• Bharateeya Katha Prathibimbam

    Bharateeya Katha Prathibimbam

    0

    భారతీయ భాషలన్నింటా కథలు పుంఖానుపుంఖంగా నిరంతరం వెలువడుతున్నాయి. జీవనది లాంటి ఆ ప్రవాహంలోంచి ఏరిఏరి కొన్ని దోసిళ్ళ కథలు ఈ రచయితా తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. అయితే వీళ్ళందరూ సామాన్య రచయితలు కారు. ప్రపంచ సాహిత్య పటం మీద భారతీయతను జెండాలా రెపరెప లాడించిన వారు. భారతీయ కథా సాహిత్యంలో నాకు నచ్చిన కొన్ని కథల్ని ఈ సంపుటిలో అందిస్తున్నాను. చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.

    – డాక్టర్ దేవరాజు మహారాజు

    160.00
    Add to cart
  • Abhayaranyam - అభయారణ్యo

    Abhayaranyam – అభయారణ్యo

    0

    అతుకు

    ”ఎంతైనా అతుకు అతుకే” మనసులో అనుకోబోయి పైకే అనేసింది సుమతి.

    హిందూ పేపర్ని దీక్షగా చదువుతున్న భాస్కర్రావు తలెత్తి సుమతి వంక చూస్తూ ”ఏంటి అన్నావ్‌” అన్నాడు.

    ”ఏం లేదండీ. కాంపౌండ్‌వాల్‌ ఆ మూల మళ్ళీ బీటలిచ్చింది. ఇప్పటికే రెండుసార్లు సిమెంటు చేయించాం. ఎందుకు బీటలిచ్చింది అంటే ‘అబ్బే ఏం లేదండి ఏదో గాలి పగులు’ అంటారు. మళ్ళీ చూడండి అదే చోట ఎట్లా బీటలిచ్చిందో” సుమతి గోడ వంకే పరీక్షగా చూస్తూ అంది.

    ‘నువ్వన్నది గోడ గురించా’ మనసులో అనుకుని ”ఇంకోసారి సిమెంటు చేయిస్తే సరిపోతుంది. మేస్త్రీకి ఒకసారి రమ్మని కబురు చేద్దాం. అనిక్కి ఓసారి గుర్తుచెయ్‌” మళ్ళీ పేపర్లో తల దూరుస్తూ అన్నాడు భాస్కర్రావు.

    అంతలో అతనికి ఆదివారం ప్రొద్దున్నే అంతసేపు పేపరు చదవటం సుమతికి ఇష్టం ఉండదని గుర్తొచ్చింది. వెంటనే పేపరు మడిచి టీపాయ్‌ మీద పెట్టి ”ఇవాళేంటి ప్రోగ్రాం? ఎటన్నా వెళ్దామా?” అన్నాడు. ఆదివారం పొద్దున్నే కాఫీ తాగుతూ వరండాలో కూర్చునో, మొక్కల్లో తిరుగుతూనో పిచ్చాపాటీ మాట్లాడడం అంటే సుమతికి ఇష్టం. భాస్కర్రావుకి పేపర్ల పిచ్చి. రోజూ వచ్చే రెండు పేపర్లు కాక ఆదివారం అదనంగా ఇంకో రెండు పేపర్లు కొంటాడు. మొత్తం నాలుగు పేపర్లు ఆదివారం అనుబంధంతో సహా అయిపోయే వరకూ వరండాలో అరుగుమీద బాసింపట్టు వేసుకూర్చుని కదలడు. మధ్యలో రెండు టీలు….

    ”అభయారణ్యం” కథల సంపుటిలో అతుకు, తోడు, అలక, జీవన చిత్రం, భయం, థర్డ్‌ ఆప్షన్‌, డిలీట్‌, అభయారణ్యం, పెళ్ళంటే, ఓ సిల్లీ కథ, దు:ఖావరణం, హోమం, అద్దం, అదృశ్యం, కళాకారుడు, నాలుగో తరం, పరుసవేది, అమ్మా వాళ్ళ ఇల్లు, సుమిత్ర, రూట్‌ కెనాల్‌ అనే 20 కథలు వున్నాయి.

    పేజీలు : 140

    120.00
    Add to cart
  • Indian

    Indian

    0

      చందు రచనల్లో జీవితరంగ సాన్నిహిత్యం ఉంటుంది. అది అతని అనుభవ ప్రపంచానికీ లోకానుశీలతకు గుర్తు. తీవ్రమైన భావుకత్వం ఉంటుంది. అది కవిత్వ హృదయానికుండే సాంద్రమైన అనుభూతికి సంకేతం. ప్రగాఢమైన సాహిత్య పరిచయం చందూ రచనల్లో కనిపిస్తుంది. సామాజిక శాస్త్రాలతో బాటు విజ్ఞాన శాస్త్రాల మేలనం ఉంటుంది. ఉదార వామపక్షానుకూల ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. చాలామంది తెలుగు నవలాకారులకు, రచయితలకు, పండితులకు లేని శక్తివంతమైన శైలి చందూ నవలల్లో కనిపిస్తుంది. సూటిదనం, స్పష్టతా, గాంభీర్యం, హాస్యం, కొంటెతనం, వ్యంగ్యం చందూ కంఠస్వరంలో చూడవచ్చు. కథనంలో ప్రసన్నత ఉంటుంది. వేగం ఉంటుంది. ఈ రెండింటి వెనుక పాఠకుణ్ణి ఆలోచనాత్మకమైన జీవనాంశాలవైపు  సామాజిక పరివర్తన వైపు సామూహిక సద్వర్తన వైపు మానవుడు సాధించగలిగే శాస్త్ర విజ్ఞానాంశాలపై మళ్ళించే లక్షణం ఉంటుంది.

                                                   – కేతు విశ్వనాథరెడ్డి

    200.00
    Add to cart
  • Kafka Kathalu

    Kafka Kathalu

    0
    200.00
    Add to cart
  • Kondameeda Gorrela Manda - కొండమీద గొర్రెల మంద

    Kondameeda Gorrela Manda – కొండమీద గొర్రెల మంద

    0

    వాస్తవాలకు దగ్గరగా వుంటూనే చిన్నపాటి గమ్మత్తు కలిగించే పాత్రలూ, వాటి విపరీత చర్యలూ చదవడం మొదలుపెడితే చకచకా జారిపోయే సంభాషలూ, వాటిని పెనవేసుకున్న ఉత్కంఠ.

    వందలాది వైవిధ్యభరిత కథలు రచించిన ఎమ్‌.వి.వి.సత్యనారాయణ కలం నుండి మనవైపు చొరబడిన కొండమీద గొర్రెలమంద ఇది. ఆసక్తికర కథనాల సమాహారం కూడా ఇదే!

    పేజీలు : 216

    200.00
    Add to cart
  • Madhupuri Kathaa Samputi - మధుపురి కథాసంపుటి

    Madhupuri Kathaa Samputi – మధుపురి కథాసంపుటి

    0

    బ్రిటీషువారు తమ విలాసాల కోసం, తమ సైనికుల విలాసాల కోసం హిమాలయ పర్వతాలలోని శీతల మంద సుగంధ పవనాలు వీచే పచ్చని ప్రదేశాలను ఎంపిక చేసుకునేవారు. ఆ ప్రాంతాలలో ఉండే వెనుకబడిన జాతుల ప్రజల జీవనాలను ధ్వంసించేవారు. విలాస నగరాలకు వచ్చే విలాస ప్రియులు సహజ సౌందర్యవంతులైన అక్కడి స్త్రీల జీవితాలను నరకప్రాయం చేసేవారు. అదేవిధంగా ఈనాటి ప్రభుత్వాలు టూరిజం పేరు మీద అలాగే స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా మారుస్తున్నారు. అణగారిన పేద, బడుగు, బలహీన గిరిజన జాతుల ప్రజల జీవనానిన& ఛిద్రం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 40 సంవత్సరాల క్రితం రాహుల్‌ సాంకృత్యాయన్‌ హిందీలో రాసిన ”బహురంగీ మధుపురి” కథల సంపుటిని ”మధుపురి” అనే పేరుమీద తెలుగులోకి అనువదించి చారిత్రక, రాజకీయ అంశాల పట్ల ఆసక్తి మెండుగా ఉండే తెలుగు పాఠకుల ముందుకు తీసుకువస్తున్నాం. రాహుల్జీ గ్రంథాలు ఆంధ్రదేశంలో బహుళ ప్రాచుర్యం పొందాయి. ఈ కథల సంపుటి కూడా ఆ విధంగానే తెలుగు ప్రజల మనోభావాల్లో విహరించగలదు.

    Pages : 272
    200.00
    Add to cart
  • Manusmruti Samagra Sastreeya Vyakhya Modati Bhagam - మనుస్మృతి సమగ్ర శాస్త్రీయ వ్యాఖ్య మొదటి భాగం

    Manusmruti Samagra Sastreeya Vyakhya Modati Bhagam – మనుస్మృతి సమగ్ర శాస్త్రీయ వ్యాఖ్య మొదటి భాగం

    0

    మనుస్మృతి గురించి విననవివారుండరు. మూలంలో అసలేముందో తెలిసినవారు తక్కువే అయినా తెలుసుకోవాలనే కుతూహలమున్నవారు ఎక్కువే. ఇది మనుస్మృతికి శాస్త్రీయంగా చేసిన శస్త్ర పరీక్ష. మనువాద విమర్శకులు అనుకుంటున్నట్టు దీనిలో ఉన్నదంతా చెడేనా? లేక సమర్థకులు భావిస్తున్నట్లు దీనిలో ఉన్నవన్నీ నేటికీ పనికొచ్చే మంచి విషయాలేనా? వాస్తవానికి ఈ రెండూ పూర్తి నిజాలు కావు. రెంటిలోనూ కొంత మాత్రమే నిజం. గతితార్కిక దృక్పథంతో, ఆధునిక శాస్త్ర విజ్ఞానం వెలుగులో మనువు చెప్పిన విషయాలలోని మంచి చెడుగులను లోతుగా విశ్లేషించిన తులనాత్మక అధ్యయనమిది. పన్నెండు అధ్యాఆయల ఆ బృహద్గ్రథం మొదటి మూడు అధ్యాఆలలోని మొత్తం 654 శ్లోకాలపై చేసిన సమగ్ర శాస్త్రీయ విశ్లేషణ ఇప్పుడు మొదటి భాగంగా మీ ముందుంది. మరో రెండు భాగాలు త్వరలో వెలువడనున్నాయి. సరళమైన వాడుకభాషలో, సుబోధకమైన శైలిలో రాశారు పుస్తక రచయిత ముత్తేవి రవీంద్రనాథ్‌.

    పేజీలు : 288

    200.00
    Add to cart
  • Oka Koyila Gunde Chappudu - ఒక కోయిల గుండె చప్పుడు

    Oka Koyila Gunde Chappudu – ఒక కోయిల గుండె చప్పుడు

    0

    ”ఒక కోయిల గుండె చప్పుడు” కథా సంపుటిలో కథలు స్త్రీల ఆశలను, ఆశయాలను, కోరికలను, ధైర్య సాహసాలను ప్రతిబింబిస్తాయి. స్త్రీ హృదయ లోతుల్లో దాగివున్న ఎన్నో బాధలను, ఆవేదనలను కూడా మన కళ్ళముందు ఆవ్కిరిస్తాయి. అలా అని ఈ స్త్రీలంతా సమస్యలను చూసి పారిపోరు. కష్టాలకు కృంగిపోరు. కన్నీళ్ళు కారుస్తూ ఇంతే నా రాత అని సర్దుకుపోరు.

    జీవితంలో పరుగులు పెడుతూ, ఎదురుతిరిగి నిలబడి ప్రశ్నిస్తారు. సున్నితంగానే అయిష్టాలను తిరస్కరిస్తారు. తనకు తారసపడిన అనేకమంది స్త్రీల మనోభావాలను తన కలంతో అందంగా, అద్భుతంగా చిత్రించి స్త్రీ ఔన్నత్యంలో మనకు తెలియని కోణాలను చూపించారు అత్తలూరి విజయలక్ష్మి ఈ కథలలో.

    చైతన్యం తొణికిసలాడే పాత్రలలో, అద్భుతమైన సన్నివేశాలతో, ఆసక్తికరమైన సంభాషణలతో అనేక రకాల జీవితాలను ఒకే కాన్వాస్‌ మీద చిత్రించి, ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠగా చదివింపజేసే కథలు… వీటిలోని ప్రతి సంఘటనా పాఠకుల మదిని తడుతుంది. ప్రతి పాత్రా పలకరిస్తుంది. కలిసి ప్రయాణం చేస్తుంది.

    పేజీలు : 167

    140.00
    Add to cart
  • Ooru Kanabaduta Ledu - ఊరు కనబడుట లేదు

    Ooru Kanabaduta Ledu – ఊరు కనబడుట లేదు

    0

     “ఊరు కనబడుటలేదు” కథా సంపుటిలో అన్ని కథలలో మన చుట్టూ ఉన్న మనిషి కనబడతాడు. మనం పోగొట్టుకున్న జ్ఞాపకాల్ని వెతికి పట్టుకోవడానికి, మనం చుట్టూ నిర్మించుకున్న గోడల్ని పగలగొట్టుకునేందుకు ఈ కథలు పనికొస్తాయనడం అక్షరసత్యం. సంగీతాత్మక శైలితో, సమాజంలోని వస్తున్న తిరోగతి మార్పులను ఒడిసిపట్టి, మనిషిపై వాలుతున్న పీడనీడను పారద్రోలడానికి మనిషిని మనందరివాడుగా, మంచితనానికి చుట్టంలా మార్చడానికి చేసిన ప్రయత్నమే ఈ కథా సంపుటి.

                కథానికా శిల్ప రహస్య మర్మాలు బాగా గుర్తించి అలవర్చుకుని కథానిక భాష సముచితంగా, సందర్భ సహితంగా ఉన్నది. చిన్న చిన్న పదాలతో వాక్యాలతో విశేష అర్థం ఆవిష్కరింపజేస్తూ నన్ను నాకు గుర్తుచేశారు.

    – పద్మశ్రీ డా కొలకలూరి ఇనాక్

    తన చుట్టూ ఉన్న వ్యక్తులనీ, వాళ్ళ ప్రవర్తననీ ఈయన నిశితంగా పరిశీలిస్తున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. ఈ లోకంలో ఇంత అన్యాయం ఎందుకుందని లోపల ఆవేదన చెందుతున్నారు. పీడితుల పట్ల సహానుభూతి ఉంది. స్పందించే హృదయముంది. ఈయన ఎన్నుకున్న కథా వస్తువులతో ఈ విషయం స్పష్టమవుతుంది.

    – ముక్తవరం పార్థసారథి

    ‘ఊరు కనబడుటలేదు’ లోని కథలలో ఎక్కువగా మధ్యతరగతి మనస్తత్వాలను, జయాపజయాలను, అట్టహాసాలను, అవమానాలను, ఆలోచనలను చివరికి వారి తాత్త్వికతను సైతం చిత్రించే ప్రయత్నం కనిపిస్తుంది. ‘ఊరుకనబడుటలేదు’ ‘ఒంటెద్దు బండి’ వంటి ఉత్తమ శ్రేణి కథలు ఇందులో ఉన్నాయి. ఇతని శైలికి లయ ఉంది. అది సంగీతాత్మకంగా ఉంది.

                                        – డా వి ఆర్ రాసాని 

    120.00
    Add to cart
  • Rangabhoomi - రంగభూమి

    Rangabhoomi – రంగభూమి

    0

    కల్పన కంటే సత్యమే సుందరంగా ఉంటుందని నిరూపించిన కథక చక్రవర్తి ప్రేమ్ చంద్. భూస్వామ్య వ్యవస్థ కూలిపోతూ పారిశ్రామిక నాగరికత తోసుకు వస్తున్న సమయంలో, పాత వ్యవస్థలోని కొంత మంచి కూడా ఎలా నశించిపోతుందో చిత్రించే నవల రంగభూమి. గుడ్డివాడు, బిచ్చగాడు ఐన సూరదాసు భూమిని మోసం ద్వారా జాన్ సేవక్ అనే పరిశ్రమికాధిపతి కొని, సిగరెట్ ఫ్యాక్టరీ స్థాపించడం, గ్రామ జీవితంలోని ప్రశాంతత ధ్వంసమై, కృత్రిమత్వం, కుటిలత్వం సూరదాసు తుపాకి గుండ్లకు బలై చనిపోతాడు.

    గాంధీజీ సిద్ధాంతాలతో సంపూర్ణ విశ్వాసం గల ప్రేమ్ చంద్ జీవితాంతం త్యాగమయ జీవితం  గడిపాడు. సోషలిస్టు ప్రపంచం గోర్కీ సాహిత్యంతో ఆకర్షితుడై, 1936లో ప్రథమ అభ్యుదయ రచయితల మహాసభకు అధ్యక్షత వహించి ఆ ఉద్యమానికి మూల పురుషుడైనాడు. ప్రేమ్ చంద్ ఉత్తమ రచనలలో ఒకటి రంగభూమి.

    500.00
    Add to cart
  • Sathyavathi Kadhalu - సత్యవతి కథలు

    Sathyavathi Kadhalu – సత్యవతి కథలు

    0

    సమాజం తనకి నిర్దేశించిన పాత్రలో ఒదిగిపోయిన అస్తిత్వాన్ని కోల్పోయిన కాలం తరువాత, అస్తిత్వ స్పృహ పెంచుకుని తనను తను ప్రతిష్టించుకునే పోరాటంలో, కొంత విజయం సాధించిన స్త్రీలు, ఆ పైన ప్రపంచీకరణతో మరింత సంక్లిష్టమైపోయిన జీవన పోరాటంలో ఉక్కిరి బిక్కిరైపోతున్న స్త్రీలూ పురుషులూ, వారి ఆశలు, ఆరాట పోరాటాలు, విజయాలు, వైఫల్యాలు, శ్రీఘ్రగతిన మారుతున్న ఆర్ధిక రాజకీయ పరిస్థితుల్లో తరిగిపోతున్న మానవీయ విలువలను కాపాడుకునే ప్రయత్నాలు, ఆ క్రమంలో సంఘర్షణలు సత్యవతి కథల నిండా కనపడతాయి. జీవితాన్ని తడిమేదే సాహిత్యం అని నమ్మే సత్యవతి కథలు ఒక ఆశావాదంతో ముగుస్తాయి. జీవితంపట్ల ఆశను, ప్రేమను వెలిగిస్తాయి.

    270.00
    Add to cart
  • Viswa Kathaa Satakam - విశ్వ కథా శతకం

    Viswa Kathaa Satakam – విశ్వ కథా శతకం

    0

    వంద కథల విందు

    ”రచయిత లక్ష్యం కథ చెప్పటమూ, పాఠకులకు వినోదం కలిగించటమూ కాదు. లోకం కప్పుకున్న ముసుగుల్ని తొలగించి చూడగలగాలి రచయిత. తప్పనిసరిగా ఇది వయ్యక్తికానుభవమే. వ్యక్తులు, పరిస్థితులు, సంఘటనలు అన్నీ రచయిత తను అర్థం చేసుకున్న దృష్టికోణం నుండి మాత్రమే రాయగలడు. తనలో కలిగిన స్పందననే పాఠకులకూ కలుగచేయటానికి ప్రయత్నిస్తాడు. అప్రయత్నంగా కబుర్లు చెప్పినట్టుగా వుంటే కథ పండిందన్నమాట” అంటాడు కథకులందరికీ ప్రాత:స్మరణీయుడు మపాసా.

    ఇందులోని ప్రతి కథనూ మపాసా సూచించిన గీటురాయితో పరీక్షించి చూడండి. మీకే తెలుస్తుంది. ఒక్కొక్క కథా సానపట్టిన వజ్రమని.

    దేశ సరిహద్దులు దాటి, ఖండాంతరాలను అధిగమించి, శతాబ్దాలకు వారధికట్టి, లోకం చుట్టివచ్చిన కథలివి.

    Pages : 462
    400.00
    Add to cart