-
Rich Dad Poor Dad
0₹399.00రిచ్ డాడ్ పూర్ డాడ్….
* ధనికులు అవాలనుకునే వారు ఆదాయాన్ని అధికంగా సంపాదించాలి అనే కట్టుకధని పటాపంచలు చేస్తుంది.
* మీ ఇంటిని మీరొక ఆస్తి అనుకునే నమ్మకాన్ని సవాలు చేస్తుంది.
* తమ పిల్లలకి డబ్బు గురించి నేర్పించటానికి నేటి విద్యా విధానం మీద ఎందుకు ఆధారపడకూడదో తల్లిదండ్రులకు తెలియజేస్తుంది.
* ఆస్తి, అప్పులకు ఆర్ధికపరమైన శాశ్వత నిర్వచనాలను ఇస్తుంది.
* మీ పిల్లలు భవిష్యత్తులో ఆర్ధికంగా విజయం సాధించటానికి, వాళ్ళకు ఏం నేర్పాలో మీకు బోధిస్తుంది.
రాబర్ట్ కియోసాకీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది జనానికి డబ్బు గురించి ఎలా ఆలోచించాలో నేర్పి, వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చారు. సూటిగా మాట్లాడడం లోనూ, ధైర్యంగా మూసభావాలని ఎదుర్కోవడంలోనూ అతను పేరు పొందారు. తరచూ అతని వైఖరి సాంప్రదాయక వివేకాన్ని ధైర్యంగా ఖండిస్తూంటుంది. ఆర్దిక స్వాతంత్ర్యాన్ని ఆవేశపూరితంగా సమర్ధించే వ్యక్తీగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.
రిచ్ డాడ్ పూర్ డాడ్ అత్యుత్తమ వ్యక్తిగత ఆర్ధిక గ్రంథం
“భవిష్యత్తులో భాగ్యవంతులవాలనుకునేవాళ్ళు రిచ్ డాడ్ పూర్ డాడ్ తోనే మొదలుపెట్టాలి.”
– యు.ఎస్.ఎ.టుడే
“జనం డబ్బు కోసం కష్టాలు పడటానికి ముఖ్యకారణం, వాళ్ళు ఎన్నో ఏళ్ళు విద్యాలయాల్లో చదువుకున్నప్పటికీ, డబ్బు గురించి అక్కడ ఏమీ నేర్చుకొకపోవటమే! దాని ఫలితం – వాళ్ళు డబ్బు కోసం పనిచేయటం నేర్చుకుంటారు…. కాని, డబ్బు చేత పనిచేయించటం వాళ్ళెన్నడూ నేర్చుకోరు.”
– రాబర్ట్ కియోసాకీ
-
Rugvedha Aryulu
0₹180.00మనం – మన పూర్వీకులు
నేడు మనదేశంలో మానవుని చూస్తున్నాం. అతని సాంఘిక, రాజకీయ, మున జీవితాన్ని ఎరుగుదుం, అతని ఆహారం, వేషభాషలు, నిత్యావసరాలు ఏమిటో మనకు తెలుసు. “మనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ మార్పు జరుగుతూ వుంది. ఈ సంగతిని ఎవరూ కాదనలేరు. కాని ఆ మార్పు ఎంత తీవ్రంగా జరిగిందో తెలుసుకొనుట కషం. ఇందుకు నూరు సంవత్సరాల తేడాతో చారిత్రక కాలాన్ని, అంతకంటే ఎక్కువ తేడాతో చరిత్రకు పూర్వమున్న కాలాన్ని, సాంఘిక, ఆర్థిక, మతదృష్టితో పరిశీలిస్తే, మార్పు నమ్మకంగా తెలుస్తుంది. మనం క్రీ|| శ|| 1956 నుండి కాకుండా క్రీ॥ ఈ 1950 నుండి వెనక్కు పయనించుదాము. ఇక్కడ 1857 ను గురించి ఒకమాట చెప్పాలి.. 1857 లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. 1757 లో ప్లాసీ యుద్ధంలో విజయులైనందున మనదేశంలో ఆంగ్లరాజ్య స్థాపన జరిగింది. కాబట్టి చాలామంది మేధావులు •57ను చాలా చెడుగా భావిస్తారు. కాని 1657, 1557, 1457 మొదలైన సంవత్సరాల్లో అటువంటి అనిష్టాలు మనదేశంలో ఏమీ కానరావు. | క్రీశ 1950 1ఇప్పుడు మనం రాతియుగం, రాగియుగం, యినుపయుగం. తుపాకిమందు.
ఆవిరి యుగాలను దాటి పరమాణుయుగంలో ఉన్నాం. 2 వాయు మండలంపై మనకు అధికారముంది. గంటకు 500 మైళు వేగంతో పోయే విమానాలు ఆకాశంలో పరుగులు తీస్తున్నాయి. ఇక రైళ్ళు, మోటారు వాహనాల సంగతి చెప్పేదేముంది?
మనది ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ. 4మన గణరాజ్యానికి రాష్ట్రపతి డా|| రాజేంద్రప్రసాదు. ఆయన మనదేశ రాజధాని
ఢిల్లీలో వుంటారు. మనకు ముఖ్యమైన సమన్వయ భాష హింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో అస్సామీ, బెంగాలీ, ఒరియా, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, మరాఠీ, గుజరాతీ
మొదలైన సాహిత్య భాషలున్నాయి. ఇవే కాకుండా మైథిలీ, మాగధీ, భోజపురి, ప్రజ, మాళవీ, రాజస్థానీ, కౌరవీ, పహాడీ మొదలైనవి కూడా సాహిత్య భాషలే.
(అవికూడా సాహిత్య భాషలవుతున్నాయి.) 6. మనం పెట్టుబడిదారీ వర్గ వ్యవస్థలో వున్నాం. 7. మనచేతిలో రాజ్యాధికారాన్ని అట్టి పెట్టుకొనుటకు యుద్ధ విమానాలు, అణు
బాంబులు పరమాస్త్రాలుగా వున్నాయి. భీషణ ఫిరంగులు, మెషినుగన్నుల సంగతి
చెప్పనవసరం లేదు. 8. మనదేశంలో హిందూ మతం, ఇస్లాం మతం ముఖ్య మతాలు. కాని
విద్యావంతులకు ఆ మతాలపై పూర్వంవలె విశ్వాసం లేదు. 9. చదువుకొన్నవారు ఆహార పానీయాల్లో అంటును పాటించరు. వివాహాదుల్లో
కూడా కులగోత్రాలు కూలుతున్నాయి. 10. సాహిత్యాకాశంలో రవీంద్రుడు,
జయశంకరప్రసాదు అస్తమించారు. హిందీలో నిరాలా, సుమిత్రానంద పంతు యిప్పుడు కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు.
-
Saanukula Aalochana Sakthi – The Power of Positive Thinking
0₹200.00ఇంటర్ నేషనల్ బెస్ట్ సెల్లర్
ప్రపంచ ప్రసిద్ది పొందిన The Power of Positive Thinking పుస్తకమును ‘సానుకూల ఆలోచన శక్తి’ గా తెలుగులోకి తీసుకువచ్చారు.
లక్షలాది స్త్రీ పురుషులు వాళ్ళ జీవితాలను విజయవంతం చేసుకోవడానికి సహాయపడింది ది పవర్ అఫ్ పాజిటివ్ థింకింగ్. అనూహ్యమైన అమ్మకాలు సాధించిన ఇందులో డాక్టర్ పీల్ ఆచరణలో విశ్వాసం యొక్క శక్తిని నిరూపిస్తారు. ఈ పుస్తకంలో వివరించిన ఆచరణీయ కిటుకులతో మీరు మీ జీవితంలో బలం పుంజుకోవచ్చు. పైగా మీ కోరికలను, ఆశలను నేరవేర్చుకోవటానికి అవసరమైన ఉపదేశాన్ని పొందవచ్చు. మీరు నేర్చుకోనేవి :
. మీ మీద ,మీరు చేసే ప్రతిదాని మీద నమ్మకం పెంచుకుంటారు.
. గొప్ప శక్తిని, పట్టుదలని పెంచుకుంటారు.
. మీ లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన శక్తి పెంచుకుంటారు
. చింతపడే లక్షణాన్ని పోగొట్టుకుని విశ్రాంతికరమైన జీవనాన్ని సాధిస్తారు.
. మీ వ్యక్తిగత, వృత్తిపర సంబంధ బాందవ్యాలని మేరుగుపరుచుకుంటారు.
. మీ పరిస్థితుల మీద అధికారం పొందుతారు.
. మీ మీద మీరు దయగా ఉంటారు.
పాఠకుడు ఆనందమైన, తృప్తికరమైన,ప్రయోజనకరమైన జీవితాన్ని సాధించడానికి తోడ్పడాలన్న ఏకైక లక్ష్యంతో రాయబడింది ఈ పుస్తకం.
……. నార్మన్ విన్సెంట్ పీల్
-
Sagara Ghosha
0₹440.00ఇది విశ్వకావ్యం. భూమి చరిత్రే ఈ కావ్యంలోని ఇతివృత్తం. మానవుడే దీంట్లో నాయకుడు. ఇది మనిషి కథ. కోట్ల ఏళ్లనాటి భూమి పుట్టుక నుండి నిన్న మొన్నటి ఘట్టాల వరకు ఇంచుమించుగా మానవుని మహాప్రస్థానంలోని అన్ని సంఘటనలు ఈ కావ్యంలో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఇది పర్యావరణ పద్య కావ్యం. మనిషి భౌతిక పరిసరాలు అందంగానూ, ఆనందాయకంగాను ఆలోచించాలని తెలియజెప్పే కావ్యం ఇది. ఆదిశంకరాచార్యుని అద్వైత సిద్ధాంత నేపథ్యంలో అన్ని దేశాల సాంస్కృతిక చరిత్రని పరిశీలించి, విశ్లేషించిన కావ్యం.
ఇది 1116 పద్యాలతో నిండిన కావ్యం. ఒక ఆశ్వాసానికి 108 చొప్పున 10 ఆశ్వాసాలు ఉన్నాయి. అవతారికలో 36 పద్యాలు ఉన్నాయి. వృత్తాలు పాతవే అయితే ఇతివృత్తం కొత్తది. ఒకానొక ప్రౌడవయస్కుడైన కవి సాగరతీరంలో కూర్చొని, సముద్రాన్ని వర్ణిస్తూ, తన్మయస్థితిలో ఉంటాడు. ఇంతలో ఒక పిల్ల కెరటం ఒడ్డుకు వచ్చి, ఆ కవి ఒళ్ళో వాలుతుంది. ఒక పసిపాప తన ఒడిలోకి వచ్చినట్లుగా భావించి, ఆ కవి ఆ కెరటాన్ని ప్రేమగా చేరదీస్తాడు. లాలిస్తూ దాని ఒళ్ళంతా నిమురుతూ ఉంటే, దాని వీపంతా జిడ్డు జిడ్డుగా, మడ్డిగా కనబడుతుంది.
“స్వచ్చంగా ఉండవలసిన నీటికెరటానివి, ఇలా ఉన్నావేమిటి”? అని ప్రశ్నిస్తాడు. తాను ఇరాక్ తీరం నుంచి కొట్టుకు వస్తున్నానని, సద్దాం హుస్సేన్ సముద్రంలో ఆయిల్ పారబోసినప్పటి నుండి తన పరిస్థితి ఇలా అయిందని కెరటం వాపోతుంది. తాను కొద్ది రోజులు కవి ఒడిలోనే విశ్రాంతి తీసుకు వెళతానని ఆర్థిస్తుంది. గుండె కరిగిన కవి ఆ తరంగ బాలికకు కవిత్వంతోనే అతిథి మర్యాదలు చేసి, జోలపాడి నిద్రపుచ్చుతాడు. తరంగం మేల్కొన్న తరువాత అది తిరిగి వచ్చిన తీరాలలోని విశేషాలను చెప్పమని ఆర్థిస్తాడు. అప్పుడా కెరటం చెప్పిన మానవుని జీవిత కథే ఈ సాగరఘోష.
-
Sai Geethamritha Sa(Ga) Ram
0₹230.00కె. వివేకానంద రెడ్డి గారు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం, అలాగే “సాయి కీర్తన” గారు కూడా ఫోన్ ద్వారా పరిచయం .
వివేకానంద రెడ్డి గారు చాలాకాలంగా వేలాది ఆధ్యాత్మిక గ్రంధాలని చదువుతున్న వ్యక్తి. నా ఆధ్యాత్మిక నవల “జయం” చదవం ద్వారా వారు నాకు పరిచయమయ్యారు. అయన తరచూ షిర్డీ వెళ్తూ, దారిలో హైద్రాబాద్ లోని మా ఇంటికి వస్తుంటారు. ఆయనది భక్తి మార్గం.
పుట్టుకతో అన్యమతస్తురాలైన కుమారి సాయి కీర్తన వారి మతాన్నే కాక హిందూమతాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసారు. వీరిద్దరూ సాయి భక్తులే. కుమారి “సాయి కీర్తన”, “సాయి సచ్చరిత్ర” ని చదివి దాని గూడార్ధాన్ని గురించి వివేకానంద రెడ్డి గారితో చర్చించాక, ఈ పుస్తకానికి అంకురార్పణ జరిగింది. వీరు పరస్పర సహాకారంతో ఈ పుస్తకాన్ని రాసారు.
ఈ పుస్తకం షిర్డీ సాయి భక్తులకే కాక , ఆధ్యాత్మిక ఆసక్తి గల అందరికి నచ్చుతుందని ఆశిస్తూ.
-
Samaya Yajamanyam
0₹150.00పరిచయం
ఒక ఎగ్జిక్యూటివ్ గా మీ వృత్తిలో మీ సమయ యాజమాన్య సామర్థ్యమే మీ విజయాన్ని లేదా అపజయాన్ని నిర్ణయిస్తుంది. ఒక విషయాన్ని సాధించడానికి సమయం తప్పించరాని, మరో ప్రత్యామ్నాయం లేని వనరు. అది మీ అమూల్యమైన ఆస్తి. దాన్ని ఆదా చేయడమో, ఒకసారి చేజారినట్టయితే తిరిగి రాబట్టుకోవడమో సాధ్యం కాదు. మీరు చేయ వలసిన ప్రతి పనికి సమయం కావాలి. మీరు సమయాన్ని మెరుగ్గా ఉపయోగించే కొద్దీ మీరు మరింత ఎక్కువ సాధించగలుగుతారు. ఫలితాలు మెరుగ్గానూ, మరింత గొప్పగానూ ఉంటాయి.
చక్కని ఆరోగ్యానికీ, శక్తివంతమైన వ్యక్తిత్వానికి సమయ యాజమాన్యం అత్యంత అవసరం. మీ జీవితం మీద, సమయం మీద మీకున్న నియంత్రణా శక్తిస్థాయి భావన – మీ అంతరంగిక శాంతి, సమన్వయం, మానసిక ఆరోగ్యం స్థాయిని ప్రధానంగా నిర్ణయిస్తుంది. మీ సమయం మీద మీకు నియంత్రణ లకపోతోందన్న మీ భావమే మీ ఒత్తిడికీ, ఆందోళనకూ, కుంగుబాటుకూ ప్రధాన వనరు. మీ జీవితంలోని క్రిటికల్ ఈవెంట్ను మెరుగ్గా ఆర్గనైజ్
కుంటూ నియంత్రించగలిగినట్టయితే క్షణం క్షణం మీరు మెరుగైన నిహంతో మరింత శక్తివంతంగా పనులు చేసుకుంటూ, మెరుగ్గా నిద్రపోగలుగుతూ మరింత ఎక్కువగా సాధించగలుగుతారు.
పుస్తకంలో విపులీకరించిన ఆలోచనలనూ, పద్ధతులనూ గించడం ద్వారా మీరు ప్రతిరోజూ రెండు అదనపు ఉత్పాదక గంటలు
ఉపయోగించడం ద్వారా………… -
Samkshipta Brahmana Charitra
0₹250.00తెలుగు బ్రాహ్మణుల విస్తృతి, వైవిద్యం జగద్విదితం.
మూలాలన్ని ఒక్కటే అయినా వీరిలో శాఖలు అనేకం.
బ్రాహ్మణుల శాఖలు, గోత్రాలు, ప్రవరలు,ఋషులు
గోత్రపురుషుల గాధలు వీటన్నిటి సంక్షిప్త రూపం – ఈ పుస్తకం.
అక్షరక్రమంలో
గోత్రాలు, ప్రవరల పట్టిక, ఈపుస్తకంలో ఒక అనుబంధం.
బ్రాహ్మణులందరికీ ఇది అవస్యపటనీయం.