• Sri Vidya Saradhi(1&2 Set)
  • Sri Vidyabrhma Sutra Bhasyam
  • Sri Vishnu Vidya

    Sri Vishnu Vidya

    0

    (శ్రీ విష్ణు సహస్రనామ భాష్యము)
    “ఇది నామ విద్య. ఈ నామాలు అక్షరాల గుంపులు కావు. నారాయణుని శబ్దాకృతులు. మొత్తంగా ఈ సహస్రనామ స్తోత్రమే విష్ణుని శబ్దమయీమూర్తి, ఇవి వేదమందు ప్రతిపాదింపబడిన పరమాత్ముని శబ్దాలు. వీటి వ్యాఖ్యానం మన వైదిక విజ్ఞానాన్ని, పరమేశ్వర జ్ఞానాన్ని స్పష్టపరుస్తాయి. అందుకే ఇది ‘విష్ణువిద్య’. .. ప్రాచీన, అర్వాచీన భాష్యాల ననుసరించి, వైదిక శాస్త్రాల సంప్రదాయాధారంగా ఒకొక్క నామానికి ఉన్న ఔచితీమంతమైన క్రమబద్ధతనీ, నిర్దిష్టమైన వ్యాఖ్యానాన్ని అందించే సమన్వయ భాష్యమిది. ప్రతినామ వ్యాఖ్యానము పారాయణయోగ్యంగా, భావనాయోగంగా సమకూర్చిన విష్ణుతేజో విలసిత గ్రంథమిది”. —

    -సామవేదం షణ్ముఖ శర్మ

    800.00
    Add to cart
  • SRIKANAKADURGAMMA CHARITAMU

    SRIKANAKADURGAMMA CHARITAMU

    0

    SRIKANAKADURGAMMA CHARITAMU

    కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.

    శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

    రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు

    252.00
    Add to cart
  • SUKLA YAJURVEDA SAMIHITA- VEDALU 4 PARTS
  • Sundara Kandamu 1, 2&3

    Sundara Kandamu 1, 2&3

    0

    పరిచయము

    శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు

    రాజమహేంద్రవరము శ్రీమద్రామాయణము భారతీయ సాహిత్యమున శిఖరాయమానమైన మహాగ్రంథము. వాల్మీకి ప్రణీతమైన యాదికావ్యము. వేదమంత్రములవలనం దెలిసికొనఁదగిన పరమాత్ముఁడు దశరథాత్మజుడుగా నవతరించెను. ఏడు కాండములుగా నున్న రామాయణములో ఇరువదినాలుగువేల శ్లోకములు గలవు. గాయత్రీమంత్రాక్షరములు ఇరువదినాల్గు. వాల్మీకి

    రామాయణములోని ప్రతి వేయవ శ్లోకము ఆ మంత్రాక్షరముతో నారంభమగును. దానివలన రామాయణము పారాయణము చేయుటవలనఁ గర్తకు సకలకార్యసిద్ధులగుచున్నవి. మనోహరమైన కవిత్వానందముతోపాటు మహిమసిద్ధిప్రదమైన

    రామాయణమునకు సుందరకాండము శిరసానీయము. సప్తకాండమండితమైన శ్రీమద్రామాయణములో సుందరకాండమును ప్రత్యేకముగాఁ బారాయణము చేయుచుందురు. తత్పారాయణము అభిష్టసిద్ధి నొసగుచుండుటయు సర్వభక్తానుభవము.

    ‘ఒక శ్లోకము, ఒక పాదము, ఒక పదము కూడ పుణ్యప్రదమని చెప్పఁబడినది. శ్రద్ధాభక్తులతో, అర్థజ్ఞానము కలిగి పారాయణ మొనర్చుటవలన గలిగెడి ప్రయోజన మనంతమైనది. సంస్కృతభాషాపరిచయము కలవారు ఆంధ్రులలో ఎందఱుందురు? అర్ధజిజ్ఞాసువులయిన ధార్మికులకు, ఆస్తికులకు, పారాయణాసక్తులకు సుబోధముగా నుండునట్లు “సుందరకాండము” ప్రచురిత మగుట తెలుగువారికి అపేక్షితము. ఇతఃపూర్వము వావిళ్ళవారు సార్థతాత్పర్యముగా ప్రచురించియున్నను, ఆ గ్రంథము లిపుడు లభ్యము గాకుండుటచేఁ బలువురు ఆంధ్రవివరణసహితమగు సుందరకాండమునకు బహుకాలముగాఁ బ్రతిక్షించుచున్నారు.

    ఇపుడీ “సుబోధినీ” సహితమగు సుందరకాండము తెలుఁగువారి కోరికకు ఫలముగా వెలువడుచుండుట ఆనందదాయకము. ఈ పుణ్యకృతికి సంకల్పించినవారు శ్రీ బోయనపల్లి కామేశ్వరరావుగారు. వీరు రామనామప్రచారకాగ్రేసరులగు “శ్రీరామశరణు”గారి శిష్యులలో అగ్రగణ్యులు. త్యాగభోగములకుఁ దగిన సంపత్తితోపాటు ధార్మిక ప్రవృత్తి కలిగిన యుదారులు; నిరంతర శ్రీరామధ్యాన పూజాతత్పరులు. ఆంగ్లమున పట్టభద్రులయ్యును, భారతీయ సంప్రదాయములయెడ అవిచలితమైన శ్రద్ధాసక్తులు కలిగినవారు. వీరు తెనుఁగు పద్యరచన చేయ సహృదయులు. “అమృతోదయ” మన్న ఆంధ్రకావ్యమును కృతిపొందియన్నారు…….

    1,500.00
    Add to cart
  • Suprasiddha Vyaktula Jeevitaallo Aprasiddha Gadhalu

    Suprasiddha Vyaktula Jeevitaallo Aprasiddha Gadhalu

    0

    మహనీయుల జీవితాల్లో మనకు తెలిసింది ఒక భాగమైతే, మనకు తెలియకుండా ఉన్న భాగంకూడా సహజంగానే మరొకటి ఉంటుంది. దానిని కూడా తెలుసుకుంటే పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే వీటిని రాశాను. ఇందులో 11 మంది ప్రముఖుల జీవితాల్లోని రెండు వైపులనూ చూపడం జరిగింది. ఈ వ్యాసాలలో కొన్ని ఆంద్ర పత్రికవారు ఒకప్పుడు వెలువరించిన ‘కలువబాల’ పత్రికలో ‘అద్దానికి మరోవైపు’ పేరిట ప్రచురితమైన శీర్షికలో వచ్చాయి. ఆ పత్రిక ఆగిపోయింది. శీర్షిక కూడా ఆగిపోయింది. అందుచేత మరికొన్ని విడిగా రాసినవి వ్రాత ప్రతిలో ఉండి పోయాయి.

                    వీటిని పుస్తక రూపంలో ప్రచురిస్తే బాగుంటుందనిపించి, పల్లవీ పబ్లికేషన్స్ వారికి పంపిస్తే వారు వెంటనే ప్రచురించేందుకు అంగీకరించారు. అందుకు వారికి కృతఙ్ఞతలు. ఇందులో 11 మంది ప్రముఖుల గురించే రాశానుగాని, ఇలా ఎంతమంది గురించి అయినా రాయవచ్చును. ఈ పుస్తకానికి లభించిన ఆదరణను బట్టి, ఆ ప్రయత్నాన్ని జరుగుతుంది. 

                                  – కోడూరి శ్రీరామమూర్తి

    70.00
    Add to cart
  • Suswarala Lakshmi M S Subbalakshmi

    Suswarala Lakshmi M S Subbalakshmi

    0

    ఇదొక జీవనరాగం. విశ్వవిఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా శ్రీమతి పల్లవి రచించిన నవల. ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి తొలిదశలో చలనచిత్ర నటిగా మీరా వంటి చిత్రాలలో నటించింది. తర్వాత సదాశివంతో వివాహమై జీవితంలో స్థిరపడిన తర్వాత కచ్చేరీలకే పరిమితమైంది. ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, మానవీయమైన సుగుణసంపత్తి గల వ్యక్తి – పారగాన్ ఆఫ్ వర్చూస్ అంటారు. ఒక సంగీత సామ్రాజ్ఞి జీవితాన్ని హృద్యంగా వచన కథాకావ్యంగా తీసుకుని రావడం కష్టతరమైన పనియే. ఎందుకంటే ఇందులో కల్పనకు తావులేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. అందులోని సాధక బాధకాలు రచయిత్రికే తెలుసు.

                పల్లవి లోగడ మహానటి సావిత్రి జీవిత చరిత్రను రచించింది. పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆరేడు ముద్రణలకు నోచుకుంది. అందులో కథ ‘చిత్ర’ విచిత్ర గతులతో నడుస్తుంది. ఇందులో అలా ఉండదు. ఇదొక గాంధర్వలోకం. రచయిత్రి ప్రతిభా విశేషముతోనే కథాకథనం రాణించాలి. అందులో ఈమె కృతార్థురాలయింది. అందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. సుబ్బలక్ష్మి రాగము, సదాశివం తానం, రచయిత్రి పల్లవి. మధ్యలో నా అనుపల్లవి అవసరం లేదు. అయినా ఆమె కోరికను కాదనలేక ఈ నాలుగు మాటలు రాశాను. సుబ్బలక్ష్మిగారి జీవితంపై వచ్చిన సమగ్ర ప్రామాణిక పరిశోధనా గ్రంథం ఇది.

                                 – ముదిగొండ శివప్రసాద్

    400.00
    Add to cart
  • Swapna Jeevi

    Swapna Jeevi

    0

    మనకు జరిగిందే కథ కాదు. మనలో జరిగేది కూడా కథే!

    మానవజాతి అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఎన్నో అంశాలలో కళ కూడా ఒకటి. మనిషి అంతరంగంలోని ఎన్నో విషయాలను వ్యక్తీకరించే మార్గం కళ. మాటలు, పదాలు వ్యక్తీకరించే భావాలను సైతం వివిధ కళారూపాల ద్వారా వ్యక్తపరిచే అవకాశం ఉంటుందని మనిషి కనుగొన్నాడు. మానవుల మొట్టమొదటి కళారూపాలు పురాతన గుహల ‘గోడలపై చిత్రించిన బొమ్మలుగా కనుగొనబడ్డాయి. ఆ విధంగా చిత్రలేఖనం మానవుడి మొదటి కళగా అర్థం చేసుకోవచ్చు. కళల ద్వారానే సంస్కృతి వ్యాపించింది. కళ మరియు సంస్కృతి ప్రజలని ఒక సమాజంగా దగ్గర చేశాయి. సమాజాన్ని బలోపేతం చేయడానికి కూడా కళ, సంస్కృతి ఎంతో ఉపయోగపడతాయి. వినోదం, విశ్రాంతి పొందడం కోసమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడం, నేర్పించడం, వ్యక్తిగత వృద్ధి సాధించడంలో కూడా వివిధ కళలు ఎంతో ఉ పయోగపడతాయి. సమాజానికి ఇంత మేలు చేసే కళ వెనుక ఉండే కళాకారుల జీవితాలు చాలా వరకూ ఎన్నో కష్టనష్టాలతో కూడి ఉండడం మాత్రం ఎంతో బాధాకరమైన విషయం. బహుశా అందుకు కారణం కళాకారుడు మిగిలిన వారికంటే ఎక్కువ వ్యాకులత కలిగి ఉండి, సమాజం పట్ల చింతకలిగిన వాడై ఉండడం ఒక కారణం అయ్యుండొచ్చు. |

    మరణం తప్పదని తెలిసిన మనిషికి తన క్షీణతను అధిగమించగలిగే ఒకే ఒక సాధనం కళ, కళాకారుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళినా, కళాకారుడు చేసిన సృష్టి అతనికి…………

    175.00
    Add to cart
  • Talapatra Nidhi
  • Taratarala Telugu Visheshamshalu & Sahityamshalu 1&2

    Taratarala Telugu Visheshamshalu & Sahityamshalu 1&2

    0

    అందరికీ నచ్చే సుందర రచన

    ముప్పై వసంతాల నాటి ముచ్చట్లతో ముందుమాటను ఆరంభిస్తాను. నాడు నేను ఉస్మానియా యూనివర్సిటి తెలుగు విభాగంలో పరిశోధక (పిహెచ్.డి) విద్యార్థిని. భాగ్యనగరంలో అది సాయంత్రం. నాలుగైదు కార్యక్రమాలైనా జరుగుతున్న బంగారపు రోజులవి. చిక్కడపల్లి ఈ సభల కీలక వేదిక. నావంటి నలుగురైదుగురు నవయువకులు దాదాపు ప్రతిరోజూ ఈ కార్యక్రమాలకు హాజరు కావడం రివాజు.

    అప్పట్లో చీకోలు సుందరయ్య గారు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో “రంగ తరంగం” పేరుతో నగరంలో జరిగిన సాహిత్య కార్యక్రమాల సమీక్షా కథనాలు వ్రాసేవారు. అంత స్పష్టంగా చెప్పలేను కానీ, చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో కృష్ణశాస్త్రి గారిమీద సిద్ధాంత గ్రంథం ఏదో ఆవిష్కరణసభ. ఆవిష్కరణ | కర్త సి.నా.రె. దిగ్గజాల వంటి కవులు, అనేకమంది సాహిత్యా భిమానులైన శ్రోతలు. సభ కిటకిటలాడుతున్నది. కొంతమంది చోటు దొరకక నిలబడ్డ పరిస్థితి. సి.నా.రె. ప్రసంగం సహజ సిద్ధమైన సభారంజకంగా సాగిపోతున్నది. మధ్యలో తన | ప్రసంగానికి కొంచెం విరామం ఇచ్చి “చూశారా ! ఈ కార్యక్రమం దిగ్విజయం | అయినట్టే లెక్క. మా మిత్రుడూ ప్రతిభావంతుడైన పాత్రికేయుడు చీకోలు | సుందరయ్య సైతం నిలబడే వార్త రాస్తున్నాడు” అన్నారు సి.నా.రె. అందరి దృష్టి సుందరయ్య గారి వైపు దిరిగితే సుందరయ్య గారి చూపు మాత్రం సి.నా.రె. ప్రసంగాన్ని సునిశితంగా వీక్షిస్తున్నది. ఆ రోజుల్లో సుందరయ్య ‘రంగ తరంగం ……..

    320.00
    Add to cart
  • Telisi okate -Teliyaka okate