• Manchi Mutyalu - మంచి ముత్యాలు

    Manchi Mutyalu – మంచి ముత్యాలు

    తెలుగు సాహిత్యపు గత వైభవాన్ని పరిశీలిస్తే మనకందులో ఎందరో మణిదీపాలవలె వెలిగినవారు కనిపిస్తారు. గురజాడ అప్పారావు, శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ మొదలైన లబ్ధ ప్రతిష్ఠులే కాక కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్‌, బుచ్చిబాబు లాంటి సమర్థులైన మనోవిశ్లేషకులను కూడా తెలుగుతల్లి మనకందించింది. సామాజిక దురన్యాయాలపై తిరుగుబాటు బావుటాలెత్తిన రాచకొండ, చలం మొదలైన వారు ఎటూవున్నారు. ఇక నాటకరంగాన్ని పరిశీలిస్తే మాలపల్లి, కన్యాశుల్కం నుంచి మరో మొహంజొదారో, రాగ రాగిణి, రాతి మనిషి లాంటి గొప్ప నాటకాలందించిన రచయితలూ మనకు వున్నారు. వీరు గాక, చాసో, కాళీపట్నం, పెద్దిభొట్ల వంటి అత్యుత్తమ కథకులూ బాలగంగాధర తిలక్‌, జంధ్యాల పాపయ్య శాస్త్రి, బసవరాజు అప్పారావు లాంటి భావుకులయిన కవులూ తెలుగు సాహితీ పీఠానికి ముత్యాలు అద్దేరు.

    వేర్వేరు రంగాలలో అత్యున్నత స్థాయి సంపాదించిన మహా రచయితల సరసన యండమూరి వీరేంద్రనాథ్‌ని నిలబెట్టే సాహసం మేము చేయము గాని, ఆయనకి కథ, నవల, నాటకం, కవిత్వం, సినిమా కథా, మాటల రచన ఈ రంగాల్లో ప్రవేశమూ, తగు మాత్రపు ఖ్యాతీ ఉన్న సంగతీ మరువలేము.

    శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ గత 35 సంవత్సరాల సాహితీ జీవనంలో జీవితం పట్ల, సమాజం సట్ల, మనిషి ప్రవర్తన పట్ల తన రచనల్లో వెలువరించిన భావాలనూ, పరాకాష్ఠగా భావించదగిన ఆణిముత్యాల్నీ ఏరికూర్చి మనకందిస్తున్నారు ప్రచురణకర్తలు. విభిన్నమైన రీతుల్లో, ఇన్ని ప్రక్రియల్లో చేపట్టిన ఒకే రచయిత రచనలోని విలువైన మాటలన్నీ ఒక పుస్తక రూపంలో రావటం తెలుగు సాహిత్య చరిత్రలో ఇదే మొదలు.

    70.00
    Add to cart
  • Manchupula Varsham - మంచుపూల వర్షం

    Manchupula Varsham – మంచుపూల వర్షం

    వ్యక్తుల్ని ప్రేమించేకొద్దీ, వారి నుంచి దూరమైతే విరహం, వారికి కోపం వస్తే బాధ. వారు వేరే వారిపట్ల కాస్త ఎక్కువ శ్రద్ద చూపితే ఈర్ష్య! అదే ప్రాణంలేని సంగీతం, పెయింటింగ్‌, రచన, పఠనం మొదలైన వాటి పట్ల అభిరుచి పెంచుకుంటే మనకి మనమే వాటితో రమించవచ్చు. అవి అలగవు, కోరికలు తీర్చమని బలవంతపెట్టవు. మరికొంత సమయం తమకోసం కేటాయించమని అడగవు. అందుకే ప్రకృతితో స్నేహం ఎల్లప్పుడూ నిరపాయకరం.

    సామాన్యుడు ఎవరేం చెప్పినా నమ్ముతాడు. ఎలా ? ఎందుకు? అని ఆలోచించడు. హేతువు వున్నదాలేదా ? ఇదెలా జరుగుతుంది ? అని తెలివైనవాడు తర్కిస్తాడు. తనకి తెలియని హేతువు కూడా వుండొచ్చుకదా, కారణం వున్నదే కరెక్టనుకోవటం దేనికి ? అని మేధావి ఆలోచిస్తాడు. హేతువు కన్నా, తనకిగానీ, ప్రపంచానికి గాని ఆ పనివల్ల వచ్చే ‘ఉపయోగం’ గురించి జ్ఞాని ఎక్కువ పరిశీలిస్తాడు.

    మనిషి ఎలా సంతృప్తిగా బ్రతకాలో చెప్పేదారిలో, ఒక మైలురాయి లాంటి వాడు భగవంతుడు. కర్తవ్య నిర్వహణ మానేసి కేవలం అతణ్ణి పూజించేవాడు, ప్రయాణం మానేసి ‘మైలురాయి’ని పూజిస్తున్నవాడి కింద లెక్క.

    ఈ ప్రపంచంలో మోసగాళ్ళందరూ ఎప్పుడూ రకరకాల అబద్ధాలు ఆడుతూ వుంటారనీ, అందమైన కట్టుకథలు విపరీతంగా చెప్పేస్తూ వుంటారనీ, మామూలు మనుషుల కన్నా వాళ్ళు చాలా డిఫరెంట్‌గా వుంటారని మనమనుకుంటే అది చాలా తప్పు. వాళ్లూ మనలాగే ఉంటారు. వారి సిన్సియారిటీని హానెస్టీగా ఎప్పుడూ భావించకూడదు. సిన్సియారిటీ అంటే శ్రద్ధ. హానెస్టీ అంటే నిజాయితీ. అతడు చాలా సిన్సియర్‌ అనటానికీ, అతడు చాలా హానెస్ట్‌ అనడానికీ చాలా తేడా ఉంది. నమ్మకద్రోహులే ఒక్కోసారి చాలా శ్రద్దగా వుంటారు.

    మనో వైజ్ఞానిక సాహిత్యంలో అపూర్వ సంచలనాలను సృష్టిస్తున్న  వ్యక్తిత్వ పుస్తకాలు – తప్పుచేద్దాంరండి, విజయానికి ఆరోమెట్టు, మైండ్‌ పవర్‌ నెంబర్‌ 1 అవటం ఎలా, విజయంలో భాగస్వామ్యం, విజయానికి అయిదుమెట్లు-గెలుపుకోసం ప్రతి వ్యక్తి ఆచరించవలసిన సూత్రాల్ని పై పుస్తకాల్నుంచి క్లుప్తీకరించి పాఠకుల సౌలభ్యం కోసం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ అందిస్తున్న విజయ రహస్యాల సంకలనం ‘మంచుపూల వర్షం’.

    50.00
    Add to cart
  • Milinda

    Milinda

    ప్రతి మనిషికీ బతికే హక్కున్నట్టే ప్రేమించే హక్కు కూడా ఉంటుంది. అది స్త్రీ పురుషులకన్నా కాస్త భిన్నంగా ఉన్నవారికి దక్కడం లేదు. వారిని అర్ధం చేసుకోకపోగా చిత్రమైన కారణాలతో వారిని మానసిక శారీరక హింసలకు గురి చేస్తున్నారు. వారి గోడును వినిపించుకోవడానికి వారి దగ్గర భాష కూడా లేని వైనాన్ని మనం గమనించాలి. నా కథల ద్వారా స్వలింగులకు, ట్రాన్స్ జెండర్స్ కీ సంఘీభావం తెలుపుతాను.

    మారే కాలాన్ని బట్టి నేను స్త్రీ వాదిని మాత్రమేనా బలమైన మానవవాదినా అని ఆలోచించుకునే అవసరం కనబడుతోంది. స్త్రీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నాయంటే మగవారి ఆలోచనా విధానం మారుతోందనే చెప్పాలి. పిల్లల్ని చూపులతోనే బెదిరించే తండ్రులు ఈ తరంలో అరుదే. వంటగదిలో ప్రధాన పాత్ర కాకపోయినా సహాయ పాత్ర పోషిస్తున్నారు నేటి పురుషులు. ఒక పక్క స్త్రీల మీద దాడులు పెరుగుతున్నా స్త్రీలని గౌరవించి సమానత్వంతో చూసే పురుషులు, యువకులు కూడా ఎక్కువే ఉన్నారు. కుటుంబ పోషణ వల్ల తీవ్రమైన మానసిక వత్తిడికి లోనై, కుటుంబం చేత నిర్లక్ష్యానికి గురయ్యే మగవారూ లేకపోలేదు. అటువంటి ఉదంతాలకి నా కథలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ప్రతీ స్త్రీ దేవతా కాదు ప్రతీ పురుషుడూ రాక్షసుడు కాదు కాబట్టి పురుషులకి నా కథల్లో గౌరవ ప్రదమైన స్థానం ఉంటుంది.

    200.00
    Add to cart
  • MUGDHA

    MUGDHA

    140.00
    Add to cart
  • Nalugukalla Mandapam
  • Neelaveni - నీలవేణి

    Neelaveni – నీలవేణి

    అవును ఇది కథన కుతూహలమే. పి.వి.సునీల్‌ కుమార్‌ కథల్లో తొంగి చూసేది, పొంగి పొరలేదీ సామాజిక అన్యాయంపై కదన కుతూహలం.

    ప్రేమరాహిత్యం నుండి సామాజిక న్యాయం వరకూ, పోలీసు నుండి పొలిటీషియన్‌ వరకూ ఏ అంశం ఆయన  కలం స్పృశించినా పాఠకుడికి వ్యంగ్యపు పంట పండినట్టే.

    అంతర్జాతీయ సాహిత్యంలోనే అరుదూ, తెలుగు సాహిత్యంలో అయితే అసలు ఊసేలేకుండా పోయిన సెటైర్‌ (వ్యంగ్యం) సునీల్‌ కుమార్‌ కలం నుండి తీయటి గోదావరి ధారలాగా పరవళ్ళు తొక్కుతోంది ఈ కథా సంపుటిలో.

    ”దెయ్యాలు’ ప్రేమను పంచినా, ‘డిసిప్లి’లు సామాన్యుడి కోసం మొరిగినా అన్నీ సునీల్‌ కుమార్‌ మార్కు పంచ్‌ లోనే.

    ‘థూ’ అన్నా, ‘చీకటి’ కన్నా, ‘పరిశుద్ధంగా’ వివాహాన్ని ‘దేవదాసు’ జరిపించినా ధిక్కార స్వరమే కానీ, మరీముఖ్యంగా వినోదాలు జల్లు.

    ఈ కథల్లో జీవం ఉంది, జీవితం ఉంది…. రంగుల హరివిల్లులా నవ్వులు పూయించగల హాస్య-వ్యంగ్య వైభవం ఉంది.

    అక్షరాల ఇది అనితరసాధ్యం… అందుకోండి అక్షర తూణీర వ్యంగ్య నీరాజనం.

    100.00
    Add to cart
  • Nene Naa Ayudham - నేనే నా ఆయుధం

    Nene Naa Ayudham – నేనే నా ఆయుధం

    ఓటమి పట్ల నిరాశ చెందకూడదనీ, కష్టాల్ని ధైర్యంతో ఎదుర్కొంటేనే విజయం సాధ్యమని నమ్మి,

    వేలాదిమందికి మార్గదర్శిగా నిలిచిన “మేధ” సంస్థల అధినేత డా.చిరంజీవి జీవితం,

    మెగా రైటర్ యండమూరి కలం నుండి…..


    ”ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ బ్రేక్‌ఫాస్ట్‌ టేబుల్‌ ముందు కూర్చున్నప్పుడు…

    కాకినాడలో పోస్టర్లు అతికించడానికి వాడగా మిగిలిపోయిన మైదా పిండితో

    చపాతీలు కాల్చుకుని తిన్న రోజులు గుర్తొచ్చి కళ్ళనీళ్ళొచ్చాయి.”

    వ్యాపారంలో పోటీ… ఎత్తులు-పైఎత్తులు…

    విస్తరించటానికి చేసే ప్రయత్నాలు… ఎక్కే శిఖరాలు, పడే లోయలూ….

    ఆర్టీసీ బల్లల మీద నిద్ర… సులభ్‌ కాంప్లెక్స్‌లో స్నానం…!

    పదో క్లాసు ఫెయిలు నుంచి.. డాక్టరేట్‌ వరకూ…!

    అట్టడుగు స్థాయి నుంచి లక్షల సంపాదన వరకూ ఎదిగిన

    ఒక నిరుద్యోగి జీవిత చరిత్ర!

    ప్రతీ నిరుద్యోగీ, వ్యాపారవేత్తా,

    జీవితంలో పైకి రావాలనే తపన ఉన్న ప్రతి వ్యక్తీ చదవ వలసిన పుస్తకం ”నేనే నా ఆయుధం”.

    150.00
    Add to cart
  • Pillala Perla Prapancham - పిల్లల పేర్ల ప్రపంచం

    Pillala Perla Prapancham – పిల్లల పేర్ల ప్రపంచం

    5000 పేర్లు వున్న ఏకైక పుస్తకం – యండమూరి వీరేంద్రనాథ్‌
    అందమైన పేరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
    ‘స్నేహ’ – మంచి పేరు. ‘సంధ్య’ చాలా మందికి వుండే అందమైన పేరు. కానీ – ‘స్నేహ సంధ్య’ మరింత అందమైన కాంబినేషన్‌. వినగానే ‘బావుంది’ అనిపించేటంత ముచ్చటైన పేరు. నీహారిక, వేదసంహిత లాంటి ఎన్నో అందమైన పేర్లను పాఠకలోకానికి పరిచయం చేసిన యండమూరి వీరేంద్రనాథ్‌ కలంలోంచి జాలువారిన ముత్యాల జల్లు ఈ పుస్తకం. గతంలో వచ్చిన పిల్లల పేర్ల పుస్తకాలకి భిన్నంగా – మరో 500 పేర్లు అధికంగా – నవ్యత కోరుకునే పాఠకులకి బహుమతిగా – యండమూరి అందించే ముచ్చటయిన పేర్ల పుస్తకం ”పిల్లల పేర్ల ప్రపంచం” చదవండి. ఎంపిక చేసుకోండి. తెలుగులో ఇన్ని (5000) పేర్లతో వెలువడుతున్న తొలి పుస్తకం ఇది. అంతేకాదు జన్మనక్షత్రాలకు అనుగుణంగా వీలైనన్ని పేర్లు పొందుపరుచబడ్డ పుస్తకం కూడా. చివరన పిల్లలు ఉండవలసిన సగటు బరువును సూచించే పట్టిక కూడా ఇందులో వుంది.

    100.00
    Add to cart
  • Prachena Gadhalahari
  • Prema Oka Kala - ప్రేమ ఒక కళ

    Prema Oka Kala – ప్రేమ ఒక కళ

    ఈ పుస్తకం ‘స్నేహం-ఆప్యాయత-ప్రేమ-మోహం-దాంపత్యం-రొమాన్స్‌-అనుబంధం’ అని ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధం పెరిగేది ఈ పరిణామక్రమంలోనే కాబట్టి, పుస్తకం కూడా ఈ ఎవల్యూషన్లో ఉంటేనే బాగుంటుందని భావించటం జరిగింది.

    అమ్మ నుంచి ప్రేమతో తొలిముద్దు, నాన్నతో పొరపాటుల దిద్దుబాటు, స్నేహితుల్లోని నచ్చిన గుణాల్ని ప్రేమించటం, వారి మైనస్‌-పాయింట్స్‌ మనస్ఫూర్తిగా ఒప్పుకోవటం… ఆ విధంగా మనిషి తన ప్రేమ పరిధిని పెంచుకుంటాడు. (అయితే కొన్నిసార్లు నమ్మిన సిద్ధాంతం కోసం విభేధించటానికి వెనుకాడడు కూడా. కానీ విభేధం వేరు, శత్రుత్వం వేరు).

    ఈ పుస్తకంలో….

    స్నేహం : స్నేహంలోంచి ప్రేమలోకి…స్నేహితుల్లో రకాలు…అకస్మాత్తుగా గుడ్‌బై చెప్పే స్నేహితులు…ఖరీదైన స్నేహాలు…మంచి స్నేహితుడి పది లక్షణాలు… స్నేహం స్వార్థమా?… ఎటువంటి స్నేహితుల్ని వదిలిపెట్టాలి?

    ప్రేమ : తూపు తొలి చూపు… తొలి స్పర్శ… పప్పీ లవ్‌… పెళ్ళికి ముందు ప్రేమ… ప్రేమ వివాహాలు… పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు… ప్రేమలో ఎమోషన్స్‌… ప్రేమ – ఈర్ష్య.

    దాంపత్యం : ఈ నాటి ఈ బంధం ఈ నాటిదే… లివ్‌-ఇన్‌-రిలేషన్‌… సెకండ్‌ సెటప్‌… సర్దుబాటు.

    శృంగారం : వద్దనకు ఈ ముద్దు … రొమాన్స్‌… వాత్సాయన… విరహ వర్ణన… శృంగారానికి ఆరు మెట్లు

    అనుబంధం : మూడు రకాల అనుబంధాలు ఉన్నాయి.

    150.00
    Add to cart
  • Quilt

    Quilt

    ముందుమాట వంటివి రాయడం నాకిష్టం ఉండదు, జంకు వల్ల. జంకు, ముందుమాటలు రాయడం చాతకానందువల్ల. కథలు, కవిత్వం కంటే ఈ తొలిపలుకులు రాయడం కష్టం అని నేననుకుంటాను. ఈ విద్య సులభంగా పట్టుబడేది కాదు. సమకాలీనుల్లో అతికొద్దిమందికి మాత్రమే శక్తిమంతమైన తొలిపలుకు జన్యువులున్నాయి. వాటివల్ల రసవత్తరమైన తొలిపలుకులు వెలువడుతాయి. మరి నేనెందుకీ సాహసానికి పూనుకున్నాను? నాకిష్టమైన రచయిత ఒకతను. వ్యక్తిగా, రచయితగా కూడా. తన నవలకి పరిచయం రాయమని అడగ్గానే రాశాను. అది అచ్చయిం తర్వాత నేను అనుకున్నట్టుగా రాయలేదని స్పష్టం అయింది. ఆ బాధ నన్నిప్పటికీ వదల్లేదు. సరే, గొర్తి సాయిగారిది అమలాపురం. ఇతని నాన్నగారు సూర్యనారాయణగారు నాకు పూర్వాశ్రమంలో మిత్రుడు, నేను అమలాపురం కాలేజీలో పనిచేస్తున్నప్పుడు. అందుచేత సాయిగారు అడగ్గానే (ఇంచుమించు) ఒప్పుకున్నాను. కానీ, ఇంకే రచయితనైనా, కొంచెం బాగా అర్థమయ్యే కథలు రాసేవాణ్ని అడిగి ఉండ వలసిందని అనుకుంటున్నాను.

    300.00
    Add to cart
  • Placeholder

    screenplaydirection

    Read more