• Dindukinda Nallatachu - దిండుకింద నల్లతాచు

    Dindukinda Nallatachu – దిండుకింద నల్లతాచు

    0

    ”నవ్య నవలల పోటీలో రూ. 50,000 ల ప్రథమ బహుమతి పొందిన నవల”

    ”చూడూ కళ్యాణీ! నాకు పెళ్ళయిన ఆడాళ్లంటే చాలా ఇష్టం. అందులోనూ మొహానికి పసుపు రాసుకుని, ప్రొద్దున్నే తులసి కోటకి పూజ చేసేవాళ్ళంటే మరీ ఇష్టం. ఒక్కసారి వప్పుకో. మళ్ళీ నీ జోలికి రాను” అంటూ దగ్గరగా జరిగాడు. సరీగ్గా ఆ సమయానికి బయట నుంచి కాలింగ్‌ బెల్‌ శబ్దం వినిపించింది. కల్యాణి చిగురుటాకులా వణికిపోయింది.

    ”దేశమంతా ఒకే మతం ఉంటే గొడవలు ఉండవా? మరి లెబనాన్‌ దేశంలో హజ్‌బుల్లా షియాలు సున్నీలు ఎందుకు ఊచకోత కోస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్‌లో ఆల్‌ఖైదా సున్నీలు షియాల్ని ఎందుకు చంపుతున్నారు? మన పక్క దేశం పాకిస్థాన్లో షియాలకీ, సున్నీలకీ మధ్య ఎందుకంత రక్తపాతం?” అని ఆగి, ”మనిషి సుఖంగా బ్రతకటానికి కావల్సింది మతం కాదురా. మానవత్వం” అన్నాడు.

    ”మానవత్వం అన్నం పెట్టదు”

    ”అమెరికాలో అన్నంట ఉంటుంది. తినటానికి టైమ్‌ ఉండదు. సొమాలియాలో టైమ్‌ ఉంది. తినటానికి అన్నం ఉండదు. ఆఫ్ఘన్‌లో మతం ఉంది. అక్కడ శాంతి లేదు. అన్నీ ఉన్న భారతదేశాన్ని ఎందుకురా ఇలా పాడు చేస్తున్నారు?”…

    పేజీలు : 192

    120.00
    Add to cart
  • Emotional Pregnancy

    Emotional Pregnancy

    0

     

    అనగనగా ఒక చెట్టు. ఆ చెట్టు కింద ఒక అబ్బాయికి కూర్చుని ఉండడం అలవాటు. అటుగా వెళ్తూ, చెట్టుకింద కూర్చున్న అబ్బాయిని చూసి నవ్వుతూ దగ్గరకొచ్చి కూర్చుంటుంది ఒక అమ్మాయి. నవ్వూ నవ్వూ, మాటా మాటా, చేయీ చేయీ కలిశాక ఆడుకుందాం రమ్మని అడుగుతుంది. ఆ అబ్బాయి కదలడు. సరేలే అని అనుకుని వెళ్ళిపోతుంది.

    మళ్ళీ మరుసటి రోజున వస్తుంది. నవ్వుతుంది. పలకరిస్తుంది. ఆడుకుందామని అడుగుతుంది. నవ్వుతాడు, పలకరిస్తాడు, కానీ కదలడు.

    మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. నవ్వుతుంటుంది. పలకరిస్తుంటుంది.

    ఆడుకుందామని అడుగుతూ ఉంటుంది. వాడు కదలడు.

    మళ్ళీ వస్తుంది. నవ్వకుండానే, పలకరించకుండానే ఆడుకుందామని

    అడుగుతుంది.

    వాడు కదలకపోయేసరికి దానికి కోపం వస్తుంది. ఒక మాట అంటుంది విసురుగా. ఆడకపోతే మళ్ళీ రానని బెదిరిస్తుంది. అయినా వాడు కదలడు. దానికి ఓపిక నశించి ఇంకో రెండు మాటలనేసి వెళ్ళిపోతుంది.

    అయినా మళ్ళీ తిరిగొస్తుంది. ఈ సారి ఏడుస్తుంది. ఒక్కసారైనా కదలవూ

    అని బతిమాలుతుంది.

     

    290.00
    Add to cart
  • Emotional Pregnancy
  • GAALI PORALU

    GAALI PORALU

    0
    250.00
    Add to cart
  • Placeholder

    gandla-mitta

    0
    Read more
  • Kailasa Manasarovar

    Kailasa Manasarovar

    0
    175.00
    Add to cart
  • Kothi Kommachi

    Kothi Kommachi

    0

    సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ అన్నారు పండిత కవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు.

    మేము ఒప్పుకోలేదు. మేం తీశాం. “స్నేహం” అనే సినిమా తీశాం. మాకు ముందు హిందీలో “దోస్తీ” అనే సినిమా తీశారు తారాచంద్

    బ్యా

    పంచదార కన్నపరదార లేపి….

    “తీయని అంటే సినిమా తీయకపోవడం కాదండి – తీయనిది అంటే తీపిగా ఉండేది. ‘స్నేహం మధురమైనది అని కదా” అన్నారు స్వాతి బలరామ్

    “ఓహో అదా- అయితే అలాటి తీపివి చాలానే ఉన్నాయి. వేసవి వెళ్ళగానే వచ్చే తొలకరి వానజల్లుకి మట్టి గుబాళించే వాసనల జల్లు తీయన… అమ్మానాన్నల ముద్దులు తీయన ఆలుమగల తొలిముద్దు అంతకంటే… మసక సంజెలో తొలి గిలి తగిలీ తగలని చేతులూ కలిసి కలియని చూపులూ- కృష్ణశాస్త్రిగారన్నట్లు పంచదారకన్న పరదార తీపిరా అని…

    750.00
    Add to cart
  • Kothi Kommachi
  • Kwilt

    Kwilt

    0
    300.00
    Add to cart
  • Madhurantakam Rajaram Samagra Katha Sankalanam 5 Parts Of Set

    Madhurantakam Rajaram Samagra Katha Sankalanam 5 Parts Of Set

    0

    సర్కసు డేరా

    ఏ పుట్టలో పాములుంటాయో, ఏ పుట్టలో ఈసిళ్ళుంటాయో యిర్లవాడికి తెలిసినట్టు మరొకరికి తెలియదు. భుజాన మోపెడు ఈతపుల్లలతోనూ, చేత నీళ్ళదుత్తతోనూ వాడొకడు మీకు పల్లెపట్టుల్లో ఎదురైతే, అతగా డక్క డెక్కడో పుట్టమూసి ఈసిళ్ళు పట్టబోతున్నాడన్న మాట! కీటక సంహారకాండలో నాందీ వాచకంగా అతడు పుట్టలో ముఖ్యరంధ్రాన్ని మాత్రం మినహాయించి, మిగిలిన వాటిని మూసేస్తాడు. ఆ తరువాత చిక్కగా నీళ్ళు చిలకరిస్తాడు. రంధ్రానికి చేరువగా ఒక దిగుడు అమర్చి అందులో దివ్వె వెలిగిస్తాడు. ఎండుమట్టి పైన చల్లటి నీళ్ళు పడ్డంతో నీటి ఆవిరి పైకెగిరి, పుట్టలోపలి కీటకాలకు వాన కురుస్తున్నట్టో లేక కురిసి వెలిసినట్టో భ్రమ కలుగుతుంది. బారులు బారులుగా అవి పైకొస్తాయి. వచ్చీరాగానే మృత్యుదేవత క్రూర దంష్ట్రలాంటి దీపశిఖ వాటిని ఆహ్వానిస్తుంది. అవి మొదట రెక్కలు రాల్చుకుంటాయి. తరువాత యిర్లవాడికి మరునాటి ఎరగా మారిపోతూ కుప్పగా కూలిపోతాయి.

    పూర్తిగా కాకపోయినా, కొంతవరకూ ఈ ‘పుట్టమూత’తో పోలికలున్న సంఘటన ఒకటి పట్టణంలో జరిగింది.

    గంటల కల్లా భోజనాలు ముగించి, జంబుచాపలు పరచుకోవడం తరువాయిగా దీపాలు ఆర్పేసి, వెచ్చగా వక్కాకు నములుతూ అరుగులపైన కూర్చున్న పల్లెటూళ్ళవాళ్ళకు ఆకాశంలో ఓ కాంతిపుంజం కనిపించింది. అది అచ్చంగా కాంతిపుంజం కూడా కాదు. భువినుండి దివికి ఏటవాలుగా ప్రసరిస్తున్న వెలుగుబాట. ‘ఎన్నడూ లేంది, ఏనాడూ వినంది, ఏమిటీ విడ్డూరం’ అని ఒక వైపున జానపదులు వెరగుపడిపోతున్నారు, మరొకవైపున ఆ వెలుగు వినువీధిలో నాలుగైదుసార్లు వలయాలు తిరిగి, అంతటితో తన పని తీరిపోయినట్టు అంతర్ధానమైపోయింది.

    మెరుపూ, ఉరుమూ ఒకేసారి ఉద్భవించినప్పటికీ శబ్దవేగం కన్నా కాంతివేగం ఎక్కువ గనుక మెరుపు ముందుగా కనిపిస్తుందని చెబుతుంది విజ్ఞాన శాస్త్రం. ఇక్కడగూడా సరిగ్గా అలాగే జరిగింది. రాత్రి ఎనిమిది గంటలు, ఆ ప్రాంతంలో వెలుగు కనిపించింది……………

    3,000.00
    Read more
  • madhuranthakamRajaram samgra sankalanam
  • Mana Navalalu Mana Kathanikalu - మన నవలలు మన కథానికలు

    Mana Navalalu Mana Kathanikalu – మన నవలలు మన కథానికలు

    0

    సాహిత్య విమర్శా రంగంలో నా కృషి అటు ప్రాచీన సాహిత్యం మీదా, ఇటు ఆధునిక కవిత్వం, కథానిక, తెలుగు సాహిత్య విమర్శల మీద జరిగింది. నవల మీద నా కృషి చాలా పరిమితమని ఈ గ్రంథమే రుజువు చేస్తున్నది. తెలుగు నవలల మీద నేను రాసిన ఈ పదమూడు వ్యాసాలే నేనింకా చెయ్యవలసిన కృషిని గురించి హెచ్చరిస్తున్నాయి. వీటిలో కొన్నింటిని అఫ్సర్‌ రాయించగా, తక్కినవి ఇతర సందర్భాల కోసం రాసినవి. ‘జగడం’ నవలకు ముందు మాట రాయమని బోయ జంగయ్య గారు నన్ను కోరడం నాకు పరమానందమైంది. ఏ ప్రక్రియ మీద విమర్శ రాసినా వస్తు చర్చ మనక బాగా ఇష్టమైంది, అలవాటైంది. నందిని సిధారెడ్డి ‘ప్రజల మనిషి’ నవలా శిల్పం మీద వ్యాసం రాయమని కోరినప్పుడు ఆనందంగా ప్రయత్నించాను. నవలా శిల్ప శాస్త్రాన్ని ముందు బెట్టుకొని కాక, నవలలో శిల్ప విశేషాలుగా నాకు కనిపించిన వాటిని చెప్పడానికి ప్రయత్నించాను.

    ‘కథాంశం’ తర్వాత 2006-2008 మధ్య మూడేళ్ళలో కథానికల మీద నేను రాసిన వ్యాసాలు పది. వీటిలో కొన్ని ముందు మాటలు. అయినా విమర్శనాత్మకంగా రాయడానికే ప్రయత్నించాను. – రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

    ఓ పుష్కర కాలంలో వచ్చిన తెలుగు నవలలు, కథానికల మీద విమర్శనా గ్రంథం ‘మన నవలలు మన కథానికలు’.  సంఘ సంస్కరణ, జాతీయ, అభ్యుదయ, విప్లవ, దళిత, బహుజన, స్త్రీ, ప్రాంతీయ అస్తిత్వవాదాలను, ఉద్యమాలను ప్రతిబింబించిన నవలలు, కథలపై సమకాలీన వాస్తవికతతో చేసిన సద్విమర్శ ఇది. రాగద్వేషాలకు అతీతంగా వస్తు వివేచనతో సాగే విమర్శనా పద్ధతికి నిలువుటద్దం ఈ పుస్తకం.

    ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా..సాహిత్య, సామాజిక చైతన్యానికి నిరంతరం కృషి చేస్తున్న ఈ కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత కలం నుండి వెలువడిన ‘మన నవలలు – మన కథానికలు’ అత్యంత అసాధారణ పుస్తకం.

    90.00
    Add to cart