు, బంధువులకన్నా దగ్గరగా ఉండేవారు. అధికారం, పద్ధతులు, నియమనిబంధనల కన్నా, ఆప్యాయతది పైచెయ్యిగా ఉండేది. వెరసి జీవితంలో జీవం ఉండేది.

    ఈనాడు అవన్నీ పలచబడిపోయాయి. ప్రస్తుతం మనం జీవిస్తున్నది. వేరే ప్రపంచం. ఎవరికీ దేనికీ ఖాళీ లేదు. ఓపిక లేదు. స్తిమితంగా తినరు. | సుఖంగా సంసారం కూడా చెయ్యరు. వాళ్ళది కాని వేరే బతుకే చాలామంది బతుకుతున్నారు. యవ్వనంలో ఉన్న ఆడ, మగ మధ్య అవసరమే తప్ప, ఆకర్షణ కరువవుతున్న దౌర్భాగ్యదశ.

    ఆ రోజుల్లో దుఖాన్ని వెతికి పట్టుకుని కథలు రాశాం. ఒకరి దుఖం పది మందికి తెలిస్తే, జీవితం మెరుగుపడుతుందన్న నమ్మకంతో రాశాం. ఇప్పుడు దుఖాన్ని కాదు, సుఖాన్ని, సంతోషాన్ని వెతికి పట్టుకోవాల్సి వస్తోంది. ఆమె………….

    275.00
    Add to cart
  • Margadarshakulu- Maharshulu
  • Matruthvam

    Matruthvam

    0

    డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి వైద్య సాహిత్య రంగాలలో సుప్రసిద్ధులు. గైనకాలజీ మరియు ఆబెట్రిక్స్ నిపుణులైన వీరు కాకినాడలో “విజయలక్ష్మి నర్సింగ్ హోమ్” ప్రారంభించి గత 38 సంవత్సరాలుగా వైద్య సేవలందిస్తున్నారు. వైద్య రంగంలోనే కాక, సాహిత్య రంగంలో కూడా ప్రసిద్ధి గాంచిన వీరి రచనలు – “మీరు ప్రేమించలేరు”, “మాకీ భర్త వద్దు”, “పేషంట్ చెప్పే కధలు”, “జ్వలిత” – కధానికా సంపుటాలు : ‘సజీవ స్వప్నాలు’, ‘చైతన్య దీపాలూ’, ‘ప్రత్యూష పవనం’, ‘వెలుతురు పువ్వులు’ – నవలలు : ‘మన దేహం కధ’, ‘కౌమార బాలికల ఆరోగ్యం’ – వైద్య పరిజ్ఞానానికి సంబంధించిన రచనలు : ‘వైద్యడు లేని చోట’, ‘మనకు డాక్టరు లేని చోట’, ‘రక్తం కధ’ – అనువాదాలు ఉన్నాయి.

    ‘డా. ఆలూరి విజయలక్ష్మి రచనలు’ అను అంశంపై నాగార్జున యూనివర్సిటీ తెలుగు విభాగం విద్యార్ధిని పరిశోధనా పత్రాన్ని సమర్పించి ఎమ్.ఫిల్. డిగ్రీ పొందారు.

    డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి అనేక సుప్రసిద్ధ సాహితీ సంస్థల నుండి, సామాజిక సంస్థలనుండి ఎన్నో సాహితీ పురస్కారాల్ని, సామాజిక సేవా పురస్కారాల్ని పొందారు.

    తెలుగు పాఠకులకు డాక్టర్ విజయలక్ష్మిగారు ఇచ్చిన మరో వినూత్న కానుక – ‘మాతృత్వం : ప్రసూతి సమస్యలు – సలహాలు’. ఈ పుస్తకం గతంలో అశేష పాఠకుల ఆదరణపొంది పలు ముద్రణలు పొందింది. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మరెన్నో మార్పులు, చేర్పులతో కూడిన పరిస్కృత ముద్రణ.

    – ఆలూరి విజయలక్ష్మి

    200.00
    Add to cart
  • Mee Medaduki Padunenta - మీ మెదడుకు పదునెంత

    Mee Medaduki Padunenta – మీ మెదడుకు పదునెంత

    0

    నేటి బాలసాహిత్య నిర్మాతలలో వాసాల నరసయ్యగారొకరు. వీరు కరీంనగర్‌ జిల్లా చౌలమద్దిలో 1942లో జన్మించారు. మెట్‌పల్లిలో చదివారు. స్కూలు మాస్టారుగా ఉద్యోగజీవితం ప్రారంభించి, పోస్టు మాస్టారుగా రిటైరయ్యారు. విద్యార్ధిగా ఉన్నప్పుడే 1955లో ”సాగంధికాహరణము” వీధి నాటకం రచించారు. 1958 – 1960 వరకు స్కూల్‌ మాగజైను ‘అభ్యుదయవాణి’కి సంపాదకత్వం నెరిపారు.
    పిల్లల మాసపత్రికల్లోనూ, దిన, వార పత్రికల్లోనూ బాలల కథలు, పొడుపు కథలు, గేయాలు, గ్రంథసమీక్షలు, చాలా వ్యాసాలతోపాటు అనేక గ్రంధాలు వెలువరించారు.

    40.00
    Add to cart
  • Nalugukalla Mandapam

    Nalugukalla Mandapam

    0

     నరేంద్ర కథావస్తువులు, ఇతివృత్త నిర్వహణ పైపైకి సరళంగా కనిపిస్తాయి. కానీ లోలోపలి పొరల్లోకి తొంగి చుస్తే అవి సంక్లిష్టమైనవి. చాల సంబద్దమైనవి. కొన్ని అసంబద్దమైనవి. సమకాలీన భారతదేశభాష సామజిక సంస్కృతులు, చరిత్ర అంత సంకీర్ణమైనవి.

                                                                                                        -కేతు విశ్వనాథరెడ్డి.

    290.00
    Add to cart
  • Nela Jaarina Mugdatvam

    Nela Jaarina Mugdatvam

    0

    నేల జారిన ముగ్ధత్వం

    “శనివారం ఉదయం పది గంటలకి మా స్కూలు ఆడిటోరియంలో ఓ చినసభ ని ఏర్పాటు చేసాము. దానికి మీరుభయులూ రావలసిందిగా కోరుతున్నాం” అని స్కూలు ప్రిన్సిపాల్ ఫోన్ చేసారు. ఓ విధంగా అర్థించారు. రిక్వెస్ట్ చేసారు.

    ఆ మాటలు విన్నాక విద్యా సాగర్ ఏం మాట్లాడ లేదు. జవాబివ్వడానికేం లేదు. స్కూలుకి ఎందుకు రమ్మంటున్నారో తెలుసు.

    వెళ్తే ఏం మాట్లాడాలి,? అసలు మాట్లాడేందుకేం ఉంది ? ఏమీ లేదనిపించింది. అందుకే నిశ్శబ్దంగా భార్య విజయని చూసాడు. మౌనం ఓ సుదీర్ఘమైన భాష . భాషతో పనిలేని కమ్యూనికేషన్. వారి మధ్య అగాధాల నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఎన్నింటినో మింగేసింది.

    అందుకే ఆమె ఫోన్ ఎవరిది, ఎక్కడ నుంచీ అని ఏం అడగలేదు. అయినా విద్యా సాగర్ ఆమెకి చెప్పాడు.. ఇప్పుడు స్కూలు ప్రిన్సిపాల్ మాటలకి , ఇప్పుడిప్పుడే ఆరుతున్న కళ్ళు మరోసారి ఊట బావులయ్యాయి. వారి గుండెల్లో పేరుకు పోయిన దుఃఖం కళ్ళల్లోకి వచ్చేసింది. ఎన్నో జ్ఞాపకాలు అప్పుడే పైపొర తొలిగిన పచ్చి పుండ్లలా సలిపేస్తున్నాయి. అవి అన్ని రాత్రింబవళ్ళు అక్కర్లేని అతిథుల్లాగా

    ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు వెళ్తున్నాయో వాళ్ళకి తెలీడం లేదు. ఆ జ్ఞాపకాల లోంచి ‘అమ్మా నాకు బతకాలని ఉంది, ఇప్పుడే చావాలని లేదు’ అంటూ బాధ పడుతూ, ఏడుస్తున్న శ్వేత కనిపిస్తోంది. ఆమె గొంతు వినిపిస్తోంది………..

    150.00
    Add to cart
  • Nityajivithamlo 33 Rakala Manava Samsyalaku Remedies Tantralu
  • Nurella Telugu Kadhalu
  • Ontari Shikharaalu

    Ontari Shikharaalu

    0
    200.00
    Add to cart
  • Ontari Sikharalu

    Ontari Sikharalu

    0

    తుంటరి లోయలు

    ఆకాశాన్ని అందుకున్నట్టుగా కనిపించే పర్వత శిఖరాలెంత గంభీరమైనవో, వాటినానుకుని కిందికి సాగే లోయలంత తుంటరివి..

    యేరెండు శిఖరాలూ వొకలా సాధించవు. యేరెండు లోయలూ వొకలా వేదించవు. జాగ్రత్తగా గమనిస్తే యే యిద్దరు మనుషులు వొకలా వుండరని తెలుసుకో గలుగుతాం.

    యెవరి ఆంతర్యం వాళ్ళదే అయిన యీ లోకంలో, ప్రతి మనిషీ వొంటరి శిఖరంలాగే బతక్క తప్పదు. అనివార్యంగా శిఖరాల నంటిపెట్టుకునే లోయలా జారిపోకా తప్పదు.

    శిఖరాలు, లోయల బలాలు, బలహీనతలు కలగలసిన మానవ అస్తిత్వ ప్రవృత్తులు యెప్పటికప్పుడు కలిగించే విభ్రమాల్నీ, విస్మయాల్నీ చిత్రించే కథల సంపుటం యిది.

    1977లో ‘గుర్రమూ కళ్ళెమూ’ అనే కథ రాసినప్పుడు నేనిలాంటి కథలు మరికొన్ని రాస్తాననీ, వాటినిలా వొక సంపుటంగా తీసుకురాగలననీ అనుకోలేదు. మొదటి నుంచీ సాహిత్యం నాకు ప్రపంచాన్ని అవగాహన చేసుకునే వేదికగానూ, సత్యాన్వేషణకొక వాహికగానూ, వ్యక్తిగత శోధనకొక మాధ్యమంగానూ కూడా తోడ్పడుతూ వస్తోంది.

    వీటికి తాత్విక కథలనే పెద్ద పేరు పెట్టలేను గానీ యివన్నీ జీవితాన్ని మనస్సునూ ప్రశ్నించే కథలని మాత్రం చెప్పగలను – భౌతిక పార భౌతిక ప్రపంచాల మధ్య ఊగిసలాడే మానవుడి వెంపర్లాటలను అర్థం చేసుకోడానికి ప్రయత్నించే కథలివి. ప్రతిక్షణమూ | పరిణామాలకు గురవుతూ, అనుక్షణమూ సంక్లిష్టంగా మారిపోయే ప్రపంచంలో…………..

    200.00
    Add to cart