-
Sparsha
0₹180.00అందరికీ తలలో నాలుకలా ఉండే ఆ మహిళ ఎందువల్ల మరణించిందో, కన్నతల్లి మీద అభాండం వేసిన ఆ కొడుకు ఏం బావుకున్నాడో,
పిల్లల మధ్యే పండుకుంటూ ఉన్న గృహిణికి వైద్యుడు హితబోధ చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో, చావు భయం లేదని ఢంకా భజాయించిన ఆ తల్లి జీవనయానం ఎటు సాగిందో, ఇద్దరి యువకుల జీవితాలు తీర్చిదిద్దాలని చూసిన ఆ ఉపకారికి ఎదురైన గడ్డు పరిస్థితి ఏమిటో, ఆ యువకుడిలో తన హీనమైన బాల్యం తదుపరి దశలలో ఎటువంటి రూపు దిద్దుకుందో, దయా దాక్షిణ్యాలతో ఎదిగిన ఆ యువతి తన ప్రత్యుపకారం ఎలా తీర్చుకుందో, స్పర్శతో కన్న కొడుకును ఆ తల్లి ఎలా కాపాడుకోగలిగిందో, ఆ దివాణంలో పడమటి గది చుట్టూ అల్లుకుని ఉన్న విచిత్ర భావన ఏమిటో, పెళ్ళికీ తన చావుకూ సంబంధం ఉందన్న ఆ యువకుడి గమ్యం ఏమిటో, కలికి కడగంటి చూపునకూ, ఎండవాలుకూ సంబంధం ఏమిటో, అమ్మను పిన్ని మరపించిందో లేదో… వంటి అనేక జీవిత వాస్తవాలకు అద్దం పట్టే కథా చిత్రణ, నాటకీయత, వేగవంతమైన నడక, సహజసిద్ధమైన సంభాషణలు ఇవీ… మేడా మస్తాన్ రెడ్డి “స్పర్శ” రచనలు.
-
-
-
Suprasiddha Vyaktula Jeevitaallo Aprasiddha Gadhalu
0₹70.00మహనీయుల జీవితాల్లో మనకు తెలిసింది ఒక భాగమైతే, మనకు తెలియకుండా ఉన్న భాగంకూడా సహజంగానే మరొకటి ఉంటుంది. దానిని కూడా తెలుసుకుంటే పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే వీటిని రాశాను. ఇందులో 11 మంది ప్రముఖుల జీవితాల్లోని రెండు వైపులనూ చూపడం జరిగింది. ఈ వ్యాసాలలో కొన్ని ఆంద్ర పత్రికవారు ఒకప్పుడు వెలువరించిన ‘కలువబాల’ పత్రికలో ‘అద్దానికి మరోవైపు’ పేరిట ప్రచురితమైన శీర్షికలో వచ్చాయి. ఆ పత్రిక ఆగిపోయింది. శీర్షిక కూడా ఆగిపోయింది. అందుచేత మరికొన్ని విడిగా రాసినవి వ్రాత ప్రతిలో ఉండి పోయాయి.
వీటిని పుస్తక రూపంలో ప్రచురిస్తే బాగుంటుందనిపించి, పల్లవీ పబ్లికేషన్స్ వారికి పంపిస్తే వారు వెంటనే ప్రచురించేందుకు అంగీకరించారు. అందుకు వారికి కృతఙ్ఞతలు. ఇందులో 11 మంది ప్రముఖుల గురించే రాశానుగాని, ఇలా ఎంతమంది గురించి అయినా రాయవచ్చును. ఈ పుస్తకానికి లభించిన ఆదరణను బట్టి, ఆ ప్రయత్నాన్ని జరుగుతుంది.
– కోడూరి శ్రీరామమూర్తి
-
-
-
-
The Happiest Man On Earth
0₹299.00నేను 1920లో తూర్పు జర్మనీలోని లీపిగ్ పట్టణంలో జన్మించాను. నా పేరు అబ్రహం
ఇంగ్లీషులో ఈ పేరును ఎడ్డీ అని పలుకుతారు. కాబట్టి దయచేసి నన్ను ఎడ్డీ అని పిలు
మిత్రమా.
మాది ప్రేమానుబంధాలుగల చాలా పెద్ద కుటుంబం. నా తండ్రి ఇసిడోర్కి నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్లు. నా తల్లి లీనా పదమూడు మంది సంతానంలో ఒకరు. ఇంతమంది పిల్లల్ని పెంచిన మా అమ్మమ్మ శక్తిని ఊహించుకోండి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆమె తన కుమారుడిని కోల్పోయింది. జర్మనీ కోసం ఒక యూదుడు తన జీవితాన్ని త్యాగం చేశాడు. అలాగే భర్తనీ కోల్పోయింది. మా తాతయ్య సైనిక పూజారి. ఆయన యుద్ధం నుండి తిరిగి రాలేదు. మా నాన్న పోలాండ్ నుండి వలస వచ్చి జర్మనీలో స్థిరపడ్డారు. ఆయన జర్మనీ పౌరుడిగా గర్వపడేవారు. ఆయన రెమింగ్టన్ టైప్ రైటర్ సంస్థలో మెకానికల్ ఇంజినీరింగ్లో అప్రెంటిస్ గా, చేరడం కోసం మొదట పోలాండ్ని విడిచిపెట్టారు.
ఆయన చక్కటి జర్మనీ భాష మాట్లాడేవారు. జర్మనీ వర్తక నౌకలో పనిచేస్తూ అమెరికా వెళ్లారు. అమెరికాలో తన వ్యాపారంలో బాగా రాణించారు గానీ తన కుటుంబానికి దూరమైయ్యారు. యూరప్ లోకి తిరిగి వచ్చి మరో జర్మన్ వ్యాపార నౌకలో పని చూసుకుందా మనుకున్నారు. సరిగ్గా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వస్తూ చిక్కుకుపోయారు. ఎందుకంటే ఆయన పోలిష్ పాస్పోర్టుపై ప్రయాణిస్తుండడంతో జర్మనీవారు ఆయనను అక్రమ చొరబాటు దారుగా భావించారు. అయితే జర్మనీ ప్రభుత్వం ఆయన్ని నైపుణ్యం గల మెకానిక్ గా గుర్తించి యుద్ధ ప్రయత్నాల కోసం భారీ ఆయుధాలు తయారుచేసే లీగ్లోని కర్మాగారంలో నిర్బంధంలో ఉండి పనిచేయడానికి అంగీకరించింది………………..
-
-
The Show Must Run
0₹170.00బంగారు వడ్లగింజలు
సుమారు ఇరవై ఏళ్ళక్రితం ఒకే కవరులో ‘భట్టిప్రోలు కథలు’ అనే పేరుతో నవ్య వీక్లీ కార్యాలయానికి వచ్చాయి, విజయరామరాజుగారి కథలు. భట్టిప్రోలు మావూరు దగ్గరే. అది గొప్ప బౌద్ధక్షేత్రం. వాన కురవంగానే అక్కడున్న దిబ్బలమీద బంగారు వడ్లగింజలు దొరుకుతాయని స్థానిక ప్రజల నమ్మకం. ఇప్పటికీ వాన పడ్డప్పుడు జనం అక్కడ వెతుకుతూనే వుంటారు.
డాక్టరుగారి కథలన్నీ భట్టిప్రోలు బంగారు వడ్లగింజల వంటివేనని నేను భావిస్తాను. పల్లెటూరియాసలో గొప్ప ఇతివృత్తాలతో రచించిన గొప్ప కథలు! దేనికదే బావున్నాయి.
‘ద షో మస్ట్ రన్’ కథాసంపుటిలో పల్లెటూరు, బస్తీ రెండింటినీ పట్టుకున్నారు.
సురభి నాటకాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ఒక్క టిక్కెట్టు తెగకపోయినా, ఒక్క ప్రేక్షకుడు రాకపోయినా సరే, అనుకున్న టైంకి తెరలేస్తుంది. అదీ వారి ప్రత్యేకత.
భమిడిపాటి కామేశ్వరరావుగారు అనేవారు, “నువ్వు రాసిన రచని పదమూడేళ్ళు ఊరబెట్టి అలానే వుంచు. తర్వాతే పత్రికలకు ఇవ్వు” అని. దేనికైనా కాలం గీటురాయి. అందుకే భట్టిప్రోలు కథలను తలచుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా కూడా తలచుకుంటారు. వాటిలో ‘చూరుకుట్టు బద్ద’, ‘నత్తముక్కల గోంగూర’ నాకు బాగా నచ్చిన కథలు……………..
బంగారు వడ్లగింజలు

Tripuraneni Ramaswamy Rachanalu
0₹400.00త్రిపురనేని రామస్వామి గురించి త్రిపురనేని రామస్వామిగారిని తరచుగా పెరియార్ రామస్వామితో (రామస్వామి నాయకర్) పోలుస్తారు. దానికి స్థూలమైన కారణం ఇద్దరూ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో వున్నారు అనే భ్రమ. కాని నిజానికి పెరియార్కీ, రామస్వామికీ ఏ రకమైన పోలికలూ లేవు. పెరియార్ ఆవేశపరుడు, రామాయణం అంటే కోపం, బ్రాహ్మల వల్లే తమిళనాడంతా పాడయిందని పెద్ద ఉద్యమం లేవదీశాడు. కాని రామస్వామి పెరియార్ కన్నా చాలా ముందు తన ఆలోచనలు సిద్ధాంతపూర్వకంగా చెప్పాడు. ఆ
రామస్వామి 1914లో ఐర్లాండు వెళ్లాడు. అక్కడ అప్పటికే ఉన్నవ లక్ష్మీనారాయణ ఇతర తెలుగువాళ్లని ఆకర్షించి రాజకీయంగా తయారు చేస్తున్నాడు. ఐర్లాండులో ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం మీద వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. ఆ ఉద్యమప్రభావం రామస్వామిమీద కూడా వుంది.
రామస్వామి ఐర్లాండులో వున్న రోజుల్లో చేసిన ప్రధానమైన పని
-
Vallu Padina Bhupala Ragam
0₹225.00డా.పి. శ్రీదేవి రాసిన ‘కాలాతీత కథ’ వాళ్ళు పాడిన భూపాలరాగం
– శీలా సుభద్రాదేవి
డా.పి. శ్రీదేవి పేరు చెప్పగానే ‘కాలాతీత వ్యక్తులు’ నవల గుర్తుకు రానివారు అరుదు. అయితే ఆమె కథలు కూడా రాసినట్లు తెలిసినా ఆ కథల్ని తెలిసినవారు తక్కువే. పి.శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాటిలో ‘కాలాతీత వ్యక్తులు’కు దీటుగా ఉన్న కథలు ఉన్నాయి. నవలలో పాత్రల లాగే మరపురాని పాత్రలతో ఉన్న కథగా చటుక్కున చెప్పదగినది – ‘వాళ్ళు పాడిన భూపాలరాగం’. ఇది 1959లో జయంతి (జులై) సంచికలో ప్రచురితం. 1966లో ‘ఏరినపూలు’ సంకలనంలో చేర్చబడింది. అనేక భిన్న మనస్తత్వాలు గల పాత్రలలో, అనేక సంఘటనలతో, ఆనాటి సమజానికి ప్రతిబింబంగా ఉండి, కథావిస్తృతి కలిగి ఉండటం చేత దీనిని నవలికగా కూడా చెప్పుకోవచ్చు. కాలాతీత వ్యక్తులు నవల రాసిన తర్వాత రాసిన కథ కావటాన కథాసంవిధానంలో, పాత్రల చిత్రణలో ఈ కథపై కూడా దాని ప్రభావం ఉంటుంది.
ఇందులోని కథంతా చెప్పకుండా పాత్రల్ని, పాత్రల స్వభావాల్నీ, మాత్రమే చెపుతాను. ఎందుకంటే ఇందులోని పాత్రలు కూడా సమాజంలో ఎప్పటికీ ఉండే పాత్రలే. పాత్రని సృష్టించేటప్పుడు పాత్రల యొక్క మూలస్వభావాన్ని కూడా పాఠకులకు అవగాహన అయ్యేలా సంఘటనల్నీ, సంభాషణల్నీ కూర్చే శైలి శ్రీదేవికే స్వంతం. అందుకనే వీరి పాత్రలు ఎప్పటికీ సజీవంగా వుంటాయి.
రామచంద్రయ్య: శుద్ధ మాష్టరీ ఉద్యోగం. లేమికి గానీ, అశుచికిగానీ బాధపడడు. అనారోగ్యం ఎరగడు. జీవితావసరాలు సమపాళ్ళలో వుండే కుదురైన సంసారం. రేడియోలూ, సినిమాలూ, గ్రామఫోన్ల వంటి అధునాతనమైన వాటిని నమ్మడు. ఇంట్లో ఏ కార్యం చేసినా పొదుపుగా, శాస్త్రోక్తంగా చేస్తాడు. ఒకరి మీద ఆధారపడకుండా బతకాలనే మధ్యతరగతి సగటు మనిషి మనస్తత్వం, జీవన విధానం కలవాడు. తిండి, బట్ట బతకటానికి చాలనేది అతని ఉద్దేశ్యం. అందుకే…………………