• Power of the Plus Factor

    Power of the Plus Factor

    0

    The key to fulfill your desires, realize your dreams and find true happiness is the Plus Factor. When activated, this key motivates you to achieve good health, confidence and security.

    Dr. Norman Vincent Peale, one of the most popular and inspirational writers of his time, explains how you can tap into this inexhaustible resource of energy and achieve your goals.

    This book will teach you how to:
    • Unlock your potential through creative dreaming
    • Set positive goals to enrich your inner self
    • Overcome setbacks by persistence and perseverance and
    • Achieve your ultimate goals

    Power of the Plus Factor will guide you and help you discover the joys of a healthy and happy lifestyle.

    Norman Vincent Peale is the internationally acclaimed author of 46 books, such as Be A Winner, Positive Living Day By Day and Six Attitudes for Winners. He was a progenitor of the theory of “positive thinking”.

    120.00
    Add to cart
  • Praavenya Jeevana Pradeepika

    Praavenya Jeevana Pradeepika

    0

    ప్రావీణ్య జీవన ప్రదీపికలో అనేకానేక భావాలు, సాధనాలు, ప్రపంచస్థాయిలో, నిండి నిబిడీకృతమై ఉన్నాయి. అవి మిమ్మల్ని క్షణాల మీద ప్రపంచ శ్రేణి విజేతల స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ పుస్తకంలో జీవితాన్ని అనూహ్యంగా మార్చే 36 అంశాలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి మిమ్మల్ని వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ పై స్థాయికి పెంచుతాయి.

                    ఒక్కొక్క రోజూ బ్రహ్మాండమైన ఫలితాలను సృష్టిస్తూ, ఒక మహాకావ్యంలా జీవించే హక్కుమీకుంది. నిరాశానిస్పృహలను పూర్తిగా పారద్రోలండి. మీరు అత్యంత గొప్పగా చేస్తున్నట్టు భావించుకోండి. ప్రావీణ్య జీవన ప్రదీపిక మీకు జీవితంలో ప్రావీణ్యం పొందాలన్న ప్రేరణనిచ్చి, మీ సాహసోపేతమైన కలలను మీరు గుర్తించేలా చేసి, మీ భవిష్యత్తు మీ గుప్పిట్లోనే ఉందని బోధించి, మీలో ఉన్న శక్తితో మీరు మళ్ళీ కలిసే ప్రదీపికగా నిలుస్తుంది. ప్రజ్ఞావంతమైన ఈ పుస్తకం మీ ప్రదీపిక ఇవాళే చదవటం మొదలుపెట్టండి!

    175.00
    Add to cart
  • Prachina Vignanam
  • Prapancha Prasiddha Janapada Kadhalu

    Prapancha Prasiddha Janapada Kadhalu

    0

    ఏ కాలానివైనా, ఏ దేశానివైనా, ఏ భాషవైనా జానపద కథలంటేనే చిత్రవిచిత్ర చమత్కారాలతో సాగుతూ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసి తమ వెంట ఏ చుక్కల లోకానికో, ఏ అందాల సీమలకో తీసుకుపోతాయి. ఈ కథలు ఆశ్చర్యానందాలే కాదు. జీవితానికి అవసరమైన విలువలను అందిస్తాయి. తరతరాల అనుభవాల అనుభూతుల సారమే ఈ జానపద కథలు. ఈ జానపద కథలు రేకెత్తించే కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు. విశేషాలు…

    మాటలు అమ్మే అంగడి వల్ల బాటసారి పొందిన ప్రయోజనం?

    మనం కురూపులమైనా, సౌందర్యవంతులమైనా జీవితాంతం మనల్ని అంటిపెట్టుకుని ఉండేది ఏమిటి?

    స్వర్గానికి కోటీశ్వరుడు వస్తే జరిగిన కోలాహలానికి కారణం?

    మానవ జీవితంలో ఉండే దురాశలు, కుయుక్తులు, జిత్తులూ వాటిని పరిష్కరించే సుయుక్తులు ఈ కథల నిండా వున్నాయి. ఇంకా ఈ కథల్లో పీనాసివాళ్ళు, మంత్రగత్తేలు, వెర్రివెంగళమ్మలు, వేలెడంత పిల్లలు మీకు తారసపడతారు.

    90.00
    Add to cart
  • Prasnale Samadhanalu

    Prasnale Samadhanalu

    0
    199.00
    Add to cart
  • Prayanam

    Prayanam

    0

     ‘రాజశుక. మంచి పేరు పెట్టారు.’ పూజారి మెచ్చుకున్నాడు.

    ‘నాకు కొడుకు పుట్టాడని మా నాన్నగారికి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన భాగవతం మొదటి స్కంధం చదువుతున్నారు. ఆయనే ఈ పేరు సూచించారు.’ రాజశుక తండ్రి సుబ్బరాజు వివరించాడు.

    ‘పాలు పితికినంత సేపు రాజశుక ఒక చోట ఉండడు.’ పెద్దయ్యాక రాజశుక విన్నాడు.

    ఆర్నెలల్లో 11 జ్యోతిర్లింగాలని రాజకుశ ఏ లాభం కోరి సందర్శించాడు?

    రాజశుక తన ఆథ్యాత్మిక ప్రయాణంలో, తీర్థ యాత్రల్లో ఏం నేర్చుకున్నాడు?

    అతనికి అనేక చోట్ల కలిగిన వివిధ అనుభవాలు ఏమిటి?

    హిందూ సంప్రదాయంలోని సన్న్యాసాశ్రమం నియమాలు ఏమిటి?

    ఆసక్తి కలిగించేలా, హాయిగా చదివించేలా ఆథ్యాత్మికతని రాయగల మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ప్రయాణం.

    జయం, పరంజ్యోతి, విధాత నవలల తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నాలుగో ఆధ్యాత్మిక నవల ప్రయాణం.

    295.00
    Add to cart
  • Prayanam By Malladi Venkata Krishna Mur

    Prayanam By Malladi Venkata Krishna Mur

    0

    ‘రాజశుక. మంచి పేరు పెట్టారు.’ పూజారి మెచ్చుకున్నాడు.

    ‘నాకు కొడుకు పుట్టాడని మా నాన్నగారికి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన భాగవతం మొదటి స్కంధం చదువుతున్నారు. ఆయనే ఈ పేరు సూచించారు.’ రాజశుక తండ్రి సుబ్బరాజు వివరించాడు.

    ‘పాలు పితికినంత సేపు రాజశుక ఒక చోట ఉండడు.’ పెద్దయ్యాక రాజశుక విన్నాడు.

    ఆర్నెలల్లో 11 జ్యోతిర్లింగాలని రాజకుశ ఏ లాభం కోరి సందర్శించాడు?

    రాజశుక తన ఆథ్యాత్మిక ప్రయాణంలో, తీర్థ యాత్రల్లో ఏం నేర్చుకున్నాడు?

    అతనికి అనేక చోట్ల కలిగిన వివిధ అనుభవాలు ఏమిటి?

    హిందూ సంప్రదాయంలోని సన్న్యాసాశ్రమం నియమాలు ఏమిటి?

    ఆసక్తి కలిగించేలా, హాయిగా చదివించేలా ఆథ్యాత్మికతని రాయగల మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ప్రయాణం.

    జయం, పరంజ్యోతి, విధాత నవలల తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నాలుగో ఆధ్యాత్మిక నవల ప్రయాణం.

    295.00
    Add to cart
  • Jangal (Prema Pelli Prema)
  • Premaki Mugimpu Eppudu?

    Premaki Mugimpu Eppudu?

    0

    ఈ పుస్తకంలో, కధలూ – వ్యాసాలతో పాటు ఇంకా ఏ యే విషయాలున్నాయో అవన్నీ ‘విషయ సూచిక’ లోనే తెలుస్తాయి. దానిలో వున్న 2,3 విషయాల గురించి, కొంచెం చెప్పాలని ఈ ముందు మాట!

                   కధల్లో, 2వ కధ ‘సుమ ప్రేమ కధ’, ఇందులో వున్న కధా వస్తువు కొంత కొత్తదే! ఇటువంటి వస్తువుని నేనెక్కడా చదవలేదు. కొన్ని ప్రాంతాల్లో ఆహారాల అలవాట్లు ఫలానా రకంగా తేడాలుగా ఉంటాయని తెలుసు. కానీ ఇది తెలిసింది కొన్నాళ్ళ కిందట! అప్పటి నించీ ఆ వస్తువుతో ఒక కధ రాయాలని ఆలోచన! సుమకి జరిగినట్టే, నా వయసులో నాకు జరిగి వుంటే, నేను కూడా సుమ లాగే ప్రవర్తించేదాన్ని అనుకుంటాను. అలా అనుకుంటున్నాను గానీ, అలాగే జరిగేదో లేదో! ఈ కధ ‘స్వాతి’ మాస పత్రికలో మొదట వచ్చినప్పుడు, ఈ కధ కొందరికి నచ్చడమూ, కొందరికి నచ్చక పోవడమూ, రెండూ జరిగాయి. ఇతర కధలకు కూడా, నచ్చడాలూ – నచ్చక పోవడాలూ జరుగుతూనే వుంటాయి. కానీ ఈ ‘సుమ కధ’ విషయంలో మాత్రం, 2 రకాలూ గట్టిగా కనపడ్డాయి. నాకైతే, ఈ కధ చాలా నచ్చింది. నేను రాశాను కదా అని కాదు; ఆ వస్తువుని బట్టి!

                                                                                                                 – రంగనాయకమ్మ

    80.00
    Add to cart
  • Premalekhalu

    Premalekhalu

    0

      ప్రేమలేఖలు అంటే ప్రియమైన మిత్రులకి రాయటం. పురుషులుగాని స్త్రీలుగాని సెక్స్ భేదమైనప్పుడు ఆ ప్రేమలోవలెనే లేఖలో కూడా రొమాన్స్ పొయెట్రీ, టెండర్ నెస్ ఎక్కువగా కనిపిస్తాయి. లేఖలు ఎక్కువ అందంగా ఆకర్షకంగా ఉంటాయి. ప్రేమలేఖలు కానివి, పోస్ట్ లో రోజువెళ్ళే లక్ష ఉత్తరాలు – అన్నీ చెత్త. చికాకు వ్యవహారాలకోసం, దొంగ మర్యాదలకోసం, తగాదాలు, నోటీసులు – ఈ రకాలు.

             మొత్తానికి విసుక్కుంటో రాసేవీ, ఏడుస్తో చదివేదిగా ఉంటాయి. వాజ్మయంలో లేఖకి స్థానం ఉండాలంటే అది ప్రేమలేఖ కావాలి. లేఖ కంటిన్యువస్ థాట్ గా ఉండాలి. చాలా ప్రియమైన మిత్రుడితో చల్లని కాలవ ఒడ్డునగాని, వెచ్చని గదిలో టీ, సిగరెట్ల ముందుగాని, కూచున్నప్పుడు ఎట్లా మాట్లాడతాము! అట్లా ఉండాలి ఉత్తరం. అంత నాచురల్ గా ఉత్తరం చదివే వారికి ఆ రాసేవారిని కలుసుకుని మాట్లాడుతున్నాము అనిపించాలి. ఉత్తరం చేతుల్లో పట్టుకుని చదివేవారు డే డ్రీమ్స్ లోకి, కలలోకి వెళ్ళకపోతే, ఆ ఉత్తరం వొచ్చి ప్రయోజనం లేదు.

    270.00
    Add to cart
  • Premaragam Vintava - Marikonni kathalu

    Premaragam Vintava – Marikonni kathalu

    0

    చిమ్మ చీకటి, వాతావరణం చల్లగా ఉంది. ఆకాశంనిండా చుక్కలు గుతులుగా వేలాడుతున్నాయి. అర్ధరాత్రి దాటుతోంది. పడవ చప్పుడులేకుండా రొయ్యల చెరువులో కదులుతోంది. ఇద్దరి నల్లటి ఆకారాలు కనిపిస్తున్నాయి. ఏసు ఫాన్లెట్ వేసి నీటిపైన చూస్తున్నాడు. గన్లో తుపాకీమందు, రవ్వలుకూరి, గురిపెట్టుకొని చూస్తున్నాడు విజో. సైగచేశాడు విజో. పడవ ఆగిపోయింది. చిన్నగా ఈల లైటు ఆరిపోయింది, తుపాకీ పేలింది. రవ్వలు దూసుకు పోయాయి. ఇప్పుడు లైటు వేసి ఆచోటంతా వెతికారు, రెండు బుడబుచ్చకాయిలు తేలాయి. మరో కొంతసేపు వేట సాగింది. మరో మూడు పిట్టలు దొరికాయి, “ఈరోజుకు చాలు, మరో రెండు రోజుల్లో రాత్రివేట చేద్దాం” అన్నాడు విజో.

    ఉదయానికి ఈ చంపిన పిట్టల్ని చూపిస్తే యజమాని సాయిరాజు సంతోషపడతాడని విబ్రోకి అనిపించింది. మరి ఈ వేటకోసమే విప్రోని తీసుకువచ్చింది. రొయ్యల చెరువుల్లో ఎన్నో సమస్యలు అవన్నీ సాయిరాజు చూసుకోగలడు కాని ఈ పిట్టల సంగతి తానే చూడాలి..

    బుడబుచ్చకాయిలు, నీటిమీద వాలే చిన్నపిట్టలు. మహా అయితే

    పిచ్చుకల కంటే కొంచెం పెద్దవి. బాతుపిల్లల సైజులో ఉంటాయి. ముదురు, లేత గోధుమరంగులలో ముదొస్తూ ఉంటాయి. నీటిమీద తేలుతూ, మధ్యమధ్యలో నీటిలో మునిగి ఓనిమిషం ఉండి, ఎదో ఒక చేపపిల్లో రొయ్యపిల్లనో నోట…

    180.00
    Add to cart
  • Puranam Srinivasa Sastry Kathalu

    Puranam Srinivasa Sastry Kathalu

    0

    కీర్తిశేషుని మాసిపోని కథాక్షరాలు

    -విహారి

    పురాణం శ్రీనివాసశాస్త్రి నాకు 1970ల నుంచీ మిత్రుడు. మొదట అతని కరలంటే ఇష్టం. ఆ తర్వాతి సాన్నిహిత్యంతో అతనూ ఇష్టమైనాడు. మృదువుగా మాటాడేవాడు. అసలు లోకం తెలీనివాడిలా ఉండేవాడు. కానీ, అతను లోకాన్ని చాలా దగ్గరగా చదివి తెలుసుకున్నవాడు. జీవికలోనూ, జీవితంలోనూ చాలా మునుగీతలూ, నిలువీతలూ వేసినవాడు. ఆంధ్రభూమిలోనూ ఆంధ్రప్రభలోనూ వారలోనూ పనిచేశాడు. ‘కోకిలమ్’ సాహిత్య సాంస్కృతిక వేదిక అతని మానస పత్రిక దాని గురించి ఎన్నో కలలుండేవి అతనికి. నేనూ, మునిపల్లెరాజు గారూ, పులిగడ్డ విశ్వనాథరావు గారి లాంటి వాళ్ళం కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. శాస్త్రికి వాళ్ళ నాన్నగారు పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి సాహిత్యమంటే అమిత గౌరవం. ఎప్పుడూ వాటి గురించి చెబుతూ, అడపాదడపా ఏదో చేయాలని అంటూ వుండేవాడు. తాను చనిపోవటానికి ముందు తన కథాసంపుటి రావాలనే కోరికని వ్యక్తం చేశాడు. కథలన్నింటినీ బయటికి తీస్తున్నానన్నాడు. అతని కలల్ని (మరణానంతరం) వాస్తవం చేస్తూ వస్తున్న సంపుటి ఇది. దీనికి కారకులైన అందరికీ అభినందనలు.

    శ్రీశా. కథల్ని పాఠకులు మెచ్చుకున్నారు. పత్రికా సంపాదకులు ఆనందించి బహుమతులిచ్చారు. (జ్యోతి, ఆంధ్రప్రభ (ప్రథమ బహుమతులు) యువచక్రపాణి నాలుగో అవార్డు, మళ్ళీ జ్యోతిలో బహుమతి… ఇలా), విమర్శకులూ, విశ్లేషకులు | ఎక్కువమంది చదవలేదు. చదివినవారు ఒకరిద్దరు ఉటంకించారు. నాకు నచ్చిన 400 తెలుగు కథల్ని విశ్లేషిస్తూ నేను ఐదేళ్ళు వివిధ పత్రికల్లో ధారావాహిక శీర్షికల్లో వాటిని పరిచయం చేశాను. వాటిలో శ్రీ. శ. ‘గూడు చాలని సుఖం |………..

    150.00
    Add to cart