• Sampadalu mee Hakku

    Sampadalu mee Hakku

    0
    98.00
    Add to cart
  • SAMPADSRUSTIKI SATAKOTIMAARGALU

    SAMPADSRUSTIKI SATAKOTIMAARGALU

    0

    SAMPADSRUSTIKI SATAKOTIMAARGALU

    విషయ సూచిక
    ఆర్థిక ప్రస్థానంలో… కరదీపిక: శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పొదుపు – పెట్టుబడులకు మార్గదర్శి డా. దువ్వూరి సుబ్బారావు ఆర్థిక భద్రతకు మార్గదర్శక గ్రంథం: శ్రీ మానుకొండ నాగేశ్వరరావు

    ధన్యవాదాలు
    తొలిమాట
    పొదుపు – అప్పుడు… ఇప్పుడు…
    భిన్న లక్ష్యాలు – విభిన్న పెట్టుబడి వ్యూహాలు
    మీకంటూ ఓ బడ్జెట్ ఉండాలి
    పిల్లలకు పొదుపు పాఠాలు
    పోస్టాఫీసు పొదుపు పథకాలు
    బ్యాంకుల్లో పొదుపు పథకాలు మీ అరచేతిలోనే…
    మ్యూచువల్ ఫండ్ల ఆవిర్భావం
    మ్యూచువల్ ఫండ్లు – సంపద సృష్టికి సోపానాలు
    మ్యూచువల్ ఫండ్ పథకాలు ఎన్నెన్నో…
    పథకాల ఎంపికలో కొన్ని మెలకువలు
    సిప్ – సంపద సృష్టికి ఓ మంత్రదండం!
    దేశ స్టాక్ మార్కెట్ల ప్రస్థానం
    మారుతున్న మార్కెట్ల ముఖచిత్రం
    సంపద సృష్టికి శతకోటి మార్గాలు…………………..

    600.00
    Add to cart
  • Sandhya Vandanamu

    Sandhya Vandanamu

    0

    మనవి

    వేదకాలములో నిత్యాగ్నిహోత్రము, స్వాధ్యాయము, మంత్రజపము, తపస్సు యజ్ఞయాగాదులు, పుణ్యకర్మానుష్ఠానముగా చెప్పబడినవి. ఆ తరువాత కలియుగములో వీటికి ప్రత్యామ్నాయముగా అనేకములు నేడు చోటుచేసుకున్నవి. అందువలన ఏది కర్మ? (అనగా వేదోక్తమైన కర్మ), ఏది వికర్మ? (అనగా కర్మబాహుళ్యము) ఏది అకర్మ (అనగా ఏది అపభ్రంశము) అని తర్కవితర్కములు చేయక • తమోగుణ రజోగుణయుతులై పుణ్యకర్మానుష్ఠానము చేయకుండా • సత్త్వగుణ ప్రధానులై నిష్కామపుణ్యకర్మానుష్ఠానము చేసి గుణరహితులై

    ఆత్మస్థానమును పొంది, ఆత్మయై విరాజిల్లుటయే పరమపురుషార్థము.

    దీనికి సాధనగా • ధర్మపరుడైయుండి • శ్రద్ధావంతః – అనగా శ్రద్ధ కలిగి

    శ్రేయాన్ స్వధర్మః – స్వధర్మమును ఆచరించుచూ రాగద్వేషా తయోః న వశమ్ ఆగచ్చేత్ – రాగద్వేషములనే వాటి వశమునకు

    లోనుగాక • నిరాశీ నిర్మమో భూత్వా – ఆశ, మమత, అహంకారము లేకుండా • అనసూయంతః – అసూయాది దుర్గుణములు లేకుండా |

    ఈషణత్రయములు లేకుండా సుఖదుఃఖములనే ద్వంద్యములకు లోనుగాక | ద్వంద్వాతీతులై యున్న కర్మబంధ విముకులగుదురని చెప్పిన శ్రీకృష్ణ భగవానుని సూచనలు పాటించుట ఉత్తమము. శాస్త్రమును అధ్యయనము చేయుటవలన శాస్త్రములోని విషయముల గ్రహింపవచ్చును. కానీ గుణములవలననే ఆచరణ సాధ్యము. కావుననే |……

    360.00
    Add to cart
  • Sankellu Tenchukuntu. . . .

    Sankellu Tenchukuntu. . . .

    0

    మా ఊరు.. ఆ రోజులు

    అధ్యాయం – 1.

    మా ఊరు.. ఆ రోజులు

    ఇది నన్ను తీర్చిదిద్దిన వ్యక్తులు, అధికారులు, వారితో ముడిపడిన ఘటనలకు సంబంధించిన యథార్థ జీవితం.

    నేను జన్మించాను. ‘ప్రాంతంలో’ అని ఎందుకు అన్నానంటే నా తల్లిదండ్రులు లేదా తాత, అవ్వలు నేను ఏ రోజున పుట్టానో రాసిపెట్ట లేదు. ఓ నడివేసవిలో మిట్ట మధ్యాహ్నం పూట నేను పుట్టానని అమ్మ చెప్పేది. అది ఏప్రిల్ కావచ్చు లేదా మే నెల కావచ్చు. గ్రామాల్లో నివసించే ఓ చదువురాని దళిత మహిళ సంవత్సరం, నెల, తేదీ ఎలా గుర్తుపెట్టుకుంటుంది? అమ్మలాగే నాన్నకూ చదువు అక్షరం ముక్కరాదు. నేను 1962లో ఐఏఎస్లో చేరిన తర్వాతనే వారు మాతృభాషలో అక్షరాభ్యాసం చేశారు.

    తన కడుపులో ఉన్నది ఓ మగబిడ్డ అని, అతడు ఏదో ఒకరోజు ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనే ఉన్నతపదవి చేపడతాడని ఏ సోదెమ్మ అమ్మకు చెప్పలేదు? ఊళ్లో ఉండే అందరు ఇతర మహిళల్లాగే అమ్మ కూడా ఎలాంటి వైద్య సదుపాయం లేకుండా నాకు జన్మనిచ్చేందుకు మరణం అంచులదాకా వెళ్లి తిరిగివచ్చింది.

    నన్ను నన్నుగా తీర్చిదిద్దడంలో అతి ముఖ్యపాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తులు ఎవరంటే అమ్మ శ్రీమతి కాకి మాణిక్యమ్మ, నాన్న శ్రీ కాకి శోభనాద్రి అని చెప్పకుండా ఎలా ఉండగలను? నా తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కూలినాలి చేసుకుని జీవనం గడిపే కోట్లాది మంది లాగే కడుపేదలు. ఆ రోజుల్లో వ్యవసాయం ఊళ్లోని కూలీలందరికీ ఏడాదికి 150 రోజుల దాకా, కొందరికైతే 200 రోజుల దాకా పని కల్పించేది. నిరంతరాయంగా కొనసాగే దయనీయమైన ఉపాధికి ఇంత కన్నా మంచి ఉదాహరణ ఉండదు. కొందరు మరికొన్ని వారాల పాటు పని వెతుక్కుంటూ పొరుగూళ్లకు వెళ్లేవారు. మా నాన్న తన జీవితమంతా ఓ భూస్వామి దగ్గర పాలేరుగా పనిచేశారు. పాలేరు అంటే ఓ ఏడాది పాటు పనికి కుదుర్చుకోవడం. ఏడాది తర్వాత ఆ ఏర్పాటు కొనసాగనూ వచ్చు లేదా ఎవరిదారి వారు చూసుకోవచ్చు.

    అంతా నోటిమాట మీదే నడుస్తుంది. ఎలాంటి రాతకోతలు ఉండవు. 75 కిలోల ధాన్యపు బస్తాల రూపంలో జీతాలు ఇచ్చేవారు. మామూలుగా అయితే ఓ 15 బస్తాల………………………

    300.00
    Add to cart
  • Sarvadevata Homa Prakaranam
  • Screen Play_Vanda Satyalu

    Screen Play_Vanda Satyalu

    0

    ఆశంస

    ఎందరో మహాను భావులు. అందరికీ వందనాలు. ‘స్క్రీన్ ప్లే’ అన్న మకుటంతో కదన రచనలో వచ్చే సమస్యలేమిటి అనే విషయంపై, నూతనంగా చలన చిత్ర కథలు, సంభాషణలు, కథన రచనలో పాల్గొనే ఎందరో అధునాతన రచయితలు, సినిమా రచన చెయ్యాలని అభిలషించే యువతీ యువకుల కోసం, ఈ గ్రంథం రచించాలన్నది ఏనాటి నుంచో నా మనసులో పాతుకుపోయిన ఆకాంక్ష.

    దాని కోసం అమెరికా వెళ్ళినప్పుడు చాలా ‘హాలీవుడ్ స్క్రీన్ ప్లే’ గ్రంథాలు కొని తీసుకు రావటం జరిగింది. 2007వ సంవత్సరం నుంచి తెలుగు విశ్వవిద్యాలయంలో “స్క్రీన్ ప్లే’ తరగతులు నిర్వహించి, తెలుగు సినీ రచయితల సంఘం పక్షాన కూడా ‘స్క్రీన్ ప్లే’ తరగతులు నిర్వహించడం జరిగింది.

    అంతే కాకుండా రాఘవేంద్రరావు గారు, ఎ. కోదండరామిరెడ్డి గారు, బి. గోపాల్ గారు ఇలా ఎంతో మంది దర్శకులను ‘షూటింగ్ స్పాట్ లో గమనించి కొన్ని స్క్రీన్ ప్లే వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది.

    బొబ్బిలి బ్రహ్మన్నలో ఒక షాట్ తీసినప్పుడు ఇలా ఎందుకు చేసారు అని అడిగితే అభినయానికి విలువనిచ్చి అని చెప్పారు. అలాగే శారదగారి పాత్ర కూతురు ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు తలుపు తీసే షాట్లో ఎదురుగా కృష్ణంరాజు గారు కనిపించాలిగదా అంటే అది జనం ఊహిస్తారు. అందుకని కెమెరా లోపల పెట్టి తలుపు తియ్యగానే సజెషన్లో హీరో నిలబడి వుంటాడు. అతని అభినయం తెలిసిపోతుంది. అతను బాధగా ఉన్నాడా? కోపంగా ఉన్నాడా అనేది. తలుపు తెరిచి చూడగానే కట్రాయిలా నిలబడ్డ భర్తను చూసి వెనకడుగు వేస్తే, ఆమెకు గుండెఝల్లు మంది అన్న ఎక్స్ ప్రెషన్ ‘ఆడిటోరియా’నికి తెలుస్తుంది అన్నారు. ఇలా ఆయనను ఎన్నో సినిమాలలో చిన్న………….

    300.00
    Add to cart
  • Screenplay Direction

    Screenplay Direction

    0

    మన తెలుగులో సినీ పరిజ్ఞానం గూర్చి తెలుసుకోవాలనుకున్న వారికి పుస్తక రూపంలో ఏ సమాచారమూ లభించదు. ఈ లోపం చిత్ర రంగ ప్రారంభదశ నుండి మనలను వెంటాడుతూనే ఉంది. కారణమేమిటంటే మొదటి నుండి మనకున్న సాంకేతిక నిపుణులు వాళ్ళ అనుభావాలను గ్రంథస్తం చేయలేకపోయారు. అనుభవజ్ఞుడు వ్రాయలేడు. వ్రాయగలిగిన వారికి సాంకేతిక నైపుణ్యం తెలియదు. ఈ ఇబ్బంది వలన మన తెలుగు సినీ రంగంలోని దర్శకులు, సాంకేతిక నిపుణులు తమ అనుభవాలను తమలోనే అణచివేసుకున్నారు.

    నేను ‘నటసోపానం’ అనే నట సాంకేతిక సిద్ధాంత గ్రంథం వ్రాసిన తరువాత చాలా మంది మిత్రులు మన తెలుగులో స్క్రీన్ ప్లే, దర్శకత్వం గూర్చిన సమాచారం ఇసుమంతైనా లేదు. ఆ కొరత తీర్చగల్గే బాధ్యత తీసుకోమని నన్ను ప్రోత్సహించడంతో ఈ చిన్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాను. కళా రంగంలో తమ కలలను సాకారం చేయదలచుకొన్న వారు తప్పని సరిగా నటసోపానం చదివి తీరాలి. ఎందుకంటే అందులో కళలకు సంబంధించిన సమస్త సమగ్ర సంపూర్ణ సమాచారం వాదించిన విస్తరిలా ఉంది. ఒక నటుడు జీవితాంతం శ్రమపడి నేర్చుకున్న అనుభవసారం కంటే ఒక్క నటసోపానం, ఎన్నో రెట్లు గురువు రూపంలో మీకు సాంకేతిక సంస్కారం బోధిస్తుంది ఇది వాస్తవం.

    ఈ చిన్న పుస్తకంలో రెండు గొప్ప విషయాల గురించి వివరించడం జరిగింది. ఒకటి స్క్రీన్ ప్లే, రెండు డైరెక్షన్. ఈ భాగాలలో పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించలేనివాడు కథను ప్రేక్షకామోదంగా చిత్రించలేడు. చిత్ర రంగంలో నాకున్న అనుభవం కొంచమేనని చెప్పలేను. అపారమని అంతకన్నా చెప్పలేను. కాని నేను రచించిన ఈ చిన్న పుస్తకం వర్ధమానులను ఉత్తమ విలువలు గల స్క్రీన్ ప్లే రైటర్స్ గా, డైరెక్టర్స్ గా తీర్చి దిద్దగలదని క్లాప్ కొట్టి మరీ చెప్పగలను.

    150.00
    Read more
  • Seetaramanjaneya Samvadamu

    Seetaramanjaneya Samvadamu

    0

       ఈ సీతారామాంజనేయ సంవాదానికి కీ.శే.గురుమూర్తి గ్రంధకర్త. నారాయణ శాస్త్రులు సరళ వ్యాఖ్యానం రాశారు. 29 ఏళ్ళ తరువాత యిప్పుడు మారిన వాడుక భాషకు అనుగుణంగా మూలభంగం కాకుండా వోరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారు సరళ వ్యాఖ్యానం రాశారు. ఆధ్యాత్మిక రామాయణానుభూతి (రామాయణంలో ఈ సంవాదం లేదు) తో గురుమూర్తి గారు రాసినదే ఈ సీతారామాంజనేయ సంవాదం. భక్తునికీ భగవంతునికీ మధ్య జరిగిన సంవాదమిది. ఆనందానికీ, ఆనందోబ్రహ్మకూ నిదర్శనం.

    350.00
    Add to cart
  • Shakti Aavribhavam
  • SHANKARABHARANM By Vamsi

    SHANKARABHARANM By Vamsi

    0

     

     

    SHANKARABHARANM By Vamsi

    ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ చిరస్మరణీయ చిత్రం ‘శంకరాభరణం’ వెండితెర నవల (Novelization) రూపంలో పుస్తకంగా అందుబాటులో ఉంది. వంశీ రచించిన ఈ అపురూప గ్రంథాన్ని విశ్వనాథ్ తనయుడు కె. నాగేంద్రనాథ్ ఇటీవల పునర్ముద్రించారు. ఈ పుస్తకం శంకరాభరణం సినిమాలోని భావోద్వేగాలు, సంగీత, సాహిత్య విశేషాలను అక్షర రూపంలో అందిస్తుంది.

    200.00
    Add to cart
  • Shivangi

    Shivangi

    0

       శివంగి

    ఎదురుగా ఎటువంటి అడ్డంకి వున్నా, వెనుకా ముందూ చూసుకోకుండా ఎగిరి అవతలి పక్కకు దూకటం సమీరుడి అశ్వానికి వున్న పెద్ద అలవాటు.

    కళ్ళేలను బిగించి పట్టుకున్నా, పళ్ళు బిగించి గట్టిగా అరిచినా, కొంచెంగా కూడా పట్టించుకోదు అది.

    రాళ్ళు రప్పలు కాదు…దట్టమైన ముళ్ళ పొదలు ఇవి. కింద పడటం అంటూ జరిగితే కత్తులతో చీరినట్లు గాయాలు అవుతాయి. ‘జాగ్రత్తరా నాన్నా…’ మూడు బారల వెనుకగా తన వాహనాన్ని నడిపిస్తున్న సమీరుడి తండ్రి చిన్నగా హెచ్చరించాడు

    సూర్యుడు పడమటి దిక్కుకి పడిపోతున్నాడు. పగటి సమయమంతా

    శ్రాంతిగా తమతమ నెలవుల్లో పడుకుని వున్న జంతువులన్నీ వళ్ళు రుచుకుంటూ వేటలకు బయలుదేరే సమయం దగ్గరపడుతోంది.

    మూడు క్రోసులుంది రహదారి… త్వరగా వెళ్ళకపోతే అడవిలో వుండగానే కటిపడిపోతుంది’ అంటూ కాలిమడమలతో తన అశ్వాన్ని కదిలించాడు మీరుడు. గట్టిగా సకిలించింది అది. అతని తండ్రి అనుమానపడుతున్నట్లుగానే ఎదుట న్న ఒక పెద్ద పొదమీద నుంచి ఎగిరి అవతలకి దూకింది.

    200.00
    Add to cart
  • SIKKOLU KATHALU

    SIKKOLU KATHALU

    0
    180.00
    Add to cart